టైటిల్ : శైలజా రెడ్డి అల్లుడు
జానర్ : రొమాంటిక్ యాక్షన్ కామెడీ
తారాగణం : నాగచైతన్య, రమ్యకృష్ణ, అను ఇమ్మాన్యూల్, మురళీ శర్మ, నరేష్, వెన్నెల కిశోర్
సంగీతం : గోపి సుందర్
దర్శకత్వం : మారుతి దాసరి
నిర్మాత : ఎస్ రాధకృష్ణ, నాగవంశీ ఎస్, పీడీవీ ప్రసాద్
వరుస విజయాలతో సూపర్ ఫాంలో ఉన్న యువ దర్శకుడు మారుతి, అక్కినేని యంగ్ హీరో నాగచైతన్య కాంబినేషన్‌లో తెరకెక్కిన సినిమా శైలజా రెడ్డి అల్లుడు. తెలుగు తెర ఒకప్పుడు సూపర్ హిట్ అయిన అత్త సెంటిమెంట్‌ను మరోసారి రిపీట్ చేస్తూ తెరకెక్కించిన ఈ సినిమాలో అత్త పాత్రలో రమ్యకృష్ణ నటించారు. మరి హిట్ ఫార్ములా నాగచైతన్య కెరీర్‌లో మరో హిట్‌గా నిలిచిందా..? రమ్యకృష్ణ అత్త పాత్రలో ఏమేరకు ఆకట్టుకున్నారు..? మారుతి తన సక్సెస్ ట్రాక్‌ను కంటిన్యూ చేశారా..?
కథ :
చైతన్య (నాగ చైతన్య ) భయంకరమైన ఈగో ఉన్న సక్సెస్‌ఫుల్ బిజినెస్‌మెన్ రావు(మురళీ శర్మ) కొడుకు. తన ఈగో కోసం కూతురు పెళ్లిని కూడా క్యాన్సిల్ చేసుకునేంత ఈగో రావుది. తన కాలనీ లోకి కొత్తగా వచ్చిన అను(అను ఇమ్మాన్యూల్) అనే అమ్మాయి తొలిచూపులోనే ఇష్టపడతాడు చైతూ.. అనుకి కూడా తన తండ్రిలాగే భరించలేనంత ఈగో ఉందని తెలిసి పని మనిషిని ప్రేమిస్తున్నట్లుగా నాటకమాడి అనుని ప్రేమలోకి దించుతాడు. అనుకి కూడా తనలాగే ఈగో ఎక్కువ అని తెలుసుకున్న రావు.. చైతన్య, అనుల పెళ్లికి ఒప్పుకుంటాడు. కానీ అనుకోని పరిస్థితుల్లో ఫ్యామిలీ ఫంక్షన్‌లో అను పర్మిషన్ లేకుండా ఎంగేజ్‌మెంట్ కూడా చేసేస్తాడు. (సాక్షి రివ్యూస్) కానీ అదే సమయంలో అను.. వరంగల్ జిల్లాను శాసించే శైలజా రెడ్డి(రమ్యకృష్ణ) కూతురు అని తెలుస్తోంది. తనకి తెలియకుండా ఏది జరగడానికి ఇష్టపడని శైలజా రెడ్డి... చైతన్య, అనుల పెళ్లికి ఒప్పుకుందా..? ఈగోని పక్కన పెట్టి శైలజా రెడ్డి, రావు.. చైతన్య, అనుల పెళ్లికి ఒప్పుకున్నారా? అన్నదే మిగతా కథ.
నటీనటులు
సినిమాలో తెర నిండా నటులు ఉన్నా సినిమా అంతా ముఖ్యంగా నాగచైతన్య, రమ్యకృష్ణ, అను ఇమ్మాన్యూల్‌ల చుట్టూనే తిరుగుతుంది. కాబోయే అత్త, ప్రియురాలి మధ్య నలిగిపోయే పాత్రలో నాగ చైతన్య మంచి నటన కనబరిచాడు. గత చిత్రాలతో పోలిస్తే నటుడిగా మంచి పరిణతి కనబరిచాడు. కామెడీ టైమింగ్‌తోనూ ఆకట్టుకున్నాడు. కమర్షియల్ ఫార్మాట్ సినిమా కావటంతో డ్యాన్సులు, ఫైట్స్‌కు కూడా మంచి అవకాశం దక్కింది. ఇక కీలకమైన అత్త పాత్రలో రమ్యకృష్ణ మరోసారి విశ్వరూపం చూపించారు. భరించలేనంత ఈగోతో అందరినీ ఇబ్బంది పెట్టే పాత్రలో రమ్యకృష్ణ నటన అందరిని అలరిస్తుంది. (సాక్షి రివ్యూస్) సెకండాఫ్‌లో ఎంట్రీ ఇచ్చినా అందరినీ డామినేట్ చేసేశారు. ఎమోషనల్ సీన్స్‌లోనూ తన ఎక్స్‌పీరియన్స్‌ను చూపించారు. ఈగో విషయంలో అమ్మతో తలపడే పాత్రలో అను ఇమ్మాన్యూల్ ఆకట్టుకున్నారు. రమ్యకృష్ణతో పోటి పడి నటించే సీన్స్‌లో కాస్త తేలిపోయినట్టుగా అనిపించినా.. గ్లామర్ తో ఆకట్టుకున్నారు. ఫస్ట్ హాఫ్‌లో మురళీ శర్మ కూడా రమ్యకృష్ణ రేంజ్‌లో ఈగో చూపించారు. హీరోయిన్ తండ్రిగా నరేష్ మరోసారి తనదైన నటనతో మెప్పించారు. వెన్నెల కిశోర్, 30 ఇయర్స్ పృథ్వీ కామెడీతో కడుపుబ్బా నవ్వించారు.
విశ్లేషణ
గత చిత్రాల్లో హీరోలకు డిఫెక్ట్ చూపించిన దర్శకుడు మారుతి ఈ సినిమాలో లేడి క్యారెక్టర్స్ కు కూడా డిఫెక్ట్ ను యాడ్ చేశాడు. విపరీతమైన ఈగోతో అందరిని ఇబ్బందులు పెట్టే అత్త పాత్రను అద్భుతంగా డిజైన్ చేశాడు. గత చిత్రాల విషయంలో కామెడీ మీదే ఎక్కువగా దృష్టి పెట్టిన మారుతి ఈ సినిమాను పక్కా కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా మలిచాడు. తొలి భాగం హీరో హీరోయిన్ల లవ్ స్టోరి, రొమాటింక్ సీన్స్‌తో సాగదీసిన దర్శకుడు.. కామెడీతో ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు. (సాక్షి రివ్యూస్) ద్వితీయార్థంలోనూ కామెడీ కంటిన్యూ చేస్తూ యాక్షన్, ఎమోషనల్ సీన్స్‌తో ఫ్యామిలీ ఆడియన్స్‌ను మెప్పించే ప్రయత్నం చేశాడు. అయితే సినిమా అంతా 90లలో వచ్చిన కమర్షియల్ ఫార్ములా సినిమాలను గుర్తు చేస్తుంది. సినిమాకు మరో మేజర్ ప్లస్ పాయింట్ కామెడీ. మారుతి తన మార్క్ కామెడీతో కడుపుబ్బా నవ్వించాడు. క్లైమాక్స్‌లో శైలజ రెడ్డి, రావు మనసు మార్చుకొని పెళ్లికి ఒప్పుకునే సన్నివేశం అంత కన్విన్సింగ్‌గా అనిపించదు. గోపిసుందర్ తన ట్యూన్స్‌తో మరోసారి మ్యాజిక్ చేశాడు. టైటిల్ సాంగ్ తో పాటు అనుబేబి, ఎగిరే పాటలు విజువల్‌గా కూడా బాగున్నాయి. సినిమాటోగ్రఫి, ఎడిటింగ్, నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి.
ప్లస్ పాయింట్స్ :
నాగచైతన్య, రమ్యకృష్ణ నటన
కామెడీ
మైనస్ పాయింట్స్ :
పాత కథ
రొటీన్ టేకింగ్
- సతీష్ రెడ్డి జడ్డా, ఇంటర్నెట్ డెస్క్.
Comments
Please login to add a commentAdd a comment