
అత్తాకోడళ్లంటే శత్రువులు అనే భావన చాలామందిలో స్థిరపడిపోయింది. వీరి మధ్య జరిగే వివాదాలను టీవీ సీరియళ్లలో ఆసక్తికరంగా చూపిస్తుంటారు. చిన్నపాటి విషయానికే కొందరు అత్తాకోడళ్లు తెగ తిట్టేసుకుంటారని, కొట్టేసుకుంటారనే ఆరోపణలు వినిపిస్తుంటాయ. తాజాగా అత్తాకోడళ్లకు సంబంధించిన ఒక వీడియో వైరల్‌గా మారింది.
మహారాష్ట్రలోని నాసిక్ జిల్లాలో రోడ్డున పడిన అత్తాకోడళ్ల ఉదంతం చోటుచేసుకుంది. సోషల్ మీడియా(Social media)లో తెగ వైరల్ అవుతున్న ఈ వీడియోలో అత్తాకోడళ్లు ఒకరి జుట్టు మరొకరు పట్టుకుని, కొట్టుకున్న దృశ్యం కనిపిస్తుంది. ఒకరిపై మరొకరు ఆగ్రహం వ్యక్తం చేస్తూ, పరస్పరం తిట్టుకోవడంతో పాటు దుస్తులు చించుకునే వరకూ వెళ్లడాన్ని ఈ వీడియోలొ చూడవచ్చు. వారి కుటుంబ సభ్యులు అత్తాకోడళ్లను విడిపించేందుకు ప్రయత్నించినప్పటికీ ఏ మాత్రం ఫలితం ఉండదు.
Kalesh b/w Mother-in-Law and Daughter-in-Law Outside Court, Nashik MH
pic.twitter.com/QAjcpr6sYu— Ghar Ke Kalesh (@gharkekalesh) February 21, 2025
ఈ అత్తాకోడళ్లు(Daughter-in-laws) యద్ధంలో ముందుగా అత్త తన కోడలి జుట్టు పట్టుకుని కింద పడేస్తుంది. అయితే కోడలు తాను ఏం తక్కువ తిన్నానంటూ అత్తపై దాడికి దిగుతుంది. ఈ వీడియోలో నల్ల చీర కట్టుకున్న ఒక మహిళ అత్తా కోడళ్ల యుద్దానికి ఆజ్యం పోస్తున్నట్లు కనిపిస్తోంది. ఈ దృశ్యం కుటుంబ కలహాలకు మించిన రేంజ్‌లో ఉంది. అయితే పోలీసులు రంగప్రవేశం చేశాక పరిస్థితి అదుపులోకి వచ్చిందని సమాచారం.
ఇది కూడా చదవండి: Mahashivratri: మహాశివరాత్రి ఎలా మొదలయ్యిందంటే..
Comments
Please login to add a commentAdd a comment