Bangarraju Movie Heroines: Krithi Shetty And Other 8 Heroines Adds Bangarraju Glamour - Sakshi
Sakshi News home page

Bangarraju :బంగార్రాజులో ఏకంగా 8మంది హీరోయిన్లు!.. గ్లామర్‌తో మెస్మరైజ్‌

Published Sun, Jan 9 2022 7:11 PM | Last Updated on Mon, Jan 10 2022 8:39 AM

Krithi Shetty And Other 8 Heroines Adds Bangarraju Glamour - Sakshi

Krithi Shetty And Other 8 Heroines Adds Bangarraju Glamour : 'సోగ్గాడే చిన్నినాయనా' వంటి హిట్‌ తర్వాత నాగార్జున హీరోగా కల్యాణ్‌ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘బంగార్రాజు’.‘సోగ్గాడు మళ్ళీ వచ్చాడు’ అన్నది క్యాప్షన్‌. ఈ మూవీలో నాగచైతన్య మరో హీరోగా నటిస్తున్నారు. నాగార్జున సరసన రమ్యకృష్ణ, నాగ చైతన్యకి జోడీగా కృతీశెట్టి నటిస్తున్నారు. సంక్రాంతి కానుకగా జనవరి 14న ఈ చిత్రం విడుదల కానుంది. ఇప్పటికే సెన్సార్‌ పూర్తి చేసుకున్న ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి.

ఇదిలా ఉండగా ఈ చిత్రంలో ఒకరు కాదు.. ఏకంగా 8మంది హీరోయిన్లు సందడి చేయనున్నారట. ఇందులో రమ్యకృష్ణ, కృతిశెట్టి మెయిన్‌ లీడ్స్‌ కాగా ఫరియా అబ్దుల్లా స్పెషల్‌ సాంగ్‌లో కనిపించింది. వీళ్లతో పాటు మీనాక్షి దీక్షిత్‌, దర్శన బానిక్‌, వేదిక, దక్ష నాగార్కర్‌, సిమ్రత్‌ కౌర్‌ వంటి హీరోయిన్లు కూడా కనిపించనున్నట్లు తెలుస్తుంది. గతంలో నాగార్జున నటించిన కింగ్‌ సినిమాలోని ఒక పాటలో ఏకంగా ఇండస్ట్రీలోని టాప్‌ హీరోయిన్స్‌ సందడి చేసిన సంగతి తెలిసిందే. 



 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement