నర్సింగ్‌ కాలేజ్‌ బస్సు బోల్తా...విద్యార్థులకు గాయాలు | Nursing Students Bus Overturned At Nalgonda Many Of Them Injured | Sakshi
Sakshi News home page

నర్సింగ్‌ కాలేజ్‌ బస్సు బోల్తా...విద్యార్థులకు గాయాలు

Published Mon, Dec 12 2022 10:17 AM | Last Updated on Mon, Dec 12 2022 11:17 AM

Nursing Students Bus Overturned At Nalgonda Many Of Them Injured - Sakshi

సాక్షి నల్గొండ: నల్గొండ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. నర్సింగ్‌ కాలేజ్‌ విద్యార్థుల బస్సు నల్లగొండ జిల్లాలోని తాటికల్ ఫ్లై ఓవర్ నుండి సర్వీస్ రోడ్డు క్రాస్ అవుతున్న క్రమంలో వెనుకవైపు నుంచి వస్తున్న లారీ, కాలేజీ బస్సు ఢీకొన్నాయి.  ఈ ఘటనలో కాలేజీ బస్సు బోల్తా పడింది. సూర్యపేటకు చెందిన భవాని స్కూల్‌ ఆఫ్‌ నర్సింగ్‌ విద్యార్థులు నల్లగొండ జిల్లా కేంద్రంలో పరీక్షలు రాయడానికి వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. గాయపడ్డవారిని స్థానికి ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

ప్రమాదం జరిగిన సమయంలో కాలేజ్‌ బస్సులో సుమారు 40 మంది విద్యార్థినిలు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదంలో సుమారు 30 మందికి గాయాలయ్యాయని, ముగ్గురు పరిస్థితి విషమంగా ఉందని సమాచారం. ఈ మేరకు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. 

(చదవండి: సీఎం గారూ..  ఇళ్లు కట్టిస్తేనే మీ మాటకు విలువ)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement