ఆ వదంతులు నమ్మవద్దు: చైతూ | My next projects news is not true, tweets Naga Chaitanya | Sakshi
Sakshi News home page

ఆ వదంతులు నమ్మవద్దు: చైతూ

Published Thu, Feb 22 2018 4:39 PM | Last Updated on Thu, Feb 22 2018 4:47 PM

My next projects news is not true, tweets Naga Chaitanya - Sakshi

టాలీవుడ్ హీరో నాగచైతన్య

హైదరాబాద్: సోషల్ మీడియాలో వస్తున్న కథనాల్లో వాస్తవం లేదన్నారు అక్కినేని వారసుడు, యంగ్ హీరో నాగచైతన్య. తాను రెండు కొత్త మూవీలకు ఒకే చెప్పినట్లుగా కొన్ని కథనాలు ప్రచారంలో ఉన్నాయని, అవన్నీ వదంతులేనని వాటిని పట్టించుకోవద్దని తన అభిమానులకు చైతూ తెలిపారు. కొత్త ప్రాజెక్టులు ఒప్పుకుంటే త్వరలోనే వెల్లడిస్తానన్నారు. ఈ నేపథ్యంలో ఇందుకు సంబంధించి సోషల్ మీడియా వేదికగా తన ప్రస్తుత మూవీ ప్రాజెక్టుల గురించి వివరించారు.

'నా లేటెస్ట్ ప్రాజెక్ట్‌లకు సంబంధించి వచ్చిన కథనాల్లో నిజం లేదు. సవ్యసాచితో పాటు దర్శకుడు మారుతితో చేస్తున్న మూవీల షూటింగ్ పనుల్లో బిజీగా ఉన్నాను. ఈ ఏడాది నావద్దకు మంచి స్క్రిప్ట్‌లు వచ్చినందుకు సంతోషంగా ఉంది. ఈ రెండు మూవీలు కాకుండా ప్రస్తుతం ప్రచారంలో ఉన్న నా లేటెస్ట్ సినిమాల అప్‌డేట్స్ నిజం కాదు. నా తర్వాతి ప్రాజెక్టుల గురించి త్వరలోనే వెల్లడిస్తానంటూ' హీరో నాగచైతన్య ట్వీట్ చేశారు. చైతూ పోస్ట్ చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది.

సర్ధార్ గ‌బ్బ‌ర్ సింగ్‌తో నిరాశ పరిచినా ఎన్టీఆర్‌తో జైలవకువ లాంటి హిట్ కొట్టిన దర్శకుడు బాబీ కొత్త మూవీలో చైతూ నటించనున్నాడని ప్రచారం జరిగింది. బాబీతో మూవీకి ఒకే చెప్పడంతో పాటు 'నిన్ను కోరి' ఫేం శివ ఇర్వాణ డైరెక్షన్‌లో మరో ప్రాజెక్ట్‌కు చైతూ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని, కానీ షూటింగ్‌ ప్రారంభానికి కొన్ని రోజులు సమయం తీసుకుంటారని అప్‌డేట్స్‌ వచ్చాయి. అయితే వీటిలో నిజంలేదని ఆయన స్పష్టం చేశారు. కాగా, చందూ మొండేటి దర్శకత్వంలో 'సవ్యసాచి'తో పాటు మారుతి డైరెక్షన్‌లో 'శైలాజా రెడ్డి అల్లుడు' షూటింగ్‌లతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement