u turn
-
విశాఖ స్టీల్ ప్లాంట్ పై చంద్రబాబు యూ టర్న్
-
మరీ ఇంత అధ్వానమా.. చంద్రబాబు ట్రాక్ రికార్డులో ఇలాంటివెన్నో!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏమైంది? కొద్ది నెలల క్రితం వరకు ఒక పద్ధతి ప్రకారం అన్నీ వ్యవస్థలు నడిచాయి. పలు కొత్త వ్యవస్థలు ప్రజల అవసరాలు తీర్చడానికి ఏర్పాటయ్యాయి. అవి ఎంత బలమైనవిగా రూపుదిద్దుకున్నాయంటే, విపక్షంలో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్‌కల్యాణ్ వంటివారు వాటిని ఏదో రకంగా తామూ కొనసాగిస్తామని చెప్పక తప్పలేదు. అది వలంటీర్ల వ్యవస్థ కావచ్చు. గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థ కావచ్చు. ఇళ్ల వద్దకే పౌర సేవలు అందించడం కావచ్చు.. ఇలా ఒకటేమిటి? దేశంలోనే పరిపాలనలో ఒక కొత్త విప్లవాన్ని నాటి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం తీసుకువచ్చింది.ఇదే టైమ్‌లో వైఎస్సార్సీపీ తెచ్చిన కొన్ని సంస్కరణల విషయంలో పచ్చి అబద్ధాలను కూడా విపక్షం, దానికి మద్దతు ఇచ్చే ఈనాడు, ఆంద్రజ్యోతి వంటి మీడియా విపరీతంగా ప్రచారం చేశాయి. ప్రజలను తీవ్ర భయాందోళనలకు గురి చేశాయి. చివరికి వైఎస్సార్సీపీ అభిమానులకే అనుమానం కలిగే స్థాయిలో టీడీపీ, జనసేన నేతలు ప్రచారం చేశారు. ముఖ్యంగా భూముల రీసర్వే, లాండ్ టైటిలింగ్ యాక్ట్‌పై వీరు చేసినంత దుష్ప్రచారం ఇంతా, అంతాకాదు. వైఎస్ జగన్మోహన్రెడ్డి మళ్లీ అధికారంలోకి వస్తే భూములన్నిటిని లాక్కుంటాడని, దానిపై కోర్టుకు వెళ్లే పరిస్థితి కూడా లేదంటూ రైతులను భయపెట్టారు. నిజం తెలుసుకునేలోపు అబద్ధం లోకం అంతా తిరిగివచ్చిందన్న సామెతను అక్షర సత్యం చేసి చూపించారు.తాము అధికారంలోకి వస్తే రీసర్వే రద్దు చేస్తామని, లాండ్ టైటిలింగ్ యాక్ట్‌ను అమలు చేయబోమని నమ్మబలికారు. దాని గురించి అప్పట్లో వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎంతగా ప్రజలకు వివరించి చెప్పబోయినా, పెద్దగా ఫలితం రాలేదు. ఆయన దీనిపై ఎక్కడా వెనక్కి తగ్గలేదు. నిజాయితీగా లాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి మాట్లాడేవారు. అది కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన కార్యక్రమం అని, దానివల్ల భూ వివాదాలకు శాశ్వతంగా తెరపడుతుందని, భూములపై ఆసాములకు పూర్తి హక్కులు దఖలు పడతాయని ఆయన చెప్పే ప్రయత్నం చేసేవారు. కానీ ఈనాడు, ఆంధ్రజ్యోతితోపాటు చంద్రబాబు పెద్ద గొంతుతో అసత్యాలను ప్రచారం చేయడంతో వైఎస్సార్సీపీపై వ్యతిరేకత పెరిగింది. వైఎస్సార్సీపీ ఓటమికి అది కూడా ఒక ప్రధాన కారణం అయింది.ఎలాగైతేనేం టీడీపీ, జనసేన, బీజేపీ కూటమికి అధికారం దక్కింది. అవకాశం వచ్చిన వెంటనే వైఎస్ జగన్మోహన్రెడ్డి తెచ్చిన ఆయా వ్యవస్థలను కూటమి ప్రభుత్వం ధ్వంసం చేయడం ఆరంభించింది. జగన్‌కు మంచి పేరు తెచ్చిన వాటిని ఏదో రకంగా బదనాం చేయడానికి తన మీడియా బలంతో ప్రయత్నాలు సాగిస్తున్నారు. ఆ క్రమంలో చంద్రబాబు నాయుడు తాను ఇచ్చిన హామీ ప్రకారం రీసర్వే నిలుపుదల చేస్తున్నామని, లాండ్ టైటిలింగ్ యాక్ట్‌ను రద్దు చేస్తున్నామని ప్రకటించారు. ఇక్కడే మళ్లీ ట్విస్ట్ ఏర్పడింది. ఈలోగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ భూ సర్వే చేయించి, టైటిలింగ్ చట్టాన్ని అమలు చేసే రాష్ట్రాలకు ఏభైఏళ్లపాటు వడ్డీ లేని రుణం అందచేస్తామని ప్రకటించింది. దాంతో చంద్రబాబు ప్రభుత్వం కామ్‌గా యుటర్న్ తీసుకుంది.ఇప్పటికే అనేక విషయాలలో తన నిర్ణయాలను రివర్స్ చేసుకున్న చంద్రబాబు ప్రభుత్వం ఈ విషయంలో కూడా అదే బాటపట్టింది. రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ రీసర్వే కొనసాగుతుందని, ఐదు శాతం రైతులలో దీనిపై ఉన్న అసంతృప్తిని పరిష్కరించి ముందుకు వెళతామని ప్రకటించారు. అంటే దీని అర్థం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాన్ని యదాతథంగా కొనసాగిస్తామనే కదా? మరి ఎన్నికల ప్రచారంలో ఎందుకంత ఘోరంగా అబద్ధాలు ప్రచారం చేశారంటే ఏమి చెబుతాం. చంద్రబాబు, పవన్‌కల్యాణ్, లోకేష్ తదితరులు పోటీపడి వదంతులు సృష్టించారు. దానిని వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం గట్టిగా ఎదుర్కోలేకపోయిన ఫలితంగా ఓటమి చవిచూడవలసి వచ్చింది.ప్రజాస్వామ్యంలో అబద్ధాల ద్వారా అధికారంలోకి రావచ్చని టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి మరోసారి రుజువు చేసింది. 1955 మధ్యంతర ఎన్నికలలో కూడా ఆంధ్రరాష్ట్రంలో ఇలాంటి అనుభవమే ఎదురైంది. ఆ రోజుల్లో కమ్యూనిస్టు పార్టీ అధికారంలోకి వచ్చేస్తుందన్నంతగా ఊపు వచ్చింది. అప్పటికి ఇంకా ఉమ్మడి ఏపీ ఏర్పడలేదు. ఆంధ్ర, రాయలసీమ కలిపి ఆంధ్రరాష్ట్రంగా ఉండేవి. కాంగ్రెస్ పార్టీ, కృషికార్ లోక్ పార్టీ, కిసాన్ మజ్దూర్ ప్రజా పార్టీలు యునైటెడ్ కాంగ్రెస్‌గా ఏర్పడి ఎన్నికలలో పోటీచేశాయి.అయినా కమ్యూనిస్టులను ఓడించడం కష్టం అని అనుకునేవారు. ఆ క్రమంలో కాంగ్రెస్‌కు మద్దతు ఇచ్చే మీడియాలోకానీ, ఆయా సభలలో కానీ కాంగ్రెస్ నేతలు ఒక వదంతిని ప్రచారం చేశారట. అదేమిటంటే కమ్యూనిస్టులు అధికారంలోకి వస్తే భూస్వాముల భార్యల మెడలపై కాడి వేసి దున్నిస్తామని ప్రముఖ కమ్యూనిస్టు నాయకుడు మాకినేని బసవపున్నయ్య అన్నారన్నది ఆ వదంతి. అప్పట్లో అలాంటివాటిని వెరిఫై చేసుకునే పరిస్థితే తక్కువ. దాంతో అది దావానలంగా వ్యాపించి అధికారంలోకి వస్తామనుకున్న కమ్యూనిస్టు పార్టీ కేవలం పదిహేను సీట్లకే పరిమితం అయిపోయింది. సరిగ్గా అదే మోస్తరుగా ఇప్పుడు భూముల టైటిలింగ్‌కు సంబంధించి టీడీపీ, జనసేన, వారి అనుబంధ మీడియా విపరీతమైన అసత్య ప్రచారం చేశాయి.సోషల్ మీడియా ఇంత విస్తారంగా వ్యాప్తిలోకి వచ్చినా, దానిని వైఎస్సార్సీపీ ఎంతగా ఖండించినా, రైతులు నమ్మలేకపోయారు. సోషల్ మీడియాను ఎంతగా దుర్వినియోగం చేయవచ్చో ఈ ఉదంతం తెలియచెబుతుంది. భూముల రీసర్వేలో కొన్ని తేడాలు ఉండవచ్చని, అవన్నీ బయటపడితే తమకు నష్టం అని కొందరు భయపడ్డారు. దానిని టీడీపీ ఎన్ క్యాష్ చేసుకుని జనాన్ని ఒక అబద్ధంతో నమ్మించి అధికారంలోకి రాగలిగింది. కానీ అబద్ధం ఏదో ఒకనాడు బయటకు రాకతప్పదు కదా! ఇప్పుడు అదే రీసర్వేని కొనసాగిస్తున్నట్లు మంత్రి చెప్పారంటేనే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.ఇప్పటికే అనేక విషయాలలో చంద్రబాబు ప్రభుత్వం రివర్స్ నిర్ణయాలు తీసుకుంది. ఉదాహరణకు వ్యవసాయ మోటర్లకు మీటర్లు పెడితే రైతులకు అవి ఉరితాళ్లు అవుతాయని చంద్రబాబు ప్రచారం చేశారు. తీరా అధికారం వచ్చాక, ఆ మీటర్లను యధాప్రకారం కొనసాగిస్తామని చెప్పి రైతులను ఆశ్చర్యంలో ముంచెత్తారు. తల్లికి వందనం గురించి ఇప్పటికే చేతులెత్తేశారు. మూడు గ్యాస్ బండల స్కీమ్ అమలుపై మంత్రి నాదెండ్ల మనోహర్ నాలుక మడతేశారు. వలంటీర్లకు జీతాలు పెంచడం సంగతి అటుంచి వారి ఉన్న ఉద్యోగాలకే దిక్కులేని పరిస్థితిని సృష్టించారు. దేశ చరిత్రలో రెండు నెలల వ్యవధిలో ఇంతగా అప్రతిష్టపాలైన ప్రభుత్వం మరొకటి ఉండకపోవచ్చు.అయినా ఆ బురద అంతటిని వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వంపై చిమ్మి తప్పించుకోవాలని చంద్రబాబు, పవన్ కల్యాణ్, లోకేష్‌లు చూస్తున్నారు. ఏ మాటకు ఆమాటే చెప్పుకోవాలి. చంద్రబాబు ట్రాక్ రికార్డు ఇందుకు భిన్నంగా ఎప్పుడూ లేదు. తనకు మద్దతు ఇచ్చే మీడియా అండతో తాను ఏమి చేసినా సాగిపోతుందన్నది ఆయన నమ్మకం. 1996 లోక్ సభ ఎన్నికల ప్రచారంలో ఆకాశమే హద్దుగా చంద్రబాబు ఏమి చెప్పింది.. ఎన్నికలయ్యాక ఏమి చేసింది.. అప్పటి కాంగ్రెస్ ప్రముఖ నేత రోశయ్య చాలా అర్థవంతమైన రీతిలో వివరించిన వీడియో వైరల్ అవుతోంది. మూడుదశాబ్దాలుగా చంద్రబాబు ఇదే టెక్నిక్ అమలు చేసినా, ప్రజలు కొన్నిసార్లు ఓడించారు. మరికొన్నిసార్లు ఆయన చేసిన మోసపూరిత వాగ్దానాలను నమ్మి గెలిపించారు.2024లో కూడా అదే జరిగింది. చిత్తశుద్ధితో తాను చెప్పింది చేయాలని అనుకోవడం వైఎస్ జగన్మోహన్రెడ్డి చేసిన తప్పా? అంటే ఏమి బదులు ఇస్తాం. ప్రజలను మోసం చేయబోనన్న వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిను జనం ఓడించారు. చంద్రబాబు ఇలా మోసపూరిత హామీలతో జనాన్ని నమ్మించి, తదుపరి ఐదేళ్లపాటు వారి చెవిలో పూలు పెట్టడం అలవాటైన వ్యవహారమే అని తెలిసినా జనం టీడీపీ కూటమిని గెలిపించారు. ఇందుకు తప్పుపట్టవలసింది చంద్రబాబునా? లేక జనాన్నా?ఎవరి ఆలోచన ప్రకారం వారు నిర్ణయానికి రావొచ్చు.– కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ పాత్రికేయులు -
యూటర్న్‌లో చంద్రబాబుది గిన్నిస్ రికార్డు: అంబటి రాంబాబు
సాక్షి,తాడేపల్లి: యూటర్న్ సీఎంగా చంద్రబాబు గిన్నిస్‌బుక్ రికార్డుకెక్కుతారని మాజీ మంత్రి, వైఎస్ఆర్సీపీ సీనియర్ నేత అంబటి రాంబాబు ఎద్దేవా చేశారు. మంగళవారం(జులై 30) తాడేపల్లిలోని వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో అంబటి మాట్లాడారు. అధికారంలోకి వచ్చిన రెండు నెలల్లోనే చంద్రబాబు అనేక విషయాలలో యూటర్న్ తిరిగారన్నారు. చంద్రబాబు అబద్దంలోనే పుట్టాడని, అబద్దంలోనే రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. రీసర్వేపై యూటర్న్నాడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు.. ముఖ్యంగా ఎన్నికల ప్రచార సమయంలో రాష్ట్రంలో భూముల సమగ్ర రీసర్వేను, ల్యాండ్ టైటిలింగ్ చట్టాన్ని తీవ్రంగా తప్పు పట్టిన చంద్రబాబు.. ఇప్పుడు యూటర్న్ తీసుకున్నారని మాజీ మంత్రి రాంబాబు గుర్తు చేశారు. భూములు, గనులు, సహజ వనరుల దోపిడి జరిగిందంటూ, ఇటీవల శ్వేతపత్రం విడుదల చేసిన చంద్రబాబు.. రాష్ట్రంలో భూముల రీసర్వేను రద్దు చేస్తున్నట్లు ప్రకటించి.. కొద్ది రోజుల్లోనే యూటర్న్ తీసుకున్నారని ఆయన ఆక్షేపించారు. స్వప్రయోజనాల కోసం ఎప్పటికప్పుడు నిర్ణయాలు మార్చుకోవడం చంద్రబాబు నైజం అని ఆయన అన్నారు.అబద్ధాలు. యూటర్న్లు‘రాష్ట్రంలో కొత ప్రభుత్వం ఏర్పడి 50 రోజులవుతోంది. ఈ కొద్ది రోజుల్లోనే చంద్రబాబు నిర్ణయాలన్నీ దారుణం. ప్రతి నిర్ణయంపై యూటర్న్. ‘ఆత్మస్తుతి పరనింద’.. ఇదే చంద్రబాబు పాలన అని మాజీ మంత్రి అంబటి రాంబాబు స్పష్టం చేశారు. ఎన్నికల ముందు గొప్పగా ప్రకటించిన హామీలు.. ముఖ్యంగా సూపర్‌సిక్స్‌ను అమలు చేయలేక.. శ్వేతపత్రాల పేరుతో కాలయాపన చేస్తూ.. గత తమ ప్రభుత్వంపై నిందలు మోపుతున్నారని ఆయన ఆక్షేపించారు.‘చంద్రబాబు ఎప్పుడూ అబద్ధంతోనే రాజ్యమేలుతాడనేది నగ్న సత్యం. అది గిన్నిస్ బుక్ రికార్డుల్లోకి ఎక్కించే అంశం’ అని అంబటి తేల్చి చెప్పారు.యథేచ్ఛగా మాట తప్పడంఎన్డీఏ కూటమిలో కొనసాగుతున్నా, రాష్ట్రానికి ఏ ఒక్కటీ సాధించలేకపోతున్న చంద్రబాబు, ఇటీవల కేంద్రం తమ బడ్జెట్లో రాష్ట్ర రాజధాని నిర్మాణం కోసం రూ.15 వేల కోట్ల రుణం ఇప్పిస్తామని చెబితే.. దానిపైనా ప్రభుత్వం గొప్పలు చెప్పుకుందని అంబటి రాంబాబు గుర్తు చేశారు.మరోవైపు ఎన్నికల హామీల అమలు విషయానికి వస్తే.. అన్నింటా మాట తప్పారని మాజీ మంత్రి అన్నారు. నాలుగు వేల పెన్షన్ ఇస్తామని చెప్పి, ఒక నెల మాత్రమే ఇచ్చారని.. ఇప్పుడు అనర్హులు చాలా మంది ఉన్నారని, కొందరిని తీసేసినా ఆశ్చర్యపోనక్కర్లేదని చెప్పారు.ఇంకా ఏటా మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు, తల్లికి వందనం సహాయం, మహిళలకు ఫ్రీ బస్, 18 ఏళ్లు నిండిన మహిళలకు నెలకు రూ.1500, ప్రతి ఇంట్లో నిరుద్యోగులకు నెలకు రూ.3 వేల నిరుద్యోగ భృతి.. ఇవేవీ ఈ ఏడాది అమలు చేసే పరిస్థితి కనిపించడం లేదని వెల్లడించారు. తాము సూపర్‌సిక్స్ ప్రకటించామని, ఇప్పుడు వాటిని అమలు చేయాలంటే భయమేస్తోందని సీఎం చంద్రబాబు అసెంబ్లీలో చెప్పడం.. పథకాల అమలులో ఆయనకు చిత్తశుద్ధి లేదని చూపుతోందని స్పష్టం చేశారు.సంపద సృష్టించడం తనకు తెలుసన్న చంద్రబాబు, అంత బేలగా మాట్లాడడం చూస్తుంటే.. చంద్రబాబు పచ్చిగా మాట మారుస్తున్న వైనం బయట పడుతోందని అన్నారు. చంద్రబాబును చూస్తుంటే, ప్రజలకు రోత కలుగుతుందన్న ఆయన, వారిలో ఇప్పటికే పశ్చాత్తాపం మొదలైందని.. చంద్రబాబుకు ఎందుకు ఓటు వేశామా అని ప్రజలంతా అనుకుంటున్నారని తెలిపారు.రీసర్వేపై దుష్ప్రచారంరాష్ట్రంలో భూముల సమగ్ర రీసర్వేపై చంద్రబాబు దారుణంగా దుష్ప్రచారం చేశారన్న అంబటి రాంబాబు.. గత ఎన్నికల సమయంలో ఆ కార్యక్రమంపై చంద్రబాబు చేసిన ప్రసంగాల వీడియోలు ప్రదర్శించారు.ఆ తర్వాత, శ్వేతపత్రం విడుదల సందర్భంగా.. రీసర్వే నిలిపేస్తామంటూ, ఈనెల 15న చంద్రబాబు చేసిన ప్రకటన వీడియో కూడా మాజీ మంత్రి ప్రెస్మీట్లో ప్రదర్శించారు.‘జగన్‌గారు చేపట్టిన భూముల సమగ్ర రీసర్వే లోపభూయిస్టమైందని, రైతులకు అన్యాయం జరుగుతుందని చెప్పిన నువ్వు ఎందుకు యూటర్న్ తీసుకున్నారు?. మీరు గొప్ప మేధావి అని మీ ఎల్లో మీడియాలో అదే పనిగా రాస్తారు. అలాంటప్పుడు వాస్తవాలు ఎందుకు గుర్తించలేదు?. అంటే మీకు కనీస అవగాహన లేదన్న విషమం అర్థమవుతోంది’.. అని సీఎం చంద్రబాబుకు మాజీ మంత్రి అంబటి చురకలంటించారు.ఇదీ సీనియర్ ఐఏఎస్ మాటదేశంలో నాడు బ్రిటిషర్ల పాలనలో 100 ఏళ్ల క్రితం భూముల సర్వే జరిగిందని, ఆ తర్వాత 100 ఏళ్లు.. అవే రికార్డులు కొనసాగాయని.. ఆ పరిస్థితుల్లో జగన్‌గారు, భూముల సమగ్ర రీసర్వేకు శ్రీకారం చుడుతూ, ఒక మహాయజ్ఞం తలపెట్టారని మాజీ మంత్రి వెల్లడించారు.భూముల రీసర్వేను తప్పు బట్టి, మళ్లీ యూటర్న్ తీసుకుని, ఇప్పుడు కొనసాగిస్తామంటున్న చంద్రబాబు వైఖరిపై తనతో ఒక సీనియర్ ఐఏఎస్ అధికారి మాట్లాడారన్న అంబటి రాంబాబు.. ఆయన ఏమన్నాడన్నది చెప్పారు. ‘ఇతర దేశాల్లో భూవివాదాలు 3 శాతం మాత్రమే ఉంటాయి. అదే మన దేశంలో 60–70 శాతం ఉంటాయి. అవన్నీ క్లియర్ చేయడం కోసం రీసర్వే చేసి విప్లవాత్మకమైన కార్యక్రమాన్ని సదుద్దేశంతో జగన్ గారు నాడు ప్రారంభిస్తే చంద్రబాబు, టీడీపీ నేతలు ఇష్టారీతిగా మాట్లాడారు. పైగా ఎవరైనా కోరుకుంటే మాత్రమే చేస్తామన్నారు. ఇప్పుడు మళ్లీ మాట మార్చారు’.. అని ఆ ఐఏఎస్ అధికారి చెప్పారని అంబటి వివరించారు.ఒక మహాయజ్ఞం‘భూముల రీసర్వే కోసం ప్రభుత్వం 14,630 మంది సర్వేయర్లను నియమించింది. 17 వేల గ్రామాల్లో 2.26 కోట్ల ఎకరాల వ్యవసాయ భూములు, 13,371 గ్రామ కంఠాల్లోని 85 లక్షల ప్రభుత్వ, ప్రేవేట్ ఆస్తులు, 110 పట్టణ ప్రాంతాల్లోని 40 లక్షల ప్రభుత్వ, ప్రేవేట్ ఆస్తులు, 10 లక్షల ప్లాట్లలో సమగ్ర రీసర్వే ఈ కార్యక్రమ లక్ష్యం. మొత్తం మూడు దశల సర్వే కార్యక్రమంలో ఇప్పటికే రెండు దశలు పూర్తయ్యాయి. ఇప్పుడు మాత్రం మళ్ళీ రీసర్వే మేం చేస్తామంటున్నారు’.. అని అంబటి రాంబాబు తెలిపారు.రీసర్వే కోసం అత్యాధునిక పరిజ్ఞానం ఉపయోగించడం వల్ల ఎర్రర్ కేవలం 5 సెం.మీ మాత్రమే ఉంటుందన్న ఆయన, ఇందుకు 75 బేస్ స్టేషన్లు ఏర్పాటు చేసి రోవర్లతో కొలిచే ప్రక్రియను తీసుకువచ్చామని గుర్తు చేశారు. అదే చైన్ పద్దతిలో.. అంటే గొలుసుల పద్దతిలో కొలిస్తే ఒక మీటర్ తేడా ఉండేదని, కానీ ఇప్పుడు కేవలం 5 సెం.మీ.కే అది పరిమితం అయిందని చెప్పారు. రీసర్వేలో భాగంగా హెలికాఫ్టర్లు, డ్రోన్లు కూడా వినియోగించామని వివరించారు.రీసర్వే. పురోగతిఈ సమగ్ర భూసర్వే రాష్ట్రవ్యాప్తంగా రెండు దశల్లో 6 వేల గ్రామాల్లో పూర్తయిందని, అందులో 4 వేల గ్రామాల్లో పాసు పుస్తకాలు ఇవ్వడం పూర్తి కాగా, మరో 2 వేల గ్రామాల్లో ఆ పని చేయాల్సి ఉందని, ఇంకా మిగిలిన గ్రామాల్లో డ్రోన్ సర్వే కూడా పూర్తయిందని.. ఆ విధంగా అన్నీ సక్రమంగా పూర్తి చేసిన తమ ప్రభుత్వం.. వివాద రహితంగా డిజిటల్ రికార్డులను అందుబాటులోకి తీసుకొచ్చిందని అంబటి వెల్లడించారు.ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్రైతులకు ఎంతో మేలు చేసే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌పై గత ఎన్నికల ముందు తీవ్ర దుష్ప్రచారం చేసిన చంద్రబాబు, అది ఇంకా ప్రయోగదశలోనే ఉన్నప్పటికీ, దాన్ని రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారని అంబటి రాంబాబు తెలిపారు. అయితే ఆ చట్టం తెచ్చింది, కేంద్రమే అన్న ఆయన, నీతి ఆయోగ్ సూచనల మేరకే.. ఆ చట్టాన్ని రాష్ట్రాలకు సూచించారని వెల్లడించారు.భూసంస్కరణలు అమలు చేసిన రాష్ట్రాలకు 50 ఏళ్ళపాటు సున్నా వడ్డీకే రుణాలు ఇచ్చే కార్యక్రమాన్ని ఇటీవలి కేంద్ర బడ్జెట్లో ఆర్ధిక మంత్రి ప్రతిపాదించారని గుర్తు చేసిన అంబటి.. భూమలు రీసర్వేతో పాటు, ఇప్పుడు ఆ చట్టాన్ని కూడా అమలు చేయాల్సి ఉంది కాబట్టి.. ఇక్కడా యూటర్న్‌కు అవకాశం లేకపోలేదని తేల్చి చెప్పారు.ఇచ్చిన ఏ హామీని అమలు చేయని మోసగాడు చంద్రబాబు అయితే.. ప్రతి మాట నిలబెట్టుకున్నది జగన్‌గారు అని, చివరకు ఈ భూసర్వే విషయంలో ఆయన చెప్పిందే కరెక్ట్ అనేది అర్ధమవుతుందని మాజీ మంత్రి అంబటి అన్నారు.ఆయనే మా ఏకైక నాయకుడు మా పార్టీలో నెంబర్ టూ స్థానం కోసం అంతర్గత పోరు సాగుతోందని ఎల్లో మీడియా ఈనాడులో ఓ కట్టుకధ అల్లారన్న అంబటి రాంబాబు.. ‘మా పార్టీలో నెంబర్ టూ ఉండరు. మా ఏకైక నాయకుడు జగన్ గారే. ఆయన ఎవరికి ఏ పని అప్పజెపితే వారు ఆ పని చేస్తారని’స్పష్టం చేశారుతమ పార్టీపై ఎన్ని కుట్రలు చేసినా, అన్నింటినీ చేధించుకుని ముందుకు వచ్చిన శక్తి సామర్థ్యాలు జగన్ గారికి ఉన్నాయని ఆయన తెలిపారు. ఇప్పుడు కూడా పార్టీలో అనేక మందిపై అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారన్న అంబటి.. ప్రభుత్వం ఎంత కక్ష సాధింపు చర్యలకు దిగినా.. తమ పార్టీలో ఎవ్వరూ భయపడబోరని తేల్చి చెప్పారు. -
అప్పుడు తప్పన్నాడు.. ఇప్పుడు అదే చేస్తున్నాడు
-
బీజేపీపై వివాదాస్పద వ్యాఖ్యలు.. ఆర్ఎస్ఎస్ నేత యూ టర్న్!
ఢిల్లీ: లోక్ సభ ఎన్నికల ఫలితాలపై స్పందిస్తూ.. ఆరెస్సెస్ నేత ఇంద్రేష్ కుమార్ లోక్‌సభ బీజేపీపై పరోక్షంగా చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అయ్యాయి. దీంతో ఆయన యూ టర్న్ తీసుకున్నారు. లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి అహం పెరిగిపోవడం వల్లే సరైన ఫలితం రాలేదని వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. పేరు ప్రస్తావించకుండా ప్రతిపక్ష కూటిమిపై విమర్శలు గుప్పించారు. ఇక.. ఆయన చేసిన వ్యాఖ్యలు వివాదం రేపటంతో క్లారిటీ ఇచ్చారు.‘‘ప్రస్తుతం దేశంలోని పరిస్థితులు చాలా స్పష్టంగా ఉన్నాయి. రాముడిని వ్యతిరేకించిన వాళ్లు అధికారంలో లేరు. రాముడిని గౌరవించాలనే సంకల్పం ఉన్నవాళ్లు ప్రస్తుతం అధికారంలోకి వచ్చారు. అదే విధంగా నరేంద్ర మోదీ నాయకత్వంలో బీజేపీ మూడోసారి అధికారంలోకి వచ్చింది’’ అని ఇంద్రేష్ కుమార్ స్పష్టం చేశారు.జైపూర్(రాజస్థాన్) కనోటాలో గురువారం సాయంత్రం జరిగిన ఓ కార్యక్రమంలో ఇంద్రేష్ కుమార్ మాట్లాడుతూ.. ‘‘రాముడ్ని పూజించేవాళ్లలో అహం పెరిగిపోయింది. వాళ్లు తమను తాము అతిపెద్ద పార్టీగా ప్రకటించుకున్నారు. కానీ, చివరికి ఏం జరిగింది. వాళ్లు అనుకున్నది జరగలేదు. రాముడు కూడా వాళ్లను 241 దగ్గరే ఆపేశాడు’’ అని అన్నారు.మరోవైపు.. ప్రతిపక్ష ఇండియా కూటమిపై కూడా విమర్శలు గుప్పించారు.మరోవైపు.. కూటమి పేరును కూడా ప్రస్తావించకుండా .. ‘‘ఎవరైతే రాముడి మీద విశ్వాసం లేకుండా పోయారో.. వాళ్లను కూడా 234 దగ్గరే ఆయన ఆపేశాడు’’ అని అన్నారు. ఇటీవల ఆఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ సైతం ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. నిజమైన సేవకుడు ఎప్పుడూ చేసిన సేవను చెప్పుకోడు, ప్రజా సేవకులకు అహంకారం ఉండరాదని వ్యాఖ్యానించారు. -
‘పద్మశ్రీ’పై హేమచంద్ ఎందుకు మనసు మార్చుకున్నారు?
ఛత్తీస్‌గఢ్‌కు చెందిన ప్రముఖ వైద్యుడు హేమచంద్ మాంఝీ ‘పద్మశ్రీ’ని తిరిగి ఇవ్వడంపై మనసు మార్చుకున్నారు. మొదట్లో పద్మశ్రీని వాపసు చేస్తానని ప్రకటించిన ఆయన ఆ తర్వాత తన నిర్ణయాన్ని మార్చుకున్నారు.మావోయిస్టుల బెదిరింపుల నేపధ్యంలో హేమచంద్ మాంఝీ మే 27న తన పద్మశ్రీ అవార్డును ప్రభుత్వానికి తిరిగి ఇచ్చేస్తున్నట్లు ప్రకటించారు. దీనిపై పరిపాలన అధికారులు వెంటనే స్పందించారు. కంకేర్ ఎస్పీ ఆయనతో మాట్లాడి భద్రత కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఇంతలోనే ప్రభుత్వం హేమచంద్ మాంఝీకి వై కేటగిరీ భద్రతను కూడా కల్పించింది. ఈ విధమైన భద్రత లభించిన నేపధ్యంలో హేమ్‌చంద్ మాంఝీ తాను పద్మశ్రీని తిరిగి ఇవ్వబోనని ప్రకటించారు.హేమ్‌చంద్ మాంఝీ నారాయణపూర్ జిల్లాలోని ఛోటాదొంగర్‌లో నివసిస్తున్నారు. మే 26 అర్థరాత్రి వేళ మావోయిస్టులు ఆయనను చంపేస్తామని బెదిరించారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో కూడా మావోయిస్టులు హేమచంద్ మాంఝీని హతమార్చేందుకు ప్రయత్నించారు. ఆ సమయంలో హేమచంద్ కనిపించకపోవడంతో మావోయిస్టులు అతని మేనల్లుడిని హతమార్చారు. హేమచంద్ మాంఝీని మావోయిస్టులు అవినీతిపరుడని ఆరోపిస్తుంటారు. ఆయనను ఈ ప్రాంతంనుంచి తరిమి కొట్టాలని పలుమార్లు ప్రజలకు పిలుపునిచ్చారు.హేమచంద్ మాంఝీ అందిస్తున్న వైద్య సేవలను గుర్తించిన ప్రభుత్వం గత నెలలో ఆయనను పద్మశ్రీ అవార్డుతో సత్కరించింది. ఈ సందర్భంలో మాంఝీ మాట్లాడుతూ ‘15 ఏళ్లుగా తాను నారాయణ్‌పూర్‌లో ప్రజలకు చికిత్స అందిస్తున్నానని, నాటి రోజల్లో ఛత్తీస్‌గఢ్‌లో ఆసుపత్రి అంటూ ఏమీ లేదన్నారు. అప్పటి నుంచి తాను వన మూలికలు, ఔషధ మొక్కల సాయంతో ప్రజలకు చికిత్స అందిస్తున్ననని’ తెలిపారు. -
దారి తప్పిన మేధావి.. ఎందుకీ మార్పు?
జయప్రకాష్ నారాయణ.. తెలుగు రాష్ట్రాలకు పరిచయం అక్కర్లేని పేరు. మాజీ ఐఏఎస్ అధికారిగా, లోక్‌సత్తా అనే పార్టీ పెట్టి ఒక్క సీటు కూడా గెలవకపోయినా.. మేధావిగా గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే తాజాగా ఆయన మాట్లాడిన మాటలు ఇప్పుడు రాజకీయంగానే కాదు.. ఏపీ జనాల్లోనూ తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ‘‘ఏపీలో ఎన్డీఏ కూటమికి లోక్‌సత్తా మద్ధతు. అభివృద్ధి, సంక్షేమం కోసం పాటుపడేవారికి ఓటేయండి. నాపై కూడా కులం ముద్ర వేసి తిట్టేవాళ్లు ఉంటారు అయినా రాష్ట్ర భవిష్యత్ కోసమే ఈ నిర్ణయం’’ : జయప్రకాష్ నారాయణ .. అభిప్రాయాలు చెప్పడంలో తప్పులేదు కావొచ్చు. కానీ.. దానికి ఎంచుకున్న సమయం, సందర్భం కూడా చూడాలి కదా. ఇప్పుడు జేపీకి అలియాస్ నాగభైరవ జయప్రకాష్ చౌదరికి కొన్ని ప్రశ్నలు అడుగుదాం. సీఎం జగన్ వచ్చిన తర్వాత పాఠశాలలు బాగుపడ్డాయి, పిల్లల చదువులు బాగున్నాయి, ఆస్పత్రులు బాగున్నాయి, వైద్యం బాగా అందుతోంది, అభివృద్ది పెరిగింది అంటూ ఇన్నాళ్లు మీరు యూట్యూబ్‌లో చేసిన వీడియోలకు మీ మాటలకు పొంతన ఎందుకు కుదరడం లేదు? ►పేదలు బాగుపడటం జేపీ గారికి నచ్చటం లేదా? ►పేదపిల్లలు ఉచితంగా ఇంగ్లీష్ మీడియం చదువుకోవటం జేపీ గారికి నచ్చటం లేదా? ►ప్రజలందరికి కార్పొరేట్ వైద్యం అందించాలనే ఉద్దేశ్యంతో ఇబ్బడిముబ్బడిగా మెడికల్ కాలేజీలు పెట్టటం .. సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు కట్టటం జెపిగారికి నచ్చటం లేదా? ►పేద ప్రజలకి తలదాచుకునేదుందుకు 30 లక్షల మందికి ఇంటి స్థలాలిచ్చి ఇల్లు కట్టించటం జేపీ గారికి నచ్చటం లేదా? ►గడచిన 75 ఏళ్లలో ఏ ముఖ్యమంత్రి ఆలోచన చేయని విధంగా 950 కిలోమిటర్లు తీరప్రాంతాన్ని అభివృద్ధి చేయటం .. అందులో భాగంగా ప్రతీ 50 కిలోమీటర్లకు ఒక పోర్ట్ కానీ లేదా ఫిషింగ్ హార్బర్ కానీ పెట్టటం జేపీ గారికి నచ్చటం లేదా? ►దక్షిణ భారతదేశం మొత్తానికి మనమే విధ్యుత్ సరఫరా చేసే స్థాయికి చేరాలనే లక్ష్యంతో అనేకరకమైన విద్యుతు ప్లాంటులు నిర్మించటం జేపీ గారికి నచ్చటం లేదా? ►ఎక్కడా లంచాలకి తావులేకుండా ప్రభుత్వ పథకాలన్నీ నేరుగా లబ్ధిదారులకే ఇవ్వటం జేపీ గారికి నచ్చటం లేదా? ►ఇటుపక్క కాకినాడ సెజ్ అటుపక్క శ్రీసిటీలలో అనేక కొత్త కంపెనీలు రావటం జేపీ గారికి నచ్చటం లేదా? ►ఉద్దానం సమస్యని పరిష్కారించటం నచ్చలేదు .. భోగాపురం ఎయిర్పోర్ట్ కట్టటం జేపీ గారికి నచ్చటం లేదా? ►రాష్ట్ర తలసరి ఆదాయం పెరగటం జేపీ గారికి నచ్చటం లేదా? ►16 లక్షల మంది కొత్తగా టాక్స్ పేయర్లు పెరగటం కూడా జేపీ గారికి నచ్చటం లేదా? ►విద్యా వైద్యంలో మన రాష్ట్రం దేశంలోనే నెంబర్ వన్ స్థానంలో ఉండటం జేపీ గారికి నచ్చటం లేదా? ►కేంద్ర మరియు ఇతర రాష్ట్రాలతో పోల్చినా లేదా అంతకుముందు చంద్రబాబు ప్రభుత్వంతో పోల్చినా ప్రతీ రంగంలో మన రాష్ట్రం మెరుగైన ఫలితాలు సాధించటం జేపీ గారికి నచ్చటం లేదా? ఇలా ఒకటేమిటి అనేకం .. అసలు రాష్ట్రం బాగుపడటం జేపీ గారికి నచ్చటం లేదా?.. అంతే కాదండోయ్ .. లక్షల కోట్లు దోచుకున్న చంద్రబాబు రామోజీ ముఠా మీద కేసులు పెట్టటం జేపీ గారికి అసలే నచ్చటం లేదా? విద్యారంగం వైద్యరంగం విద్యుత్ రంగం లాంటి వన్నీ ఒక్క కులం చేతిలోనే ఉండాలా? .. ముఠాలుగా ఏర్పడి ప్రజలని దోచుకోవాలా? పేద ప్రజలు మీ ఇళ్ల పక్కన ఉండటానికి వీల్లేదా? దోమలమీద యుద్ధం .. పుష్కరాలకు లైట్లు రంగుల పేరుతో రాష్టాన్ని దోచుకోవాలి ... దోచుకున్న డబ్బులతో ఓట్లు కొనాలి .. కేసుల్లేకుండా వ్యవస్థల్ని మానేజ్ చేయాలి .. అప్పుడే మీకు నచ్చుతుందా? అలా చేసే వాళ్ళకే మీరు మద్ధతిస్తారా?.. -
ఢిల్లీలో దాక్కున్న రింగ్ మాస్టర్ చినబాబు.. రాను రాను నేను రాను
-
Delhi Woman's Death Case: వెలుగులోకి విస్తుపోయే నిజాలు
ఢిల్లీలో 20 ఏళ్ల యువతిని కారుతో ఢీ కొట్టి ఈడ్చుకెళ్లిన దారుణ ఘటన యావత్తు దేశాన్ని ఉలిక్కిపడేలా చేసింది. ఈ అమానుష ఘటనపై అధికారులు సైతం దిగ్బ్రాంతికి గురయ్యారు. ఈ ఘటనపై ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్న ఢిల్లీ పోలీసులు.. విచారణలో ప్రత్యక్ష సాక్షి చెబుతున్న విషయాలను విని ఒక్కసారిగా షాక్‌కి గురయ్యారు. అలానే సీసీఫుటేజ్ దృశ్యాలు సైతం నివ్వెరపోయేలా ఉన్నాయని పోలీసులు చెబుతున్నారు. ఈ మేరకు ఈ ఘటననే చూసిన ప్రత్యక్ష సాక్షి దీపక్ దహియా మాట్లాడుతూ...ఈ ఘటన తెల్లవారుజామున 3.30 గంటలకు జరిగినట్లు తెలిపాడు. అతను తన మిఠాయి షాపు వద్ద ఉండగా.. సుమారు వంద మీటర్ల దూరంలో పెద్ద శబ్దం వచ్చింది. కారు టైరు పేలిందనుకున్నా.. కానీ కారు కదిలినప్పుడూ ఒక మృతదేహం కనిపించింది. దీంతో వెంటనే పోలీసులకు సమాచారం అందించాను. తాను పెద్దగా అరుస్తూ వాహనాన్ని ఆపేందుకు మోటారు బైక్‌తో వెంబడించి యత్నించాను కానీ వారు వాహనాన్ని ఆపలేదు. సుమారు గంటన్నరపాటు ఆ యువతి మృతదేహాన్ని 20 కి.మీ దూరం ఈడ్చుకెళ్లారని తెలిపాడు. వారు యూటర్న్ తీసుకుని పదే పదే డ్రైవింగ్ చేసుకుంటూ వెళ్లిపోయినట్లు వెల్లడించాడు. ఇది కేవలం ప్రమాదం కాదని దహియా నొక్కి చెప్పాడు. అంతేగాదు సుమారు గంటన్నర తర్వాత, కంఝవాలా రోడ్డులోని జ్యోతి గ్రామ సమీపంలో కారు నుంచి మృతదేహం వేరయ్యిందని, ఆ తర్వాత నిందితులు అక్కడ నుంచి పారిపోయారని చెప్పాడు. ఈ మేరకు ఢిల్లీ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీసు హరేంద్ర కుమార్ సింగ్ మాట్లాడుతూ...కారు ఢీ కొట్టడంతో యువతి స్కూటీ నుంచి పడిపోయిందని, ఆ తర్వాత చాలా దూరం వరకు ఈడ్చుకెళ్లినట్లు తెలిపారు. వాహనం రిజిస్టర్ నెంబర్ ఆధారంగా నిందితులను అదుపులోకి తీసుకుని అరెస్టు చేసినట్లు తెలిపారు. అలాగే వాహనం కిటికీలు మూసి ఉన్నాయి, పైగా సంగీతం బిగ్గరగా వస్తున్నందున్న తమకు ఏం జరిగిందో తెలియలేదని నిందితులు చెబుతున్నారు. ఆ తర్వాత అసలు విషయం తెలిసి పరారయ్యినట్లు పోలీసులకు తెలిపారు. ఆ దారుణ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట హల్చల్ చేస్తోంది. 🔴#BREAKING | New CCTV Confirms Witness Account, Car Makes U-Turn, Drags Delhi Woman https://t.co/wPFfrz6eKV pic.twitter.com/DvUDIbbwfM — Breaking News (@feeds24x7) January 2, 2023 (చదవండి: ఢిల్లీ ఘటనపై గవర్నర్ సక్సేనా ఫైర్: సిగ్గుతో తలదించుకోవాల్సి వస్తుంది) -
బిగ్ క్వశ్చన్: యూటర్న్ కు బ్రాండ్ అంబాసిడర్ చంద్రబాబు
-
అంతా తూచ్! యాపిల్ ఆఫీస్ భలే ఉంది: మస్క్ యూటర్న్
న్యూఢిల్లీ: టెక్ దిగ్గజం యాపిల్‌తో యుద్ధానికి సై అంటే సై అన్న బిలియనీర్, ట్విటర్ బాస్ ఎలాన్ మస్క్ వెనక్కి తగ్గారు. ముఖ్యంగా యాపిల్ ప్రధాన కార్యాలయంలో యాపిల్ సీఈవో టీమ్ కుక్‌తో భేటీ తర్వాత మస్క్ మాట మార్చడం హాట్‌టాపిక్‌గా నిలిచింది. (షాకింగ్: ఇక ఆ రంగంలో ఉద్యోగాలకు ముప్పు, నేడో, రేపో నోటీసులు!) టెక్ దిగ్గజం యాపిల్ పై యుద్ధాన్ని ప్రకటించిన ప్రపంచ కుబేరుడు మస్క్ పలు ఆరోపణలు చేశారు. తన ట్విటర్‌ను యాప్ స్టోర్ నుంచి తొలగిస్తే.. తాను కూడా ప్రత్యామ్నాయంగా స్మార్ట్ఫోన్ల తయారీలోకి దిగుతానంటూ స్పష్టం చేశారు. ఈ మేరకు ట్వీట్ కూడా చేశారు. అయితే అనూహ్యంగా తాను అపార్థం చేసున్నామనీ, ట్విటర్ ను తొలగించాలని ఎప్పుడూ అనుకోలేదంటూ ట్వీట్ చేశారు. అసలేం జరుగుతోందని యాపిల్ సీఈఓ టిమ్ కుక్నునిలదీసిన మస్క్ తాజాగా తామిద్దరి మధ్యా మంచి చర్చ జరిగిందనీ, ఇతర విషయాలతోపాటు, యాపిల్ యాప్ స్టోర్ నుంచి ట్విటర్‌ను తొలగించాలని తామెపుడూ భావించలేదని టిమ్ స్పష్టంగా చెప్పారంటూ పేర్కొన్నారు. అంతేకాదు కాలిఫోర్నియాలోని కుపెర్టినోలో "యాపిల్ అందమైన హెచ్‌క్యూ" వీడియో క్లిప్‌ను కూడా షేర్ చేయడం విశేషం. Thanks @tim_cook for taking me around Apple’s beautiful HQ pic.twitter.com/xjo4g306gR — Elon Musk (@elonmusk) November 30, 2022 var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_5051504145.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
జూబ్లీహిల్స్‌లో ట్రాఫిక్ ట్రయల్ రన్.. అయోమయంలో వాహనదారులు
సాక్షి, హైదరాబాద్: జూబ్లీహిల్స్ ట్రాఫిక్ పోలీసుల ప్రయోగాత్మక ఆంక్షల నడుమ వాహనాలు ఆగుతూ... సా..గుతూ కనిపించాయి. సీవీఆర్ జంక్షన్, రోడ్ నెం. 45 జంక్షన్లో రైట్ టర్న్‌ను తొలగించడంతో తొలి రోజు ఎక్కువ మందికి అవగాహన లేకపోవడంతో చుట్టూ తిరుగుతూ ప్రయాణించాల్సి వచ్చింది. ► జూబ్లీహిల్స్ రోడ్ నెం. 45 బాలకృష్ణ నివాసం చౌరస్తాతో పాటు జర్నలిస్టు కాలనీ, సీవీఆర్, బీవీబీపీ చౌరస్తా, జూబ్లీహిల్స్ చెక్‌పోస్టులో రోజురోజుకూ పెరుగుతున్న ట్రాఫిక్‌ను నియంత్రించేందుకు ట్రాఫిక్ పోలీసులు కొన్ని మార్గాల్లో ట్రయల్ రన్ కింద మళ్లింపులు చేపట్టి శుక్రవారం నుంచి అమల్లోకి తీసుకొచ్చారు. ఇద్దరు ట్రాఫిక్ ఏసీపీలు, ఇద్దరు ట్రాఫిక్ ఇన్స్పెక్టర్లు, ఎనిమిది మంది ఎస్ఐలు కలిసి మొత్తం 32 మంది ట్రాఫిక్ పోలీసులు ఈ ట్రాఫిక్ మళ్లింపును పర్యవేక్షించారు. ► మధ్యాహ్నం 12 గంటల నుంచి ట్రాఫిక్ మళ్లింపులు ప్రారంభించారు. చాలా మందికి అవగాహన లేకపోవడంతో ఎటు వెళ్లాలో తెలియక గజిబజిగా ముందుకు సాగుతుండగా ట్రాఫిక్ పోలీసులు వారికి దారి చూపారు. ► అయితే పలుచోట్ల ట్రాఫిక్ చాంతాండాంత దూరానికి నిలిచిపోవడంతో వాహనదారులు అసహనానికి గురయ్యారు. మొదటి రోజు వాహనాలు వివిధ మార్గాల నుంచి మళ్లించడంతో చుట్టూ తిరుగుతూ వాహనదారులు గమ్యస్థానాలకు వెళ్లారు. ► నగర ట్రాఫిక్ అదనపు కమిషనర్ రంగనాథ్, ఏసీపీ జ్ఞానేందర్‌రెడ్డి పలుచోట్ల యూటర్న్లు, రైట్ టర్న్‌లను పరిశీలించారు. రాంగ్ రూట్లో ఆర్టీసీ బస్సు జూబ్లీహిల్స్ రోడ్ నెం. 36 ప్రధాన రోడ్డులో పెద్దమ్మ గుడి కమాన్ నుంచి మాదాపూర్ వెళ్లే టర్నింగ్ వద్ద పిల్లర్ నెంబర్ సి–1659 నుంచి హెచ్‌సీయూ డిపోకు చెందిన సిటీ బస్సు శుక్రవారం ఉదయం రాంగ్రూట్లో వస్తూ కనిపించింది. సాధారణంగా ఆటో వాలాలు, ద్విచక్ర వాహనదారులు రాంగ్రూట్లో వెళ్లడం కనిపిస్తుంది. ఏకంగా సిటీ బస్సు రాంగ్రూట్లో వస్తుండటంతో స్థానికులు అవాక్కయ్యారు. ఈ విషయాన్ని ఓ స్కూటరిస్ట్ ఫొటో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు. సర్వీసు రోడ్డులో నిండుగా... జూబ్లీహిల్స్ రోడ్ నెం. 45ల కేబుల్ బ్రిడ్జి నిర్మించి దానికి అనుసంధానంగా ఫ్లై ఓవర్ నిర్మించిన తర్వాత ఇప్పటి వరకు సర్వీసు రోడ్డులో వాహనాలు ఏ రోజు కూడా నిండుగా కనిపించలేదు. కానీ తొలిసారి శుక్రవారం నుంచి జూబ్లీహిల్స్‌లోని ఆయా జంక్షన్ల వద్ద పోలీసులు ఆంక్షలు విధించి మళ్లింపులు చేపట్టడంతో సర్వీసు రోడ్లు సైతం వాహనాలతో కిక్కిరిసిపోయాయి. మరో వైపు రోడ్ నెం.45లోని ఫ్లై ఓవర్ మీదుగా కేబుల్ బ్రిడ్జి వైపు వాహనాలు తక్కువగా వెళ్లడం గమనార్హం. (క్లిక్ చేయండి: 20 నిమిషాల్లో పంజాగుట్ట నుంచి ఓఆర్ఆర్కు) జూబ్లీ హిల్స్ చెక్ పోస్టు నుంచి బాలయ్య ఇంటి దగ్గర రైట్ టర్న్ తీసేసిన ట్రాఫిక్ పోలీసులు. ఫిల్మ్ నగర్ జంక్షన్ వద్ద కూడా యూ టర్న్ లేదు. సిగ్నల్ ఫ్రీ అంటే మమ్మల్ని సిటీ అంతా తిప్పడం కాదు సర్ అట్టర్ ఫ్లాప్ ప్రయోగం. Please Look into this. @HYDTP. @HiHyderabad #Hyderabad @KTRTRS — Vidya Sagar Gunti (@GVidya_Sagar) November 25, 2022 నగర వాసులు ఏమంటున్నారు.. మరోవైపు ట్రాఫిక్ పోలీసులు చేపట్టిన ట్రయన్ రన్‌పై నగర వాసులు తమ అభిప్రాయాలను సోషల్ మీడియా ద్వారా వెల్లడిస్తున్నారు. ట్రాఫిక్ సమస్యను పరిష్కరించమంటే తమను ఊరంతా తిప్పుతున్నారని అంటున్నారు. So! The city traffic police woke up one day and said - everything is fine, let’s mess up? Was that the thought behind all these diversions/ no U-turns in Jubilee Hills? Such chaos! #Hyderabad #HyderabadTraffic #WhatOnly🤯 pic.twitter.com/WpDIaB0u7Y — Revathi (@revathitweets) November 26, 2022 -
ట్రంప్ చేసిన పనికి బైడెన్ క్షమాపణ
వాషింగ్టన్: అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన పనికి ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ క్షమాపణలు చెప్పారు. డొనాల్డ్ ట్రంప్ హయాంలో పారిస్ పర్యావరణ ఒప్పందం నుంచి అమెరికా వైదొలిగిన అంశంపై మాట్లాడుతూ ఈ మేరకు ప్రపంచ దేశాలను క్షమాపణలు కోరారు బైడెన్. పారిస్ ఒప్పందంలో వెంటనే చేరుతున్నట్లు ప్రకటించారు. ప్రధాన పర్యావరణ సదస్సులను నిర్వహించామని తెలిపారు. భూతాపాన్ని తగ్గించే పోరాటంలో నాయకత్వాన్ని తిరిగి తీసుకునేందుకు అమెరికా సిద్ధంగా ఉన్నట్లు స్పష్టం చేశారు బైడెన్. ఐక్యరాజ్య సమితి కాప్27 సదస్సులో ప్రసంగించారు. ‘స్నేహితులారా.. ఈ ఒక్క సమస్యపై దశాబ్దాలుగా చర్చ కొనసాగుతోంది. పురోగతిలో అడ్డంకులను అధిగమించడానికి అమెరికా చేయవలసిన పరివర్తనాత్మక మార్పులు చేయాలని నిర్ణయించుకునే నేను అధ్యక్ష పదవికిలోకి వచ్చాను. అమెరికా ఒక విశ్వసనీయమైన, గ్లోబల్ లీడర్‌గా వాతావరణ మార్పులపై పోరాటం చేసేందుకు సిద్ధంగా ఉంది. దానిని సాధించటానికి మా సాయశక్తులా కృషి చేస్తాం.’ అని తెలిపారు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్. 2030 నాటికి శిలాజ ఇంధనాల వాడకాన్ని తగ్గించాలనే లక్ష్యాన్ని చేరుకుంటామన్నారు. ప్రపంచ దేశాలు సైతం శిలాజ ఇంధనాల వాడకాన్ని తగ్గించేందుకు కృషి చేయాలని కోరారు బైడెన్. వారిపై ఒత్తిడి తేవటం గ్లోబల్ లీడర్‌గా తమ బాధ్యత అని వెల్లడించారు. పర్యావరణ సంక్షోభంతో అది మానవ, ఆర్థిక, వాతవారణ, జాతీయ భద్రతకు ముప్పు తెస్తోందని సూచించారు. ఈ భూమండలంపై ఉన్న ప్రతి జీవికి ముప్పు వాటిల్లుతోందన్నారు. ఇదీ చదవండి: పాలపుంతతో ప్రాణానికి నిశ్చింత -
పీఎంగా రిషి సునాక్ బిగ్ ‘యూ-టర్న్’.. ఆ నిర్ణయంలో మార్పు
లండన్: బ్రిటన్ రాజకీయ చరిత్రను తిరగరాస్తూ భారత సంతతి వ్యక్తి రిషి సునాక్ ప్రధాని పదవి చేపట్టిన విషయం తెలిసిందే. దేశాన్ని ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెక్కించేందుకు కఠిన నిర్ణయాలు తప్పవంటూ తన మార్క్‌ను చూపిస్తున్నారు. అయితే, ప్రధాని పీఠంపై కూర్చున్న మొట్టమొదటి సారి బిగ్ యూటర్న్ తీసుకుని తన నిర్ణయాన్ని మార్చుకున్నారు. దేశీయ బాధ్యతల నేపథ్యంలో ఐక్యరాజ్య సమితి క్లైమేట్ సమ్మిట్‌కు వెళ్లకూడదని ముందుగా నిర్ణయించుకున్న రిషి సునాక్.. తాజాగా ఆ నిర్ణయాన్ని మార్చుకుని వెళ్లాలని నిశ్చయించుకున్నారు. తాను పర్యావరణ సదస్సుకు హాజరవుతున్నట్లు ట్వీట్ చేశారు. ‘పర్యావరణ మార్పులపై చర్యలు తీసుకోకుండా బంగారు భవిష్యత్తు లేదు. పునరుత్పాదక ఇంధనాలపై పెట్టుబడులు పెట్టకుంటే విద్యుత్తు సంక్షోభం దిశగా అడుగులు వేస్తున్నట్లే. అందుకే.. వచ్చే వారం జరగనున్న కాప్27 క్లేమేట్ సదస్సుకు హాజరవబోతున్నా. సురక్షితమైన, స్థిరమైన భవిష్యత్తును నిర్మించే గ్లాస్గో వారసత్వాన్ని కొనసాగించాలనుకుంటున్నా.’ అని ట్వీట్ చేశారు రిషి సునాక్. ఈజిప్ట్‌లోని షర్మ్ ఎల్-షేక్ రెడ్ సీ రిసార్ట్‌లో జరిగే సమావేశానికి హాజరు కాకూడదని సునాక్ తీసుకున్న నిర్ణయం పర్యావరణ ప్రచారకుల ఆగ్రహానికి కారణమైంది. ఈ కారణంగానే ఆయన తన నిర్ణయాన్ని మార్చుకున్నట్లు తెలుస్తోంది. రిషి సునాక్ ట్వీట్ చేయకముందే యూ-టర్న్‌పై హింట్ ఇచ్చారు ఆయన అధికార ప్రతినిధి. నిర్ణయంపై పునఃసమీక్షిస్తున్నట్లు చెప్పారు. దానికన్నా ముందు మాజీ ప్రధాని బోరిస్ జాన్సన్ హాజరుకాబోతున్నట్లు ప్రకటించారు. గత ఏడాది కాప్ 26 సమావేశానికి ఆయన ప్రధాని హోదాలో హాజరయ్యారు. There is no long-term prosperity without action on climate change. There is no energy security without investing in renewables. That is why I will attend @COP27P next week: to deliver on Glasgow's legacy of building a secure and sustainable future. — Rishi Sunak (@RishiSunak) November 2, 2022 ఇదీ చదవండి: ఈ నిర్ణయం ఘోర తప్పిదం...రిషి సునాక్‌పై విమర్శలు! -
Cyberabad: జంక్షన్లు, యూ టర్న్‌లు.. ఎక్కడ కావాలో మీరే చెప్చొచ్చు!
సాక్షి, హైదరాబాద్: ట్రాఫిక్ సమస్యలను పరిష్కరించాలంటే అధ్యయనం తప్పనిసరి. స్థానికుల అవసరాలను, వాహనదారుల ఇబ్బందులను పరిష్కరించగలిగితే వక్రమార్గంలో ప్రయాణాలు, ప్రమాదాలూ తగ్గుతాయి. అలాగే ట్రాఫిక్ నిబంధనలను సక్రమంగా పాటిస్తారు. ఈ క్రమంలో సైబరాబాద్‌లో కొత్తగా యూటర్న్లు, జంక్షన్ల ఏర్పాటు అవసరాన్ని ట్రాఫిక్ పోలీసు ఉన్నతాధికారులు గుర్తించారు. స్థానికుల నుంచి అభ్యర్థనలను స్వీకరించి, ఆ మేరకు కూడళ్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. రాంగ్ రూట్లో వెళుతూ.. ‘నిజమైన వినియోగదారులే.. నిజమైన న్యాయనిర్ణేతలు’ ట్రాఫిక్ నిర్ణయాలలో ఇది అక్షరాలా నిజం. వాహనదారులు కోరిన విధంగా యూటర్న్ ఇస్తే వక్రమార్గంలో ప్రయాణించరు. అలా చేయకపోవటంతో రాంగ్ రూట్లో వెళ్లి ప్రమాదాలకు కారణం అవుతున్నారని పోలీసులు గుర్తించారు. అందుకే యూటర్న్లు, జంక్షన్లు, ట్రాఫిక్ మళ్లింపుల ఏర్పాట్లపై స్థానికుల నుంచి వచ్చిన అభ్యర్థనలను స్వీకరించాలని నిర్ణయించినట్లు పోలీసు అధికారి ఒకరు తెలిపారు. ఆయా ఏర్పాట్లతో ట్రాఫిక్ రద్దీకి పరిష్కారం ఉంటుందా? వాహన ప్రమాదాలు తగ్గుతాయా? అసలు అది న్యాయబద్దమైన కోరికేనా వంటి అన్ని కోణాల్లో పరిశీలించిన తర్వాతే నిర్ణయం తీసుకుంటామని వివరించారు. కారు పడిందని ఫ్లైఓవరు ఎక్కట్లేదు.. ఖాజాగూడ నుంచి ఐకియా వైపు వెళ్లే వాహనదారులు బయోడైవర్సిటీ ఫ్లైఓవర్ పైకి ఎక్కకుండా కింది నుంచి వెళ్లి జంక్షన్ దగ్గర కుడి వైపునకు మళ్లుతున్నట్లు ట్రాఫిక్ పోలీసులు గుర్తించారు. కారణమేంటని అధ్యయనం చేయగా.. రెండున్నరేళ్ల క్రితం ఆ ఫ్లైఓవర్ పైనుంచి కారు కిందికి పడిపోవటంతో వాహనదారులు ఇప్పటికీ భయపడుతున్నారని, అలాగే ఆ ఫ్లైఓవర్ డిజైనింగ్‌లోనే లోపాలున్నాయని ఓ ట్రాఫిక్ పోలీసు అధికారి తెలిపారు. ఏ రహదారైనా 90 డిగ్రీల కోణంలో తిరిగేటప్పుడు ఎటు వైపునకు మళ్లుతుందో ఆ వైపు రోడ్డు కొంత వంగి ఉండాలి. లేకపోతే వేగంతో వచ్చే వాహనాలు రోడ్డుకు అనుగుణంగా మళ్లవు. దీంతో ప్రమాదాలు జరుగుతాయి. ప్రస్తుతం బయోడైవర్సిటీ ఫైఓవర్ రోడ్డు డిజైనింగ్‌లో మరమ్మతులు చేయలేం కాబట్టే వాహనాల వేగాన్ని నియంత్రించే చర్యలు తీసుకుంటున్నామని ఆయన వివరించారు. యూటర్న్, జంక్షన్లు ఇక్కడే.. ఇప్పటివరకు యూటర్న్లు, జంక్షన్ల ఏర్పాటుపై స్థానికుల నుంచి 25కి పైగా అభ్యర్థనలు వచ్చాయని.. సాధ్యాసాధ్యాలపై క్షేత్ర స్థాయిలో అధ్యయనం చేసిన తర్వాత 3 ప్రాంతాలను ఎంపిక చేశామని, మరో 11 ప్రాంతాలు పరిశీలనలో ఉన్నాయని సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసు ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. ► ఐఐఐటీ జంక్షన్ నుంచి విప్రో జంక్షన్ వెళ్లే మార్గంలో కోకాపేట దగ్గర వరుణ్ మోటార్స్ వైపున తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ (టీఎస్ఐఐసీ)తో కలిసి జంక్షన్‌ను అభివృద్ధి చేశారు. ► ఏఐజీ ఆసుపత్రి అభ్యర్థన మేరకు గచ్చిబౌలిలోని డెలాయిట్ ఆఫీసు దగ్గర యూటర్న్‌ను ఏర్పాటు చేశారు. ► గచ్చిబౌలి జంక్షన్ ఇందిరానగర్ దగ్గర యూటర్న్‌ను ఇచ్చారు. ► జీఎంసీ బాలయోగి స్టేడియం ముందు ఉన్న యూటర్న్ తక్కువ విస్తీర్ణం ఉందని వచ్చిన అభ్యర్థన మేరకు వెడల్పాటి యూటర్న్‌ను ఏర్పాటు చేశారు. జంక్షన్లు, ఫుట్‌పాత్‌ల అభివృద్ధిపై దృష్టి పెట్టాలి అధికారులతో మంత్రి కేటీఆర్ సమీక్ష గ్రేటర్ నగరంలో రోడ్ల నిర్వహణతో పాటు వాటికి అనుబంధంగా ఉన్న ఫుట్‌పాత్‌లు, జంక్షన్ల అభివృద్ధి, నిర్వహణ తదితర అంశాలపై దృష్టి సారించాలని జీహెచ్ఎంసీ అధికారులను మంత్రి కేటీఆర్ ఆదేశించారు. నగరంలో జరుగుతున్న వివిధ అభివృద్ధి కార్యక్రమాలపై అమీర్‌పేట హెచ్ఎండీఏ కార్యాలయంలో జరిగిన సమావేశంలో జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ, పురపాలకశాఖ ఉన్నతాధికారులతో మంత్రి మాట్లాడారు. వ్యూహాత్మక రహదారుల అభివృద్ధి కార్యక్రమం (ఎస్పార్‌డీపీ), సమగ్ర రోడ్డు నిర్వహణ (సీఆర్ఎంపీ)లో భాగంగా కొనసాగుతున్న కార్యక్రమాలపై అధికారులు మంత్రికి వివరాలు అందించారు. సీఆర్ఎంపీ ద్వారా నిరంతరం నగరంలోని ప్రధాన రహదారుల నిర్వహణ కొనసాగిస్తున్నందున వాటి ఫలితాలు ప్రజలకు అందుతున్నాయన్నారు. ఈ నేపథ్యంలో రోడ్లకు సంబంధించిన అన్ని అంశాలపైనా మరింత దృష్టి సారించాలని మంత్రి ఆదేశించారు. నగరంలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న ఫార్ములా ఈ– రేసుకి సంబంధించి మంత్రి కేటీఆర్ సమీక్షించారు. సమావేశంలో పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్ కుమార్, జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేశ్ కుమార్ పాల్గొన్నారు. (క్లిక్: విలవిలలాడిన ఐటీ సిటీ.. ‘గ్రేటర్’ సిటీ పరిస్థితి ఏంటి?) -
జంక్షన్’లోనే లైఫ్ ‘టర్న్’
సాక్షి హైదరాబాద్: నగరంలో రోడ్డు ప్రమాదాలు వాటిలో మృతుల సంఖ్యను తగ్గించడానికి ప్రత్యేక కార్యాచరణ సిద్ధం చేస్తున్న సిటీ ట్రాఫిక్ పోలీసులు సమగ్ర అధ్యయనాలకు శ్రీకారం చుట్టారు. వీటిలో భాగంగా ప్రమాదాలు జరుగుతున్న ప్రాంతాలు, సమయాలు గుర్తిస్తున్నారు. తాజాగా చేపట్టిన అధ్యయనంలో గడిచిన మూడేళ్ల కాలంలో ట్రాఫిక్ జంక్షన్లు, యూ టర్న్స్ వద్ద అనేక ప్రమాదాలు జరిగినట్లు గుర్తించారు. 2019– 21 మధ్య మొత్తం మృతుల్లో కనిష్టంగా 18.91 శాతం, గరిష్టంగా 21.14 శాతం మంది ఈ ప్రాంతాల్లోనే మృత్యువాతపడ్డారని తేలింది. మొత్తమ్మీద 147 మంది ఈ ప్రాంతాల్లో జరిగిన యాక్సిడెంట్స్‌లోనే కన్నుమూశారు. ఈ అధ్యయనాల ఆధారంగా నిరోధానికి చర్యలు తీసుకుంటామని సిటీ ట్రాఫిక్ చీఫ్ ఏవీ రంగనాథ్ ‘సాక్షి’కి తెలిపారు. ఉల్లంఘనలే ప్రధాన కారణం.. సిటీలోని పలు ప్రాంతాల్లో అనునిత్యం కనిపించే సీన్లు చూస్తే ఇతర వాహనాల కంటే ద్విచక్ర వాహనచోదకులే ఎక్కువగా ఉల్లంఘనలకు పాల్పడుతుంటారని స్పష్టమవుతోంది. సిగ్నల్ జంపింగ్, ర్యాష్ డ్రైవింగ్, స్టాప్ లైన్ క్రాసింగ్‌తో పాటు నిర్లక్ష్యంగా టర్న్ తీసుకోవడం వంటివి చేస్తుంటారని ట్రాఫిక్ పోలీసులు గుర్తించారు. ఇతర ప్రాంతాల మాదిరిగానే జంక్షన్లు, యూ టర్న్స్ వద్దా ఇదే పంథా అనుసరిస్తున్నారు. అదే వీరితో పాటు ఎదుటి వారి ప్రాణాల మీదకు తెస్తోందని ట్రాఫిక్ పోలీసులు అంచనా వేస్తున్నారు. గడిచిన మూడేళ్ల కాలంలో నమోదైన ప్రమాదాలను పరిశీలిస్తే జంక్షన్లు, యూ టర్న్స్ మృత్యువాతపడిన వాళ్లల్లో ద్విచక్ర వాహనచోదకులది మొదటి స్థానం కాగా.. పాదచారులది రెండో స్థానం. అధ్యయనంలో గుర్తించిన అంశాలివి... 2021లో యూ టర్న్స్ వద్ద జరిగిన ప్రమాదాల్లో 11 మంది మృత్యువాతపడగా.. జంక్షన్ల వద్ద 48 మంది మరణించారు. ఏడాది మొత్తమ్మీద రోడ్డు ప్రమాదాల్లో మరణించిన వారి సంఖ్య 279 మంది. ఇందులో రాత్రి వేళ 28 ప్రమాదాలు జరగ్గా, పగటి వేళల్లో 31 చోటు చేసుకున్నాయి. మృతుల్లో పాదచారులు 17 మంది, ద్విచక్ర వాహనచోదకులు 35 మంది, ఇతరులు ఏడుగురు ఉన్నారు. లంగర్‌హౌస్‌లోని ఆర్మీ గేట్ యూ టర్న్, బోయిన్పల్లి చౌరస్తా, డెయిరీ ఫామ్ టీ జంక్షన్, ఎంజే మార్కెట్ వద్ద ఎక్కువ ప్రమాదాలు జరిగాయి. 2020లో యూ టర్న్స్ వద్ద జరిగిన ప్రమాదాల్లో 8 మంది మృత్యువాతపడగా... జంక్షన్ల వద్ద 31 మంది మరణించారు. ఏడాది మొత్తమ్మీద రోడ్డు ప్రమాదాల్లో మరణించిన వారి సంఖ్య 254. రాత్రి వేళ 20 ప్రమా దాలు జరగ్గా, పగటి వేళ 19 చోటు చేసుకున్నా యి. మృతుల్లో పాదచారులు 12 మంది, ద్విచక్ర వాహనచోదకులు 26 మంది, ఇతరులు ఒకరు ఉన్నారు. అమీర్‌పేట చౌరస్తా, నల్లగొండచౌ రస్తా, బాలమ్రాయి ఎక్స్ రోడ్స్, తాజ్‌మహల్ ఎక్స్‌రోడ్ వద్ద ఎక్కువ ప్రమాదాలు జరిగాయి. 2019లో యూ టర్న్స్ వద్ద జరిగిన ప్రమాదాల్లో 11 మంది మృత్యువాతపడగా... జంక్షన్ల వద్ద 38 మంది మరణించారు. మరణించిన వారి సంఖ్య మొత్తం 259 మంది. రాత్రి వేళ 22 ప్రమాదాలు జరగ్గా, పగటి వేళల్లో 27 చోటు చేసుకున్నాయి. మృతుల్లో పాదచారులు 25 మంది, ద్విచక్ర వాహనచోదకులు 19 మంది, ఇతరులు ఐదుగురు ఉన్నారు. చిలకలగూడ చౌరస్తా, ఫీవర్ ఆస్పత్రి జంక్షన్ వద్ద ఎక్కువ ప్రమాదాలు జరిగాయి. పటిష్ట ప్రణాళిక రూపొందిస్తున్నాం హైదరాబాద్‌లోని జంక్షన్లు, యూ టర్న్స్ వద్ద చోటు చేసుకుంటున్న ప్రమాదాలపై ప్రత్యేక దృష్టి పెట్టనున్నాం. తాజా అధ్యయనం గుర్తించిన అంశాల ఆధారంగా పటిష్ట కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేస్తాం. ఇతర విభాగాలతో కలిసి ఆయా చోట్ల క్షేత్రస్థాయి అధ్యయనాలు నిర్వహిస్తాం. వారి సహకారంతో అవసరమైన మార్పుచేర్పులు చేయడంతో పాటు రోడ్ ఇంజినీరింగ్ వంటి చర్యలు తీసుకుంటాం. ఈ ఏడాది నగరంలో రోడ్డు ప్రమాదాలు, వాటిలో మృతుల సంఖ్యను గణనీయంగా తగ్గించాలనే కృతనిశ్చయంతో ఉన్నాం. – ఏవీ రంగనాథ్, సిటీ ట్రాఫిక్ చీఫ్ -
ఉగ్గబట్టుకుని చూడాల్సిన వీడియో! ఏది నిజం.. ఏది వైరల్!
Driver Takes Impossible u-turn On Narrow Hillside Road: ర్యాష్ డ్రైవింగ్‌కి సంబంధించిన పలు వైరల్ వీడియోలు చూశాం. కొన్ని వీడియోల్లో అయితే వీడి పని అయిపోయింది అనుకునేంతగా వీడియోలు చూశాం. కొంత మంది బస్సు కింద పడిన ఏ మాత్రం గాయాలుపాలు కాకుండా బయటపడిన వీడియోలు చూశాం. అయితే కొండ అంచున ఒక డ్రైవర్ యూటర్నింగ్ తీసుకుంటున్న వీడియో ఒకటి ప్రస్తుతం ఇన్‌స్టాగ్రామ్‌లోనూ, ట్విట్టర్లోనూ తెగ వైరల్ అవుతుంది. కానీ ఈ వీడియో చూడాలంటే మాత్రం చాలా టెన్షన్‌గా, ఏం అవుతుందో అని ఉగ్గబట్టుకుని భయం భయంగా చూడాలి. అసలు విషయంలోకెళ్తే...ఒక కొండల వద్ద ఘాటీ రోడ్డులో వెళ్లేందుకు ఒక మార్గం వచ్చేటప్పడూ ఒక మార్గం ఉంటుంది. ఎందుకంటే కొండల వద్ద ఎదురుగా ఇంకో వాహనం ఏదీ రాదు. అలాగే ఇరుకైన కొండల అంచున రోడ్డుపై యూటర్న్ తీసుకోవడం అసలు కుదరదు. కానీ ఈ వీడియోలో డ్రైవర్ తన బ్లూ కార్‌తో అంత ఇరుకైన పర్వత రోడ్డు వద్ద చాలా నైపుణ్యం ప్రదర్శించి యూ టర్న్ తీసుకున్నాడు. పైగా అతనికి ఈ యూటర్న్ తీసుకోవడానికి సుమారు 80 నిమిషాలు పట్టింది. దీంతో నెటిజన్లు ఆ డ్రైవర్ నైపుణ్యాన్ని తెగ ప్రశసింస్తూ రకరకాలుగా ట్వీట్ చేశారు. అయితే ఈ వీడియోని డ్రైవింగ్స్కిల్ అనే యూట్యూబ్ ఛానెల్ గత ఏడాది డిసెంబర్లో మొదటిసారి షేర్ చేసింది. అంతేకాదు కారు నడిపే వ్యక్తి చాలా ఇరుకైన రహదారిపై యూ టర్న్‌లు ఎలా చేయాలో ప్రదర్శించే నిపుణుడు అని పేర్కొంది. అయితే మళ్లీ ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవ్వడమే కాక నెటిజన్లను తెగ ఆకర్షిస్తోంది. The perfect 80 point turn! pic.twitter.com/bLzb1J1puU — Dr. Ajayita (@DoctorAjayita) January 23, 2022 ఇక ఇంటర్నెట్లో మరో వీడియో కూడా వైరల్ అవుతోంది. ఇది పై వీడియోకి ఒరిజినల్ అనే ప్రచారం నడుస్తోంది. సో.. ఈ రెండిటిలో ఏది నిజం? ఏది వైరల్? అనేది నిర్ధారించడం కొంచెం కష్టమే అవుతోంది. (చదవండి: రూ.500 కోసం జుట్టు జుట్టు పట్టుకుని....చెప్పులతో కొట్టుకున్నారు: వైరల్ వీడియో) -
Viral Video: ఏంటా దూకుడు!... బ్రేక్ వేసుండకపోతే పరిస్థితి....
అతి వేగం అనర్థం అని ట్రాఫిక్ పోలీసులు ఎంత మొత్తుకుంటున్న యువతలో మాత్రం మార్పు రావడం లేదు. స్పీడ్ బ్రేకర్లు, జీపీఎస్ అంటూ వేగాన్ని నియంత్రించేందుకు పోలీసులు నానా తంటాలు పడుతున్నారు. అయినా మితి మీరిన వేగంతో వేళ్తేనే మజా అంటోంది యువత. ఎంత భయంకరమైన ప్రమాదాలు జరిగిన తగ్గేదేలే అంటూ రయ్ రయ్ మంటూ వెళ్లిపోతున్నారు. అచ్చం అలాంటి ఘటన గురించే ఇప్పుడు మనం చెప్పుకోబోతున్నాం. ఎందుకంటే ఇక్కడొక వ్యక్తి కూడా యూ టర్న్ తీసుకుంటున్న బస్సుని లక్ష్య పెట్టకుండా తనదైన స్పీడులో దూసుకుపోతున్న వీడియో ఒకటి నెట్టింట తెగ వైరల్ అవుతోంది. కర్ణాటకలోని మంగళూరులో బస్సును వేగంగా దాటిన వ్యక్తి త్రుటిలో ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు. బస్సు డ్రైవర్ యూ టర్న్తీసుకోవడానికి బస్సుని ఒక పక్కకు ఆపి తిప్పడానికి ప్రయత్నిస్తున్నాడు. ఇంతలో అకస్మాత్తుగా స్కూటర్ పై దూసుకుంటూ వస్తున్న ఒక వ్యక్తిని చూసి బస్సు డ్రైవర్ వెంటనే బ్రేక్ వేశాడు. అదృష్టవశాత్తు అతనికి ఏం కాలేదు. అయితే ఆ వ్యక్తి మాత్రం చేపల ప్రాసెసింగ్ యూనిట్ గేట్‌ని రాసుకుంటూ ..ఒక దుకాణం, చెట్టు మధ్యలో ఉన్న చిన్న గ్యాప్ నుంచి వెళ్లిపోయాడు. అతను రైడ్ చేసిన విధానం చూస్తేనే వొళ్లు గగ్గర్పాటుకు గురవుతుంది. అయితే ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట తెగ వైరల్ అవుతోంది. దీంతో నెటిజన్లు లక్కీ గై అని ఒకరు, మరోకరేమో ఏమి జరగనట్టుగా వెళ్లిపోతున్నాడు అంటూ విమర్శిస్తూ ట్వీట్ చేశారు. Viral video of a young man who was speeding on a scooter and miraculously avoided colliding with a bus that was taking a U-turn near Elyarpadavu, Mangalore. 🚌💨🛵 The scooter then hits the door of the fish processing unit and passed in between a shop and a tree. 😱 pic.twitter.com/c4vAvbbikj — Mangalore City (@MangaloreCity) January 11, 2022 -
‘ఢిల్లీలో ఏమన్న చేసుకోండ్రి.. మా రాష్ట్రంలో ఏందీ లొల్లి: సీఎం యూటర్న్
చండీగఢ్: మూడు కొత్త వ్యవసాయ చట్టాల రద్దుకు సంవత్సరానికి పైగా పోరాడుతున్న రైతులపై తొలిసారి పంజాబ్ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రైతు ఉద్యమంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. రైతుల ఆందోళనపై యూటర్న్ తీసుకున్నారు. రైతుల నిరసన కార్యక్రమాలతో తమ రాష్ట్రం తీవ్రంగా నష్టపోతుందని పేర్కొన్నారు. ‘ఢిల్లీలో ఇష్టమొచ్చినట్టు చేసుకోండి.. కానీ పంజాబ్‌లో ఎందుకు’ అని ప్రశ్నించారు. కేంద్రంపై పోరాడేందుకు ఢిల్లీలో ఉద్యమం చేయాలని సూచించారు. చదవండి: అమ్మా దొంగా ఇక్కడున్నావా? ఇది చూస్తే మీ స్ట్రెస్ హుష్‌కాకి సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వంపై పోరాడేందుకు రైతులు తమ శక్తియుక్తుల్ని ఉపయోగించాలని చెప్పారు. రాష్ట్రంలో కాదని పేర్కొన్నారు. పంజాబ్‌కు ఎందుకు నష్టం చేస్తున్నారు? అని ప్రశ్నించారు. హరియాణా, ఢిల్లీలో నిరసన కార్యక్రమాలు చేసుకోండి అని సూచించారు. రైతులు ఢిల్లీ, హరియాణాలోని 113 ప్రాంతాల్లో ఆందోళన చేస్తున్నారు అని తెలిపారు. ‘మీ ఆందోళనతో రాష్ట్ర అభివృద్ధిపై తీవ్ర ప్రభావం పడడం ఆందోళనకరం’ అని ఆరోపించారు. రాష్ట్రం ఆదాయం కోల్పోతుందని ఆందోళన వ్యక్తం చేశారు. చదవండి: రజనీకాంత్ స్టైల్లో మంత్రి హరీశ్‌రావు డ్యాన్స్ పంజాబ్‌లో వచ్చే ఏడాది ఎన్నికలు రాబోతున్న నేపథ్యంలో సీఎం అమరీందర్‌సింగ్ ఈ విధంగా యూటర్న్ తీసుకున్నారని తెలుస్తోంది. నల్ల చట్టాల రద్దుకు రైతులు పంజాబ్‌లో భారీ స్థాయిలో ఆందోళనలు చేస్తున్న విషయం తెలిసిందే. పది నెలలుగా రైతులు నల్ల చట్టాల రద్దుకు ఉద్యమాన్ని తీవ్రస్థాయిలో కొనసాగిస్తున్న విషయం తెలిసిందే. కొత్త వ్యవసాయ చట్టాలతో తమకు మద్దతు ధర దక్కదని.. వ్యవసాయం కార్పొరేటు పరం అవుతుందనే ఆందోళనతో రైతులు ఉద్యమ బాట పట్టారు. -
Ramdev యూటర్న్: వ్యాక్సిన్ తీసుకుంటా, వారు దేవదూతలు
సాక్షి,న్యూఢిల్లీ: అల్లోపతిపైన, డాక్టర్లపైనా సంచలన వ్యాఖ్యలతో వివాదంలో ఇరుక్కున్న యోగా గురు బాబా రాందేవ్ యూ టర్న్ తీసుకున్నారు. వైద్యులు దేవుని దూతల్లాంటి వారంటూ తాజాగా పేర్కొన్నారు. తన పోరాటం వైద్యులపై కాదు, మాదకద్రవ్యాల మాఫియాకు వ్యతిరేకంగా అంటూ ప్రకటించారు. అంతేకాదు కోవిడ్ వ్యాక్సిన్ వల్ల ఎలాంటి ఉపయోగం లేదని, టీకాలు తీసుకున్న తరువాత కూడా వేలాది మంది వైద్యులు మరణించారంటూ దుమారాన్ని రాజేసిన ఆయన త్వరలోనే తాను కూడా కరోనా వ్యాక్సిన్ తీసుకుంటానని ప్రకటించారు. అలాగే అంతర్జాతీయ యోగా దినోత్సవం అయిన జూన్ 21 నుంచి అందరికీ ఉచిత టీకా అందుబాటులో రావడంపై సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీపై ప్రశంసలు కురిపించారు. శస్త్రచికిత్సలు, అత్యవసర పరిస్థితుల్లో అల్లోపతి విధానం ఉత్తమమైందని చెప్పారు రాందేవ్. తాను భారతీయ వైద్యవ్యవస్థని ద్వేషించడం లేదని తెలిపారు. తన పోరాటం డ్రగ్ మాఫియాపై మాత్రమేనని రాందేవ్ పేర్కొన్నారు. అయితే ప్రాణాంతక ఇతర వ్యాధులు, తీర్చలేని రుగ్మతలు పురాతన పద్ధతుల ద్వారా నయం చేయవచ్చని ఆయుర్వేదంలో ఉందన్నారు. కానీ అవసరమైన మందులు, చికిత్సల పేరుతో ప్రజలను దోపీడీ చేయకూడదని ఆయన హితవు పలికారు. అలాగే ప్రభుత్వం అందిస్తున్న జనరిక్ మెడిసిన్ తక్కువ ధరలకే ప్రజలకు అందుబాటులో ఉంటున్నాయని చెప్పుకొచ్చారు. ప్రతి పౌరుడికి ఉచితంగా టీకాలు వేసేలా మోదీ చారిత్రాత్మక ప్రకటన చేశారనీ, ప్రతి ఒక్కరూ టీకాలు వేయించుకోవాలని కోరారు. యోగా, ఆయుర్వేదాన్ని ప్రజలంతా ఆచరించాలని, వ్యాధుల నివారణలో యోగా రక్షణ కవచంలా ఉంటుందనీ, ముఖ్యంగా కరోనా నుండి యోగా రక్షిస్తుందని రాందేవ్ పేర్కొన్నారు. కాగా వ్యాక్సిన్ సమర్థత, అల్లోపతిని, వైద్యులను కించపరిచేలా రాందేవ్ చేసిన వ్యాఖ్యలపై ఇండియన్ మెడికల్ అసోసియేషన్ మండిపడింది. రాందేవ్‌కు లీగల్ నోటీసు లిచ్చింది. దీంతోపాటు కేంద్ర ఆరోగ్యమంత్రికి, ప్రధానికి లేఖ రాసింది. ఢిల్లీ మెడికల్ అసోసియేషన్ పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన ఢిల్లీ హైకోర్టు విచారణను జూలై 13వ తేదీకి వాయిదా వేసింది. మరోవైపు రాందేవ్‌పై చర్యలు తీసుకోవాల్సిందిగా బుధవారం ఐఎంఎ, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసిఎంఆర్) కు లేఖ రాసిన సంగతి తెలిసిందే. ఈ పరిణామాల నేపథ్యంలో రాందేవ్ తాజా వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. చదవండి : వ్యాక్సిన్లపై రాందేవ్ వివాదాస్పద వ్యాఖ్యలు DRDO: 2-డీజీ డ్రగ్, కీలక నిర్ణయం -
భారత్‌పై ఆక్రోశం? చక్కెర, పత్తికి పాకిస్తాన్లో తిప్పలు
ఇస్లామాబాద్: పక్కనున్న దేశంపై కక్ష సాధింపు చర్యల్లో భాగంగా అవసరమైన వస్తువుల దిగుమతిపై నిషేధం విధించగా తాజాగా మళ్లీ ఎత్తి వేసే ప్రయత్నాలు జరిగాయి. దీనిపై నిన్న మంత్రిమండలి కూడా నిర్ణయం తీసుకుంది. భారత్ నుంచి పత్తి, చక్కెర దిగుమతి చేసుకోవాలని తీర్మానించారు. అయితే ఒకరోజు తిరిగే లోపే ఆ నిర్ణయానికి బ్రేక్ పడింది. దీంతో ప్రధానమంత్రి ఇమ్రాన్‌ఖాన్‌కు చుక్కెదురైంది. భారత్ నుంచి వస్తువుల దిగుమతికి ఆ దేశంలోని జాతీయ సంస్థ నిరాకరించింది. 2019 ఆగస్టులో జమ్మూ కశ్మీర్‌పై తీసుకున్న చర్యలతో పాకిస్తాన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. అప్పటి నుంచి భారత్ నుంచి దిగుమతి చేసుకునే పత్తి, చక్కెర తదితర వస్తువులపై నిషేధం విధించింది. పాకిస్తాన్ మంత్రిమండలి ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ అధ్యక్షతన బుధవారం సమావేశమై భారత్ నుంచి దిగుమతులు పునరుద్ధరించాలని నిర్ణయించింది. ఈ మేరకు పత్తి, చక్కెర దిగుమతులకు తిరిగి అనుమతి ఇవ్వాలని నిర్ణయించారు. అయితే తెల్లారే గురువారం పాకిస్తాన్లో ఆర్థిక సహకార కమిటీ (ఎకనామిక్ కోఆర్డినేషన్ కమిటీ-ఈసీసీ) ఆ నిర్ణయాన్ని వ్యతిరేకించింది. భారత్ నుంచి దిగుమతులు అవసరం లేదని తేల్చి చెప్పింది. అయితే మంత్రిమండలి తీసుకున్న నిర్ణయమే ఫైనలా? లేదా ఆర్థిక కమిటీ నిర్ణయం ఫైనలా అనేది తేలాల్సి ఉంది. భారత్‌ను దూరం చేసుకోవాలనే ఉద్దేశంతో పాక్ వైఖరి ఉంది. పరిస్థితి ఇలాగే కొనసాగితే పాకిస్తాన్లో ఆహార కొరత తీవ్రంగా ఏర్పడే ప్రమాదం ఉంది. ఇప్పటికే చక్కెర, పత్తి కొరత తీవ్రంగా ఉంది. అందుకే వాటిని తిరిగి దిగుమతి చేసుకోవాలని పాకిస్తాన్ ప్రభుత్వం భావిస్తుండగా ఆ నిర్ణయానికి ఆర్థిక కమిటీ నిరాకరించింది. మరి ఇమ్రాన్ ప్రభుత్వం ఏం నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి. -
చిన్మయానంద కేసులో భారీ ట్విస్ట్
లక్నో: కేంద్ర మాజీ మంత్రి స్వామి చిన్మయానంద లైంగిక దాడి కేసు కీలక మలుపు తిరిగింది.. చిన్మయానంద తనపై లైంగిక దాడికి పాల్పడ్డారంటూ గతేడాది ఆరోపించిన లా విద్యార్థిని తాజాగా యూటర్న్ తీసుకుంది. ఆయన తనపై లైంగిక దాడికి పాల్పడలేదని కోర్టు ముందు పేర్కొంది. దాంతోపాటు ఆయనపై పెట్టిన కేసును వెనక్కి తీసుకుంటున్నట్లు తెలిపింది. అయితే ఆమె కేసు వాపస్ తీసుకోవడానికి గల కారణాలు మాత్రం స్పష్టంగా తెలియరాలేదు. షహజాన్‌పూర్‌లో చదువుతున్న లా విద్యార్థిని గతేడాది ఆగస్టులో కనిపించకుండా పోయింది. తరువాత తిరిగి వచ్చిన ఆమె మాజీ మంత్రి చిన్మయానందపై లైంగిక ఆరోపణలు చేసింది. చాలా పోరాటాలు జరిగిన తరువాత గతేడాది సెప్టెంబర్‌లో ఆయనను పోలీసులు అరెస్ట్ చేశారు. అలహాబాద్ హైకోర్టులో ఇద్దరు న్యాయమూర్తులతో కూడిన ప్రత్యేక బ్రాంచ్ ఈ కేసు విచారణను చేపట్టింది. ఫిబ్రవరిలో చిన్మయానంద బెయిల్‌పై బయటకు వచ్చారు. మంగళవారం ఈ కేసు విచారణకు రాగా, చిన్మయానంద తనపై ఎలాంటి లైంగిక దాడికి పాల్పడలేదని విద్యార్థిని కోర్టుకు తెలిపింది. అయితే మాజీ మంత్రి తనపై అత్యాచారానికి పాల్పడ్డాడంటూ గతంలో ఆరోపించిన విద్యార్థిని తాజాగా మాట మార్చడంతో న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. తప్పుడు ఆరోపణలు చేసినందుకు ఆమెపై కేసు నమోదు చేయాలని పోలీసులను ఆదేశిస్తూ తదుపరి విచారణను బుధవారానికి వాయిదా వేసింది. న్యాయ విద్యార్థిని మాట మార్చడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. చదవండి: బెయిల్‌పై వచ్చి ఘనంగా బర్త్‌డే -
దావుద్ విషయంలో పాక్ యూటర్న్
-
బాబు నాలుకకు ఎన్నీ చీలికలో..!
-
యూటర్న్ బాబు