Viral Video: ఏంటా దూకుడు!... బ్రేక్‌ వేసుండకపోతే పరిస్థితి.... | Mangaluru Man Riding Scooter Escaping Collision Bus Took Uturn | Sakshi
Sakshi News home page

Viral Video: ఏంటా దూకుడు!... బ్రేక్‌ వేసుండకపోతే పరిస్థితి....

Published Thu, Jan 13 2022 10:26 AM | Last Updated on Thu, Jan 13 2022 12:18 PM

Mangaluru Man Riding Scooter Escaping Collision Bus Took Uturn  - Sakshi

అతి వేగం అనర్థం అని ట్రాఫిక్‌ పోలీసులు ఎంత మొత్తుకుంటున్న యువతలో మాత్రం మార్పు రావడం లేదు. స్పీడ్‌ బ్రేకర్లు, జీపీఎస్‌ అంటూ వేగాన్ని నియంత్రించేందుకు పోలీసులు నానా తంటాలు పడుతున్నారు. అయినా మితి మీరిన వేగంతో వేళ్తేనే మజా అంటోంది యువత. ఎంత భయంకరమైన ప్రమాదాలు జరిగిన తగ్గేదేలే అంటూ రయ్‌ రయ్‌ మంటూ వెళ్లిపోతున్నారు. అచ్చం అలాంటి ఘటన గురించే ఇప్పుడు మనం చెప్పుకోబోతున్నాం. ఎందుకంటే ఇక్కడొక వ్యక్తి కూడా యూ టర్న్‌ తీసుకుంటున్న బస్సుని లక్ష్య పెట్టకుండా తనదైన స్పీడులో దూసుకుపోతున్న వీడియో ఒకటి నెట్టింట తెగ వైరల్‌ అవుతోంది.

కర్ణాటకలోని మంగళూరులో బస్సును వేగంగా దాటిన వ్యక్తి త్రుటిలో ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు. బస్సు డ్రైవర్‌ యూ టర్న్‌తీసుకోవడానికి బస్సుని ఒక పక్కకు ఆపి తిప్పడానికి ప్రయత్నిస్తున్నాడు. ఇంతలో అకస్మాత్తుగా స్కూటర్‌ పై దూసుకుంటూ వస్తున్న ఒక వ్యక్తిని చూసి బస్సు డ్రైవర్‌ వెంటనే బ్రేక్‌ వేశాడు. అదృష్టవశాత్తు అతనికి ఏం కాలేదు.

అయితే ఆ వ్యక్తి మాత్రం చేపల ప్రాసెసింగ్‌ యూనిట్‌ గేట్‌ని రాసుకుంటూ ..ఒక దుకాణం, చెట్టు మధ్యలో ఉన్న చిన్న గ్యాప్‌ నుంచి వెళ్లిపోయాడు. అతను రైడ్‌ చేసిన విధానం చూస్తేనే వొళ్లు గగ్గర్పాటుకు గురవుతుంది. అయితే ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట తెగ వైరల్‌ అవుతోంది. దీంతో నెటిజన్లు లక్కీ గై అని ఒకరు, మరోకరేమో ఏమి జరగనట్టుగా వెళ్లిపోతున్నాడు అంటూ విమర్శిస్తూ ట్వీట్‌ చేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement