overturn
-
రైలు పట్టాలపై సిలిండర్.. బయటపడిన మరో కుట్ర
కాన్పూర్: దేశంలోని పలు ప్రాంతాల్లో రైళ్లను పట్టాలు తప్పించేందుకు కుట్రలు జరుగుతున్నాయి. ఇటువంటి ఘటనలకు సంబంధించిన వార్తలు తరచూ వినిపిస్తున్నాయి. తాజాగా ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో రైల్వే ట్రాక్‌పై గ్యాస్ సిలిండర్‌ను ఉంచి, రైలును పట్టాలు తప్పించేందుకు గుర్తుతెలియని దుండగులు ప్రయత్నించారు. కాన్పూర్ నుంచి ఫతేపూర్‌కు వెళ్లే ఢిల్లీ హౌరా రైల్వే ట్రాక్‌పై రైల్వే సిబ్బందికి ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ కనిపించింది.కాన్పూర్‌లోని ప్రేమ్‌పూర్ రైల్వే స్టేషన్ సమీపంలో లూప్ లైన్లో ఎల్పీజీ సిలిండర్‌ను ఉంచారు. ఈ ఘటన నేడు (ఆదివారం) తెల్లవారుజామున 5.50 గంటలకు జరిగింది. లోకో పైలట్ అసిస్టెంట్, లోకో పైలట్ ప్రమాదాన్ని గుర్తించి, ఎమర్జెన్సీ బ్రేక్ వేయడం ద్వారా రైలును ఆపారు. రైలులోని ఉద్యోగులు ఈ విషయాన్ని ఆర్పీఎఫ్కి, డిపార్ట్మెంట్లోని ఇతర అధికారులకు తెలియజేశారు.ఘటనా స్థలానికి సంబంధించిన చిత్రాలలో రైల్వే ట్రాక్‌పై ఐదు కిలోల గ్యాస్ సిలిండర్‌ను ఉంచడాన్ని గమనించవచ్చు. పైలట్, అసిస్టెంట్ పైలట్ అప్రమత్తంగా వ్యవహరించడంతో రైలును పట్టాలు తప్పించే కుట్ర విఫలమైంది. ఈ ఘటనపై రైల్వే శాఖ విచారణకు ఆదేశించింది. ఈ మేరకు ఉత్తర మధ్య రైల్వే జోన్‌లోని ప్రయాగ్‌రాజ్ డివిజన్ పీఆర్వో అమిత్ సింగ్‌కు సమాచారం అందించారు.ఇది కూడా చదవండి: పట్టాలు తప్పిన ముజఫర్‌పూర్- పూణె స్పెషల్ రైలు -
బీర్ల వ్యాన్ బోల్తా
-
నెల్లూరు చెరువులో పడవ బోల్తా..అయిదుగురి మృతదేహాలు లభ్యం
సాక్షి, నెల్లూరు: పొదలకూరు మండలం తోడేరు చెరువులో గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. గల్లంతైన ఆరుగురిలో అయిదు మృతదేహాలను రెస్క్యూ టీం వెలికి తీసింది. మృతులు బాలాజీ, చల్లా ప్రశాంత్, కళ్యాణ్, త్రినాథ్, రఘుగా గుర్తించినట్లు పేర్కొన్నారు. మరో వ్యక్తి సురేంద్ర ఆచూకీ కోసం ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి. మంత్రి కాకాణి ,ఎస్పీ విజయరావు, కలెక్టర్ చక్రధర్ బాబు సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న జడ్పీ చైర్పెర్సన్ ఆనం అరుణమ్మ.. మృతుల కుటుంబసభ్యులను పరామర్శించారు. కాగా జిల్లాలో ఆదివారం సాయంత్రం ఘోర ప్రమాదం జరిగింది. పొదలకూరు మండలం తోడేరు గ్రామ చెరువులో ప్రయాణికులతో వెళ్తున్న పడవ బోల్తా పడింది. ఈ ఘటనలో ఆరుగురు యువకులు గల్లంతయ్యారు. వాళ్ల ఆచూకీ కోసం పోలీసులు, ఫైర్ సిబ్బంది గాలిస్తున్నారు. సెలవు దినం కావడంతో వాళ్లంతా సరదాగా షికారుకు వెళ్లినట్లు తెలుస్తోంది. ప్రమాదం సమయంలో పడవలో పది మంది యువకులు ఉన్నారు. నలుగురు క్షేమంగా బయటపడ్డారు. ఆరుగురు గల్లంతయ్యారు. గల్లంతయిన యువకుల పేర్లు.. సురేంద్ర,(19), రఘు (24), బాలాజీ (21), త్రినాథ్ (18), కళ్యాణ్(28), ప్రశాంత్(29)గా నిర్ధారించారు పోలీసులు. పొదలకూరు సీఐ సంగమేశ్వరరావు, ఎస్ఐ కరిముల్లా పర్యవేక్షణలో గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. (చదవండి: నెల్లూరులో ఘోర ప్రమాదం: తోడేరు చెరువులో పడవ బోల్తా.. ఆరుగురు యువకుల గల్లంతు) -
మిరాకిల్ ఘటన: ఘోర కారు ప్రమాదం..బతికే ఛాన్సే లేదు! కానీ..
ఎన్నో రకాల కారు ప్రమాదాల గురించి విని ఉంటాం. చాలా మటుకు ఆ ప్రమాదాల్లో ప్రాణాలు పోవడమే లేదా తీవ్ర గాయాలతో చికిత్స పొందుతూ మృతి చెందిన ఘటనలే కోకొల్లలు. అలాంటిది కారు ఓ గోడకు క్రాష్ అయ్యి దారుణంగా స్పిన్నయ్యి బోల్తా పడింది. ఆ ఘటన చూస్తే కారులో ఉన్న వాళ్లంతా చనిపోయి ఉంటారనిపిస్తుంది. కానీ అద్భుతంగా నలుగురు కొద్ది పాటి గాయాలతో ప్రాణాలతో బయటపడ్డారు. ఈ ఘటన కేరళలో చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే..కోజికోడ్‌లోని కరుమలలో ఒక కారు ఘోర ప్రమాదానికి గురైంది. నలుగురు వ్యక్తులతో ప్రయాణిస్తున్న ఆ కారు అదుపుతప్పి రోడ్డు పక్కనే ఉన్న గోడను ఢీ కొట్టి గిరిగిర చక్కెర్లు కొడుతూ బోల్తాపడింది. కారు స్పిన్నవ్వడంతో ఓ వ్యక్తి వెనుక సీటులోంచి జారిపడి విండో ఫ్రేమ్‌ని పట్టుకుని ఉన్నాడు. ఇంతలో అటుగా వస్తున్న కొందరూ వాహనదారులు ఆ కారులో ఉన్న వారికి సాయం అందించి బయటకు తీసే యత్నం చేశారు. ఐతే అదృష్టవశాత్తు ఆ కారులోని వారందరికి ఏమి కాలేదు. ఆ ప్రయాణికుల్లో ఒక మహిళకి చేతికి గాయం కావడంతో ఒక ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటోంది. ఇలాంటి ఘటనలు అత్యంత అరుదుగా సంభవిస్తాయి. అంతేగాదు మిరాకిల్ అంటే ఇదేనేమో అన్నట్లు ఉంది ఆ కారు ప్రమాదం. అందుకు సంబంధించిన వీడియో నెట్టంట తెగ చక్కెర్లు కొడుతోంది. మీరు కూడా ఓ లుక్కేయండి. #Kerala, #India Passenger slips out of rear window during spinning and flipping car crash, holding onto window frame throughout. Only minor injuries reported pic.twitter.com/EqdOLZNYsS — Cláudio (@BigDeadSoul) February 23, 2023 (చదవండి: మిస్టరీగా 11 ఏళ్ల చిన్నారి హత్య..చిక్కుముడి విప్పిన మిస్డ్ కాల్) -
నర్సింగ్ కాలేజ్ బస్సు బోల్తా...విద్యార్థులకు గాయాలు
సాక్షి నల్గొండ: నల్గొండ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. నర్సింగ్ కాలేజ్ విద్యార్థుల బస్సు నల్లగొండ జిల్లాలోని తాటికల్ ఫ్లై ఓవర్ నుండి సర్వీస్ రోడ్డు క్రాస్ అవుతున్న క్రమంలో వెనుకవైపు నుంచి వస్తున్న లారీ, కాలేజీ బస్సు ఢీకొన్నాయి. ఈ ఘటనలో కాలేజీ బస్సు బోల్తా పడింది. సూర్యపేటకు చెందిన భవాని స్కూల్ ఆఫ్ నర్సింగ్ విద్యార్థులు నల్లగొండ జిల్లా కేంద్రంలో పరీక్షలు రాయడానికి వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. గాయపడ్డవారిని స్థానికి ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాదం జరిగిన సమయంలో కాలేజ్ బస్సులో సుమారు 40 మంది విద్యార్థినిలు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదంలో సుమారు 30 మందికి గాయాలయ్యాయని, ముగ్గురు పరిస్థితి విషమంగా ఉందని సమాచారం. ఈ మేరకు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. (చదవండి: సీఎం గారూ.. ఇళ్లు కట్టిస్తేనే మీ మాటకు విలువ) -
బీకాం విద్యార్థుల ప్రశ్నపత్రం తారుమారు
డాక్టర్ బీ.ఆర్.అంబేడ్కర్ యూనివర్సిటీ పరీక్షల విభాగం డొల్లతనం మరోసారి బయటపడింది. బీకాం ప్రథమ సంవత్సరం రెగ్యులర్ విద్యార్థులకు అందజేయాల్సిన పేపర్ తారుమారు (ఒక ప్రశ్నపత్రం బదులు మరోప్రశ్నపత్రం ఇవ్వడం) అయిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సప్లిమెంటరీ విద్యార్థులకు ఇవ్వాల్సిన ప్రశ్నపత్రం రెగ్యులర్ విద్యార్థులకు ఇవ్వడంతో వారంతా తీవ్ర గందరగోళంలో ఉన్నారు. తమకు యూనివర్సిటీ ఉన్నతాధికారులు న్యాయం చేయాలని వేడుకుంటున్నారు. శ్రీకాకుళం: బీఆర్‌ఏయూ పరిధిలో గతనెల 24 నుంచి ఈ నెల నాలుగో తేదీ వరకు ఐదో సెమిస్టర్, ఈ నెల 8 నుంచి 16వ తేదీ వరకు మొదటి, మూడో సెమిస్టర్ పరీక్షలు జరిగాయి. ఇందులో బీకాం ఫస్టియర్ చదువుతున్న విద్యార్థులకు మొదటి సెమిస్టర్ పరీక్షల్లో భాగంగా ఈనెల 13వ తేదీన ఫండమెంటల్ అకౌంటింగ్ పరీక్ష జరిగింది. అయితే వీరికి ఇచ్చిన ప్రశ్నపత్రం తారుమారైంది. 2016–17 బ్యాచ్‌కు చెందిన రెగ్యులర్ విద్యార్థులకు ఇవ్వాల్సిన ప్రశ్నాపత్రం ఇవ్వకుండా.. సప్లిమెంటరీ (2015–16) విద్యార్థులకు ఇవ్వాల్సిన ప్రశ్నాపత్రాన్ని అందజేశారు. తమ ప్రశ్నాపత్రమే ఆనుకుని వారంతా పరీక్ష రాసేశారు. జిల్లాలో శ్రీకాకుళం నగరంతోపాటు చాలా ప్రాంతాల్లోని కేంద్రాల్లో ప్రశ్నపత్రం తారుమారైనట్లు విద్యార్థులు ఆలస్యంగా గుర్తించారు. స్కోరింగ్ సబ్జెక్ట్ అకౌంటింగే! వాస్తవానికి బీకాం విద్యార్థులకు ఫండమెంటల్/ఫైనాన్షియల్ అకౌంటింగ్ పేపర్‌ను స్కోరింగ్ సబ్జెట్‌గా అంతా భావిస్తారు. సెమిస్టర్ విధానంలో జరుగుతున్న పరీక్షలకు గత ఐదు మాసాలగా సన్నద్ధమయ్యారు. అయితే పరీక్షలకొచ్చేసరికి తమది కాని ప్రశ్నపత్రాన్ని అందజేసి తమకు నిండా ముంచారని వారంతా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఫస్టియర్ బీకాం విద్యార్థులు సుమారు నాలుగు వేల మంది ఉండగా ఇందులో సగానికిపైగా విద్యార్థులు తారుమారు ప్రశ్నపత్రం కారణంగా నష్టపోయినట్లు తెలిసింది. తమకు జరిగిన నష్టాన్ని తెలుసుకుని లబోదిబోమంటున్నారు. యూనివర్సిటీ అధికారులు తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. న్యాయం చేయని పక్షంలో విద్యార్థి సంఘాలతో మమేకమై యూనివర్సిటీ వద్ద ధర్నాకు దిగుతామని చెబుతున్నారు. ఇలాంటి తరుణంలో యూనివర్సిటీ ఉన్నతాధికారులు కల్పించుకుని ఏ మేరకు నిర్ణయం తీసుకుంటారో వేచిచూడాలి. మాదృష్టికి రాలేదు పేపర్లు మారిన విషయం ఇప్పటి వరకూ మా దృష్టికి రాలేదు. రెగ్యులర్, సప్లిమెంటరీ పరీక్షల ప్రశ్నపత్రాలు వేర్వేరుగా పరీక్షా కేంద్రాలకు పంపిస్తాం. వీటి పంపిణీలో పొరపాటు జరిగితే వెంటనే చీఫ్ సూపరింటెండెంట్, ఇన్విజిలేటర్లు మాదృష్టికి తీసుకురావాలి. లేదంటే అది వారి తప్పిదమవుతుంది. మా దృష్టికి వస్తేనే ఎలా న్యాయం చేయాలనేదానిపై ఆలోచన చేస్తాం. – తమ్మినేని కామరాజు, బీఆర్ ఏయూ పరీక్షల విభాగం డీన్ -
బస్సు బోల్తా: ఆరుగురికి గాయాలు
ఉదయగిరి (నెల్లూరు జిల్లా) : ఉదయగిరి మండలం సర్వరాబాద్ దగ్గర గురువారం మధ్యాహ్నం ఓ ఆర్టీసీ బస్సు అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో ఆరుగురికి గాయాలయ్యాయి. బస్సు సీతారామపురం నుంచి ఉదయగిరి వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. క్షతగాత్రులను ఉదయగిరి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మాధవ రెడ్డి అనే ప్రయాణికుడి కాలు విరగడంతో అతణ్ని నెల్లూరుకు తరలించారు. -
వోల్వో బస్సు బోల్తా.. ఇద్దరి మృతి
ప్రకాశం: వేగంగా వెళ్తున్న వోల్వో బస్సు అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొనడంతో ఇద్దరు ప్రయాణికులు మృతిచెందగా.. మరో 10 మందికి గాయాలయ్యాయి. ఈ సంఘటన ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలం కల్కివాయి వద్ద బుధవారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. విశాఖపట్నం నుంచి చైన్నై వెళ్తున్న వోల్వో బస్సు సింగరాయకొండ సమీపంలోకి చేరుకోగానే డివైడర్‌ను ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ప్రమాద సమయంలో బస్సులో 42 మంది ప్రయాణికులు ఉండగా.. ఇద్దరు మృతిచెందారు.. ఇందులో నాలుగు సంవత్సరాల బాబు ఉన్నాడు. ప్రమాద సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని క్షతగాత్రులను ఒంగోలు రిమ్స్‌కు తరలించారు. అందులో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. ఇదిలా ఉండగా.. డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగినట్లు స్థానికులు, ప్రయాణికులు అంటున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.