Sailaja Reddy Alludu
-
ఫుల్‌గా ఎంజాయ్ చేస్తున్న చై-సామ్!
అక్కినేని ఫ్యామిలీ ప్రస్తుతం ఫుల్ జోష్‌లో ఉన్నట్టు కనిపిస్తోంది. నాగ చైతన్య హీరోగా తెరకెక్కిన ‘శైలజా రెడ్డి అల్లుడు’, సమంత నటించిన ‘యూ టర్న్’ ఒకే రోజున విడుదలైనా.. రెండు సినిమాలు కూడా పాజిటివ్ టాక్ తెచ్చుకుని విజయవంతమయ్యాయి. ఒకే కుటుంబానికి చెందిన రెండు సినిమాలు ఒకే రోజున విడుదలవ్వడమే అరుదు.. అందులో భార్య, భర్త లీడ్ రోల్స్‌లో నటించిన రెండు వేర్వేరు సినిమాలు రిలీజ్ అవ్వడం ఆశ్చర్యమే. అయినా రెండు సినిమాలు విభిన్న కథాంశాలతో తెరకెక్కడంతో.. రెండు చిత్రాలను ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. ప్రస్తుతం ఈ జంట ఖుషీగా పార్టీ చేసుకుంటున్నట్టుంది. పబ్‌లో ఎంజాయ్ చేస్తూ దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు సమంత. ఈ పార్టీలో అఖిల్ కూడా చిందులేసినట్టున్నాడు. -
బాలనటి నుంచి శైలజారెడ్డి కూతురి వరకు
బాలనటిగా చిత్రసీమలోకి అడుగుపెట్టిన అను ఇమ్మాన్యుయేల్ మలయాళ చిత్రం ‘యాక్షన్ హీరో బిజూ’తో హీరోయిన్ అయింది. మజ్ను, కిట్టుగాడు ఉన్నాడు జాగ్రత్త, ఆక్సిజన్, అజ్ఞాతవాసి, శైలాజారెడ్డి అల్లుడు... చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన అను అంతరంగ తరంగాలు... ►మనం ఎప్పుడూ ఒకేలా ఉండమనే విషయాన్ని బలంగా నమ్ముతాను. రకరకాల అనుభవాలు మనల్ని ఆకర్షణీయంగా తీర్చుదిద్దుతాయి. రెండు సంవత్సరాల క్రితం వరకు తెలుగులో నా డైలాగులను నేను చెప్పుకోవడం కష్టంగా ఉండేది. ఇప్పుడు అలాంటి కష్టం లేదు. త్వరలో తెలుగును ధారాళంగా మాట్లాడగలననే నమ్మకం ఉంది. ►నటన నా జీవితాన్నే మార్చేసింది. ఒకప్పుడు ఇతరుల మీద ఎక్కువగా ఆధారపడేదాన్ని. ఇప్పుడు నా పనులు నేనే సొంతంగా చేసుకోగలుగుతున్నాను. ‘శైలజారెడ్డి అల్లుడు’లో పొగరున్న యువతిగా నటించాను. నిజజీవితంలో కూడా నాకు పొగరు ఉంది. అయితే దాన్ని నేను ‘హెల్తీ ఇగో’ అంటాను. నాకే కాదు ప్రతి ఒక్కరికీ ఇది ఉండాలి. ►వేరే కథానాయికతో కలిసి పనిచేయడం వల్ల నేనేమీ ‘అభద్రత’కు గురికాను. మన గురించి మనకు స్పష్టత లేనప్పుడే అభద్రతాభావన ముందుకొస్తుంది. నేను నటించే సినిమా ఏమిటో దానిలో నా పాత్ర ఏమిటో నాకు స్పష్టంగా తెలుసుకాబట్టి అభద్రత అనే సమస్యే ఎదురుకాదు. ►పాత్రలో ఎంత దమ్ము ఉంది, ఎంత గొప్పగా ఉంది అనేది విషయం కాదు. సినిమా ఆడకపోతే మన కష్టం, ప్రతిభ కనిపించకపోవచ్చు. అంతమాత్రాన యాంత్రికంగా నటించలేము కదా! ఫలితం ఎలా ఉన్నా ప్రయత్నలోపం ఉండకూడదని నమ్ముతాను. నా పాత్ర అద్భుతంగా ఉండటం వల్ల సినిమా ఆడదు... సినిమా అనేది రకరకాల పాత్రల ప్యాకేజీ. ►నటి అన్నాక కమర్షియల్ సినిమాలతో పాటు నటనకు ఆస్కారం ఉన్న నాన్ కమర్షియల్ సినిమాలు కూడా చేయాలి. అయితే కెరీర్ నిర్మాణదశలో ప్రయోగాత్మక చిత్రాలు, పాత్రలకు దూరంగా ఉండాలనుకుంటున్నాను. కొన్ని అవకాశాలు అనుకోకుండా తలుపుతట్టి ఎక్కడికో తీసుకువెళతాయి. ‘మహానటి’లాంటి సినిమా చేయాలని ఉంది. ►జయాపజయాలు మన అధీనంలో ఉండవు. కాబట్టి ఫెయిల్యూర్స్ గురించి అతిగా ఆలోచించను. కెరీర్ ప్రారంభంలో సహజంగానే కొన్ని తప్పులు చేస్తాం. నేను అలాగే చేశాను. అంతమాత్రాన ‘ఇక అంతా అయిపోయింది’ అని డీలాపడే మనిషిని కాదు. ఇండస్ట్రీలో పోటీ గురించి చెప్పాలంటే, మెడికల్ ఎంట్రన్స్లాంటి పోటీ కాకపోయినా పోటీ అనేది ఉండాలి. అలా ఉంటే మరింత మెరుగవుతాం. -
గురువారం గుమ్మడికాయ
ఈ నెలలో ‘శైలజారెడ్డి అల్లుడి’గా ప్రేక్షకులను మెప్పించిన నాగచైతన్య తన నెక్ట్స్ చిత్రం ‘సవ్యసాచి’ సినిమా షూటింగ్‌ను కంప్లీట్ చేసే పనిలో బిజీగా ఉన్నారు. చందూ మొండేటి దర్శకత్వంలో నాగచైతన్య హీరోగా నవీన్ ఎర్నేని, చెరుకూరి మోహన్, వై. రవిశంకర్ నిర్మిస్తున్న సినిమా ‘సవ్యసాచి’. ఇందులో నిధీ అగర్వాల్ కథానాయిక. భూమిక, మాధవన్ కీలక పాత్రలు చేశారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్‌లో జరుగుతోంది. నిజానికి ఈ మూవీ మేజర్ పార్ట్ షూటింగ్ పూర్తయింది. ప్రస్తుతం చిన్న ప్యాచ్‌వర్క్ కోసం షూటింగ్ జరుపుతున్నారు. ఇది కూడా రేపటితో పూర్తి అవుతుంది. దీంతో ఈ గురువారం గుమ్మడికాయ కొడతారు ‘సవ్యసాచి’టీమ్. అన్నట్లు ఇంకో మాట... ఈ సినిమా కోసం ‘అల్లరి అల్లుడు’లో నాగార్జున, రమ్యకృష్ణ చేసిన ‘నిన్ను రోడ్డుమీద చూసినది లగాయితు’ అనే సాంగ్‌ను రీమిక్స్ చేసిన సంగతి తెలిసిందే. ఈ పాటను నాగచైతన్య, నిధీ అగర్వాల్‌పై చిత్రీకరించారు. ఈ చిత్రం నవంబర్ 2న రిలీజ్ కానుంది. ఇదిలా ఉంటే శివ నిర్వాణ దర్శకత్వంలో నాగచైతన్య, సమంత జంటగా నటించనున్న చిత్రం అక్టోబర్ 6న ఆరంభం కానుందట. -
మూడు రోజుల్లో 23 కోట్లు.. నేను నమ్మలేకపోయా!
‘‘శైలజారెడ్డి అల్లుడు’ సినిమాకి మంచి ఓపెనింగ్స్ ఇచ్చి, ఆదరిస్తున్న ప్రేక్షకులకు ప్రత్యేక ధన్యవాదాలు. మా సినిమా కలెక్షన్స్ గురించి చెప్పినప్పుడు ముందు నమ్మలేకపోయా. ముఖ్యంగా మౌత్ టాక్ని చాలా పాజిటివ్‌గా స్ప్రెడ్ చేసిన వారికి, చేస్తున్నవారికి థ్యాంక్స్’’ అని నాగచైతన్య అన్నారు. ఆయన హీరోగా, అనూ ఇమ్మాన్యుయేల్ హీరోయిన్గా మారుతి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘శైలజారెడ్డి అల్లుడు’. రమ్యకృష్ణ, నరేశ్, పృథ్వీ ఇతర పాత్రల్లో నటించారు. ఎస్.రాధాకృష్ణ (చినబాబు) సమర్పణలో నాగవంశీ. ఎస్, పీడీవీ ప్రసాద్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 13న విడుదలైంది. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా తొలిరోజు 12 కోట్ల రూపాయలు వసూలు చేయగా, మూడు రోజులకి దాదాపు 23 కోట్లు వసూలు చేసిందని చిత్రబృందం పేర్కొంది. ఈ సందర్భంగా నిర్వహించిన థ్యాంక్స్ మీట్లో నాగచైతన్య మాట్లాడుతూ– ‘‘ఈ చిత్రంలో నా లుక్ చాలా ఫ్రెష్‌గా, డిఫరెంట్‌గా, బాడీ లాంగ్వేజ్ చాలా ఎనర్జిటిక్‌గా ఉందని అంటున్నారు. ఒక యాక్టర్‌కి ఇవే బెస్ట్ కాంప్లిమెంట్స్. థ్యాంక్యూ మారుతిగారు. అప్పుడు ‘ప్రేమమ్’, ఇప్పుడు ‘శైలజారెడ్డి అల్లుడు’ చిత్రాలతో హిట్స్ ఇచ్చిన నిర్మాతలకు థ్యాంక్స్’’ అన్నారు. ‘‘శైలజారెడ్డి అల్లుడ్ని తెలుగు ప్రేక్షకులు సొంత అల్లుyì లా ఆదరిస్తున్నారు. ఈ చిత్రం వసూళ్లు మాకు చాలా ఆనందాన్ని, ఎనర్జీని ఇచ్చాయి. నా గత చిత్రాల కంటే ఈ చిత్రం బాగుందని ఫోన్లు చేస్తున్నారు’’ అన్నారు మారుతి. ‘‘ఈ సక్సెస్ మీట్‌కి కారణం ప్రేక్షకులే. వారికి థ్యాంక్స్’’ అన్నారు అనూ ఇమ్మాన్యుయేల్. నటులు నరేశ్, పృథ్వీ, సినిమాటోగ్రాఫర్ నిజార్ షఫి తదితరులు పాల్గొన్నారు. -
‘కలెక్షన్లు చెప్పినప్పుడు నమ్మలేకపోయాను’
సాక్షి, హైదరాబాద్: అక్కినేని యంగ్ హీరో నాగ చైతన్య, అను ఇమ్మాన్యూల్ జంటగా డైరక్టర్ మారుతి తెరకెక్కించిన శైలజా రెడ్డి అల్లుడు బాక్సాఫీస్ వద్ద కలక్షన్ల వర్షం కురిపిస్తోంది. వినాయక చవితికి ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం మూడు రోజుల్లో దాదాపు 23 కోట్ల రూపాయలు వసూలు చేసింది. ఇందుకు సంబంధించి చిత్ర బృందం పీపుల్స్ బ్లాక్‌బస్టర్ పేరిట పోస్టర్‌ను రిలీజ్ చేశారు. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ నిర్మించిన ఈ చిత్రం విడుదలైన తొలి రోజు నుంచే పాజిటివ్ టాక్‌తో దూసుకెళుతోంది. చిత్ర విజయాన్ని పురస్కరించుకుని చిత్ర యూనిట్ శనివారం థ్యాంక్స్ మీట్ ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమంలో నాగ చైతన్య మాట్లాడుతూ.. శైలజా రెడ్డి చిత్రాన్ని ఘనవిజయం చేసినందుకు ప్రేక్షకులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. మొదట సినిమా కలెక్షన్లు చెప్పినప్పుడు నమ్మలేకపోయానని అన్నారు. ఈ సినిమాకు నాకు చాలా కాంప్లిమెంట్స్ వచ్చాయని.. అందుకు మారుతికి థ్యాంక్యూ చెప్పాలని అన్నారు. ఈ సినిమాలో పృథ్వీరాజ్ నటనకు చాలా మంచి కామెంట్స్ వస్తున్నాయని పేర్కొన్నారు. దర్శకుడు మారుతి మాట్లాడుతూ.. శైలజా రెడ్డి చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులు వాళ్ల సొంతింటి అల్లుడిలా ఆదరిస్తున్నారని తెలిపారు. ఈ సినిమా కలెక్షన్లు మాకు చాలా ఆనందాన్ని ఇచ్చాయని.. అక్కినేని ఫ్యాన్స్ తనకు సూపర్ ఎనర్జీ ఇచ్చారని వెల్లడించారు. నాగ చైతన్య, అను, రమ్యకృష్ణ లకు స్పెషల్ థ్యాంక్స్ తెలిపారు. ఈ సినిమా బాగుందని ఫ్యామిలీల నుంచి ఫోన్లు వస్తున్నాయని అన్నారు. చిత్రంలో నటించిన ప్రతి ఒక్కరికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. అను మాట్లాడుతూ.. ముందు ప్రేక్షకులకు థ్యాంక్స్ చెప్పాలని అన్నారు. మారుతికి, నాగచైతన్యకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. సినిమా చూడని వాళ్లు థియేటర్ వెళ్లి తప్పక సినిమా చూడండి అని కోరారు. ఇంకా ఈ కార్యక్రమంలో నరేష్, పృథ్వీ, సినిమాటోగ్రాఫర్ నిజార్ షఫీ, నాగవంశీ పాల్గొన్నారు. -
అలరిస్తున్న అల్లుడు
-
‘శైలజారెడ్డి అల్లుడు’ మూవీ సక్సెస్ మీట్
-
నాగ్ సినిమాలో చైతూ హీరోయిన్..!
కింగ్ నాగార్జున డిఫరెంట్ రోల్స్‌కు, మల్టీస్టారర్ సినిమాలకు సై అంటున్నారు. తాజాగా నానితో కలిసి దేవదాస్ సినిమాలోనటిస్తున్న నాగ్, త్వరలో ఓ తమిళ మల్టీస్టారర్‌లో నటించేందుకు ఓకె చెప్పారు. పవర్‌పాండి సినిమాతో కోలీవుడ్‌లో దర్శకుడిగా సక్సెస్ సాధించిన ధనుష్ త్వరలో ఓ మల్టీస్టారర్ సినిమాలో నటిస్తూ దర్శకత్వం వహించనున్నారు. ఈ సినిమాలో మరో హీరోగా టాలీవుడ్ మన్మథుడు నాగార్జున నటిస్తున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ తేనాండళ్ ఫిలింస్ నిర్మిస్తున్న ఈ సినిమాలో ఒక హీరోయిన్ గా అదితిరావ్ హైదరీని ఫైనల్ చేయగా మరో హీరోయిన్ పాత్రకు అను ఇమ్మాన్యూల్ను తీసుకున్నట్టుగా తెలుస్తోంది. తాజాగా నాగచైతన్య సరసన శైలజా రెడ్డి అల్లుడు సినిమాలో నటించిన అను, వెంటనే నాగ్ సినిమాలో ఛాన్స్ కొట్టేశారు. శరత్ కుమార్, ఎస్జే సూర్యలు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాకు పవర్ పాండి ఫేం సీన్ రోనాల్డ్ సంగీతమందిస్తున్నారు. -
అవే నన్ను నిలబెట్టాయి
‘‘నేను చేసిన వెరైటీ రోల్స్ మాత్రమే నన్ను ఇలా నిలబెట్టాయి. అలాంటివి చేస్తూనే ఉంటాను. ‘శైలజా రెడ్డి అల్లుడు’ రెగ్యులర్‌గా కనిపించే అత్తా, అల్లుళ్లు కామెడీ మూవీలా ఉండదు. చూస్తే కచ్చితంగా సర్ప్రైజ్ అవుతారు. ఇందులో కొత్త అత్త, కొత్త అల్లుణ్ని చూస్తారు’’ అని రమ్యకృష్ణ అన్నారు. నాగ చైతన్య, అనూ ఇమ్మాన్యుయేల్ జంటగా మారుతి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘శైలజా రెడ్డి అల్లుడు’. పీడీవీ ప్రసాద్, నాగవంశీ నిర్మించారు. ఈ సినిమా గురువారం రిలీజైంది. మంచి ఓపెనింగ్స్ సాధించిందని చిత్రబృందం పేర్కొంది. ఈరోజు తన పుట్టిన రోజు సందర్భంగా రమ్యకృష్ణ సినిమా విశేషాలు పంచుకుంటూ – ‘‘నా బర్త్‌డే టైమ్‌లో రిలీజైన మా చిత్రం సూపర్ హిట్ అవ్వడం చాలా హ్యాపీగా ఉంది. అందరం జెన్యూన్‌గా కష్టపడ్డాం. ఇందులో మారుతిగారు నా కోసం రెండు షేడ్స్ ఉన్న పాత్ర రాశారు. చాలా స్పీడ్‌గా వర్క్ చేస్తారాయన. నా కెరీర్లో ఫాస్ట్‌గా కంప్లీట్ చేసిన మూవీ ఇదే. కామెడీ సీన్స్ మధ్యలో ఆపేసి మరీ నవ్వేవాళ్లం. నా చుట్టూ కామెడీ జరుగుతుంటే సీరియస్‌గా ఉండటం కష్టంగా అనిపించేది. చైతన్య వెరీ డౌన్ టు ఎర్త్. యాక్టర్‌గా చాలా బాగా ఎదుగుతున్నాడు. నన్ను కన్విన్స్ చేసే సీన్లో బాగా యాక్ట్ చేశాడు. -
‘అల్లుడు’ వసూళ్లు అదరగొడుతున్నాడు
నాగ చైతన్య మంచి జోష్‌లో ఉన్నాడని తెలుస్తోంది. ‘శైలజా రెడ్డి అల్లుడు’తో ఈ వినాయక చవితికి ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి విజయాన్ని అందుకున్నాడు. ఇక ఈ సినిమా పాజిటివ్ టాక్‌తో దూసుకెళ్లడంతో సంతోషంగా ఉన్నట్టున్నాడు. మారుతి స్టైల్లో తెరకెక్కిన ఈ కమర్షియల్ ఎంటర్టైనర్ బాగానే వర్కౌట్ అయినట్టు కనిపిస్తోంది. ఈ సినిమా తొలిరోజే పన్నెండు కోట్ల గ్రాస్‌ను కలెక్ట్ చేసింది. తన సినిమా కెరీర్లో హయ్యస్ట్ ఓపెనర్‌గా ఈ చిత్రం నిలిచింది. నాగ చైతన్య కెరీర్లో బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచేలా ఉంది ఈ చిత్రం. ఈ మూవీలో రమ్యకృష్ణ, అను ఇమాన్యుయేల్, మురళీ శర్మ, నరేష్ కీలకపాత్రల్లో నటించారు. ఇక ఈ యువ హీరో తన తదుపరి ప్రాజెక్ట్ ‘సవ్యసాచి’తో ప్రేక్షకులను పలకరించేందుకు సిద్దంగా ఉన్నట్లు తెలుస్తోంది. #ShailajaReddyAlludu scores 12 Crores gross worldwide on its day 1, Highest ever in @chay_akkineni 's career, Thanks to all for the phenomenal response 🙏 Book Your Tickets Now: https://t.co/l2Jw77hHje https://t.co/ddkMF6fRty @directormaruthi @itsanuemmanuel @vamsi84 pic.twitter.com/LSddrkrpHU — Sithara Entertainments (@SitharaEnts) September 14, 2018 -
‘శైలజా రెడ్డి అల్లుడు’ మూవీ రివ్యూ
టైటిల్ : శైలజా రెడ్డి అల్లుడు జానర్ : రొమాంటిక్ యాక్షన్ కామెడీ తారాగణం : నాగచైతన్య, రమ్యకృష్ణ, అను ఇమ్మాన్యూల్, మురళీ శర్మ, నరేష్, వెన్నెల కిశోర్ సంగీతం : గోపి సుందర్ దర్శకత్వం : మారుతి దాసరి నిర్మాత : ఎస్ రాధకృష్ణ, నాగవంశీ ఎస్, పీడీవీ ప్రసాద్ వరుస విజయాలతో సూపర్ ఫాంలో ఉన్న యువ దర్శకుడు మారుతి, అక్కినేని యంగ్ హీరో నాగచైతన్య కాంబినేషన్లో తెరకెక్కిన సినిమా శైలజా రెడ్డి అల్లుడు. తెలుగు తెర ఒకప్పుడు సూపర్ హిట్ అయిన అత్త సెంటిమెంట్‌ను మరోసారి రిపీట్ చేస్తూ తెరకెక్కించిన ఈ సినిమాలో అత్త పాత్రలో రమ్యకృష్ణ నటించారు. మరి హిట్ ఫార్ములా నాగచైతన్య కెరీర్లో మరో హిట్‌గా నిలిచిందా..? రమ్యకృష్ణ అత్త పాత్రలో ఏమేరకు ఆకట్టుకున్నారు..? మారుతి తన సక్సెస్ ట్రాక్‌ను కంటిన్యూ చేశారా..? కథ : చైతన్య (నాగ చైతన్య ) భయంకరమైన ఈగో ఉన్న సక్సెస్ఫుల్ బిజినెస్మెన్ రావు(మురళీ శర్మ) కొడుకు. తన ఈగో కోసం కూతురు పెళ్లిని కూడా క్యాన్సిల్ చేసుకునేంత ఈగో రావుది. తన కాలనీ లోకి కొత్తగా వచ్చిన అను(అను ఇమ్మాన్యూల్) అనే అమ్మాయి తొలిచూపులోనే ఇష్టపడతాడు చైతూ.. అనుకి కూడా తన తండ్రిలాగే భరించలేనంత ఈగో ఉందని తెలిసి పని మనిషిని ప్రేమిస్తున్నట్లుగా నాటకమాడి అనుని ప్రేమలోకి దించుతాడు. అనుకి కూడా తనలాగే ఈగో ఎక్కువ అని తెలుసుకున్న రావు.. చైతన్య, అనుల పెళ్లికి ఒప్పుకుంటాడు. కానీ అనుకోని పరిస్థితుల్లో ఫ్యామిలీ ఫంక్షన్లో అను పర్మిషన్ లేకుండా ఎంగేజ్మెంట్ కూడా చేసేస్తాడు. (సాక్షి రివ్యూస్) కానీ అదే సమయంలో అను.. వరంగల్ జిల్లాను శాసించే శైలజా రెడ్డి(రమ్యకృష్ణ) కూతురు అని తెలుస్తోంది. తనకి తెలియకుండా ఏది జరగడానికి ఇష్టపడని శైలజా రెడ్డి... చైతన్య, అనుల పెళ్లికి ఒప్పుకుందా..? ఈగోని పక్కన పెట్టి శైలజా రెడ్డి, రావు.. చైతన్య, అనుల పెళ్లికి ఒప్పుకున్నారా? అన్నదే మిగతా కథ. నటీనటులు సినిమాలో తెర నిండా నటులు ఉన్నా సినిమా అంతా ముఖ్యంగా నాగచైతన్య, రమ్యకృష్ణ, అను ఇమ్మాన్యూల్ల చుట్టూనే తిరుగుతుంది. కాబోయే అత్త, ప్రియురాలి మధ్య నలిగిపోయే పాత్రలో నాగ చైతన్య మంచి నటన కనబరిచాడు. గత చిత్రాలతో పోలిస్తే నటుడిగా మంచి పరిణతి కనబరిచాడు. కామెడీ టైమింగ్‌తోనూ ఆకట్టుకున్నాడు. కమర్షియల్ ఫార్మాట్ సినిమా కావటంతో డ్యాన్సులు, ఫైట్స్‌కు కూడా మంచి అవకాశం దక్కింది. ఇక కీలకమైన అత్త పాత్రలో రమ్యకృష్ణ మరోసారి విశ్వరూపం చూపించారు. భరించలేనంత ఈగోతో అందరినీ ఇబ్బంది పెట్టే పాత్రలో రమ్యకృష్ణ నటన అందరిని అలరిస్తుంది. (సాక్షి రివ్యూస్) సెకండాఫ్‌లో ఎంట్రీ ఇచ్చినా అందరినీ డామినేట్ చేసేశారు. ఎమోషనల్ సీన్స్‌లోనూ తన ఎక్స్‌పీరియన్స్‌ను చూపించారు. ఈగో విషయంలో అమ్మతో తలపడే పాత్రలో అను ఇమ్మాన్యూల్ ఆకట్టుకున్నారు. రమ్యకృష్ణతో పోటి పడి నటించే సీన్స్‌లో కాస్త తేలిపోయినట్టుగా అనిపించినా.. గ్లామర్ తో ఆకట్టుకున్నారు. ఫస్ట్ హాఫ్‌లో మురళీ శర్మ కూడా రమ్యకృష్ణ రేంజ్లో ఈగో చూపించారు. హీరోయిన్ తండ్రిగా నరేష్ మరోసారి తనదైన నటనతో మెప్పించారు. వెన్నెల కిశోర్, 30 ఇయర్స్ పృథ్వీ కామెడీతో కడుపుబ్బా నవ్వించారు. విశ్లేషణ గత చిత్రాల్లో హీరోలకు డిఫెక్ట్ చూపించిన దర్శకుడు మారుతి ఈ సినిమాలో లేడి క్యారెక్టర్స్ కు కూడా డిఫెక్ట్ ను యాడ్ చేశాడు. విపరీతమైన ఈగోతో అందరిని ఇబ్బందులు పెట్టే అత్త పాత్రను అద్భుతంగా డిజైన్ చేశాడు. గత చిత్రాల విషయంలో కామెడీ మీదే ఎక్కువగా దృష్టి పెట్టిన మారుతి ఈ సినిమాను పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్గా మలిచాడు. తొలి భాగం హీరో హీరోయిన్ల లవ్ స్టోరి, రొమాటింక్ సీన్స్‌తో సాగదీసిన దర్శకుడు.. కామెడీతో ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు. (సాక్షి రివ్యూస్) ద్వితీయార్థంలోనూ కామెడీ కంటిన్యూ చేస్తూ యాక్షన్, ఎమోషనల్ సీన్స్‌తో ఫ్యామిలీ ఆడియన్స్‌ను మెప్పించే ప్రయత్నం చేశాడు. అయితే సినిమా అంతా 90లలో వచ్చిన కమర్షియల్ ఫార్ములా సినిమాలను గుర్తు చేస్తుంది. సినిమాకు మరో మేజర్ ప్లస్ పాయింట్ కామెడీ. మారుతి తన మార్క్ కామెడీతో కడుపుబ్బా నవ్వించాడు. క్లైమాక్స్‌లో శైలజ రెడ్డి, రావు మనసు మార్చుకొని పెళ్లికి ఒప్పుకునే సన్నివేశం అంత కన్విన్సింగ్‌గా అనిపించదు. గోపిసుందర్ తన ట్యూన్స్‌తో మరోసారి మ్యాజిక్ చేశాడు. టైటిల్ సాంగ్ తో పాటు అనుబేబి, ఎగిరే పాటలు విజువల్‌గా కూడా బాగున్నాయి. సినిమాటోగ్రఫి, ఎడిటింగ్, నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి. ప్లస్ పాయింట్స్ : నాగచైతన్య, రమ్యకృష్ణ నటన కామెడీ మైనస్ పాయింట్స్ : పాత కథ రొటీన్ టేకింగ్ - సతీష్ రెడ్డి జడ్డా, ఇంటర్నెట్ డెస్క్. -
‘యువసామ్రాట్’ వద్దన్నా
‘‘సక్సెస్ విషయంలో చిన్న సినిమాలు పెద్ద సినిమాలు అవుతున్నాయి. పెద్ద సినిమాలు చిన్నవి అవుతున్నాయి. కథ ముఖ్యం. సినిమా సక్సెస్ అనేది కేవలం హీరో, డైరెక్టర్‌దే కాదు. ఆ సినిమాకి చేసిన ఇతర యాక్టర్స్, టెక్నీషియన్స్కూ చెందుతుంది’’ అన్నారు నాగచైతన్య. మారుతి దర్శకత్వంలో నాగచైతన్య, అనూ ఇమ్మాన్యుయేల్ జంటగా ఎస్. రాధాకృష్ణ సమర్పణలో నాగవంశీ, పీడీవీ ప్రసాద్ నిర్మించిన సినిమా ‘శైలజారెడ్డి అల్లుడు’. ఈ సినిమా నేడు విడుదలవుతున్న సందర్భంగా నాగచైతన్య చెప్పిన విశేషాలు. ► ఈ సినిమాలో ఈగో లేని హీరో క్యారెక్టర్ చేశాను. కానీ, నా చుట్టూ ఉన్న క్యారెక్టర్స్ ఫుల్‌గా ఈగో ఫీల్ అవుతాయి. అప్పుడు హీరో ఏం చేశాడు? అనేది ఆసక్తికరం. అనవసర ఈగో వల్ల వచ్చే సమస్యలు, రిలేషన్ బ్రేక్ అయ్యే పరిస్థితులను సినిమాలో చూపించాం. క్లైమాక్స్‌లో మంచి ఎమోషనల్ డ్రామా ఉంది. నాకు, ‘వెన్నెల’ కిశోర్ మధ్య ఉన్న సన్నివేశాలు ప్రేక్షకులను నవ్విస్తాయి. నా దృష్టిలో ఒక బ్యాలెన్సింగ్ కోణంలో ఈగో కరెక్టే అనిపిస్తుంది. కానీ, అది పక్కవారిని ఇబ్బంది పెట్టేలా ఉండకూడదు. ఈ సినిమాతో ఆడియన్స్‌కు మరింత చేరువ అవుతాను. ► మారుతీగారు ‘బాబు బంగారం’ సినిమా చేస్తున్నప్పుడు నేను ‘ప్రేమమ్’ చేస్తున్నాను. అప్పుడు ఆయనతో పరిచయం అయ్యింది. అలా ఈ సినిమా ప్రారంభానికి బీజం పడింది. నిర్మాత రాధాకృష్ణగారి జడ్జిమెంట్ బాగుంటుంది. అలాంటి ప్రొడ్యూసర్స్ ఇండస్ట్రీకి కావాలి. నాన్నగారితో రమ్యకృష్ణగారు చాలా సినిమాలు చేశారు. ఈ సినిమా బిగినింగ్‌లో రమ్యకృష్ణగారితో కలిసి వర్క్ చేయడం కాస్త నెర్వస్‌గా అనిపించింది. ► ఒక సినిమా రిలీజ్ డేట్ మార్చడం కరెక్ట్ కాదన్నదే నా అభిప్రాయం. కానీ తప్పనిసరి పరిస్థితుల్లో ‘శైలజారెడ్డి అల్లుడు’ రిలీజ్ డేట్ మార్చాల్సి వచ్చింది. సమంత ‘యు టర్న్’, నా సినిమా ఒకేసారి వస్తాయనుకోలేదు. నిజానికి వాళ్లే ముందు డేట్ ఫిక్స్ చేసుకున్నారు. మా సినిమా, మీ ‘యు టర్న్’తో పాటు వస్తుందని సమంతతో చెప్పినప్పుడు ఇంట్లో ఓ డిఫరెంట్ ఎక్స్ప్రెషన్ ఇచ్చింది. మా ఇద్దరి సినిమాల్లో ఏది సక్సెస్ కావాలంటే.. రెండూ సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను. ► యువసామ్రాట్ ట్యాగ్ వద్దని మారుతిగారికి చెప్పాను. కానీ వినలేదు. ఈ ట్యాగ్‌ను పెద్ద బాధ్యతగా ఫీల్ అవుతున్నాను. సోషల్ మీడియాలో ఫ్యాన్స్ కామెంట్స్ చదువుతాను. నెగటివ్ కామెంట్స్‌ను పాజిటివ్‌గానే తీసుకుంటాను. నా మీద ప్రేమతోనే వాళ్లు అలా స్పందిస్తున్నారనుకుంటున్నా. ► ‘సవ్యసాచి’ సినిమాలో ఒక సాంగ్ బ్యాలెన్స్ ఉంది. నవంబర్‌లో రిలీజ్ చేస్తున్నాం. శివనిర్వాణ డైరెక్షన్లో చేయబోతున్న సినిమా అక్టోబర్ ఫస్ట్ వీక్‌లో, ‘వెంకీమామ’ సినిమా అక్టోబర్ ఎండింగ్లో స్టార్ట్ అవుతాయి. ► నాన్నగారి కోసం (నాగార్జున) రాహుల్ రవీంద్రన్ ఓ కథ రెడీ చేస్తున్నాడు. అలాగే ‘బంగార్రాజు’ సినిమాలో నాన్నగారితో కలిసి యాక్ట్ చేసేది నేనా? అఖిలా? అనేది త్వరలో తెలుస్తుంది. డిజిటల్ మీడియా వైపు మా బ్యానర్ ఫోకస్ పెట్టింది. కొన్ని వెబ్ సిరీస్‌లు ప్లాన్ చేస్తున్నాం. ► కొత్త డైరెక్టర్స్‌ను ప్రోత్సహించడం ఇష్టమే. ఆల్రెడీ కొన్ని సినిమాలు చేశాను కూడా. కొన్ని వర్కౌట్ కాలేదు. అయితే ఒకరిని వేలెత్తి చూపే మనస్తత్వం కాదు నాది. నా జడ్జిమెంట్ కూడా తప్పు అయ్యుండవచ్చు. ఇప్పటివరకు నేను చేసిన సినిమాల్లో కెల్లా ‘ప్రేమమ్’కు బాగా కనెక్ట్ అయ్యాను. ► పెళ్లి తర్వాత లైఫ్ బాగుంది. పెళ్లి తర్వాత సమంతకు కెరీర్ ఎలా ఉంటుందో అని భయపడ్డాను. కానీ, ఆమె కెరీర్ సూపర్‌గా సాగడం హ్యాపీగా ఉంది. ► కెరీర్ పరంగా యాక్టర్స్ అందరికీ థ్రెట్ ఉంటుంది. అందరూ మంచి సినిమాలే చేయాలనుకుంటారు. ఇలాంటి పోటీ వాతావరణం మంచిదే. మంచి సినిమాలు ప్రేక్షకుల ముందుకు వస్తాయి. ‘అర్జున్ రెడ్డి’, ‘ఆర్ ఎక్స్ 100’... సినిమాలకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది. నేనీ టైప్ సినిమాలు చేయాలంటే కాస్త టైమ్ పడుతుంది. -
‘నా కెరీర్లో అవే చెత్త సినిమాలు’
వినాయక చవితి సందర్భంగా శైలజా రెడ్డి అల్లుడుగా ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నాడు యంగ్ హీరో నాగ చైతన్య. గతంలో ఎన్నడూ లేనంతగా ఈ సినిమా ప్రమోషన్లో పాలు పంచుకుంటున్నాడు చైతూ. తాజాగా మీడియాకు ఇచ్చిన ఇంటర్య్వూలో పలు ఆసక్తికర అంశాలను వెల్లడించారు. ఈ సందర్భంగా తన కెరీర్లో తనకు బాగా నచ్చిన నచ్చని సినిమాలు వెల్లడించాడు చైతూ. ప్రేమమ్ తన కెరీర్లోనే బెస్ట్ సినిమా అన్న నాగచైతన్య.. దడ, బెజవాడ సినిమాలు చెత్త సినిమాలన్నాడు. ఆ సినిమాలు చేసినందుకు ఇప్పటికీ బాధపడుతున్నానని తెలిపారు. మారుతి దర్శకత్వంలో తెరకెక్కిన శైలజా రెడ్డి అల్లుడు రేపు (13-09-2018) రిలీజ్ అవుతోంది. రమ్యకృష్ణ అత్తగా నటించిన ఈ సినిమాలో అను ఇమ్మాన్యూల్ హీరోయిన్గా నటించారు. -
కేటీఆర్‌పై నాగ చైతన్య కామెంట్!
‘శైలజా రెడ్డి అల్లుడు’ సినిమాతో సందడి చేసేందుకు రెడీ అయ్యాడు నాగచైతన్య. ఇప్పటికే ఈ సినిమాలోని పాటలు, టీజర్, ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. మారుతి స్టైల్ టేకింగ్‌లో తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్దంగా ఉంది. ఈ చిత్రం ప్రమోషన్లో భాగంగా అభిమానులతో ముచ్చటించేందుకు సోషల్‌మీడియాలో ఆన్‌లైన్‌లోకి వచ్చాడు ఈ యువ హీరో. అభిమానుల ప్రశ్నల తాకిడికి కూల్‌గా సమాధానమిచ్చాడు. ఈ సినిమాలో తనకు నచ్చిన పాటలు, రాబోయో తన ప్రాజెక్ట్‌ల గురించి, అజిత్, రామ్‌చరణ్, ప్రభాస్ ఇలా హీరోలందరి గురించి తన అభిప్రాయాన్ని తెలపమని నాగచైతన్యను అడిగారు. ఇక దీంట్లో భాగంగా కేటీఆర్ గురించి అడగ్గా.. ఆయనొక నిజమైన లీడర్.. ప్రభావితం చేయగల నాయకుడంటూ బదులిచ్చారు. ప్రభాస్ గురించి అడగ్గా.. లార్జర్ దెన్ లైఫ్ అని, రామ్ చరణ్‌పై స్పందిస్తూ.. సినిమా సినిమాకు బెటర్ అవుతూ ఉంటున్నాడు..అతని స్టైల్ ఇష్టమని సమాధానమిచ్చాడు. వెంకటేష్, రకుల్ ప్రీత్ సింగ్, మహేష్ బాబు, నాగార్జునలకు సంబంధించిన ప్రశ్నలు అభిమానులు అడిగారు. నాగ చైతన్య, అను ఇమ్మాన్యుయేల్, రమ్యకృష్ణ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న శైలజా రెడ్డి అల్లుడు సెప్టెంబర్ 13న విడుదల కానుంది. -
నా నడక భారతీయ స్త్రీల మాదిరి ఉండదు..
సినిమా: నా నడకే ఒక కిక్కు అంటోంది నటి అను ఇమ్మానుయేల్. ఏంటీ అంత సీన్ లేదు అని అనుకుంటున్నారా? మీరేమైనా అనుకోండి నా స్టైలే వేరు అంటోంది ఈ అమ్మడు. అన్నట్టు ఈమె చికాగో బ్యూటీ అన్న విషయం ఎందరికి తెలుసు? అయితే మాలీవుడ్‌కు బాల నటిగా కాలు పెట్టి, అక్కడే కథానాయకిగా కూడా నటించేసింది. ఇంకేముంది మాలీవుడ్‌లో నటిస్తే టాలీవుడ్, కోలీవుడ్‌లకు ఈ బ్యూటీ ఎంట్రీ ఈజీనే అవుతుందని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అదే జరిగింది. మాలీవుడ్ నుంచి సరాసరి టాలీవుడ్‌కు ఆపై కోలీవుడ్‌కు దిగుమతి అయిపోయింది. తెలుగులో మజ్ను చిత్రం మంచి విజయాన్ని అందించడంతో అక్కడ చకచకా పవన్‌కల్యాణ్, అల్లుఅర్జున్ లాంటి స్టార్ హీరోలతో రొమాన్స్ చేసేసింది. అయితే అవేవి అమ్మడి కెరీక్‌కు ఉపయోగపడలేదు. తాజాగా నాగచైతన్యతో నటించిన శైలజారెడ్డి అల్లుడు ఇటీవల తెరపైకి రానుంది. ప్రస్తుతం మరో అవకాశం చేతిలో లేదు. ఇక కోలీవుడ్‌లోనూ మంచి ఎంట్రీనే లభించింది. విశాల్‌కు జంటగా తుప్పరివాలన్ చిత్రంతో తమిళ ప్రేక్షకులకు పరిచయమైంది. అయితే ఆ చిత్రం హిట్ అయినా అమ్మడిని ఎవరూ పట్టించుకోలేదు. దీంతో అమ్మడు వార్తల్లో ఉంటూ ఉచిత ప్రచారం పొందాలనుకుంటోంది. అందులో భాగంగానే నా నడకలోనూ కిక్కు ఉంది అని స్టేట్మెంట్ ఇచ్చింది. ఇంతకీ ఈ జాణ ఏమంటుందో చూస్తే ఓ పనైపోద్దిగా! నేను చీర కట్టినా నాలో అమెరికా యువతి చాయలు కనిపిస్తున్నాయని అంటున్నారు. నేను చీర కట్టినా, సెర్చ్‌కు వెళ్లినా నా శారీరక భాష భారతీయ అమ్మాయిలకు భిన్నంగానే ఉంటుంది. నేను కూర్చున్నా, నడిచినా భారతీయ స్త్రీల మాదిరి ఉండదు. ఇంకా చెప్పాలంటే నా నడకలోనే ఓ కిక్కు ఉంటుంది. అందుకు లెక్క నేను అమెరికా అమ్మాయి కావడమే. ఇక్కడ చిత్రాల్లో నటిస్తుండడంతో ఇండియన్ స్త్రీల వస్త్రాధరణను గమనిస్తూ అలవాటు చేసుకుంటున్నాను. నిజం చెప్పాలంటే నేను చాలా శాంత స్వభావిని. గట్టిగా మాట్లాడను కూడా. ఇతరులు ఎంతగా మాట్లాడుతున్నా గమనిస్తూ ఉంటాను. అలాంటి ఇప్పుడు ఒక చిత్రంలో నా స్వభావానికి విరుద్ధమైన పాత్రలో నటిస్తున్నాను. ఈర్శా్యభావం కలిగిన అమ్మయిగా బిగ్గరగా అరచి నటించిన సన్నివేశాలు చూస్తే నాకే ఆశ్చర్యం అనిపించింది అని అంటున్న అనుఇమ్మానుయేల్ తను అంతగా హంగామా చేసి నటిస్తున్న చిత్రం ఏదో చెప్పలేదు. బహుశా తెలుగు చిత్రం శైలజారెడ్డి అల్లుడు అనుకుంటా. -
‘శైలజారెడ్డి అల్లుడు’ ప్రీ రిలీజ్ ఫంక్షన్
-
‘అల్లరి అల్లుడు’ అంత హిట్ అవ్వాలి
‘‘చైతన్యని అందరూ శైలజారెడ్డిగారి అల్లుడు అంటున్నారు.. కాదు.. అక్కినేని నాగేశ్వరరావుగారి మనవడు.. నాగార్జున పెద్దకొడుకు. ప్రేమకథా చిత్రాలైనా, ఎంటర్టైన్మెంట్ చిత్రాలైనా, ఒక స్ట్రాంగ్ ఉమెన్ క్యారెక్టర్ ఉన్న సినిమాల్లో అయినా నాన్నగారికి నాన్నగారే సాటి. ఇప్పుడు ఆయన వారసత్వాన్ని చైతన్య తీసుకున్నాడు’’ అని హీరో నాగార్జున అన్నారు. నాగచైతన్య, అనూ ఇమ్మాన్యుయేల్ జంటగా రమ్యకృష్ణ ముఖ్య పాత్రలో మారుతి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘శైలజారెడ్డి అల్లుడు’. ఎస్.రాధాకృష్ణ(చినబాబు) సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్ పతాకంపై ఎస్.నాగవంశీ, పీడీవీ ప్రసాద్ నిర్మించిన ఈ చిత్రం ఈనెల 13న విడుదలవుతోంది. హైదరాబాద్‌లో నిర్వహించిన ప్రీ రిలీజ్ ఫంక్షన్లో నాగార్జున మాట్లాడుతూ– ‘‘చైతన్య చాలా సాఫ్ట్.. చక్కగా నవ్వుతూ ఉంటాడు.. బంగారం.. అని మీరందరూ అంటూ ఉంటారు. కాదు.. తనలో చిలిపితనం కూడా ఉంది. నేను కొంచెం సినిమా చూశా. మారుతీగారు ఆ చిలిపితనాన్ని చక్కగా వాడుకున్నారు. నేను, రమ్యకృష్ణ కలసి ఎన్నో సినిమాలు చేశాం, చాలా పెద్ద హిట్స్ అయ్యాయి.‘బాహుబలి’ తర్వాత రమ్య అంటే భారతదేశంలో తెలియనివారు ఎవరూ లేరు. నాతోపాటు ‘అల్లరి అల్లుడు’ చిత్రంలో చిన్న గెస్ట్‌రోల్ చేసింది. ఇప్పుడు చైతన్యతో ‘శైలజారెడ్డి అల్లుడు’ చేసింది. ఈ సినిమా ‘అల్లరి అల్లుడు’ అంత హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మారుతీగారికి మాస్ పల్స్ బాగా తెలుసు. మా ఫ్యాన్స్‌కి ఏం కావాలో ఈ సినిమాలో మీరు ఇస్తున్నందుకు థ్యాంక్స్. గత నెలలో నాకు బాగా దగ్గరైన ఇద్దరు మనల్ని వదిలి వెళ్లిపోయారు. హరి అన్నయ్య(హరికృష్ణ). ఎవర్నైనా ఇక్కడ నేను ‘అన్న’ అని పిలుస్తానంటే అది ఆయనొక్కర్నే. ఆయన వెళ్లిపోయిన రోజు నా పుట్టినరోజు. పొద్దున్నే వార్త వినగానే ఎలా కనెక్ట్ చేసుకోవాలో కూడా తెలియలేదు. నా స్నేహితుడు, ఆత్మీయుడు రవీందర్ రెడ్డి మరణం కూడా నన్ను బాధించింది. చైతన్య కెరీర్లో ‘శైలజారెడ్డి అల్లుడు’ సినిమా బిగ్గెస్ట్ హిట్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా’’ అన్నారు. హీరో నాని మాట్లాడుతూ– ‘‘ఇంతకుముందు జనరేషన్లో మంచి సాంగ్స్ అన్నీ నాగార్జునగారికి పడితే.. మా జనరేషన్లో మంచి సాంగ్స్ నాగచైతన్యకు పడ్డాయి. ఆ ఫ్యామిలీకి మంచి పాటలన్నీ అలా రాసిపెట్టినట్లు ఉన్నాయి. ‘శైలజారెడ్డి అల్లుడు’ చిత్రం కొంచెం ‘అల్లరి అల్లుడు’ లాంటి సినిమా అని నాగార్జునగారు నాతో అన్నారు. ఆ మాట చాలు ఈ సినిమాలో ఏ స్థాయి ఎంటర్టైన్మెంట్ ఉంటుందో’’ అన్నారు. ‘‘ఇంత స్పీడ్‌గా షూటింగ్ పూర్తి చేసి, ఇంతే త్వరగా సినిమా రిలీజ్ చేస్తుండటం ఇన్నేళ్లలో ఫస్ట్‌టైమ్ చూస్తున్నా. వేడివేడిగా మీ ముందుకు రాబోతోంది’’ అన్నారు రమ్యకృష్ణ. మారుతి మాట్లాడుతూ– ‘‘నాగచైతన్యగారిని మీరు(అభిమానులు) ఎలా చూడాలనుకుంటున్నారో వందశాతం అలాగే ఉంటారని గ్యారంటీ ఇస్తున్నా. ఈ సినిమా నుంచి ఆయన యువసామ్రాట్.. ఫిక్స్ అవ్వండి. ఈ సినిమాలో ట్యాగ్ వేస్తున్నా. ‘శైలజారెడ్డి అల్లుడు’ ఓ మంచి లవ్‌స్టోరీ. రమ్యమేడమ్తో ఫొటో దిగడం, పనిచేయడం అందరికీ ఓ కలలా ఉంటుంది. అలాంటిది ఆమెను డైరెక్ట్ చేయడం నా కల నెరవేరినట్టే. ఓ యాక్టర్‌గా, హీరోగా పరిచయమైన నా హీరో(నాగచైతన్య).. ఇప్పుడు నాకు మంచి ఫ్రెండ్ అయ్యాడు’’ అన్నారు. నాగచైతన్య మాట్లాడుతూ– ‘‘మా అక్కినేని అభిమానులందరికీ నమస్కారం. బయటికి అభిమానులు అంటున్నాం కానీ మీరందరూ నా ఫ్యామిలీయే. ప్రతి సినిమా ఈవెంట్‌కి వచ్చి ఇలాగే ఎంకరేజ్ చేసి ఇదే ఎనర్జీ ఇచ్చి ప్రోత్సహిస్తారు. మీరే నా బలం, బలహీనత.. మీరిచ్చే ప్రేమకి మీరు కోరుకునేది ఓ హిట్ సినిమా. ఇకనుంచి ప్రతి సినిమా మిమ్మల్ని మైండ్‌లో పెట్టుకుని మీరు గర్వపడే సినిమాలు చేస్తానని మాట ఇస్తున్నా. మారుతిగారు మనకి ఓ సూపర్ సినిమా ఇచ్చారు. చినబాబుగారు, వంశీ, పీడీవీ ప్రసాద్‌గారు రెండేళ్లకిందట ఎప్పటికీ మరచిపోలేని ‘ప్రేమమ్’ అనే సినిమా ఇచ్చారు. ఇప్పుడు ఈ సినిమా ఇచ్చారు. రమ్య మేడమ్ ఈ సినిమాకి పెద్ద సపోర్ట్. పండుగకి ఇది పండుగలాంటి సినిమా. మీరు ఎంజాయ్ చేసి, మీ మొహంలో ఓ నవ్వుంటే నేనూ ఆరోజు పండుగ చేసుకుంటా’’ అన్నారు. ‘‘ఇటీవల స్టేజ్ ఎక్కిన ప్రతిసారి నాకు మాటలు సరిగ్గా వచ్చేవి కాదు. అన్నయ్య(నాగచైతన్య) గురించి మాట్లాడాలన్నప్పుడు మాత్రం తన్నుకుంటూ వస్తున్నాయి. మారుతీగారు మీరు కరెక్ట్ టైమ్‌లో కరెక్ట్ హీరోని పట్టారు. సినిమాలో అల్లుణ్ని చేశారు. పెళ్లి చేసుకున్న తర్వాత అన్నయ్య ఫేస్‌లో సడెన్‌గా మంచి గ్లో వచ్చింది’’ అని హీరో అఖిల్ అన్నారు. చిత్ర సమర్పకులు రాధాకృష్ణ, నిర్మాతలు పీడీవీ ప్రసాద్, నాగవంశీ, అనూ ఇమ్మాన్యుయేల్, నిర్మాతలు తుమ్మలపల్లి రామసత్యనారాయణ, రవిశంకర్, నటులు కాశీ విశ్వనాథ్, నరేశ్, సంగీత దర్శకుడు గోపీసుందర్, కెమెరామెన్ నిజ ర్ పాల్గొన్నారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
కొన్ని రోజులు డిజార్డర్స్‌కి బ్రేక్
‘‘ఈ మధ్య అన్నీ డిజార్డర్స్ (హీరో క్యారెక్టర్‌కి లోపం) తోనే సినిమాలు చేస్తున్నాం అని అంటున్నారు. ఈ సినిమాలో ఏ డిజార్డర్ ఉండదు. కొన్ని రోజులు డిజార్డర్స్‌కి బ్రేక్ ఇద్దాం అనుకుంటున్నాను. ఫ్యామిలీ అంతా ఎంజాయ్ చేసే మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ తీశాను’’ అని దర్శకుడు మారుతి అన్నారు. నాగచైతన్య, అనూ ఇమ్మాన్యుయేల్ జంటగా మారుతి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘శైలజా రెడ్డి అల్లుడు’. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై పీడివీ ప్రసాద్, నాగ వంశీ నిర్మించారు. ఈ చిత్రం ఈ నెల 13న రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా మారుతి చెప్పిన విశేషాలు. ► ముందుగా ఈ సినిమాను ఆగస్ట్ 31న రిలీజ్ చేద్దాం అనుకున్నాం. కానీ కేరళ వరదల కారణంగా కుదర్లేదు. సంగీత దర్శకుడు గోపీ సుందర్ చుట్టాలు కూడా ఆ వరదల్లో చిక్కుకుపోయారు. దాంతో ఈ సినిమాను వాయిదా వేసేశాం. ► ‘శైలజా రెడ్డి అల్లుడు’ అనే టైటిల్ చూడగానే ఈ సినిమా అత్తా అల్లుడి మధ్య సవాల్ అని ఊహించేసుకుంటారు. కానీ ఇది అత్తా అల్లుడే కాదు వాళ్ల అమ్మాయితో కూడా ఈగో సమస్యల్లో ఇరుకుంటాడు హీరో. సాధారణ మనిషి శైలజా రెడ్డి అల్లుడు ఎలా అయ్యాడని కథ. ఈగోయిస్ట్ మనుషులతో హీరో ఎలా నలిగిపోతాడన్నది మరో కోణం. హీరోకి చాలా సహనం కావాలి. రియల్‌గా కూడా చైతూకి ఓపిక ఎక్కువ. పాజిటివ్ పర్సన్. ► ఫస్ట్ యూత్‌ఫుల్ స్టోరీ (‘ఈ రోజుల్లో’), హారర్ కామెడీ (ప్రేమకథా చిత్రమ్), ఆ తర్వాత ఫ్యామిలీ ఎంటర్టైనర్ (‘భలే భలే మగాడివోయ్’) తీశాం. ఇప్పుడు ఫుల్‌లెంగ్త్ ఫ్యామిలీ ఆడియన్స్ మూవీ చేశాను. ఎప్పటికప్పుడు కొత్త జానర్స్ టచ్ చేస్తే మనం ఇంప్రూవ్ అవుతాం. ► ఎప్పుడూ అత్తలంటే చెడ్డవాళ్లే అనుకుంటాం. కానీ ఇందులో అలా కాదు. చైతూ చాలా కొత్తగా ఉంటాడు. రమ్యకృష్ణగారి పాత్రకు కూడా కథలో ఇంపార్టెన్స్ ఉంది. అందుకే ఈ టైటిల్ పెట్టాం. ► ‘అల్లరి అల్లుడు’లాంటి పాత టైటిల్స్ పెడదాం అనుకున్నాం కానీ విరమించుకున్నాం. ఇందులో టైటిలే కొంచెం పాతగా ఉంటుంది. సినిమా మాత్రం కొత్తగా ఉంటుంది. చైతూ కూడా క£ý లో భాగం అవుతాడు. మొత్తం నా మీదే నడవాలని అనుకోడు. ఈ సినిమా చేయాలనుకున్నప్పుడు కూడా నాగార్జునగారి ఫ్యామిలీ చేస్తున్న సినిమాల దృష్టిలో పెట్టుకొని కథను అనుకున్నాను. ► అనూ ఇమ్మాన్యుయేల్ బయట ఎలా ఉంటుందో సినిమాలో కూడా అలానే ఉంటుంది. ఫస్ట్ హాఫ్ అంతా లవ్‌స్టోరీ, సెకండ్ హాఫ్ అంతా ఫుల్ ఫ్యామిలీ సీన్స్ ఉంటాయి. ప్రొడ్యూసర్స్ నాగ వంశీ, ప్రసాద్‌గార్లు రిచ్‌గా సినిమాని తీశారు. ఈ సినిమా నా కెరీర్లో చాలా రిచ్‌గా ఉంటుంది. ► కొన్నిసార్లు మనం అనుకున్న ఐడియాకు వేరే దర్శకుడు కనెక్ట్ కాకపోవచ్చు. వీళ్లు చేయగలరు అని నాకు నమ్మకం కుదిరితే వేరే డైరెక్టర్స్‌తో సినిమాలు నిర్మించాలనుకుంటున్నాను. అయితే ప్రస్తుతానికి చిన్న సినిమాలకు బ్రేక్ ఇవ్వాలనుకుంటున్నాను. ఏ సినిమాకైనా అదే హార్డ్ వర్క్ ఉంటుంది. పెద్ద సినిమాకు ఓ నెల శ్రమ ఉంటుంది. చిన్న సినిమాను హిట్ చేయడం గ్రేట్. కొత్తవాళ్ల పోస్టర్స్‌తో ఆడియన్స్‌ను థియేటర్‌కి తీసుకురావడం గ్రేట్. -
అన్నీ సొంత నిర్ణయాలే!
‘‘కెరీర్ స్టార్టింగ్‌లో ఉన్నాను. తప్పులు చేస్తే దిద్దుకునే అవకాశం ఉంటుంది. పోటీ ఫీలవ్వను. హిట్, ఫ్లాప్స్ నా కంట్రోల్లో ఉండవు. సినిమాలు ఆడకపోతే చాన్సులు తగ్గుతాయనే నెర్వస్నెస్ ఉంటుంది. సినిమా సినిమాకు నన్ను నేను బెటర్ చేసుకోవాలనుకుంటాను. సొంత నిర్ణయాలు తీసుకోవడానికే ఇష్టపడతాను’’ అన్నారు అనూ ఇమ్మాన్యుయేల్. నాగచైతన్య, అనూ ఇమ్మాన్యు యేల్ జంటగా మారుతి దర్శకత్వంలో నాగవంశీ, పీడీవీ ప్రసాద్ నిర్మించిన ‘శైలజారెడ్డి అల్లుడు’ ఈ నెల 13న విడుదల కానుంది. ఈ సందర్భంగా అనూ ఇమ్మాన్యుయేల్ చెప్పిన సంగతులు... ► ఈ మూవీలో ఈగోయిస్ట్ అండ్ యాంగ్రీ గాళ్ అను పాత్ర చేశాను. ఎప్పుడూ తనే నంబర్ 1 అవ్వాలనుకుంటుంది. గర్వంగా ఫీల్ అవుతుంది. కానీ ఒకసారి ప్రేమిస్తే ఎక్కువగా ప్రేమిస్తుంది. ఇంతకు ముందు నేను చేసిన పాత్రలకు భిన్నంగా ఉంటుంది. రియల్ లైఫ్‌లో నేను కొంచెం ఈగోయిస్ట్. అయితే ఎంతవరకూ ఉండాలో అంతవరకే. ► నాగచైతన్య కంఫర్టబుల్ అండ్ చాలెంజింగ్ కో స్టార్. రమ్యకృష్ణగారి ఎనర్జీ సూపర్. పెద్ద పెద్ద డైలాగ్స్‌ను కూడా ఆమె జ్ఞాపకం పెట్టుకుని సులభంగా చెప్పేవారు. సినిమాలో రమ్యకృష్ణగారి కూతురు పాత్రలో కనిపిస్తాను. మారుతిగారు అమేజింగ్ డైరెక్టర్. సెట్లో నేను ఎక్కువగా సైలెంట్‌గానే ఉంటాను. కానీ ఒకసారి నాకు కనెక్ట్ అయితే నాన్‌స్టాప్‌గా మాట్లాడతాను. ► ‘అజ్ఞాతవాసి’ స్క్రిప్ట్‌ని వినే సైన్ చేశాను. ఆ సినిమా మంచి వర్కింగ్ ఎక్స్పీరియన్స్. ‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’లో నటించడం హ్యాపీ. ‘గీత గోవిందం’ సినిమాలో నాకు ఆఫర్ వచ్చింది. కానీ డేట్స్ లేకపోవడంతో కుదరలేదు. అందుకే గెస్ట్ రోల్ చేశాను. ‘అజ్ఞాతవాసి, గీతగోవిందం’ సినిమాలకు నా పాత్రలకు నేనే డబ్బింగ్ చెప్పాను. హైదరాబాద్‌లో ఇల్లు ఇంకా కొనలేదు. కానీ హోమ్లీ ఫీలింగ్ ఉంది. ► నేను నటించిన కొన్ని సినిమాలు ఆశించినంతగా ఆడలేదు. అయితే ఏం? కెరీర్ స్టారింగ్‌లో శ్రుతీహాసన్‌కి కూడా ఇలానే జరిగింది. ఫ్లాప్స్ అనేవి జర్నీలో ఓ భాగం. ప్రస్తుతం నా మాతృభాష మలయాళంతో పాటు ఇతర భాషల నుంచి మంచి ఆఫర్స్ వస్తున్నాయి. ముందు తెలుగులో ప్రూవ్ చేసుకోవాలను కుంటున్నాను. మంచి స్క్రిప్ట్, స్ట్రాంగ్ రోల్స్ కోసం చూస్తున్నాను. ప్రయోగాత్మక చిత్రాలు చేయాలని ఉన్నా యంగ్ యాక్ట్రస్ని కాబట్టి ఇప్పుడే కరెక్ట్ కాదేమో అనిపిస్తోంది. కరెక్ట్ టైమ్ వచ్చినప్పుడు తప్పకుండా చేస్తాను. -
‘శైలజా రెడ్డి అల్లుడు’ కోసం ‘దేవదాస్’
అక్కినేని యువ కథా నాయకుడు నాగ చైతన్య హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం శైలజా రెడ్డి అల్లుడు. మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో శైలజా రెడ్డి పాత్రలో రమ్యకృష్ణ నటిస్తుండగా అను ఇమ్మాన్యూల్ హీరోయిన్గా కనిపించనున్నారు. ముందుగా ఈ సినిమాను ఆగస్టు 31న రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేసినా అనివార్య కారణాల వల్ల సెప్టెంబర్ 13కు వాయిదా వేశారు. రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో చిత్రయూనిట్ భారీ ప్రీ రిలీజ్ వేడుకను నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నారు. సెప్టెంబర్9న నిర్వహించనున్న ఈ వేడుకకు దేవదాస్ చిత్ర కథానాయకులు నాగార్జున, నానిలు ముఖ్య అతిథిలుగా హాజరు కానున్నారు. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై రూపొందుతున్న ఈ సినిమాకు గోపిసుందర్ సంగీతమందిస్తున్నారు. -
గూఢచారి దర్శకుడి నెక్ట్స్ ప్రాజెక్ట్
అడివి శేష్ హీరోగా తెరకెక్కిన సూపర్ హిట్ సినిమా గూఢచారి. స్పై థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమాతో శశికిరణ్ దర్శకుడిగా పరిచయం అయ్యాడు. తొలి సినిమాతోనూ ఘన విజయాన్ని అందుకున్న ఈ యువ దర్శకుడు తన నెక్ట్స్ ప్రాజెక్ట్‌ను ఓ బిగ్ బ్యానర్లో చేయనున్నాడట. యంగ్ హీరోలతో క్రేజీ ప్రాజెక్ట్స్‌ను లైన్లో పెట్టిన సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లో శశికిరణ్ తన తదుపరి చిత్రాన్ని చేయనున్నాడు. ఈ బ్యానర్లో తెరకెక్కిన శైలజా రెడ్డి అల్లుడు వినాయక చవితి కానుకగా రిలీజ్‌కు రెడీ అవుతుండగా నితిన్ హీరోగా వెంకీ కుడుముల (ఛలో ఫేం) దర్శకత్వంలో నాని హీరోగా గౌతమ్ తిన్ననూరి(మళ్ళీరావా ఫేం) దర్శకత్వంలో సినిమాలు సెట్స్‌మీదకు రానున్నాయి. వీటితో పాటు శశికిరణ్ చిత్రానికి కూడా ఓకె చెప్పినట్టుగా తెలుస్తోంది. త్వరలోనే శశికిరణ్ దర్శకత్వంలో నటించబోయే హీరో ఎవరనేది వెల్లడించనున్నారు. -
సెప్టెంబర్ 21న ‘నన్ను దోచుకుందువటే’
సమ్మోహనం సినిమాతో సూపర్ హిట్ అందుకున్న యంగ్ హీరో సుధీర్ బాబు మరో ఆసక్తికర చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నాడు. ఆర్ఎస్ నాయుడు దర్శకత్వంలో ‘నన్ను దోచుకుందువటే’తో సిద్ధమవుతున్నాడు. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమాను ముందుగా వినాచక చవితి కానుకగా సెప్టెంబర్ 13న రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేశారు. అయితే అదే రోజు నాగచైతన్య ‘శైలజా రెడ్డి అల్లుడు’, సమంత ‘యు టర్న్’ సినిమాలు రిలీజ్ అవుతుండటంతో సుధీర్ బాబు తమ చిత్రాన్ని సెప్టెంబర్ 21న రిలీజ్ చేసేందుకు ఫిక్స్ అయ్యారు. ఈ సినిమాను సుధీర్ బాబు స్వయంగా తన సొంత నిర్మాణ సంస్థ సుధీర్ బాబు ప్రొడక్షన్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు.సుధీర్ సరసన నభా నటేష్ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాకు అజనీష్ బి లోకనాథ్ సంగీతమందిస్తున్నారు. -
‘శైలజా రెడ్డి అల్లుడు’ మూవీ స్టిల్స్
-
‘శైలజా రెడ్డి అల్లుడు’ ట్రైలర్ రిలీజ్
నాగచైతన్య. మారుతి కాంబినేషన్లో రూపొందుతున్న శైలజా రెడ్డి అల్లుడు సినిమా ట్రైలర్ రిలీజ్ అయ్యింది. మారుతి మార్క్ కామెడీ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ ట్రైలర్లో ‘నాపేరు చైతన్య ముద్దుగా చైతూ అంటారు’అంటూ పరిచయం చేసుకున్నాడు నాగచైతన్య. నాగచైతన్యకు జోడిగా అను ఇమ్మాన్యుయేల్ నటించిన ఈ సినిమాను నాగవంశీ, పీడీవీ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సీనియర్ నటి రమ్యకృష్ణ చాలా కాలం తరువాత అత్త పాత్రలో కనిపించనున్నారు. డైరెక్టర్ మారుతి గత చిత్రాల మాదిరిగానే ప్రేక్షకులకు ఫుల్ కామెడీ అందించడానికి సిద్దమయ్యాడు. కామెడీకే పరిమితం కాకుండా విభిన్నమైన కథ, పంచ్ డైలాగ్స్, ట్విస్ట్‌లతో ఆకట్టుకునే మారుతి ఈ చిత్ర ట్రైలర్లోనూ తన మార్క్ కనిపంచేలా చేశాడు. వెన్నెల కిషోర్, పృథ్వీ కామెడీ పంచ్‌లు నవ్వులు పండిస్తున్నాయి. ‘పొగరుతో సాధించలేనిది ప్రేమతో సాధించవచ్చు, ఆవకాయ అన్నంలో కలుపుకొని తినాలి కాని ఎర్రగా ఉంది కదా అని మొఖానికి పులుముకోవద్దు, మీలో పుచ్చకాయంత ప్రేమ ఉందా’ లాంటి కామెడీ డైలాగులు చూస్తుంటే సినిమా చూసిన ప్రేక్షకుడు కడుపుబ్బా నవ్వుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ చిత్రానికి గోపీసుందర్ సంగీతమందిస్తున్నారు. వినాయకచవితి కానుకగా సెప్టెంబర్ 13న ప్రేక్షకుల ముందుకు ఈ చిత్రం రాబోతుంది. -
‘శైలజా రెడ్డి అల్లుడు'