4 People Escape Unhurt After Car With Baby Onboard Overturns in Kerala - Sakshi
Sakshi News home page

Viral Video: మిరాకిల్‌ ఘటన: ఘోర కారు ప్రమాదం..బతికే ఛాన్సే లేదు! కానీ..

Published Fri, Feb 24 2023 4:05 PM | Last Updated on Fri, Feb 24 2023 4:16 PM

4 Escape Unhurt After Car With Baby Onboard Overturns At Kerala - Sakshi

ఎన్నో రకాల కారు ప్రమాదాల గురించి విని ఉంటాం. చాలా మటుకు ఆ ప్రమాదాల్లో ప్రాణాలు పోవడమే లేదా తీవ్ర గాయాలతో చికిత్స పొందుతూ మృతి చెందిన ఘటనలే కోకొల్లలు. అలాంటిది కారు ఓ గోడకు క్రాష్‌ అయ్యి దారుణంగా స్పిన్నయ్యి బోల్తా పడింది. ఆ ఘటన చూస్తే కారులో ఉన్న వాళ్లంతా చనిపోయి ఉంటారనిపిస్తుంది. కానీ అద్భుతంగా నలుగురు కొద్ది పాటి గాయాలతో ప్రాణాలతో బయటపడ్డారు. ఈ ఘటన కేరళలో చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే..కోజికోడ్‌లోని కరుమలలో ఒక కారు ఘోర ప్రమాదానికి గురైంది.

నలుగురు వ్యక్తులతో ప్రయాణిస్తున్న ఆ కారు అదుపుతప్పి రోడ్డు పక్కనే ఉన్న గోడను ఢీ కొట్టి గిరిగిర చక్కెర్లు కొడుతూ బోల్తాపడింది. కారు స్పిన్నవ్వడంతో ఓ వ్యక్తి వెనుక సీటులోంచి జారిపడి విండో ఫ్రేమ్‌ని పట్టుకుని ఉన్నాడు. ఇంతలో అటుగా వస్తున్న కొందరూ వాహనదారులు ఆ కారులో ఉన్న వారికి సాయం అందించి బయటకు తీసే యత్నం చేశారు. ఐతే అదృష్టవశాత్తు ఆ కారులోని వారందరికి ఏమి కాలేదు.

ఆ ప్రయాణికుల్లో ఒక మహిళకి చేతికి గాయం కావడంతో ఒక ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటోంది. ఇలాంటి ఘటనలు అత్యంత అరుదుగా సంభవిస్తాయి. అంతేగాదు మిరాకిల్‌ అంటే ఇదేనేమో అన్నట్లు ఉంది ఆ కారు ప్రమాదం. అందుకు సంబంధించిన వీడియో నెట్టంట తెగ చక్కెర్లు కొడుతోంది. మీరు కూడా ఓ లుక్కేయండి. 

(చదవండి: మిస్టరీగా 11 ఏళ్ల చిన్నారి హత్య..చిక్కుముడి విప్పిన మిస్డ్‌ కాల్‌)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement