
నాగచైతన్య
అల్లుడు అండ్ టీమ్ నైట్ అంతా నిద్రపోలేదట. ఎవరీ అల్లుడు అంటే.. కేరాఫ్ శైలజారెడ్డి అన్నమాట. మరి... నిద్రపోకుండా ఏం చేశారు? అది మాత్రం సిల్వర్ స్క్రీన్‌పై చూడాల్సిందే. నాగచైతన్య హీరోగా మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘శైలజారెడ్డి అల్లుడు’. సితార ఎంటర్‌టైన్మెంట్స్ పతాకంపై నాగవంశీ, పీడీవీ ప్రసాద్ నిర్మిస్తున్నారు.
ఇందులో అనూ ఇమ్మాన్యుయేల్ కథానాయికగా నటిస్తున్నారు. రమ్యకృష్ణ కీలక పాత్ర చేస్తున్నారు. రీసెంట్‌గా ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ను రిలీజ్ చేశారు. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ నైట్ టైమ్ జరుగుతోంది. నాగచైతన్య, అనూ ఇమ్మాన్యుయేల్‌పై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారట. సగానికిపైగా షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమాను ఈ ఏడాది ఆగస్టులో రిలీజ్ చేయాలని చిత్రబృందం ప్లాన్ చేస్తోందని సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment