missed
-
ముంబైలో తప్పిన విమానాల ఢీ
ముంబై:ఎప్పుడూ రద్దీగా ఉండే ముంబై ఛత్రపతి ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో ఘోర ప్రమాదం తప్పింది. శనివారం విమానాశ్రయంలోని ఓ రన్‌వే పై ఓ వైపు ఎయిర్ఇండియాకు చెందిన విమానం అవుతుండగానే అదే రన్‌వేపై వెనుక ఇండిగో ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానం ల్యాండ్ అయింది. టేక్ఆఫ్ అవుతున్న విమానం గాల్లోకి ఎగరడంతో తృటిలో పెద్ద ప్రమాదం తప్పినట్లయింది. అసలు ఈ ఘటన జరగడానికి ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్(ఏటీసీ) కమ్యూనికేషన్ లోపమే కారణమని వెల్లడైంది. ఇండోర్ నుంచి వచ్చిన ఇండిగో విమానానికి పొరపాటున ల్యాండింగ్‌కు అనుమతిచ్చినట్లు తేలింది.ఇండిగో విమానం ల్యాండింగ్‌కు కొన్ని సెకన్ల ముందు ఇదే రన్‌వేపై తిరువనంతపురం వెళ్లాల్సిన ఎయిర్ఇండియా విమానం టేకాఫ్ అయింది. ఎయిర్ఇండియా విమానం గాల్లోకి లేవడం సెకన్లు ఆలస్యమైనా భారీగా ప్రాణ నష్టం జరిగేది. ఈ ఘటనపై డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్(డీజీసీఏ) విచారణ ప్రారంభించింది. ఇండిగో విమానం ల్యాండ్ అయ్యేందుకు క్లియరెన్స్ ఇచ్చిన ఏటీసీ ఉద్యోగిని ఇప్పటికే తొలగించారు. -
అయోధ్య వేడుకలో కనిపించని సైఫ్ జంట: ఆసుపత్రిలో చేరిన సైఫ్అలీ ఖాన్?
అయోధ్యలో బాల రాముడి ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం అత్యంత వైభవోపేతంగా ముగిసింది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చేతులు మీదుగా జరిగిన ఈ వేడుకకు పలువురు రాజకీయ, క్రీడా రంగ ప్రముఖులు హాజరైన సంగతి తెలిసిందే. ముఖ్యంగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్, హీరోలందరూ తరలివచ్చారు. బిగ్‌బీ అమితాబ్, చిరంజీవితోపాటు,ధనుష్ అలియా భట్-రణబీర్ కపూర్ జంట, విక్కీ కౌశల్-కత్రినా కైఫ్ దంపతులు, ఆయుష్మాన్ ఖురానా , రణదీప్హుడా, భర్త శ్రీరామ్‌తో కలిసి మాధురీ దీక్షిత్ , జాకీ ష్రాఫ్ సహా పలువురు సెలబ్రిటీలు అయోధ్య నగరానికి తరలివచ్చారు. ఇంకా చిత్ర నిర్మాతలు రోహిత్ శెట్టి ,రాజ్ కుమార్ హిరానీ నిర్మాత మహావీర్ జైన్ ఇంకా సుభాయ్ఘాయ్ తదితరులు బాలరాముణ్ని దర్శించుకున్నారు.రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ, నీతా అంబానీ ఆకాష్ అంబానీ, శ్లోకా అంబానీ, ఇషా అంబానీ, అనిల్ అంబానీ, ఎయిర్టెల్ చీఫ్ తదితర వ్యాపార దిగ్గజాలు కూడా హాజరైన్నారు. #WATCH | Ayodhya: On the Shri Ram Pran Pratishtha ceremony, BJP leader Bansuri Swaraj says, "... The ambience of the whole country has changed for good. My heart feels very happy... I would credit the late Ashok Singhal for this day... This 500-year-long fight was for our… pic.twitter.com/EzMbdn0rDV — ANI (@ANI) January 22, 2024 #WATCH | Actor Dhanush attended the Ayodhya Ram Temple 'Pran Pratishtha' ceremony today pic.twitter.com/r1B7UdVLBp — ANI (@ANI) January 22, 2024 కానీ ఆదిపురుష్ నటుడు సైఫ్ అలీ ఖాన్, అతని భార్య కరీనా కపూర్ జాడ కనిపించలేదు. అయితే మోకాలి , భుజానికి గాయం కారణంగా సైఫ్ సోమవారం ముంబైలోని కోకిలాబెన్ ఆసుపత్రిలో చేరినట్లు తెలుస్తోంది. శస్త్రచికిత్స చేయించుకోవాల్సిన అవసరం ఉందని సమాచారం. ఓం రౌత్ దర్శకత్వంలో కృతి సనన్ , ప్రభాస్ నటించిన పౌరాణిక చిత్రం ఆదిపురుష్‌లో సైఫ్ అలీ ఖాన్ రావణుడి పాత్రలో నటించిన సంగతి తెలిసిందే. -
ఈ ముద్దుగుమ్మలు ఆడా లేరు...ఈడా లేరు!
ఈ ఏడాది కొంతమంది కథానాయికలను తెలుగు తెర మిస్సయింది. ఆ మాటకొస్తే తెలుగులో మాత్రమే కాదు.. ఏ భాష తెరపైనా ఈ తారలు కనిపించలేదు. ఆడా లేరు.. ఈడా లేరు అన్నట్లు ఎక్కడా కనిపించకుండా ఆ నాయికలు ఏం చేస్తున్నారో చూద్దాం. ‘లవ్ స్టోరీ (2021)’, ‘శ్యామ్ సింగరాయ్ (2021)’, ‘విరాటపర్వం (2022)’ సినిమాలతో రెండేళ్లుగా తెలుగు తెరపై సందడి చేసిన సాయి పల్లవి ఈ ఏడాది మాత్రం సిల్వర్ స్క్రీన్‌కి దూరమయ్యారు. చెప్పాలంటే 2023లో నటిగా సాయిపల్లవి పూర్తిగా బ్రేక్ తీసుకున్నట్లే. ఎందుకంటే ఆమె హీరోయిన్గా చేసిన సినిమాలేవీ తెలుగులోనే కాదు... ఇతర భాషల్లో కూడా విడుదల కాలేదు. 2022లో తమిళంలో చేసిన ‘గార్గి’ చిత్రం తర్వాత సాయి పల్లవి నటించిన మరో చిత్రం ప్రేక్షకుల ముందుకు రాలేదు. ప్రస్తుతం నాగచైతన్యతో ‘తండేల్’, శివ కార్తికేయన్‌తో ఒక చిత్రం... సాయి పల్లవి కమిట్ అయిన సినిమాలు ఇవే. ‘తండేల్’ షూటింగ్ జరుగుతోంది. శివ కార్తికేయన్‌తో చేస్తున్న సినిమా షూటింగ్ కూడా జరుగుతోంది. సో.. వచ్చే ఏడాది డబుల్ ధమాకాలా సాయి పల్లవి ఈ రెండు చిత్రాలతో థియేటర్స్‌లో సందడి చేస్తారు. హీరోయిన్గా ‘కార్తికేయ 2’, ‘18 పేజెస్’, ‘అంటే.. సుందరానికీ’ సినిమాలో ఓ అతిథి పాత్ర, ‘బటర్ ఫ్లై’తో డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ ఇలా.. 2022లో అనుపమా పరమేశ్వరన్ ఫుల్ ఫామ్‌లో కనిపించారు. కానీ ఈ ఏడాది వెండితెరపై సందడి చేయలేదు. తెలుగులో అనుపమ చేస్తున్న ‘డీజే టిల్లు’ సీక్వెల్ ‘డీజే టిల్లు స్క్వేర్’ చిత్రం ఈ ఏడాది విడుదలకు ముస్తాబైనా కొన్ని కారణాల వల్ల వచ్చే ఏడాది ఫిబ్రవరి 9కి వాయిదా పడింది. దాంతో ఈ ఏడాది ఆమె కనిపించలేదు. ప్రస్తుతం అనుపమ చేతిలో రవితేజ ‘ఈగల్’, తెలుగులో ఓ లేడీ ఓరియంటెడ్ మూవీ ఉన్నాయి. ఇతర భాషల్లో మరో రెండు సినిమాలు ఉన్నాయి. జనవరిలో ‘ఈగల్’, ఫిబ్రవరిలో ‘డీజే టిల్లు స్క్వేర్’ విడుదలవుతాయి. చూస్తుంటే.. 2024లో అనుపమా పరమేశ్వరన్ ముచ్చటగా మూడు సార్లయినా వెండితెరపై మెరిసే అవకాశం ఉంది. గత ఏడాది రెండు తెలుగు సినిమాలు (పక్కా కమర్షియల్, థాంక్యూ), రెండు తమిళ సినిమాలు (తిరుచిత్రంబలం, సర్దార్)లతో కెరీర్లో దూకుడు పెంచినట్లుగా కనిపించారు రాశీ ఖన్నా. కానీ ఆ స్పీడ్‌కు ఈ ఏడాది స్పీడ్ బ్రేకర్ పడింది. రాశీ ఖన్నా సైన్ చేసిన హిందీ చిత్రం ‘యోధ’ రిలీజ్ వచ్చే ఏడాదికి వాయిదా పడింది. అలాగే తెలుగులో శర్వానంద్‌తో రాశీ ఖన్నా కమిట్ అయిన సినిమా ప్రస్తుతానికి హోల్డ్‌లో ఉంది. ఇలా రాశీ ఖన్నా వెండితెరపై మెరవలేకపోయారు. అయితేనేం.. తమిళంలో రాశీ ఖన్నా ఓ హీరోయిన్గా నటించిన ‘అరణ్మణై 4’, హిందీ ‘యోధ’ రిలీజ్‌కు రెడీ అవుతున్నాయి. మరో రెండు ప్రాజెక్ట్స్ కూడా పోస్ట్ ప్రోడక్షన్ వర్క్స్ స్టేజ్‌లో ఉన్నాయి. సో.. వచ్చే ఏడాది రాశీ ఖన్నా జోరు మళ్లీ కనిపిస్తుంది. అన్నట్లు మరో మాట.. తెలుగులో ‘తెలుసుకదా’ అనే సినిమాలో ఓ హీరోయిన్గా నటిస్తున్నారు రాశీ ఖన్నా. సిద్ధు జొన్నలగడ్డ ఓ హీరోగా, ‘కేజీఎఫ్’ ఫేమ్ శ్రీనిధీ శెట్టి మరో హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాతో కాస్ట్యూమ్ డిజైనర్ నీరజా కోన దర్శకురాలిగా పరిచయం కానున్నారు. ఇక గత ఏడాది ‘కేజీఎఫ్ 2’ వంటి బ్లాక్ బస్టర్, తమిళంలో ‘కోబ్రా’ చిత్రంతో తెరపై కనిపించిన శ్రీనిధీ శెట్టి ఈ ఏడాది కనిపించలేదు. తెలుగులో ‘హీరో’, తమిళంలో ‘కలగ తలైవన్’ సినిమాలతో గత ఏడాది సిల్వర్ స్క్రీన్‌పై మెరిశారు నిధీ అగర్వాల్. కానీ ఈ ఏడాది మాత్రం స్లో అయ్యారు. ఈ ఏడాది ఆమె హీరోయిన్గా నటించిన ఏ చిత్రం ఏ భాషలో కూడా వెండితెరపైకి రాలేదు. నిధి నటిస్తున్న ‘హరిహర వీరమల్లు’ చిత్రం షూటింగ్ దశలో ఉంది. నాని ‘గ్యాంగ్‌లీడర్’, శర్వానంద్ ‘శ్రీకారం’ వంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు హీరోయిన్ ప్రియాంకా అరుళ్ మోహన్ సుపరిచితురాలే. గత ఏడాది ‘ఈటీ’, ‘డాన్’ వంటి తమిళ చిత్రాలతో వెండితెరపై మెరిశారామె. అయితే ఈ యంగ్ బ్యూటీ కూడా ఈ ఏడాది వెండి తెరపై కనిపించలేదు. ప్రియాంక హీరోయిన్గా నటించిన ‘కెప్టెన్ మిల్లర్’ చిత్రం ఈ ఏడాది రిలీజ్‌కు షెడ్యూలై, ఆ తర్వాత సంక్రాంతికి షిఫ్ట్ అయ్యింది. అలా ఈ ఏడాదిని మిస్ అయ్యారు ప్రియాంక. ప్రస్తుతం తెలుగులో ‘సరిపోదా శనివారం’, ‘ఓజీ’, తమిళంలో ‘బ్రదర్’ చిత్రాలు చేస్తున్నారు ప్రియాంకా అరుళ్ మోహన్. -
15.5 కోట్ల సంవత్సరాల క్రితం మాయం.. ఆసియా ఖండంలో ప్రత్యక్షం!
15.5 కోట్ల ఏళ్ల క్రితం మాయమైన ఖండాన్ని ఆసియా ఖండంలో శాస్త్రవేత్తలు గుర్తించారు. ‘ఆర్గోల్యాండ్’ (Argoland) అని పిలిచే ఈ ఖండానికి సంబంధించిన శకలాలను ఆగ్నేయాసియాలో కనుగొన్నారు. ఈ శకలాలు మొదట్లో ఆస్ట్రేలియా ఖండంలో భాగంగా ఉండేవి. తర్వాత ఇండోనేషియా తూర్పు భాగం వైపు మళ్లాయి. ఒకప్పుడు 15.5 కోట్ల సంవత్సరాల పురాతన భూభాగంలో భాగంగా ఉండే ఈ ఖండం యునైటెడ్ స్టేట్స్ మాదిరిగా చాలా పెద్దగా విస్తరించి ఉండేది. ఆర్గోల్యాండ్ శకలాల పరిశోధన ఏడేళ్లపాటు సాగిందని నెదర్లాండ్స్‌లోని ఉట్రేచ్ట్ విశ్వవిద్యాలయానికి చెందిన భూవిజ్ఞాన శాస్త్రవేత్త, రచయిత ఎల్డర్ట్ అడ్వోకాట్ పేర్కొన్నారు. ఆగ్నేయాసియా ప్రాంతంలో అక్కడక్కడా విసిరేసినట్టుండే ఈ శకలాలు ఒకే భూభాగం నుంచి వేరుపడినవని కనుగొనేందుకు శాస్త్రవేత్తలు చాలా కష్టపడ్డారు. ఈ శకలాల వరుసను ‘ఆర్గోలాండ్’ అని పిలిచేవారు. ప్రారంభంలో ఇదంతా ఒకే భూభాగంగా ఉండేది. 15.5 కోట్ల ఏళ్ల నాటి ప్రస్థానం ఆగ్నేయాసియా భూభాగం ఆఫ్రికా, దక్షిణ అమెరికా వంటి ఖండాల మాదిరిగా కాకుండా అనేక శకలాలుగా విచ్ఛిన్నమై ఉంటుంది. దీంతో ఆర్గోల్యాండ్ అనేక ముక్కలుగా విడిపోవడంతో దాని ఉనికి మరుగునపడిపోయింది. ప్రస్తుతం ఈ శకలాలకు సంబంధించి లభ్యమైన మ్యాప్ ఆధారంగా ఆర్గోల్యాండ్ అదృశ్యం కాలేదని పరిశోధకులు కనుగొన్నారు. ఈ ఆవిష్కరణతో శాస్త్రవేత్తలు 15.5 కోట్ల నాటి ఆర్గోల్యాండ్ ప్రస్థానాన్ని గుర్తించారు. ఇది దృఢమైన ఒకే భూభాగం కాకుండా సూక్ష్మఖండాల శ్రేణి కాబట్టి ఈ ఖండానికి శాస్త్రవేత్తలు ఆర్గోల్యాండ్కు బదులుగా ‘ఆర్గోపెలాగో’ అని పేరు పెట్టారు. సైన్స్ జర్నల్ ‘గోండ్వానా రీసెర్చ్’లో అక్టోబరు 19న ప్రచురితమైన ఈ పరిశోధన భూ గ్రహం పరిణామం గురించిన ఆధారాలను అందించడమే కాకుండా ప్రస్తుత జీవవైవిధ్యం, పర్యావరణ వ్యవస్థలు ఎలా అభివృద్ధి చెందాయనే విషయాలను కూడా వెలుగులోకి తెచ్చింది. Argoland was once part of the ancient supercontinent of Gondwana. Prior to the current scattered arrangement of continents, there existed supercontinents.@elonmusk pic.twitter.com/KSrK9q3JJk — JeepsyX (@JeepsyX) November 13, 2023 -
Viral Video: అదృష్టం అంటే వీడిదే.. సైకిల్ ముక్క కూడా మిగలలేదు..!
-
కామారెడ్డి జిల్లా : పాఠశాల నుండి ఇద్దరు విద్యార్థుల అదృశ్యం
-
తృటిలో ఒలింపిక్ పతకాన్ని చేజార్చుకున్న కేరళ కుట్టి ఎవరో తెలుసా?
సాక్షి, హైదరాబాద్: ఒలింపిక్ క్రీడలు, మహిళలు, బంగారు పతకాలు అనగానే క్రీడాభిమానులకు ఠక్కున గుర్తొచ్చేపేరు పరుగుల రాణి పీటీ ఉష. అభిమానులు పయోలి ఎక్స్‌ప్రెస్‌గా పిల్చుకునే పీటీ ఉష పేరు తెలియని భారతీయుడు ఉండడంటే అతిశయోక్తి కాదు. దేశ కీర్తి కిరీటాన్ని ప్రపంచవ్యాప్తంగా వినిపించేలా చేసిన ఉష అంతర్జాతీయ క్రీడా జీవితంలో మొత్తం 101 స్వర్ణ పతకాలను సాధించారంటే ఆమె ప్రతిభను అర్థం చేసుకోవచ్చు. భారత మహిళా ట్రాక్ అండ్కే ఫీల్డ్‌లో కేరళ కుట్టీ పిలావుళ్ళకండి తెక్కే పఱంబిల్ ఉష 1979 నుంచి దేశానికి పలు విజయాలను అందించారు. 1986 సియోల్ ఆసియా క్రీడలలో 4 బంగారు పతకాలు, రజిత పతకం సాధించి రికార్డు సృష్టించిన ఉష తృటిలో ఒలంపిక్స్ పతకాన్నిచేజార్చుకున్నారు. అవును నిజం. 1980 రష్యా ఒలంపిక్స్ ఉషకుపెద్దగా కలిసిరాలేదు. అయితే 1984 ఒలింపిక్స్‌లో ఎలాగైనా పతకం సాధించాలని ఆశించారు. అమెరికా లోని లాస్ ఏంజిల్స్‌లో జరిగిన క్రీడలలో ఉష సెమీఫైనల్స్‌లో ప్రథమస్థానంలో నిలిచినా, పైనల్స్ లో వెంట్రుకవాసిలో పతకం పొందే అవకాశం కోల్పోయారు. సెకనులో వందోవంతు (0.01) తేడాతో కాంస్య పతకం పొందే అవకాశం జారవిడుచుకున్న విషయం అప్పట్లో భారతీయులను చాలా కాలం వెంటాడింది. 1960లో ప్లయింగ్ సిఖ్ మిల్కా సింగ్‌కు కలిగిన దురదృష్టమే పీటీ ఉషకు కూడా ఎదురైందని భావించారు. అయితే ఒలింపిక్ క్రీడల అథ్లెటిక్స్ లో పైనల్స్ చేరిన తొలి మహిళా క్రీడాకారిణిగా ఆమె రికార్డు సృష్టించారు. ఆమె దేశానికి సాధించిపెట్టిన ఖ్యాతికి గుర్తుగా భారత ప్రభుత్వం పద్మశ్రీ,అర్జున అవార్డులతో సత్కరించింది. కాగా టోక్యో ఒలింపిక్ భారత్‌కు తొలి పతకాన్ని అందించిన వెయిట్ లిఫ్టర్ మీరాబాయి చాను చరిత్రలో తన పేరును చిరస్థాయిగా నిలుపుకున్నారు. ఒలింపిక్స్ ప్రారంభం రోజునే పతకం సాధించిన తొలి భారతీయురాలిగా ఖ్యాతి గడించారు. -
సెల్ఫీ తీసుకుంటూ ఫోన్‌తో నీటిలోకి కొట్టుకుపోయిన బాలుడు
చిన్నకోడూరు (సిద్దిపేట): సెల్ఫీ సరదా ఓ బాలుడి ప్రాణం మీదకు తెచ్చింది. నీటి ప్రాజెక్ట్ చూడడానికి వెళ్లిన బాలుడు అక్కడ సెల్ఫీ తీసుకుంటూ ప్రమాదవశాత్తు ప్రాజెక్ట్ నీటిలో పడి గల్లంతయ్యాడు. ఈ సంఘటన సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం చంద్లాపూర్ శివారులోని రంగనాయకసాగర్ ప్రాజెక్ట్ వద్ద జరిగింది. దీంతో సిద్దిపేటలో విషాదం నిండింది. కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. కొడుకు ఆచూకీ కోసం ఎదురుచూస్తున్నారు. సిద్దిపేటకు చెందిన వెగ్గలం కార్తీక్ (15) తన మిత్రులు చరణ్, హేమంత్‌చారి, సాయిచరణ్‌లతో కలిసి చంద్లాపూర్ శివారులో ఉన్న రంగనాయకసాగర్ ప్రాజెక్ట్ చూసేందుకు శుక్రవారం వెళ్లాడు. అక్కడ మొత్తం ప్రాంతం కలియతిరిగి సరదాగా గడుపుతున్నారు. ఈక్రమంలో స్నేహితులతో కలిసి కార్తీక్ ఫొటోలు దిగుతున్నాడు. అనంతరం సెల్ఫీ ఫొటో కోసం ప్రయత్నాలు చేశాడు. పంపింగ్ చేసే స్థలంలో కార్తీక్, చరణ్ కలిసి సెల్ఫీ దిగుతుండగా ఒక్కసారిగా కింద ఉన్న మట్టిపెళ్లలు నీటిలోకి జారాయి. దానిపైన నిలబడ్డ కార్తీక్, చరణ్ ఇద్దరూ నీటిలో మునిగిపోయారు. ఈ ఘటనతో తోటి మిత్రులు షాక్‌కు గురయ్యారు. అయితే చరణ్ ఓ కట్టె సాయంతో నీటిలో నుంచి బయటపడగా కార్తీక్ నీటిలో కొట్టుకుపోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి వచ్చి కార్తీక్ కోసం గాలించారు. గత ఈతగాళ్లతో గాలింపు చర్యలు చేపట్టారు. నీటి ప్రవాహంలో కొట్టుకుపోవడంతో కార్తీక్ మృతి చెంది ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. మృతదేహం కోసం వెతుకుతున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: డబ్బుల్లేక భార్యతో గొడవ.. కూతుళ్లతో విషం తాగి -
20 సంవత్సరాల తర్వాత..
నారాయణపేట రూరల్ : దాదాపు 20 ఏళ్ల క్రితం తప్పిపోయిన ఓ మహిళ ఎట్టకేలకు తిరిగొచ్చింది. కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. మండలంలోని సింగారం గ్రామానికి చెందిన గంగమ్మ కూలీ పనిచేస్తుండగా.. భర్త పశువులు కాసేవారు. ఈమెకు ముగ్గురు ఆడపిల్లలు. అయితే భర్త అనారోగ్యం పాలుకావడంతో కుటుంబ పోషణ గంగమ్మపై పడింది. దీంతో మానసిక ఒత్తిడికి లోనై చిన్న కూతురు రేణును తీసుకుని అదృశ్యమైంది. ఏళ్ల తరబడి ఎంత వెతికినా ఆమె ఆచూకీ లభించలేదు. ఇంట్లో ఉన్న ఇద్దరు అమ్మాయిలు పనిచేసుకుంటూ తండ్రిని పోషిస్తూ వచ్చారు. గ్రామానికి చెందిన పెద్ద మనుషులు దగ్గరుండి వారికి వివాహం చేశారు. ఈ క్రమంలో గత పదేళ్ల క్రితం గంగమ్మ భర్త మృతిచెందాడు. అదృశ్యమైన గంగమ్మ నాలుగేళ్ల క్రితం చేతకాని పరిస్థితుల్లో భూత్పూర్ మండలం అన్నాసాగర్ పంచాయతీ రావులపల్లికి ఒంటరిగా చేరుకుంది. అక్కడే పాచి పనిచేస్తూ కాలం వెళ్లదీసింది. ఈ నెల 19న కిందపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో ఆచూకీ అడగటంతో సొంతూరు సింగారం అని చెప్పడంతో గ్రామ యువకులు సర్పంచ్ నాగిరెడ్డికి సమాచారం ఇచ్చారు. వివరాలు సేకరించి గంగమ్మ పెద్ద కుమార్తె చెన్నమ్మకు చెప్పి, భూత్పూర్ పోలీసుల సహకారంతో ఆమెను అప్పగించారు. -
‘పది’లో ఫెయిలయ్యానని ఇంటి నుంచి వెళ్లిన విద్యార్థిని
ఇంద్రవెల్లి(ఖానాపూర్) మంచిర్యాల : పదో తరగతిలో పెయిల్ అయినందుకు మనస్థాపం చెందిన ఓ విద్యార్థిని బుధవారం ఇంటి నుంచి వెళ్లిపోయింది. మండలంలోని కేస్లాపూర్ గ్రామానికి చెందిన మెస్రం లక్ష్మణ్, రత్నాబాయి దంపతులకు చెందిన గంగామణి(15) కేస్లాపూర్ ఆశ్రమ పాఠశాలలో 10వ తరగతి చదివింది. మార్చిలో పరీక్ష రాసింది. ఇందులో ఫెయిల్ కావడంతో రోజు బాధపడుతూ ఉండేది. మనస్థాపంతో మంగళవారం బహిర్భూమికి వెళ్లివస్తానని చెప్పి కనిపించకుండాపోయింది. పలు చోట్ల ఆరా తీసినా ఆచూకీ లభించకపోవడంతో కుటుంబీకులు బుధవారం ఇంద్రవెల్లి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై అరికిల్ల గంగారాం తెలిపారు. -
అడవిలో తప్పిపోయిన ఉపాధి కూలీ
ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల) : మండలంలోని దుమాల గ్రామానికి చెందిన ఉపాధి కూలీ బట్టు లచ్చవ్వ(68)ఈనెల 8న మంగళవారం కూలీ పనులకు వెళ్లి అడవిలోనే తప్పిపోయింది. అప్పటి నుంచి లచ్చవ్వకోసం కుటుంబసభ్యులు బంధువుల ఇళ్లలో గాలించారు. అయినా ఫలితం లేకపోవడంతో మంగళవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. లచ్చవ్వ కుమారుడు రాజు మూడేళ్ల క్రితం గల్ఫ్ వెళ్లాడు. భర్త కొమురయ్య అనారోగ్యంతో మృతిచెందగా లచ్చవ్వ ఉపాధి కూలీగా పనిచేస్తూ జీవనం సాగిస్తోంది. తల్లి తప్పిపోయినట్లు తెలుసుకున్న కుమారుడు రాజు ఈనెల 10న స్వగ్రామానికి తిరిగి వచ్చాడు. కుటుంబసభ్యులంతా వెతికినా ప్రయోజనం లేకపోవడంతో రాజు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు కేసునమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై శ్రీనివాస్‌గౌడ్ తెలిపారు. -
పోగొట్టుకున్న భూమి పత్రాల అప్పగింత
విజయనగరం టౌన్ : పట్టణంలోని కానుకుర్తివారివీధికి చెందిన శర్మ పని నిమిత్తం ఇంటి నుంచి తన 17 ఎకరాలకు చెందిన భూమి ఒరిజినల్ డాక్యుమెంట్లను తీసుకుని వెళ్తుండగా మార్గమధ్యలో అవి ఎక్కడో పడిపోయాయి. విషయాన్ని సాయంత్రం నాలుగు గంటల సమయంలో గమనించి ట్రాఫిక్ పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే అప్రమత్తమైన ట్రాఫిక్ పోలీసులు ఆయా ప్రాంతాల్లో ఉన్న బీట్ పోలీసులకు సమాచారమిచ్చారు. ఈ మేరకు రాత్రి 7 గంటల ప్రాంతంలో మయూరీ జంక్షన్ బీట్ పరిసర ప్రాంతాల్లో కొందరు యువకులు డాక్యుమెంట్లను గుర్తించి పోలీసులకు అందజేశారు. ట్రాఫిక్ ఎస్సై వాసుదేవ్ వెంటనే విషయాన్ని బాధితుడిని రప్పించి డాక్యుమెంట్లు అందజేశారు. -
చెన్నైకి ఎదురుదెబ్బ..రెండు మ్యాచ్‌లకు రైనా దూరం
సాక్షి, స్పోర్ట్స్ : ఐపీఎల్ మ్యాచ్‌లు రసవత్తరంగా కొనసాగుతున్నాయి. పాయింట్ల లిస్టులో తొలిస్థానంలో ఉన్న చెన్నైసూపర్ కింగ్స్(సీఎస్కే)కు పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. కీలక ఆటగాడు సురేన్ రైనా గాయంతో తర్వాతి రెండు మ్యాచ్‌లకు దూరం అయ్యాడు. దీంతో వచ్చే ఆదివారం(ఏప్రిల్ 15న) కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌తో జరిగే మ్యాచ్, ఏప్రిల్ 20న రాజస్తాన్ రాయల్స్‌తో జరిగే మ్యాచ్‌లకు రైనా లేకుండానే సీఎస్కే బరిలోకి దిగుతుంది. కోల్కత్తా నైట్ రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సునీల్ నరైన్ వేసిన 10వ ఓవర్లో సింగిల్ తీసే సమయంలో రైనా తీవ్రంగా ఇబ్బందిపడ్డాడు. కాలి గాయానికి వారం రోజుల విశ్రాంతి అవసరమని వైద్యులు సూచించడంతో సీఎస్కే ఈ నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే సీఎస్కే ఆటగాడు కేదార్ జాదవ్ సీజన్ మొత్తానికి దూరమైన సంగతి తెల్సిందే. తాజాగా రైనా కూడా గాయపడటం సీఎస్కేకి పెద్ద ఎదురు దెబ్బే. చేతివేలి గాయంతో బాధపడుతున్న ఫాఫ్ డుప్లెసిస్ ఆదివారం మ్యాచ్ నాటికి కోలుకునే అవకాశం ఉంది. ప్రాక్టీస్ సమయంలో గాయపడిన మురళీ విజయ్ ముంబాయితో జరిగిన మ్యాచ్‌లో ఆడలేకపోయారు. తర్వాత కోలుకున్నా కోల్కత్తా నైట్‌రైడర్స్ మ్యాచ్‌లో ఆడే అవకాశం రాలేదు. రైనా గాయపడటంతో ఆయన స్థానంలో మురళీ విజయ్‌కు ఆడే అవకాశం రావచ్చు. -
ఎన్ఆర్ఐ మహిళ అదృశ్యం
ముంబై : భారత సంతతికి చెందిన మహిళ అదృశ్యమైన ఘటన ముంబై నగరంలో కలకలం రేపింది. దక్షిణాఫ్రికాలో నివసిస్తున్న 76 ఏళ్ల దేవికమ్మ పిళ్లై అనే మహిళ లోకమాన్య తిలక్ టెర్మినస్ నుంచి భువనేశ్వర్‌లో రైలులో బయలు దేరిన అదృశ్యమైనట్టు రైల్వే పోలీసులు తెలిపారు. సెలవులు గడపడానికి నెల కిందట వచ్చిన ఆమె ఫిబ్రవరి 21 నుంచి దక్షిణ ముంబైలో కొలబ ప్రాంతంలోని గెస్ట్ హౌస్‌లో ఉంటోంది. ఫిబ్రవరి 23న భువనేశ్వర్‌కు రైలులో వెళ్లినప్పటి నుంచి కనిపించటం లేదని ఆమె కూతురు సమాచారమిచ్చినట్లు రైల్వే పోలీసులు చెప్పారు. చివరిసారిగా ఆమె మహారాష్ట్రలోని గోండిగా ప్రాంతంలో ఉన్నట్లు ఫోన్ సిగ్నల్ ఆధారంగా గుర్తించినట్టు వెల్లడించారు. మార్చి 1న దేవికమ్మ క్షేమ సమాచారం తెలుసుకోవడానికి దక్షిణాఫ్రికా నుంచి ఆమె కూతురు గెస్ట్ హౌస్‌కు ఫోన్ చేసింది. ఆమె అక్కడి నుంచి వెళ్లపోయి, ఇంటికి తిరిగి రాకపోవడంతో ముంబైలోని పోలీసులను సంప్రదించింది. ఆమె కనిపించకుండా పోవడంతో గెస్ట్‌హౌస్ మెనేజర్ ఫిర్యాదు చేశాడు. భువనేశ్వర్‌లో ఆమె ఏ స్నేహితురాలిని కలుస్తానని వెళ్లిందో తెలుసుకున్నామని రైల్వేపోలీసు అధికారి మహేశ్ బల్వంత్‌రావ్ అన్నారు. మరింత లోతుగా దర్యాప్తు చేసి ఆమె ఆచూకీ కనుగొంటామన్నారు. -
బసాపురం చెరువులో బాలిక గల్లంతు
ఆదోని: పట్టణ జనాభా దాహార్తి తీరుస్తున్న 104 బసాపురం చెరువులో ఆదివారం పర్వతాపురం గ్రామానికి చెందిన మాధవి(11) అనే బాలిక గల్లంతైంది. గేదెలు మేపడానికి వెళ్లిన బాలికకు దాహం వేయడంతో చెరువులోకి దిగింది. కాలు జారడంతో నీళ్లలో పడిపోయింది. గట్టిగా కేకలు వేయడంతో సమీపంలోనే ఉన్న గేదెలు మేపుతున్న ఓ బాలుడు చెరువులోకి జారి పడిన దృశ్యం చూసి వెంటనే దాదాపు ఒకటిన్నర కిలో మీటరు ఉన్న గ్రామానికి వెళ్లి జరిగిన సంఘటన గురించి ఆమె తల్లిదండ్రులకు చెప్పాడు. తల్లిదండ్రులు లక్ష్మి, మల్లికార్జునతో పాటు గ్రామానికి చెందిన వారు చాలా మంది వెంటనే చెరువు వద్దకు వచ్చి గాలింపు చర్యలు చేపట్టారు. సమాచారం అందుకున్న మున్సిపాలిటీ సిబ్బంది కూడా గాలింపు చర్యల్లో పాల్గొన్నారు. గాలింపు రాత్రి వరకు కొనసాగినా మాధవి జాడ కనిపించలేదు. లక్ష్మి దంపతులకు ముగ్గురు సంతానం కాగా మాధవి పెద్ద కూతురు. గేదెలు మేపుతూ చేదోడు వాదోడుగా ఉన్న తమ కూతురు చెరువులో గల్లంతు కావడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరు అవుతున్నారు. తమ కూతురు కోసం రాత్ర కూడా కళ్లల్లో వత్తులు వేసుకుని చెరువు గట్టుమీదే నిరీక్షిస్తున్నారు. సోమవారం తిరిగి గాలింపు చర్యలు చేపట్టే అవకాశం ఉంది. -
సినిమాకు వెళ్లి ఇద్దరు బాలుర అదృశ్యం
పటాన్చెరు: సంగారెడ్డిజిల్లా పటాన్చెరు పోలీసు స్టేషన్ పరిధిలోని ఇస్నాపూర్‌లో ఇద్దరు బాలురు అదృశ్యమయ్యారు. సాయిరాం సహో(15), సాయితేజ(15)లు 9వ తరగతి చదువుతున్నారు. వీరిద్దరూ ఆదివారం సినిమాకని వెళ్లి ఇళ్లకు తిరిగి రాలేదు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
పంట కాలువలో దంపతుల గల్లంతు
కాలువలో దూకేసిన భార్య ఆమెను రక్షించేందుకు భర్త .. కొత్తపేట : కులాంతర వివాహం చేసుకున్నారు. ఎలాంటి పొరపచ్చాలు లేకుండా హాయిగా జీవనం సాగిస్తున్నారు. ఏ కష్టం వచ్చిందో ఏమో కానీభార్య కాలువలోకి దూకేయగా ఆమెను రక్షించబోయి భర్త తమ కుమార్తెను వదిలేసి కాలువలోకి దూకాడు. ఇద్దరూ గల్లంతయ్యారు. కొత్తపేట మండలం కండ్రిగ గ్రామానికి చెందిన కముజు శ్రీనివాసరావు (29), భవాని (26) దంపతులు బిళ్లకుర్రు శివారు డేగలవారిపాలెం వంతెన వద్ద భార్యా భర్తలు పంట కాలువలోకి దూకి గల్లంతయ్యారు. ఆదివారం రాత్రి జరిగిన ఈ సంఘటనకు సంబంధించి తండ్రి రాంబాబు, స్థానికులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. కండ్రిగ శివారు గుబ్బలవారిపాలెం గ్రామానికి చెందిన కముజు రాంబాబు – పుష్పకుమారి దంపతులకు కుమారుడు శ్రీనివాసరావు, ఒక కుమార్తె ఉన్నారు. శ్రీనివాసరావు సుమారు ఆరేళ్ల క్రితం అయినవిల్లి మండలం వీరవల్లిపాలెం గ్రామానికి చెందిన భవాని అనే యువతిని కులాంతర వివాహం చేసుకున్నాడు. వారికి పాప జన్మించింది. ప్రస్తుతం నాలుగేళ్ల కుమార్తె చెవిటి, మూగ, నడవలేని దివ్యాంగురాలు. శ్రీనివాసరావు ప్రస్తుతం రావులపాలెంలో ఒక ప్రైవేట్ స్కూలులో పీఈటీగా పనిచేస్తున్నాడు. పెళ్లికి బయలుదేరి... ఇదిలా ఉండగా గ్రామంలో మట్టపర్తి సింహాచలం కుమార్తె వివాహం సందర్భంగా ఆదివారం మధ్యాహ్నం విందు కార్యక్రమంలో భార్యాభర్తలు ఇద్దరూ ఉత్సాహంగా పాల్గొన్నారు. అమలాపురంలో పెళ్లి కుమారుని ఇంటి వద్ద వివాహం కార్యక్రమానికి కుమార్తెను తీసుకుని భార్యాభర్తలిద్దరూ మోటార్ సైకిల్‌పై రాత్రి ఏడు గంటల సమయంలో ఇంటి నుంచి బయలుదేరారు. సమీనపంలోని డేగలవారిపాలెం వంతెన వద్దకు వెళ్లేసరికి ఏమైందో ఏమో గాని భార్య భవాని మోటార్ సైకిలు దిగి పరుగెత్తగా భర్త శ్రీనివాసరావు బండి స్టాండ్ వేసి కుమార్తెను మోటార్ సైకిల్‌పైనే ఉంచి ఆమె వెంట పరుగెట్టాడు. ఆమె గట్టుపై చెప్పులు వదిలేసి బొబ్బర్లంక–అమలాపురం కాలువలో దూకేసింది. ఆమెను రక్షించేందుకు అతనూ దూకేవాడు. కాలువ అవతల ఉన్న వారు ఎవరో కాలువలో దూకేశారని గ్రహించి కేకలు వేయగా ఆ సమీపంలో నివాసితులు వాకాడ శ్రీనివాసరావు, వాకాడ శేషగోవిందరావు సంఘటనా స్థలానికి చేరుకోగా అక్కడ ఎవరూ కనిపించలేదు. సమీపంలో మోటార్‌సైకిలు, దానిపై ఒక పాప ఉంది.అక్కడ సెల్‌ఫోన్ పడివుంది. అదే సమయంలో గుబ్బలవారి పాలెంకు చెందిన ఓ వ్యక్తి అటు వెళుతూ ఆ పాపను గుర్తించి తన వెంట తీసుకువెళ్లి శ్రీనివాసరావు కుటుంబ సభ్యులకు అప్పగించాడు. గ్రామస్తులు సంఘటనా స్థలానికి చేరుకుని గాలిస్తున్నారు. కొత్తపేట ఎస్సై డి.విజయకుమార్, ఏఎస్సై ఎ.గరగారావు సంఘటనా స్థలాన్ని సందర్శించారు. దివ్యాంగ కుమార్తే కారణమా ? కుమార్తె దివ్యాంగురాలు కావడంతో నిత్యం ఆ దంపతులు మదన పడేవారు. పలుమార్లు కుమార్తెతో కాలువలో పడి ఆత్మహత్య చేసుకోవాలనుకునేవారు. వారి మాటలు విన్న అతడి తల్లిదండ్రులు వారించి అటువంటి పని చేయకండి..వైద్యం చేయిస్తున్నారు కదా..ఆరోగ్యవంతురాలు అవుతుందిలే అని నచ్చచెప్పేవారు. ఆమె అఘాయిత్యానికి పాల్పడగా ఆమెను రక్షించేందుకు వెళ్లి గల్లంతయ్యాడని అతడి తండ్రి రాంబాబు కన్నీటి పర్యతమయ్యాడు. -
సత్యదేవుని ఆదాయానికి ‘క్షవరం’
- అన్నవరం దేవస్థానంలో రూ.7 లక్షల విలువైన తలనీలాలు మాయం - రూ.1.28 కోట్లకు వేలం పాడిన టీడీపీ నేత - షరతుల ప్రకారం సగం సొమ్ము చెల్లించకుండానే మూడు నెలల తలనీలాల తరలింపు - కుమ్మక్కైన సిబ్బంది - ఆలస్యంగా గుర్తించిన అధికారులు - గుమస్తా సస్పెన్షన్.. ఇద్దరికి ఛార్జ్ మెమోలు అన్నవరం : బీహార్‌లో పశువుల దాణాను మేసేసిన ప్రబుద్ధుల గురించి విన్నాం. రాష్ట్రంలో ఇసుక బుక్కేస్తున్న బకాసురుల బాగోతాలను రోజూ చూస్తూనే ఉన్నాం. తాజాగా అన్నవరం దేవస్థానంలో సత్యదేవుని ఆదాయానికి కొంతమంది సిబ్బంది క్షవరం చేసేశారు. 18 రోజుల కాలానికి భక్తులు సమర్పించిన రూ.7 లక్షల విలువైన తలనీలాలు మాయమయ్యాయి. దాదాపు ఆరు నెలల కిందట జరిగిన ఈ వ్యవహారం బయటకు వెల్లడి కాకుండా కొందరు అధికారులు గోప్యత పాటించారు. ఎట్టకేలకు ఆ బాగోతం బయట పడడంతో కేశఖండన శాల గుమస్తాను సస్పెండ్ చేసి, సంబంధిత సూపరింటెండెంట్, ఏఈఓలకు మెమోలు జారీ చేసినట్లు ఈఓ కె.నాగేశ్వరరావు ఆదివారం విలేకర్లకు తెలిపారు. అసలేం జరిగిందంటే.. పలువురు భక్తులు సత్యదేవునికి తలనీలాలు సమర్పిస్తూంటారు. అలా వచ్చిన తలనీలాలను దేవస్థానం ఏడాది ముందే టెండర్ కం వేలంపాట ద్వారా విక్రయిస్తుంది. పాటదారు ఆ ఏడాదంతా ఆ తలనీలాలను సేకరించుకోవాలి. గత ఏడాది ఆగస్ట్ ఒకటో తేదీ నుంచి ఈ ఏడాది జూలై 31 వరకూ తలనీలాలు పోగు చేసుకుని, తీసుకునే హక్కును తుని మునిసిపాలిటీలో కీలక పదవిలో ఉన్న ఓ టీడీపీ నాయకుడు రూ.1.28 కోట్లకు దక్కించుకున్నారు. టెండర్ షరతుల ప్రకారం సగం మొత్తం అంటే రూ.64 లక్షలు చెల్లించాలి. అనంతరం తలనీలాలు తీసుకోవాలి. దీని ప్రకారం ఆ పాటదారు డిపాజిట్ రూపంలో రూ.10 లక్షలు చెల్లించాడు. మిగిలిన మొత్తంలో రూ.18 లక్షలు నగదు, మిగిలిన మొత్తానికి చెక్కులు ఇచ్చాడు. అయితే ఆ చెక్కులు మారలేదు. దీంతో టెండర్ నిబంధనల ప్రకారం సగం సొమ్ము చెల్లించనందున, భక్తులు సమర్పించిన తలనీలాలను ఒక గదిలో దాచి ఉంచారు. దీనికి అటు దేవస్థానం అధికారులు, ఇటు పాటదారుని వద్ద పని చేసేవారు రెండు తాళాలు వేసి జాయింట్ కస్టడీలో ఉంచుకున్నారు. అయితే పాట పాడిన వ్యక్తి అధికార టీడీపీ నాయకుడు కావడంతో ఏ ఒత్తిళ్లు వచ్చాయో ఏమో కానీ నిబంధనలకు విరుద్ధంగా తలనీలాలు తీసుకువెళ్లడానికి సంబంధిత అధికారులు అనుమతించారు. దీంతో గదిలో భద్రపరచిన మూడు నెలల తలనీలాలను అక్టోబర్ 29న పాటదారుకు అప్పగించారు. ఆ మర్నాటి నుంచి భక్తులు సమర్పించిన తలనీలాలను పాటదారుకు ఇవ్వకుండా ప్రతి రోజూ కేశఖండన శాల సిబ్బంది గ్రేడింగ్ చేసి భద్రపర్చాలి. అయితే అధికారుల నుంచి తమకు అటువంటి ఆదేశాలు లేనందున తలనీలాలు ఉన్న గదికి తాళం వేయలేదని సంబంధిత సిబ్బంది చెబుతున్నారు. మొత్తానికి ఏం జరిగిందో కానీ అక్టోబర్ 30 నుంచి నవంబర్ 16 వరకూ వచ్చిన తలనీలాలు మాయమయ్యాయి. ఏ రోజు ఎంత మొత్తంలో తలనీలాలు వచ్చాయన్న ఆధారాలు కూడా లేవు. దీంతో పాటదారు తరఫు మనుషులతో సిబ్బంది కుమ్మక్కై తలనీలాలను తరలించేసి, సొమ్ము చేసుకున్నారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. విచారణకు ఆదేశించాం తలనీలాలు మాయమైన వ్యవహారంలో కేశఖండన శాల గుమస్తా ఎం.రామకృష్ణను సస్పెండ్ చేశాం. ఈ వ్యవహారంపై సంజాయిషీ ఇవ్వాల్సిందిగా సూపరింటెండెంట్ జి.సత్యనారాయణ, ఏఈఓ సాయిబాబాలకు ఛార్జి మెమోలు జారీ చేశాం. పెద్ద పెద్ద స్కామ్‌లు కూడా చాలా కాలం తరువాతే వెలుగు చూస్తాయి. ఇదీ అంతే. ఆరు నెలల క్రితం జరిగినా అందుకే మా దృష్టికి రాలేదు. పాటదారు చెల్లించిన సొమ్ము మేరకే తలనీలాలు తీసుకువెళ్లేందుకు అనుమతించాం. ఈ వ్యవహారంపై విచారణకు ఆదేశించాం. నవంబర్ 17 నుంచి తలనీలాలను భద్రపరుస్తున్నాం. పూర్తి సొమ్ము కట్టని పాటదారుపై కేసు వేశాం. పాత వేలం రద్దు చేసి కొత్తగా వేలం నిర్వహిస్తాం. - కె.నాగేశ్వరరావు, కార్యనిర్వహణాధికారి, అన్నవరం దేవస్థానం -
అప్పుడు అదృశ్యం...ఇప్పుడు ప్రత్యక్షం
20 ఏళ్ల క్రిందట అదృశ్యమైన తమ్ముడు ఆకస్మికంగా ప్యత్యక్షం ... ఆ కుటుంబాల్లో ఆనందం ఇరవై ఏళ్ల కిందట ... పదిహేనేళ్ల వయసులో ఇంట్లో అలిగి పారిపోయాడు. కడుపు మాడితే వాడే వస్తాడులే అనుకున్నారు. ఒకటి, రెండు రోజులు ఎదురు చూశారు. అప్పటికీ రాకపోవడంతో కుటుంబ సభ్యులతోపాటు బంధువులు, సన్నిహితులు, స్నేహితులు ఒక్కటై వెదికారు. ఫలితం కనిపించలేదు. ఆశలు వదులుకున్నారు. ఈ ఘటన 1997 మే నెలలో జరిగింది. 20017 ఏప్రిల్ నెల ... సరిగ్గా 20 ఏళ్ల తర్వాత నాడు అదృశ్యమైన కుర్రాడు ఓ కేసు విచారణలో ఊరు పేరు బయటపడడంతో అమలాపురం పట్టణ పోలీసు స్టేషన్‌కు తీసుకువచ్చి తన కుటుంబ సభ్యులను పిలిపించడంతో ఉద్విగ్న పరిస్థితులు నెలకున్నాయి. - అమలాపురం టౌన్ 20 ఏళ్ల క్రితం ఏం జరిగింది? అమలాపురం రూరల్ మండలం సాకుర్రు గ్రామానికి చెందిన శిరగం బాలకృష్ణ అన్నదమ్ములు పండ్ల వ్యాపారం చేసుకుంటూ జీవించే వారు. ఆ అన్నదమ్ముల్లో చివరి వాడైన శిరగం రాంబాబు (15) తన అన్నల వ్యాపారంలో తన వంతు సాయపడేవాడు. వీరి తల్లిదండ్రులు చిన్నతనంలో మరణించారు. దీంతో రాంబాబు తన ఇద్దరు అన్నయ్యలు, ఇద్దరు అక్కలు దగ్గరే పెరిగాడు. ఓ రోజు ఇంట్లో కోపగించి హైదరాబాద్ వెళ్లిపోయాడు. కొన్నాళ్లు రాంబాబు కోసం బంధువులు, స్నేహితులు ఇళ్ల వద్ద గాలించినా ప్రయోజనం లేదు. ఈ లోపు అక్కలకు పెళ్లిళ్లు కావడం, అన్నయ్యలు పండ్ల వ్యాపారాలతో వేరే గ్రామాల్లో స్థిరపడ్డారు. ఎక్కడెక్కడ పనిచేశాడు.. రాంబాబు ఇంట్లోంచి 15వ ఏట వెళ్లిపోయి హైదరాబాద్ చేరుకున్నాడు. అక్కడే ఇరవై ఏళ్లుగా కూలీ పనులు చేసుకుంటూ జీవిస్తున్నాడు. హైదరాబాద్ కూకట్‌పల్లిలో ఓ షామియానా షాపులో కూలీగా పదేళ్లు పనిచేశాడు. బోయినపల్లిలో ఓ పంక్షన్ హాలులో మరో పదేళ్లు కూలీగా పనిచేశాడు. అయితే మూడు నెలల క్రితం అమలాపురం వచ్చి పట్టణంలోని ఓ పాత ఇనుము, ప్లాస్టిక్ సామాన్ల దుకాణంలో పనిచేస్తున్నాడు. పోలీసు స్టేషన్‌కు వచ్చిందిలా.. పట్టణంలో మంగళవారం సాయంత్రం రోడ్డుపై రాంబాబు, మరో వ్యక్తి ఓ విషయమై గొడవ పడ్డారు. అవతలి వ్యక్తి ఫిర్యాదుతో రాంబాబును స్టేషన్ క్రైం పార్టీ హెడ్ కానిస్టేబుళ్లు అయితాబత్తుల బాలకృష్ణ, బత్తుల రామచంద్రరావు స్టేషన్‌కు తీసుకుని వచ్చి విచారించారు. అసలు నీది ఏ ఊరు?, నీ వాళ్లు ఎవరు? అని ఆరా తీశారు. రాంబాబు మాది సాకుర్రు గ్రామమని, గతంలో ఇళ్లు విడిచి వెళ్లిపోయానని... ఇప్పుడు మా వాళ్లు ఎక్కడ ఉన్నారో కూడా తెలియదని బదులిచ్చాడు. దీంతో పోలీసులు సాకుర్రులోని రాంబాబు బంధువులను రప్పించి సమాచారం చెప్పారు. అంబాజీపేటలో ఉంటున్న రాంబాబు అన్నయ్య బాలకృష్ణకు, సాకుర్రులో ఉంటున్న అక్క నల్లా ఆదిలక్ష్మి కుటుంబాలకు బంధువులు సమాచారం అందించి బుధవారం మధ్యాహ్నం పోలీసు స్టేషన్‌కు రప్పించారు. 20 ఏళ్ల తర్వాత రాంబాబును చూసి అన్నయ్య, అక్క కుటుంబాల వారు ఉద్వేగానికి గురై కన్నీటి పర్యంతమయ్యారు. ఇన్ని సంవత్సరాల తర్వాత కలుసుకున్నందుకు వారి ఆనందానికి అవుధుల్లేవు. మొత్తానికి కథ కంచికి.. రాంబాబు ఇంటికి చేరాడు. -
కాలువలో బాలిక గల్లంతు
కడియం : కొద్దిసేపటిలో 8వ తరగతి పరీక్షలు రాయాల్సిన బాలిక ప్రమాదవశాత్తు కాలువలో గల్లంతైన సంఘటన కడియంలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. కడియం నుంచి వెంకాయమ్మపేట వెళ్లే రోడ్డులో వెల్ల శ్రీనివాస్, లక్ష్మిలు తమ ఇద్దరి పిల్లలతో నివాసం ఉంటున్నారు. వ్యవసాయ కూలీలుగా పనిచేస్తున్న శ్రీనివాస్, లక్ష్మి ఎప్పటిలాగే పనికి వెళ్లిపోయారు. వారి కుమార్తె వెల్ల భువనేశ్వరి(12) కడియం ఉన్నత పాఠశాలలో 8వ తరగతి చదువుతోంది. గురువారం మధ్యాహ్నం పరీక్షకు వెళ్లేందుకు సిద్ధమవుతోంది. దీంతో 12 గంటల సమయంలో కాలువలో స్నానం చేసేందుకు వెళ్లింది. అయితే ప్రమాదవశాత్తు కాలు జారీ కాలువలో పడిపోయింది. ఈ బాలికతోపాటు ఉన్న మిగతా పిల్లలు కేకలు వేసి పెద్దలను పిలుచుకువచ్చారు. అయితే అప్పటికే బాలిక కాలువలో కొంత దూరం కొట్టుకుపోయింది. సుమారు వంద మీటర్ల వరకు బాలిక చేతులు పైకి కన్పించాయని, ఆ తరువాత కన్పించలేదని నేరుగా చూసిన వారు చెబుతున్నారు. ఆమె కొట్టుకుపోవడాన్ని గమనించి కర్ర అందించేందుకు ప్రయత్నించినా సాధ్యం కాలేదని అక్కడున్న మహిళలు చెప్పారు. ఈలోపు వీరి కేకలు విని అక్కడికి చేరుకున్న కొందరు కాలువలోకి దిగి వెదికేందుకు ప్రయత్నించారు. అయినా ఫలితం లేకపోయింది. కాగా కాలువ నీటి మట్టం తగ్గిస్తే గానీ వెతకడం సాధ్యం కాదని వారు చెబుతున్నారు. ఇదిలా ఉండగా కూలిపని చేసుకుంటూ పిల్లలను పెంచుకుంటున్నామని, ఈ వార్త విని బాలిక తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. -
నిర్లక్ష్యమా? సాంకేతిక లోపమా?
తూర్పుపాలెంలో త్రుటిలో తప్పిన బ్లో అవుట్ తరచూ ప్రమాదాలు సంభవిస్తున్నా కానరాని జాగ్రత్త మలికిపురం (రాజోలు) : సమయం : బుధవారం ఉదయం 11 గంటలు స్థలం : తూర్పుపాలెం గ్రామం, కే డబ్ల్యూ 17 జడ్ ఓఎన్జీసీ సైట్ .. ఉన్నట్టుండి డ్రిల్లింగ్ జరిగిన బావి నుంచి అకస్మాత్తుగా భారీ గ్యాస్, ఆయిల్ పెల్లుబికింది. గ్యాస్ కిలో మీటరు మేర ఆవరించింది. సిబ్బంది, ఇంజినీర్లు కూడా తొలుత పరుగులు పెట్టారు.సమీపంలోని జీసీఎస్ ( గ్యాస్ గేదరింగ్ స్టేషన్)ల నుంచి సుమారు 200 మంది సిబ్బంది, నాలుగు అగ్నిమాపక వాహనాలు చేరుకున్నాయి. అరగంట గడిచాక గ్యాస్ తొలగింది. కాసేపు తేరుకున్న సిబ్బంది, కంటికి సంఘటన స్థలం కనిపిస్తుండడంతో ఫైర్ ఇంజన్ల సహాయంతో సంఘటన బావి వద్దకు చేరుకున్నారు. ఒక ఓఎన్జీసీ ఉన్నతాధికారి మాట్లాడుతూ ఇక్కడ అత్యంత భయంకర వాతావరణం నెలకొంది. ఆయిల్, గ్యాస్ ఆవరించి ఉంది. ఇక్కడే మరో మూడు గ్యాస్ ఆయిల్, బావులు ఉన్నాయి. ఫొటోలు తీస్తే ఆ ఫ్లాష్ తీవ్రతకు ఫైర్ అయితే పెను ప్రమాదం సంభవిస్తుందని స్థానిక విలేకరులను, గ్రామస్తులను హెచ్చరించారు. ప్రమాద తీవ్రత ఏంటో చెప్పకనే అర్థమవుతోంది. దీనికి కారణం ఎవరు. ఇక్కడ జీవిస్తున్న ప్రజలదా? భద్రత లేకుండా కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఆయిల్ సంస్థలదా? ఇలాంటి అనేక సంఘటనలు ప్రాణాలను హరించి వేస్తున్నాయి. 1990 ప్రాంతంలో కొమరాడ ఆయిల్ బావి బ్లో అవుట్ నుంచి 1994 అమలాపురం వద్ద బోడసకుర్రు బ్లోఅవుట్, 1995లో కొత్త పేట మండలం దేవర పల్లి బ్లోఅవుట్, 2014లో నగరం పైప్ లైన్ పేలుడు, సహా అనేక సంఘటనలు ఆయిల్ నిక్షేపాల అన్వేషణలో జరిగాయి. మూడే ళ్ల క్రితం రాజోలు మండంలో కడలిలో పొన్నమండ నుంచి తాటిపాకకు వెళ్లే గెయిల్ పైపు పేలి అనేక ఎకరాల్లో పంట కాలిపోయింది. దగ్గర్లో నివాసాలు లేకపోవడంతో ప్రాణాపాయం తప్పింది. రెండేళ్ల క్రితం రాజోలు మండలంలో కాట్రేని పాడు బావి బ్లోఅవుట్ కొద్దిపాటిలో తప్పింది. కేజీ బేసిన్లోఉమారు 11 వందల బావులు, మొత్తం 900 కిలో మీటర్లు గ్యాస్ పైప్లైన్లు విస్తరించి ఉన్నాయి. బావులు కోనసీమలోనే అధికం. ఇక్కడి నుంచి హైదరాబాద్ వరకూ పైప్లైన్లను ఏర్పాటు చేశారు. నిర్వహణ లోపం బావులను, గెయిల్ పైప్లైన్లను తరచూ పరిశీలిస్తూ నిర్వహణ సక్రమంగా ఉండాలి. కానీ కేజీ బేసిన్లో ఈ బావుల, పైప్లైన్ల నిర్వహణ సక్రమంగాలేదు. అంతా నిర్లక్ష్యం .. బావులు, గ్యాస్ పైప్‌లను తరచూ ఒత్తిడి, రాపిడికి గురై పాడయి పోతున్నా వాటిని మార్చాల్సిన గెయిల్‌తో పాటు ఇతర సంస్థలు ఏమాత్రం పట్టించుకోవడం లేదు. గ్యాస్ అమ్మకాల ద్వారా కోట్ల రూపాయల ఆదాయం ఆర్జిస్తున్నా ప్రజల ప్రాణాలను ఫణంగా పెడుతున్నాయి తప్ప, మరమ్మతులకు పెట్టుబడి పెట్టడం లేదు. నాణ్యత లోపం .. ఆయిల్ బావుల పర్యవేక్షణ, పైప్లైన్ల నిర్మాణంలో కూడా నాణ్యత లోపం చాలా ఉంటోంది. ప్రజల ప్రాణాలతో ముడిపడి ఉన్న వీటి నిర్వహణ, నిర్మాణంలో బాధ్యతగా వ్యవహరించకుండా ఇష్టానుసారం కాంట్రాక్టులు ఇచ్చి, నాణ్యత లేని పైప్లైన్లు వేయడం వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయి. దోపిడీయే తప్ప అభివృద్ధి శూన్యం ఆయిల్ నిక్షేపాలను తరలించుకు పోతున్న సంస్థలు ఈ ప్రాంత అభివృద్ధికి కేటాయిస్తున్న నిధులు కంటితుడుపుగానే ఉన్నాయి. కారు చౌకగా ప్రేవేటు సంస్థలకు గ్యాసును కేటాయిస్తున్నాయి. ఇక్కడ కనీసం రోడ్డు వేయడానికి నిధులు ఇవ్వరు. ఆ సంస్థ వాహనాల వల్ల దెబ్బతింటున్న రోడ్లను కూడా ప్రభుత్వమే నిర్మించాల్సి వస్తోంది. కుంగిన కోనసీమ ఓఎన్జీసీ, గెయిల్ కార్యకలాపాల వల్ల కోనసీమ మూడడుగులు కిందికి దిగిందని అధ్యయన బృందాలు ఇటీవల పశ్చిమ గోదావరిజిల్లా నర్సాపురంలో జరిగిన సదస్సులో తేల్చాయి. దీంతో సమద్రం నుంచి ఉప్పు నీరు భూబాగం పైకి వస్తుందని ఆ బృందం స్పష్టం చేసింది. -
విద్యార్థి అదృశ్యం
అనంతపురం సెంట్రల్ : నగరంలోని ఆదర్శనగర్‌కు చెందిన జోసఫ్ (9) అనే రెండో తరగతి విద్యార్థి అదృశ్యమయ్యాడు. తల్లిదండ్రులు మందలించడంతో మనస్తాపానికి గురై మంగâýæవారం ఇంటి నుంచి వెళ్లిపోయాడు. ఎన్ని చోట్ల వెతికినా జాడ కనిపించకపోవడంతో బుధవారం తల్లిదండ్రులు టూటౌ¯ŒS పోలీస్‌స్టేçÙ¯ŒSలో ఫిర్యాదు చేశారు. -
హెచ్ఎల్సీలో బాలుడి గల్లంతు
గార్లదిన్నె : గార్లదిన్నె మండలం పెనకచర్ల డ్యాం గ్రామానికి చెందిన చాకలి లక్ష్మిదేవి, నరసింహులు దంపతుల కుమారుడు రాము(16) హెచ్ఎల్సీలో పడి గల్లంతయ్యాడు. పోలీసుల కథనం ప్రకారం... తల్లిదండ్రులతో కలసి హెచ్ఎల్సీ కాలువలో దుస్తులు ఉతికేందుకు బుధవారం వెళ్లిన బాలుడు ప్రమాదవశాత్తు కాలుజారి కాలువలో పడి, నీటి ప్రవాహానికి కొట్టుకుపోయాడు. అవతలి వైపు గట్టునున్న పశువుల కాపర్లు గమనించి గట్టిగా కేకలు వేయడంతో రాము తల్లిదండ్రులు అప్రమత్తమయ్యారు. అందరూ కలసి రాము కోసం గాలించారు. అయినా అతని ఆచూకీ దొరకలేదు. ఉన్న ఏకైక కుమారుడు ఇలా కళ్లెదుటే నీటిలో కొట్టుకుపోవడంతో ఆ వృద్ధ తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు. తమ బిడ్డ ఆచూకీ తెలపాలని అందరినీ వేడుకున్నారు. సమాచారం అందుకున్న ఎస్ఐ శ్రీనివాసులు వెంటనే ఈతగాళ్లతో కాలువ వద్దకు చేరుకున్నారు. సాయంత్రం వరకు గాలించినా బాలుడిని కనుగొనలేకపోయారు. -
అస్సాం వృద్ధుడు రాజమహేంద్రవరంలో అదృశ్యం
ఆచూకీ తెలిపిన వారికి రూ. 50 వేల బహుమతి రాజమహేంద్రవరం క్రైం : అస్సాంకు చెందిన గురుదర్‌దాస్ అనే వృద్ధుడు రాజమహేంద్రవరంలో రైలు నుంచి దిగి అదృశ్యమయ్యాడని అతడి కుమారుడు ప్రతాప్‌దాస్ తెలిపాడు. ఆ వృద్ధుడు మానసిక వైద్యం కోసం భార్య, ఇద్దరు కుమారులతో కలిసి హైదరాబాద్ బయలుదేరాడు. అస్సాం నుంచి హౌరా చేరుకున్న వారు అక్కడి నుంచి గౌహతి ఎక్స్‌ప్రెస్‌లో సికింద్రాబాద్‌కు పయనమయ్యారు. ట్రెయిన్ ఈ నెల 22న రాజమహేంద్రవరం రైల్వేస్టేçÙన్ చేరుకున్నాక, తాను టాయిలెట్‌కు వెళతానంటూ గురుదర్‌దాస్ రైలు నుంచి కిందకు దిగాడు. ఎంతకీ రాకపోవడంతో 10 నిముషాల అనంతరం తామిద్దరం రైలు దిగి చూడగా తండ్రి ఆచూకీ లభించలేదని ఇద్దరు కుమారులు తెలిపారు. తమ తండ్రి వయస్సు 68 సంవత్సరాలని, చామన ఛాయ రంగులో 5.2 అడుగుల ఎత్తు ఉంటాడని వారు తెలిపారు. అదృశ్యమైన రోజు క్రీమ్ కలర్ పంజాబీ, వైట్ దోటీ ధరించాడని వివరించారు. బెంగాలీ భాష మాట్లాడతాడని పేర్కొన్నారు. తమ తండ్రి ఆచూకీ తెలిసిన వారు సెల్ నంబర్లు 09401561412, 09401918476, 09435898626, 09401203138, వీటితో పాటు జీఆర్పీ సీఐ 09440627551 నంబరుకు సమాచారం అందించాలని కోరారు. ఆచూకీ తెలిపిన వారికి రూ.50 వేల బహుమతి ఇస్తామని పేర్కొన్నారు. -
ఎవరెస్టును అధిరోహించి.. తిరిగి వస్తూ!
కోల్ కతా: ప్రపంచంలోనే ఎత్తైన ఎవరెస్ట్ పర్వత శిఖరాన్ని శనివారం ఉదయం అధిరోహించిన పశ్చిమ బెంగాల్ కు చెందిన ముగ్గరు పర్వతారోహకులు తిరిగివస్తూ 8 వేల అడుగుల ఎత్తులో (డెత్ జోన్) వద్ద ఆచూకీ లేకుండా పోయారు. మొత్తం పర్వతారోహణకు ఏడుగురు వెళ్లగా భట్టచార్య శుక్రవారం మృతి చెందాడు. ఆ తర్వాత మిగిలిన ఆరుగురిలో ముగ్గురు మాత్రమే క్యాంప్ 4 కు చేరుకోగా మిగిలిన ముగ్గురి నుంచి ఇప్పటివరకు ఎలాంటి సమాచారం లేదు. ఆచూకీ లేకుండా పోయిన వారిలో సునీత హజ్రా, గౌతమ్ ఘోష్, పరేశ్ నాథ్ లు ఉన్నారు. క్యాంపునకు సురక్షితంగా చేరుకున్న రమేష్, మలయ్, సత్యరూప్, రుద్రప్రసాద్ లు చివరి క్యాంప్ ను చేరుకుని యాత్రను ముగించడానికి బయలుదేరారు. డెత్ జోన్ ప్రయాణంలో ఇబ్బందులకు లోనైనా తట్టుకుని గమ్యాన్ని చేరుకున్నట్లు వివరించారు. గతంలో రెండుసార్లు ఎవరెస్టును అధిరోహించడానికి ప్రయత్నించి విఫలం చెందిన ప్రదీప్, చేతనా సాహులు ఈ సారి విజయవంతమవడంతో కోల్ కతా వాసులు సంబరాల్లో మునిగిపోయారు.