Six Dead And Several Injured As APSRTC Hits Lorry In Annamayya District - Sakshi
Sakshi News home page

ఆర్టీసీ బస్సును ఢీకొన్న లారీ.. ఆరుగురు మృతి

Published Sat, Jul 22 2023 7:07 PM | Last Updated on Sat, Jul 22 2023 7:38 PM

Road Accident In Annamayya District Several Killed And Injured - Sakshi

సాక్షి, అన్నమయ్య: అన్నమయ్య జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఆరుగురు దుర్మరణం చెందారు.  ఓబులవారిపల్లె మండల పరిధిలోని జాతీయ రహదారిపై శనివారం సాయంత్రం ఈ ప్రమాదం జరిగింది.

వివరాల్లోకి వెళితే.. ఓబులవారిపల్లె పరిధిలోని జాతీయ రహదారిపై కడప నుంచి తిరుపతికి వెళ్తున్న ఆర్టీసీ బస్సును ఎదురుగా వచ్చిన లారీ వేగంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు.

లారీ డ్రైవర్‌ అతివేగమే ప్రమదానికి కారణమని స్థానికులు చెబుతున్నారు. ఈ ప్రమాద ఘటనతో రాజంపేట-తిరుపతి జాతీయ రహదారిపై ట్రాఫిక్‌ స్తంభించింది. దీంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ట్రాఫిక్‌ క్లియర్‌ చేశారు. ఈ ప్రమాదంలో గాయపడిని వారిని రాజంపేట ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. 

చదవండి   Kachidi Fish: కాకినాడలో కాస్ట్‌లీ చేప.. వేలంలో రూ.3లక్షల 10వేలు!.దీని ప్రత్యేక ఇదే

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement