ముంబై:ఎప్పుడూ రద్దీగా ఉండే ముంబై ఛత్రపతి ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో ఘోర ప్రమాదం తప్పింది. శనివారం విమానాశ్రయంలోని ఓ రన్‌వే పై ఓ వైపు ఎయిర్‌ఇండియాకు చెందిన విమానం అవుతుండగానే అదే రన్‌వేపై వెనుక ఇండిగో ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానం ల్యాండ్ అయింది.
టేక్‌ఆఫ్ అవుతున్న విమానం గాల్లోకి ఎగరడంతో తృటిలో పెద్ద ప్రమాదం తప్పినట్లయింది. అసలు ఈ ఘటన జరగడానికి ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్(ఏటీసీ) కమ్యూనికేషన్ లోపమే కారణమని వెల్లడైంది. ఇండోర్ నుంచి వచ్చిన ఇండిగో విమానానికి పొరపాటున ల్యాండింగ్‌కు అనుమతిచ్చినట్లు తేలింది.
ఇండిగో విమానం ల్యాండింగ్‌కు కొన్ని సెకన్ల ముందు ఇదే రన్‌వేపై తిరువనంతపురం వెళ్లాల్సిన ఎయిర్‌ఇండియా విమానం టేకాఫ్ అయింది. ఎయిర్‌ఇండియా విమానం గాల్లోకి లేవడం సెకన్లు ఆలస్యమైనా భారీగా ప్రాణ నష్టం జరిగేది.
ఈ ఘటనపై డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్(డీజీసీఏ) విచారణ ప్రారంభించింది. ఇండిగో విమానం ల్యాండ్ అయ్యేందుకు క్లియరెన్స్ ఇచ్చిన ఏటీసీ ఉద్యోగిని ఇప్పటికే తొలగించారు.
Comments
Please login to add a commentAdd a comment