collission
-
AP: తెలంగాణ ఆర్టీసీ బస్సును ఢీకొన్న ట్యాంకర్
సాక్షి,అనంతపురం:బెంగళూరు నుంచి హైదరాబాద్ వెళుతున్న తెలంగాణ ఆర్టీసీ బస్సును గురువారం(అక్టోబర్11) అర్ధరాత్రి అనంతపురంజిల్లా గార్లదిన్నె మండలం తిమ్మంపేట సమీపంలో ట్యాంకరు ఢీకొట్టింది.ఈ ప్రమాదంలో బస్సులో ప్రయాణిస్తున్న తొమ్మిది మంది గాయపడ్డారు. ఈ ప్రమాదంలో ట్యాంకరు డ్రైవరుకు తీవ్ర గాయాలయ్యాయి. గాయపడ్డవారిని హైవే పెట్రోలింగ్ అనంతపురం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మిగిలిన ప్రయాణికులను ఇతర బస్సుల్లో హైదరాబాద్‌కు తరలించారు. జాతీయ రహదారి44పై ట్రాఫిక్ అంతరాయం కలగకుండా పోలీసులు చర్యలు తీసుకున్నారు.ఇదీ చదవండి: ఈ టీతో నష్టాలే -
ముంబైలో తప్పిన విమానాల ఢీ
ముంబై:ఎప్పుడూ రద్దీగా ఉండే ముంబై ఛత్రపతి ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో ఘోర ప్రమాదం తప్పింది. శనివారం విమానాశ్రయంలోని ఓ రన్‌వే పై ఓ వైపు ఎయిర్ఇండియాకు చెందిన విమానం అవుతుండగానే అదే రన్‌వేపై వెనుక ఇండిగో ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానం ల్యాండ్ అయింది. టేక్ఆఫ్ అవుతున్న విమానం గాల్లోకి ఎగరడంతో తృటిలో పెద్ద ప్రమాదం తప్పినట్లయింది. అసలు ఈ ఘటన జరగడానికి ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్(ఏటీసీ) కమ్యూనికేషన్ లోపమే కారణమని వెల్లడైంది. ఇండోర్ నుంచి వచ్చిన ఇండిగో విమానానికి పొరపాటున ల్యాండింగ్‌కు అనుమతిచ్చినట్లు తేలింది.ఇండిగో విమానం ల్యాండింగ్‌కు కొన్ని సెకన్ల ముందు ఇదే రన్‌వేపై తిరువనంతపురం వెళ్లాల్సిన ఎయిర్ఇండియా విమానం టేకాఫ్ అయింది. ఎయిర్ఇండియా విమానం గాల్లోకి లేవడం సెకన్లు ఆలస్యమైనా భారీగా ప్రాణ నష్టం జరిగేది. ఈ ఘటనపై డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్(డీజీసీఏ) విచారణ ప్రారంభించింది. ఇండిగో విమానం ల్యాండ్ అయ్యేందుకు క్లియరెన్స్ ఇచ్చిన ఏటీసీ ఉద్యోగిని ఇప్పటికే తొలగించారు. -
నర్సింగ్ కాలేజ్ బస్సు బోల్తా...విద్యార్థులకు గాయాలు
సాక్షి నల్గొండ: నల్గొండ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. నర్సింగ్ కాలేజ్ విద్యార్థుల బస్సు నల్లగొండ జిల్లాలోని తాటికల్ ఫ్లై ఓవర్ నుండి సర్వీస్ రోడ్డు క్రాస్ అవుతున్న క్రమంలో వెనుకవైపు నుంచి వస్తున్న లారీ, కాలేజీ బస్సు ఢీకొన్నాయి. ఈ ఘటనలో కాలేజీ బస్సు బోల్తా పడింది. సూర్యపేటకు చెందిన భవాని స్కూల్ ఆఫ్ నర్సింగ్ విద్యార్థులు నల్లగొండ జిల్లా కేంద్రంలో పరీక్షలు రాయడానికి వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. గాయపడ్డవారిని స్థానికి ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాదం జరిగిన సమయంలో కాలేజ్ బస్సులో సుమారు 40 మంది విద్యార్థినిలు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదంలో సుమారు 30 మందికి గాయాలయ్యాయని, ముగ్గురు పరిస్థితి విషమంగా ఉందని సమాచారం. ఈ మేరకు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. (చదవండి: సీఎం గారూ.. ఇళ్లు కట్టిస్తేనే మీ మాటకు విలువ) -
విమానం కిందకు కారు.. తప్పిన పెను ప్రమాదం!
రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు ట్రాఫిక్ పోలీసులు, ప్రభుత్వ యంత్రాంగం ఎంతలా అవగాహన కార్యక్రమాలు చేపట్టినప్పటికీ ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేయడమే కాకుండా వాహనకారులకు స్పీడ్‌గా వెళ్లకుండా ఉండేలా జరిమానాలు విధిస్తూ కట్టిడి చేస్తున్నప్పటికీ ప్రమాదం ఎటూ నుంచి ముంచుకొస్తోందో అర్థం కాని స్థితి. ప్రస్తుతం ఇక్కడ కూడా అలానే జరిగింది. అదీకూడా విమానాశ్రంయలో కట్టుదిట్టమైన భద్రతతో కూడిన ఆ చోట కన్నురెప్ప పాటులో ఒక పెద్ద పెను ప్రమాదం తప్పింది. వివరాల్లోకెళ్తే....ఢిల్లీ విమానాశ్రయంలో ఇండిగో విమానం ఏ 320 నియో ఢాకాకు బయలుదేరేందుకు సిద్ధంగా ఉంది. ఇంతలో గో ఫస్ట్ ఎయిర్‌లైన్స్‌కి చెందిన కారు.. విమానం కిందకు వెళ్లిపోయింది. వాస్తవానికి విమానం ముందు చక్రానికి ఢీ కొట్టిందేమోనని అక్కడ ఉన్న అధికారులు టెన్షన్‌తో ఊపిరి బిగపెట్టుకుని చూస్తున్నారు. ఐతే అనూహ్యంగా తృటిలో పెద్ద పెనుప్రమాదం తప్పిపోయింది. ఆ విమానానికి ఉన్న ముందు చక్రానికి వెంట్రుకవాసి దూరంలో ఈ కారు ఆగిపోయింది. ఈ ఘటనకు గల కారణాలు గురించి డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ లేదా డీజీసీఏ సివిల్ ఏవియేషన్ రెగ్యులేటర్ పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తుందని అధికారులు తెలిపారు. సదరు కారు డ్రైవర్ మద్యం సేవించి ఇలా ర్యాష్‌గా కారు నడిపాడేమోనని బ్రీత్ ఎనలైజర్ పరీక్ష కూడా నిర్వహించారు. ఐతే నెగిటివ్ వచ్చిందని అధికారులు తెలిపారు. ఈ ఘటనలో విమానానికి ఎలాంటి నష్టం జరగలేదని, ఎవరూ గాయపడలేదని విమానాశ్రయ వర్గాలు వెల్లడించాయి. ఈ విమానం మంగళవారం ఉదయం పాట్నాకు వెళ్లేందకు సిద్ధంగా ఉన్న సమయంలో ఈ ప్రమాదం తలెత్తిందని పేర్కొన్నారు. ఐతే ఈ ఘటన పై ఇండిగో కానీ గో ఫస్ట్ గానీ స్పందించ లేదు. ఈ మేరకు ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఆన్లైన్లో తెగ వైరల్ అవుతోంది. #WATCH | A Go Ground Maruti vehicle stopped under the nose area of the Indigo aircraft VT-ITJ that was parked at Terminal T-2 IGI airport, Delhi. It was an Indigo flight 6E-2022 (Delhi–Patna) pic.twitter.com/dxhFWwb5MK — ANI (@ANI) August 2, 2022 (చదవండి: పనసకాయ కోసం ఎన్ని తిప్పలు పడిందో ఈ ఏనుగు) -
కుటుంబం విధివశం
సాక్షి, బళ్లారి: రాయచూరు జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో తల్లిదండ్రులు, వారి ఇద్దరు కూతుర్లు ప్రాణాలు కోల్పోయారు. కారు–లారీ ఎదురెదురుగా ఢీకొనడంతో ఈ విషాదం సంభవించింది. సింధనూరు తాలూకా జవళగెరె సమీపంలోని బాలయ్య క్యాంపు వద్ద సోమవారం తెల్లవారుజామున ఈ ఘటన చోటు చేసుకుంది. బెంగళూరు నుంచి హైదరాబాద్‌కు వెళ్తుండగా మధ్యప్రదేశ్‌కు చెందిన వారు బెంగళూరు నుంచి కారు (టీఎస్–08 హెచ్‌జీ–5584)లో హైదరాబాద్‌కు వెళుతున్నారు. ఎదురుగా తెలంగాణ వైపు నుంచి సింధనూరు వైపు వస్తున్న లారీ (ఏపీ–21 వై–6498) ఢీకొంది. ఘటనా స్థలంలోనే కారులో ప్రయాణిస్తున్న భార్యాభర్తలతో పాటు ఇద్దరు చిన్నారులు కూడా మరణించారు. ఈ ప్రమాదంలో కారు నుజ్జునుజ్జు కాగా రోడ్డు రక్తమోడింది. కారులోని నలుగురూ మరణించారు. మృతులు ప్రదీప్ (35), పూరి్ణమ (30), వీరి కూతుళ్లు జతిన్ (12), మాయిన్(7). స్థానిక సీఐ ఉమేష్ కాంబ్లె, బళగానూరు ఎస్ఐ వీరేష్ సిబ్బందితో లారీలోకి దూసుకుపోయిన కారును పొక్లెయినర్‌తో బయటకు లాగి మృతదేహాలను వెలికితీశారు. పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు. వాహనాల డ్రైవర్ల నిద్రమత్తే ప్రమాదానికి కారణమనే అనుమానం ఉంది. లారీ డ్రైవర్ పరారీలో ఉన్నట్లు సమాచారం. (చదవండి: సారీ..రీచార్జ్‌కు డబ్బుల్లేవు) -
Viral Video: ఏంటా దూకుడు!... బ్రేక్ వేసుండకపోతే పరిస్థితి....
అతి వేగం అనర్థం అని ట్రాఫిక్ పోలీసులు ఎంత మొత్తుకుంటున్న యువతలో మాత్రం మార్పు రావడం లేదు. స్పీడ్ బ్రేకర్లు, జీపీఎస్ అంటూ వేగాన్ని నియంత్రించేందుకు పోలీసులు నానా తంటాలు పడుతున్నారు. అయినా మితి మీరిన వేగంతో వేళ్తేనే మజా అంటోంది యువత. ఎంత భయంకరమైన ప్రమాదాలు జరిగిన తగ్గేదేలే అంటూ రయ్ రయ్ మంటూ వెళ్లిపోతున్నారు. అచ్చం అలాంటి ఘటన గురించే ఇప్పుడు మనం చెప్పుకోబోతున్నాం. ఎందుకంటే ఇక్కడొక వ్యక్తి కూడా యూ టర్న్ తీసుకుంటున్న బస్సుని లక్ష్య పెట్టకుండా తనదైన స్పీడులో దూసుకుపోతున్న వీడియో ఒకటి నెట్టింట తెగ వైరల్ అవుతోంది. కర్ణాటకలోని మంగళూరులో బస్సును వేగంగా దాటిన వ్యక్తి త్రుటిలో ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు. బస్సు డ్రైవర్ యూ టర్న్తీసుకోవడానికి బస్సుని ఒక పక్కకు ఆపి తిప్పడానికి ప్రయత్నిస్తున్నాడు. ఇంతలో అకస్మాత్తుగా స్కూటర్ పై దూసుకుంటూ వస్తున్న ఒక వ్యక్తిని చూసి బస్సు డ్రైవర్ వెంటనే బ్రేక్ వేశాడు. అదృష్టవశాత్తు అతనికి ఏం కాలేదు. అయితే ఆ వ్యక్తి మాత్రం చేపల ప్రాసెసింగ్ యూనిట్ గేట్‌ని రాసుకుంటూ ..ఒక దుకాణం, చెట్టు మధ్యలో ఉన్న చిన్న గ్యాప్ నుంచి వెళ్లిపోయాడు. అతను రైడ్ చేసిన విధానం చూస్తేనే వొళ్లు గగ్గర్పాటుకు గురవుతుంది. అయితే ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట తెగ వైరల్ అవుతోంది. దీంతో నెటిజన్లు లక్కీ గై అని ఒకరు, మరోకరేమో ఏమి జరగనట్టుగా వెళ్లిపోతున్నాడు అంటూ విమర్శిస్తూ ట్వీట్ చేశారు. Viral video of a young man who was speeding on a scooter and miraculously avoided colliding with a bus that was taking a U-turn near Elyarpadavu, Mangalore. 🚌💨🛵 The scooter then hits the door of the fish processing unit and passed in between a shop and a tree. 😱 pic.twitter.com/c4vAvbbikj — Mangalore City (@MangaloreCity) January 11, 2022 -
రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి
రంగారెడ్డి(పూడూరు): రంగారెడ్డి జిల్లా పూడూరు మండల కేంద్రం సమీపంలో ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ మహిళ మృతి చెందింది. వివరాలు.. హైదరాబాద్-బీజాపూర్ ప్రధాన రహదారి పక్కనున్న ఓ చెట్టును ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఈ సంఘటనలో ఓ మహిళ అక్కడిక్కడే మృతిచెందగా..మరో 15 మందికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.