
ఈ నెలలో ‘శైలజారెడ్డి అల్లుడి’గా ప్రేక్షకులను మెప్పించిన నాగచైతన్య తన నెక్ట్స్ చిత్రం ‘సవ్యసాచి’ సినిమా షూటింగ్‌ను కంప్లీట్ చేసే పనిలో బిజీగా ఉన్నారు. చందూ మొండేటి దర్శకత్వంలో నాగచైతన్య హీరోగా నవీన్ ఎర్నేని, చెరుకూరి మోహన్, వై. రవిశంకర్ నిర్మిస్తున్న సినిమా ‘సవ్యసాచి’. ఇందులో నిధీ అగర్వాల్ కథానాయిక. భూమిక, మాధవన్ కీలక పాత్రలు చేశారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్‌లో జరుగుతోంది. నిజానికి ఈ మూవీ మేజర్ పార్ట్ షూటింగ్ పూర్తయింది.
ప్రస్తుతం చిన్న ప్యాచ్‌వర్క్ కోసం షూటింగ్ జరుపుతున్నారు. ఇది కూడా రేపటితో పూర్తి అవుతుంది. దీంతో ఈ గురువారం గుమ్మడికాయ కొడతారు ‘సవ్యసాచి’టీమ్. అన్నట్లు ఇంకో మాట... ఈ సినిమా కోసం ‘అల్లరి అల్లుడు’లో నాగార్జున, రమ్యకృష్ణ చేసిన ‘నిన్ను రోడ్డుమీద చూసినది లగాయితు’ అనే సాంగ్‌ను రీమిక్స్ చేసిన సంగతి తెలిసిందే. ఈ పాటను నాగచైతన్య, నిధీ అగర్వాల్‌పై చిత్రీకరించారు. ఈ చిత్రం నవంబర్ 2న రిలీజ్ కానుంది. ఇదిలా ఉంటే శివ నిర్వాణ దర్శకత్వంలో నాగచైతన్య, సమంత జంటగా నటించనున్న చిత్రం అక్టోబర్ 6న ఆరంభం కానుందట.