
సంగారెడ్డి: పటాన్ చెరులోని ఇస్నాపూర్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. టిప్పర్ లారీ ఓ ఆటోని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతిచెందారు. వేగంగా వచ్చిన టిప్పర్ లారీ ఆటోను ఢీకొట్టడంతో.. ఆటో నుజ్జునుజ్జు అయింది. ఆటోలో ఉన్న ఒకరు మృతి చెందగా.. రోడ్డుపై నడుచుకుంటూ వెళ్లుతున్న మరో ఇద్దరు మృతిచెందారు.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనస్థలానికి చేరుకొని మృతి చెందిన వారి మృతదేహాలను పటాన్‌చెరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రమాద సమయంలో ఆటోలో నలుగురు ప్రయాణిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. తీవ్రగాయాల పాలైన మరొకరిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలిచారు. ఘటన స్థలాన్ని జిల్లా ఎస్పీ రమణ కుమార్ పరిశీలించారు.
Comments
Please login to add a commentAdd a comment