
అక్కినేని ఫ్యామిలీ ప్రస్తుతం ఫుల్ జోష్‌లో ఉన్నట్టు కనిపిస్తోంది. నాగ చైతన్య హీరోగా తెరకెక్కిన ‘శైలజా రెడ్డి అల్లుడు’, సమంత నటించిన ‘యూ టర్న్’ ఒకే రోజున విడుదలైనా.. రెండు సినిమాలు కూడా పాజిటివ్ టాక్ తెచ్చుకుని విజయవంతమయ్యాయి.
ఒకే కుటుంబానికి చెందిన రెండు సినిమాలు ఒకే రోజున విడుదలవ్వడమే అరుదు.. అందులో భార్య, భర్త లీడ్ రోల్స్‌లో నటించిన రెండు వేర్వేరు సినిమాలు రిలీజ్ అవ్వడం ఆశ్చర్యమే. అయినా రెండు సినిమాలు విభిన్న కథాంశాలతో తెరకెక్కడంతో.. రెండు చిత్రాలను ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. ప్రస్తుతం ఈ జంట ఖుషీగా పార్టీ చేసుకుంటున్నట్టుంది. పబ్‌లో ఎంజాయ్ చేస్తూ దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు సమంత. ఈ పార్టీలో అఖిల్ కూడా చిందులేసినట్టున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment