
పెళ్లి పనులతో కొద్ది రోజులు సినిమాల నుంచి బ్రేక్ తీసుకున్న అక్కినేని యంగ్ హీరో నాగచైతన్య తిరిగి షూటింగ్ లతో బిజీ అవుతున్నాడు. ఇప్పటికే చందూమొండేటి దర్శకత్వంలో సవ్యసాచి సినిమా షూటింగ్ లో పాల్గొంటున్నాడు. ఈసినిమా సెట్స్ మీద ఉండగానే ఇప్పుడు మరో సినిమాను ప్రారంభించాడు. మహానుభావుడు సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న మారుతి దర్శకత్వంలో నాగచైతన్య తదుపరి చిత్రం తెరకెక్కనుంది.
సితార ఎంటర్ టైన్మెంట్స్ నిర్మిస్తున్న ఈ సినిమా ఈ రోజు(శనివారం) లాంచనంగా ప్రారంభమైంది. నాగచైతన్య సరసన అను ఇమ్మాన్యూల్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు శైలజా రెడ్డి అల్లుడు అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారు. కీలకమైన అత్త పాత్రలో రమ్యకృష్ణ నటించనుందన్న టాక్ వినిపిస్తోంది. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ డిసెంబర్ నెలాఖరున ప్రారంభించేలా ప్లాన్ చేస్తున్నారు.
(మరిన్ని చిత్రాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి)
Comments
Please login to add a commentAdd a comment