‘నా కెరీర్‌లో అవే చెత్త సినిమాలు’ | Naga Chaitanya Reveals His Best And Worst Films | Sakshi
Sakshi News home page

Published Wed, Sep 12 2018 1:50 PM | Last Updated on Wed, Sep 12 2018 1:50 PM

Naga Chaitanya Reveals His Best And Worst Films - Sakshi

వినాయక చవితి సందర్భంగా శైలజా రెడ్డి అల్లుడుగా ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నాడు యంగ్ హీరో నాగ చైతన్య. గతంలో ఎన్నడూ లేనంతగా ఈ సినిమా ప్రమోషన్‌లో పాలు పంచుకుంటున్నాడు చైతూ. తాజాగా మీడియాకు ఇచ్చిన ఇంటర్య్వూలో పలు ఆసక్తికర అంశాలను వెల్లడించారు. ఈ సందర్భంగా తన కెరీర్‌లో తనకు బాగా నచ్చిన నచ్చని సినిమాలు వెల్లడించాడు చైతూ.

ప్రేమమ్‌ తన కెరీర్‌లోనే బెస్ట్‌ సినిమా అన్న నాగచైతన్య.. దడ, బెజవాడ సినిమాలు చెత్త సినిమాలన్నాడు. ఆ సినిమాలు చేసినందుకు ఇప్పటికీ బాధపడుతున్నానని తెలిపారు. మారుతి దర్శకత్వంలో తెరకెక్కిన శైలజా రెడ్డి అల్లుడు రేపు (13-09-2018) రిలీజ్ అవుతోంది. రమ్యకృష్ణ అత్తగా నటించిన ఈ సినిమాలో అను ఇమ్మాన్యూల్‌ హీరోయిన్‌గా నటించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement