Viral Video: Dog Riding Bike Wearing A Helmet - Sakshi
Sakshi News home page

Viral Video: హెల్మట్‌ ధరించి బైక్‌పై రైడ్‌ చేస్తున్న కుక్క

May 24 2023 12:55 PM | Updated on May 24 2023 2:04 PM

Viral Video: Dog Riding Bike Wearing A Helmet - Sakshi

ట్రాఫిక్‌ పోలీసుల మన రక్షణ కోసమే హెల్మట్‌ని ధరించమని చెబుతున్నా సరే చాలామంది వాహనదారులు అస్సలు లక్ష్యపెట్టరు. పోలీసులకు పట్టుబడిన తీరు మారకపోగా జరిమానాలు కట్టేందుకు రెడీ అ‍య్యిపోతుంటారు. ఎందుకు ధరించడం లేదని అధికారులు ప్రశ్నించినా ఏదో ఒక కారణం చెప్పి జారుకునేందుకే ట్రై చేస్తారే తప్ప బాధ్యతగా వ్యవహరించరు.

నన్ను చూసి అయినా బుద్ధి తెచ్చుకోండి అన్నట్లుగా కుక్క హెల్మట్‌ ధరించి మరీ బైక్‌పై రైడ్‌ చేస్తోంది. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ హల్‌చల్‌ చేస్తోంది. ఆ వీడియోలో ఒక వ్యక్తి వెనుకాల ఓ కుక్క హెల్మట్‌ ధరించి.. మనిషి మాదిరిగా కూర్చొని వెళ్తోంది. నిజానికి బైక్‌ నడిపేవాడు మాత్రమే గాక వెనుక కూర్చొన్న వ్యక్తి కూడా పిలియన్‌ రైడర్‌గా హెల్మట్‌ ధరించాల్సిందే.

కానీ చాలామంది ప్రయాణకులు హెల్మట్‌ని ధరించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించి ప్రాణాలపైకి తెచ్చకుంటున్నారు. ఐతే ఆ వీడియోని ఓ ట్విట్టర్‌ వినియోగ దారుడు 'రూల్‌ ఇస్‌ రూల్‌' అనే క్యాప్షనతో ఓ కుక్క ప్రయాణికుడి మాదిరిగా బైక్‌పై హెల్మట్‌ ధరించి వెళ్తోందంటూ.. వీడియోని కూడా జత చేసి పోస్ట్‌ చేశాడు. ఈ వీడియోకి లక్షకు పైగా వ్యూస్‌ లైక్‌లు వచ్చాయి. మీరు కూడా ఓ లుక్కేయండి.

(చదవండి: తల్లి కోసం భగీరథుడిలా.. ఆ 14 ఏళ్ల బాలుడు..)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement