కాన్పూర్: దేశంలోని పలు ప్రాంతాల్లో రైళ్లను పట్టాలు తప్పించేందుకు కుట్రలు జరుగుతున్నాయి. ఇటువంటి ఘటనలకు సంబంధించిన వార్తలు తరచూ వినిపిస్తున్నాయి. తాజాగా ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో రైల్వే ట్రాక్‌పై గ్యాస్ సిలిండర్‌ను ఉంచి, రైలును పట్టాలు తప్పించేందుకు గుర్తుతెలియని దుండగులు ప్రయత్నించారు. కాన్పూర్ నుంచి ఫతేపూర్‌కు వెళ్లే ఢిల్లీ హౌరా రైల్వే ట్రాక్‌పై రైల్వే సిబ్బందికి ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ కనిపించింది.
కాన్పూర్‌లోని ప్రేమ్‌పూర్ రైల్వే స్టేషన్ సమీపంలో లూప్ లైన్‌లో ఎల్‌పీజీ సిలిండర్‌ను ఉంచారు. ఈ ఘటన నేడు (ఆదివారం) తెల్లవారుజామున 5.50 గంటలకు జరిగింది. లోకో పైలట్ అసిస్టెంట్, లోకో పైలట్ ప్రమాదాన్ని గుర్తించి, ఎమర్జెన్సీ బ్రేక్ వేయడం ద్వారా రైలును ఆపారు. రైలులోని ఉద్యోగులు ఈ విషయాన్ని ఆర్‌పీఎఫ్‌కి, డిపార్ట్‌మెంట్‌లోని ఇతర అధికారులకు తెలియజేశారు.
ఘటనా స్థలానికి సంబంధించిన చిత్రాలలో రైల్వే ట్రాక్‌పై ఐదు కిలోల గ్యాస్ సిలిండర్‌ను ఉంచడాన్ని గమనించవచ్చు. పైలట్, అసిస్టెంట్ పైలట్ అప్రమత్తంగా వ్యవహరించడంతో రైలును పట్టాలు తప్పించే కుట్ర విఫలమైంది. ఈ ఘటనపై రైల్వే శాఖ విచారణకు ఆదేశించింది. ఈ మేరకు ఉత్తర మధ్య రైల్వే జోన్‌లోని ప్రయాగ్‌రాజ్ డివిజన్ పీఆర్‌వో అమిత్ సింగ్‌కు సమాచారం అందించారు.
ఇది కూడా చదవండి: పట్టాలు తప్పిన ముజఫర్‌పూర్- పూణె స్పెషల్ రైలు
Comments
Please login to add a commentAdd a comment