పటాన్‌చెరు: సంగారెడ్డిజిల్లా పటాన్‌చెరు పోలీసు స్టేషన్ పరిధిలోని ఇస్నాపూర్‌లో ఇద్దరు బాలురు అదృశ్యమయ్యారు. సాయిరాం సహో(15), సాయితేజ(15)లు 9వ తరగతి చదువుతున్నారు. వీరిద్దరూ ఆదివారం సినిమాకని వెళ్లి ఇళ్లకు తిరిగి రాలేదు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.