రమ్యకృష్ణ
‘‘నేను చేసిన వెరైటీ రోల్స్ మాత్రమే నన్ను ఇలా నిలబెట్టాయి. అలాంటివి చేస్తూనే ఉంటాను. ‘శైలజా రెడ్డి అల్లుడు’ రెగ్యులర్‌గా కనిపించే అత్తా, అల్లుళ్లు కామెడీ మూవీలా ఉండదు. చూస్తే కచ్చితంగా సర్‌ప్రైజ్ అవుతారు. ఇందులో కొత్త అత్త, కొత్త అల్లుణ్ని చూస్తారు’’ అని రమ్యకృష్ణ అన్నారు. నాగ చైతన్య, అనూ ఇమ్మాన్యుయేల్ జంటగా మారుతి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘శైలజా రెడ్డి అల్లుడు’. పీడీవీ ప్రసాద్, నాగవంశీ నిర్మించారు. ఈ సినిమా గురువారం రిలీజైంది. మంచి ఓపెనింగ్స్ సాధించిందని చిత్రబృందం పేర్కొంది.
ఈరోజు తన పుట్టిన రోజు సందర్భంగా రమ్యకృష్ణ సినిమా విశేషాలు పంచుకుంటూ – ‘‘నా బర్త్‌డే టైమ్‌లో రిలీజైన మా చిత్రం సూపర్ హిట్ అవ్వడం చాలా హ్యాపీగా ఉంది. అందరం జెన్యూన్‌గా కష్టపడ్డాం. ఇందులో మారుతిగారు నా కోసం రెండు షేడ్స్ ఉన్న పాత్ర రాశారు. చాలా స్పీడ్‌గా వర్క్ చేస్తారాయన. నా కెరీర్‌లో ఫాస్ట్‌గా కంప్లీట్ చేసిన మూవీ ఇదే. కామెడీ సీన్స్ మధ్యలో ఆపేసి మరీ నవ్వేవాళ్లం. నా చుట్టూ కామెడీ జరుగుతుంటే సీరియస్‌గా ఉండటం కష్టంగా అనిపించేది. చైతన్య వెరీ డౌన్ టు ఎర్త్. యాక్టర్‌గా చాలా బాగా ఎదుగుతున్నాడు. నన్ను కన్విన్స్ చేసే సీన్‌లో బాగా యాక్ట్ చేశాడు.
Comments
Please login to add a commentAdd a comment