
అక్కినేని నాగ చైతన్య హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం సవ్యసాచి. నవంబర్ 2 న రిలీజ్ అవుతున్న ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో వేగం పెంచారు చిత్రయూనిట్. ఇప్పటికే టీజర్ ట్రైలర్‌లతో సందడి చేస్తున్న సవ్యసాచి టీం తాజాగా సాంగ్ టీజర్స్‌తో ఆకట్టుకుంటున్నారు. ఈ సినిమాలో నాగార్జున సూపర్ హిట్ సాంగ్ ‘నిన్ను రోడ్డు మీద చూసినది’ పాటను రీమిక్స్ చేస్తున్న సంగతి తెలిసిందే.
ఈ పాట వీడియో టీజర్‌ను రిలీజ్ చేశారు. ఒరిజినల్ పాట లోని ఫ్లేవర్ ఏ మాత్రం మిస్ కాకుండా ఈ ట్రెండ్‌కు తగ్గట్టుగా ట్యూన్ చేశారు కీరవాణి. చైతూ కూడా సూపర్బ్ డ్యాన్స్ మూమెంట్స్‌తో ఆకట్టుకున్నాడు. చైతూ లుక్స్, కాస్ట్యూమ్స్ కూడా పాటకు మరింత ప్లస్ అయ్యాయి. నిధి అగర్వాల్ గ్లామర్ లుక్స్ తో పాటు డ్యాన్స్ కూడా ఇరగదీశారు. చైతూ హీరోగా ప్రేమమ్ లాంటి సూపర్ హిట్ చిత్రాన్ని డైరెక్ట్ చేసిన చందూ మొండేటి ఈ సినిమాకు దర్శకుడు. పూర్తి యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమాలో చైతన్య ఓ డిఫరెంట్ క్యారెక్టర్‌లో నటిస్తున్నాడు. తన ఎడమ చేతిమీ నియంత్రణ లేని పాత్రలో చైతూ నటన ఆకట్టుకుంటుందంటున్నారు చిత్రయూనిట్.
Comments
Please login to add a commentAdd a comment