
క్రేన్‌ను ఢీకొన్న డీసీఎం వాహనం
సాక్షి, పటాన్‌చెరు: సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు మండలం పటాన్‌చెరు ఎంవీఐ కార్యాలయం సమీపంలో ఔటర్ రింగ్ రోడ్డుపై జరిగిన ప్రమాదంలో ఒకరు దుర్మరణం చెందారు. ఆగి ఉన్న క్రేన్‌ను డీసీఎం ఢీకొంది. ఈ సంఘటనలో డీసీఎం డ్రైవర్ క్యాబిన్‌లోనే మృతిచెందాడు. మరొకరికి స్వల్ప గాయాలయ్యాయి. ఈ డీసీఎం అనంతపురం నుంచి కాన్పూర్‌కు టమాటా లోడు తీసుకెళ్తున్నది. కాగా, క్యాబిన్‌లో చిక్కుకున్న డ్రైవర్ మృతదేహాన్ని వెలికి తీసేందుకు పోలీసులు యత్నిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment