
రమ్యకృష్ణ, నాగచైతన్య, అనూ ఇమ్మాన్యుయేల్
కుర్చీలో ఠీవీగా కూర్చుని ఓర కంటితో కాసింత కోపంగా అల్లుడు, కూతుర్ని (నాగచైతన్య, అనూ ఇమ్మాన్యుయేల్) చూస్తున్నారు శైలజారెడ్డి (రమ్యకృష్ణ). అల్లుడేమో అత్తని ఆటపట్టిస్తున్నట్లు చిరునవ్వులు చిందిస్తుంటే.. కూతురేమో భర్తవైపు ఆప్యాయంగా చూస్తున్నారు. నాగచైతన్య, అనూ ఇమ్మాన్యుయేల్ జంటగా రమ్యకృష్ణ ప్రధాన పాత్రలో మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘శైలజారెడ్డి అల్లుడు’.
పీడీవీ ప్రసాద్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై నాగవంశీ ఎస్. నిర్మిస్తున్న ఈ చిత్రం ఫస్ట్ లుక్‌ని సోమవారం రిలీజ్ చేశారు. ఆగస్టులో ఈ సినిమా రిలీజ్ కానుంది. ఈ ఫస్ట్ లుక్‌పై నాగచైతన్య స్పందిస్తూ – ‘‘డైరెక్టర్ మారుతిగారు ఆఫ్ స్క్రీన్ నన్ను ఎంటర్‌టైన్ చేస్తున్నట్లే ఆన్ స్క్రీన్ మిమ్మల్ని (ప్రేక్షకులు) ఎంటర్‌టైన్ చేయబోతున్నారు. సితార బ్యానర్‌లో పనిచేయడం నాకు ఎప్పుడూ సౌకర్యంగానే ఉంటుంది. రమ్యకృష్ణగారి పాత్ర చాలా స్పెషల్‌గా ఉంటుంది’’ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment