Isnapur
-
పటాన్ చెరులో ఘోర ప్రమాదం.. ముగ్గురు మృతి
సంగారెడ్డి: పటాన్ చెరులోని ఇస్నాపూర్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. టిప్పర్ లారీ ఓ ఆటోని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతిచెందారు. వేగంగా వచ్చిన టిప్పర్ లారీ ఆటోను ఢీకొట్టడంతో.. ఆటో నుజ్జునుజ్జు అయింది. ఆటోలో ఉన్న ఒకరు మృతి చెందగా.. రోడ్డుపై నడుచుకుంటూ వెళ్లుతున్న మరో ఇద్దరు మృతిచెందారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనస్థలానికి చేరుకొని మృతి చెందిన వారి మృతదేహాలను పటాన్చెరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రమాద సమయంలో ఆటోలో నలుగురు ప్రయాణిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. తీవ్రగాయాల పాలైన మరొకరిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలిచారు. ఘటన స్థలాన్ని జిల్లా ఎస్పీ రమణ కుమార్ పరిశీలించారు. -
పెళ్లికూతురి తల్లి ఎంతపని చేసింది..
సాక్షి, హైదరాబాద్ : ముహుర్త బలం గట్టిగా ఉంటేనే వివాహ బంధం కలకాలం నిలుస్తుందని నమ్మకం. అందుకే పెళ్లి ముహుర్తానికి అంత ప్రాధాన్యత ఇస్తారు. అయితే అనుకున్న ముహుర్తానికి తాళి కట్టలేదని పీటల మీద నుంచి కూతుర్ని తీసుకు వెళ్లిపోయింది ఓ తల్లి. ఈ సంఘటన పటాన్చెరు మండలంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే...ఇస్నాపూర్ కు చెందిన వెంకటేష్‌కు సింధూజ అనే యువతితో నిశ్చితార్ధం జరిగింది. మార్చి 14వ తేదీ 7 గంటల36 నిమిషాలకు పెళ్లి ముహుర్తం. ఇస్నాపూర్‌లోని పెళ్లికొడుకు నివాసంలో పెళ్లి కార్యక్రమం జరుగుతోంది. ముహుర్తానికి పెళ్లికొడుకు వెంకటేష్, పెళ్లి కూతురు సింధుజ కూడా పెళ్లిపీటలపై కూర్చొవడానికి సిద్దమయ్యారు. అంతే అక్కడ ప్రత్యక్షమైన పెళ్లికూతురు తల్లి నిర్మల ముహుర్తం దాటి పోయిందంటూ కూతుర్ని బలవంతంగా పీటలపై నుంచి లేపి, అక్కడ నుంచి తీసుకు వెళ్లిపోయింది. దీంతో చివరి నిమిషంలో పెళ్లి నిలిచిపోయింది. సినిమా ట్విస్ట్ ను తలపించేలా జరిగిన ఈ ఘటనతో పెళ్లికొడుకు బంధువులు షాక్ తిన్నారు. కాగా జిల్లాకు చెందిన పెళ్లిళ్ల పేరయ్య ఈ సంబంధం కుదిర్చినట్లు పెళ్లికొడుకు తరపు బంధువులు తెలిపారు. అయితే పెళ్లి కూతురు బీదరాలు కావడంతో పెళ్లి ఖర్చుల నిమిత్తం 50 వేల రూపాయలతో పాటు బంగారు ఉంగరాన్ని కూడా ఇచ్చామని చెబుతున్నారు. పెళ్లి కూతురు సింధూ, ఆమె తల్లి నిర్మల మాత్రమే పెళ్లికి వచ్చారన్నారు. చివరకు పెళ్లికొడుకు బంధువుల ఫిర్యాదు మేరకు పెళ్లి కూతురు తల్లి నిర్మలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. -
అనుకున్న ముహుర్తానికి తాళి కట్టలేదని..
-
సినిమాకు వెళ్లి ఇద్దరు బాలుర అదృశ్యం
పటాన్చెరు: సంగారెడ్డిజిల్లా పటాన్చెరు పోలీసు స్టేషన్ పరిధిలోని ఇస్నాపూర్‌లో ఇద్దరు బాలురు అదృశ్యమయ్యారు. సాయిరాం సహో(15), సాయితేజ(15)లు 9వ తరగతి చదువుతున్నారు. వీరిద్దరూ ఆదివారం సినిమాకని వెళ్లి ఇళ్లకు తిరిగి రాలేదు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
విషాదాన్ని మిగిల్చిన సాగర్ విహార యాత్ర
మెదక్ : విహార యాత్ర వారికి విషాదాన్ని మిగిల్చింది. నాగార్జున సాగర్ విహారయాత్రకు వెళుతున్న ఓ ప్రయివేట్ బస్సు శనివారం ఉదయం ప్రమాదానికి గురైంది. మెదక్ జిల్లా పటాన్చెరు మండలం ఇస్నాపూర్ వద్ద ఓవర్ లోడ్‌తో వెళుతున్న లారీ ...బస్సును వేగంగా వచ్చి ఢీకొన్న సంఘటనలో 20మంది గాయపడ్డారు. వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రికి తరలించారు. ఓ స్వచ్ఛంద సంస్థ వృద్ధులను.. నాగార్జున సాగర్ విహార యాత్రకు తీసుకు వెళుతున్నట్లు సమాచారం. ప్రమాదానికి గురైన హెల్పేజ్ ఇండియా బస్సుగా గుర్తించారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
మైనర్ బాలికపై అత్యాచారయత్నం
పటాన్చెరు టౌన్, న్యూస్‌లైన్: అభం శుభం తెలియని ఓ బాలికపై ఓ యువకుడు అత్యాచార యత్నానికి పాల్పడ్డాడు. ఈ సంఘటన మండలంలోని ఇస్నాపూర్ గ్రామంలో ఆదివారం సాయంత్రం చోటుచేసుకుంది. సీఐ శంకర్‌రెడ్డి కథనం ప్రకారం... ఒడిషా రాష్ట్రంలోని బాజీపూర్ గ్రామానికి చెందిన చెందూర్(21) స్థానికంగా ఓ ప్రైవేటు పరిశ్రమలో పని చేస్తున్నాడు. ఇస్నాపూర్‌లోని ఓ భవనంలో అద్దెకుంటున్నాడు. అయితే పక్క పోర్షన్లో భార్యాభర్తలు తమ కూతురు(5)తో కలిసి ఉంటున్నారు. భార్యాభర్తలిద్దరూ స్థానికంగా ఓ పరిశ్రమలో ఉద్యోగం చేస్తున్నారు. వారి కూతురు ఓ ప్రైవేట్ స్కూల్లో యూకేజీ చదువుతుంది. కాగా ఆదివారం సాయంత్రం అదే భవనంలో వేరే పోర్షన్లో ఉంటున్న బాలికతో కలిసి ఆడుకుంటుండగా చెందూరు వారిద్దరిని ఇంట్లోకి పిలిచి తలుపులు వేసి సదరు బాలికపై అత్యాచారయత్నం చేశాడు. అదే సమయంలో మరో చిన్నారి తల్లి తమ పాప కోసం వెతుకుతుండగా చెందూరు ఇంట్లో నుంచి కేకలు వినిపించాయి. దాంతో ఆమె తలుపులు బాదడంతో చెందూరు తలుపులు తెరిచాడు. ఈ విషయాన్ని ఆమె సదరు పాప తల్లిదండ్రులకు చెప్పడంతో వారు పటాన్చెరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. చెందూరును అదుపులోకి తీసుకుని కేసు దర్యాప్తు చేస్తున్నట్టు సీఐ తెలిపారు.