Krithi Shetty: ‘‘బంగార్రాజు’ కథని 2020లో విన్నాను. ఆ తర్వాతే ‘సోగ్గాడే చిన్ని నాయనా’ సినిమాను చూశాను. అందులోని కామెడీ టైమింగ్ నాకు బాగా నచ్చింది. ఆ రెఫరెన్స్‌తో ‘బంగార్రాజు’ చేసేటప్పుడు ఒత్తిడి అనిపించలేదు. సంక్రాంతి లాంటి చక్కని సినిమా ‘బంగార్రాజు’. ఇందులో తొలిసారి ఫోక్ సాంగ్ చేశాను’’ అని హీరోయిన్ కృతీశెట్టి అన్నారు. అక్కినేని నాగార్జున, రమ్యకృష్ణ, నాగచైతన్య, కృతీ శెట్టి కాంబినేషన్‌లో తెరకెక్కిన చిత్రం ‘బంగార్రాజు’. కల్యాణ్ కృష్ణ దర్శకత్వంలో అక్కినేని నాగార్జున నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 14న విడుదలవుతోంది. ఈ సందర్భంగా ‘బంగార్రాజు’లో నాగచైతన్యకి జోడీగా నటించిన కృతీశెట్టి విలేకరులతో మాట్లాడుతూ...
► ‘బంగార్రాజు’ లో నా పాత్ర నాగలక్ష్మి గురించి కల్యాణ్ కృష్ణగారు చెప్పినప్పుడు నవ్వేశాను. ఇలాంటివారు కూడా ఉంటారా? అనిపించింది. అందుకే ఈ పాత్ర చేయడానికి ఒప్పుకున్నా. సినిమా చూశాక ప్రేక్షకులు కూడా అలాగే ఫీలవుతారనుకుంటున్నా. బీటెక్ చదివిన గ్రామ సర్పంచ్‌గా చేశాను. నా పాత్ర ఫన్‌గా ఉంటుంది. నాగార్జున సార్‌తో సినిమా అన్నప్పుడు ఎలా రిసీవ్ చేసుకుంటారో? అనిపించింది. కానీ ఆయన తోటి నటులపై చూపించిన గౌరవం, హుందాతనం చూసి ఆశ్చర్యపోయాను. నేను జూనియర్ అని కాకుండా తోటి టీమ్‌మేట్‌లా చూశారు. నాగచైతన్యగారు కూడా చాలా కూల్‌గా, సరదాగా ఉంటారు.
► నేను చదివిన సైకాలజీ సినిమా రంగానికి బాగా ఉపయోగపడింది. సైకాలజీ స్టూడెంట్‌గా అందర్నీ గమనిస్తుంటాను. నాగార్జున సార్ షాట్ లేనప్పుడు చాలా క్లాసీగా మాట్లాడతారు. షాట్ రెడీ అనగానే వెంటనే పాత్రలో లీనమవుతారు.. అది చాలా గ్రేట్. రమ్యకృష్ణగారి నుంచి కూడా చాలా నేర్చుకున్నాను.
► నేను గ్లిజరిన్ లేకుండా ఏడుపు సీన్స్ చేస్తాను. నటిగా ఎదగడానికి ఉపయోగపడే, నాకు నచ్చిన పాత్రలనే ఎంపిక చేసుకుంటాను. నాకు సంక్రాంతి గురించి పెద్దగా తెలీదు.. కానీ ‘బంగార్రాజు’ చేస్తున్నప్పుడు తెలిసింది. సంక్రాంతికి ఏ సినిమా విడుదలయినా చూస్తామని నాకు తెలిసిన తెలుగువారు చెప్పడంతో ఇక్కడివారు సినిమాని ఎంతగా ప్రేమిస్తారో అర్థమయింది.
► ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’ సినిమా పూర్తి చేశాను. ప్రస్తుతం ‘మాచర్ల నియోజకవర్గం’, రామ్‌తో మరో సినిమా చేస్తున్నాను. లేడీ ఓరియంటెడ్ కథ ఇంకా ఫైనల్ కాలేదు.
Comments
Please login to add a commentAdd a comment