అక్కినేని యువ కథనాయకుడు నాగచైతన్య హీరోగా తెరకెక్కుతున్న డిఫరెంట్ యాక్షన్ ఎంటర్‌టైనర్ సవ్యసాచి. కార్తీకేయ, ప్రేమమ్ లాంటి హిట్ చిత్రాలను అందించిన చందూ మొండేటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ఇపాటికే రిలీజ్ కావాల్సి ఉంది. అయితే గ్రాఫిక్స్ విషయంలో ఆలస్య కావటంతో రిలీజ్‌ను వాయిదా వేశారు.
ఈ లోగా శైలజా రెడ్డి అల్లుడు సినిమాను పూర్తి చేసిన చైతూ ఆ సినిమాతో ఈ నెల 31న ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. శైలజా రెడ్డి అల్లుడు సినిమా పనులు పూర్తి కావటంతో తిరిగి సవ్యసాచితో బిజీ అయ్యాడు చైతూ. ప్రస్తుతం హైదరాబాద్‌లో షూటింగ్ చేస్తున్న చిత్రయూనిట్ త్వరలో ఆకరిపాట చిత్రీకరణ కోసం ఫారిన్ వెళ్లనున్నారు. ఈ పాటతో షూటింగ్ మొత్తం పూర్తి కానుంది. చైతన్య సరసన నిధి అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment