Karnataka Major Road Accident Several Injured And Died - Sakshi
Sakshi News home page

Karnataka Major Road Accident: కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం.. బస్సు- లారీ ఢీకొని తొమ్మిది మంది మృతి

Published Tue, May 24 2022 9:16 AM | Last Updated on Tue, May 24 2022 11:57 AM

Karnataka Major Road Accident Several Injured And Died - Sakshi

Karnataka Road accident: కర్ణాటకలోని హుబ్లి శివారు ప్రాంతంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో తొమ్మిది మంది మృతి చెందారు. పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం... మంగళవారం ఉదయం కొల్హాపూర్‌ నుంచి బెంగళూరు వెళ్తున్న బస్సు అదే దారిలో వెళ్తున్న లారీ ఢీకొట్టుకున్నాయి. ఈ ప్రమాదంలో తొమ్మిది మంది మృతి చెందగా 26 మందికి గాయలయ్యాయి.

సమాచారం అందిన వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను హుబ్లిలోని కిమ్స్‌కి ఆస్పత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు. ఈ ప్రమాదంలో లారీ, బస్సు డ్రైవర్​ ఇద్దరూ  అక్కడికక్కడే మరణించారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement