Folk songs
-
కెమెరా పట్టిన్నడే సీమ దసర సిన్నోడు.. రాత్రికి రాత్రే స్టార్ సింగర్
మహబూబ్‌నగర్: నారాయణపేట జిల్లా ఊట్కూర్ మండలంలోని పెద్దజట్రం గ్రామానికి చెందిన మాడపోళ్ల ఆశప్ప, మాణిక్యమ్మ దంపతులకు ఉష, మంజుల ఇద్దరు కూతుళ్లు. ఉష గ్రామంలోని పాఠశాలలో 3వ తరగతి వరకు చదివి మానేసింది. చిన్నప్పటి నుంచే పొలం పనులకు వెళ్లేది. అయితే వీరి తల్లిదండ్రులు అనారోగ్యంతో మృతిచెందారు. దీంతో బంధువులు చేరదీసి వరుసకు మామ అయిన వ్యక్తితో పెళ్లి చేశారు. బాబు, పాప పుట్టి అనారోగ్యంతో నెలలు నిండకుండానే మృతిచెందారు. భర్తకు సైతం మతిస్థిమితం లేకపోవడంతో ఇంటి నుంచి వెళ్లిపోయాడు. దీంతో గ్రామంలో జీవనోపాధి కష్టంగా మారడంతో హైదరాబాద్‌కు వలస వెళ్లింది. అక్కడే భవన నిర్మాణ రంగంలో కూలీ పనులు చేస్తూ ఒంటరి మహిళగా జీవనం సాగిస్తుంది. పొట్ట చేతపట్టుకొని పట్నం వెళ్లిన ఓ ఒంటరి మహిళ జీవితాన్ని ఒక్కపాట సెన్సేషన్‌గా మార్చేసింది. చిన్నప్పటి నుంచి జానపద పాటలంటే ఉన్న విపరీతమై ఇష్టమే అదృష్టం వెతుక్కుంటూ వచ్చేలా చేసింది. ‘కెమెరా పట్టిన్నడే సీమ దసర సిన్నోడు’ అనే పాటతో రాత్రికి రాత్రి స్టార్ సింగర్‌గా మారింది. పాట రాసి, స్వరం కలిపి ప్రాణం పోసి అచ్చం తెలంగాణ యాస, భాషతో పల్లె జానపదాన్ని యావత్ ప్రపంచానికి చాటిచెప్పిన ఆ కళాకారిణి నారాయణపేట జిల్లా ఊట్కూర్ మండలంలోని పెద్దజట్రం గ్రామానికి చెందిన మాడపోళ్ల ఉష. ఈమె ఈ ఏడాది జూన్ 29న పాట పాడగా ఇప్పటి వరకు యూట్యూబ్‌లో 26 మిలియన్ల వ్యూస్ అంటే 2.60 కోట్ల మంది చూశారంటే పాట క్రేజ్ ఏంటో అర్థం చేసుకోవచ్చు. పదేళ్ల క్రితం హైదరాబాద్‌కు.. తాను వ్యవసాయ పనులకు వెళ్లే సమయంలో ఆడవాళ్లు పాడుకునే జానపద పాటలను శ్రద్ధగా గమనించి పాడుతూ ఉండేది. గత పదేళ్ల క్రితం జీవనోపాధి కోసం హైదరాబాద్‌కు వెళ్లింది. అక్కడే కూలీ పనులు చేసుకుంటూ తీరిక సమయంలో జానపద పాటలు పాడుతూ ఉండేది. యూట్యూబ్‌లో జానపద పాటలకు ఆదరణ పెరగడం చూసి తాను సైతం పాటలు పాడాలనే కోరికతో కొన్ని పాటలు రాసి వీడియోలు చేసింది. సరైన ఆదరణ రాకపోయినా.. పట్టువిడవకుండా పాటలు రాస్తూ.. ట్యూన్లు కలుపుతూ అవకాశాల కోసం ఎదురుచూసింది. గతంలో జగిత్యాల జోగుల వెంకటేశ్‌తో రెండు పాటలు, గొల్లపల్లి శివన్న సిరిసిల్లతో ఒక పాట పాడింది. ఓ రోజు జానపద పాటల కవర్‌పై హరీశ్ పాటేల్ ఫోన్ నంబర్ తీసుకొని ఫోన్ చేసి.. తాను జానపద పాటలు రాసి, పాడతానని అవకాశం ఇవ్వాలని కోరింది. ఆయన దగ్గరకు వెళ్లి మూడు పాటలు పాడి వినిపించింది. ఈ క్రమంలోనే కెమెరా పట్టిన్నడే సీమ దదర సిన్నోడు అనే పాట నచ్చడంతో గజ్వేల్‌లో అమూల్య స్టూడియోలో ఆమె దగ్గర పాడించి జూన్ 29న రిలీజ్ చేశారు. యూట్యూబ్‌లో వస్తున్న సెన్షేషన్ చూసి ఉష రాత్రికి రాత్రి జానపద స్టార్ సింగర్‌గా మారిపోయింది. చిన్నపిల్లలతో మొదలుకొని పెద్దల వరకు యూట్యూబ్‌లో పాట వింటూ మురిసిపోతున్నారు. చేయూత ఇవ్వండి..గ్రామంలో రేకుల షెడ్డు ఇల్లు మాత్రమే ఉంది. ప్రభుత్వం నా పరిస్థితిని గుర్తించి గృహలక్ష్మి ఇల్లుతోపాటు జీవనోపాధి కోసం దళితబంధు పథకాన్ని మంజూరు చేయాలి. నాకు జానపద పాటలంటే ఎంతో ఇష్టం. భవిష్యత్‌లో అవకాశం వస్తే సినిమా పాటలు పాడతా. పదేళ్లుగా కూలీ పనిచేస్తూ జీవనం సాగిస్తున్నా. కళాభిమానులు నా జానపద పాటలను ఆదరించి చేయూతనివ్వండి. – ఉష, జానపద కళాకారిణి, పెద్దజట్రం -
మీకు ఫోక్ సాంగ్స్ అంటే ఇష్టమా.. అయితే మీ కోసమే ప్రత్యేక ఛానెల్!
యూట్యూబ్‌లో మనం రోజు మూవీస్, మ్యూజిక్, షార్ట్ ఫిల్మ్స్, ఎడ్యుకేషన్, కుక్కింగ్, ట్రావెల్ ఇలా ప్రతి రోజు ఎదో ఒక కంటెంట్ చూస్తూనే ఉంటాం. అయితే ఇప్పటి వరకు ఫోక్ టచ్ ఉన్న ప్రైవేట్ తెలుగు సాంగ్స్ మాత్రం చాలా తక్కువే అని చెప్పచ్చు. ఇటీవల ఫోక్ సాంగ్స్‌కు విపరీతమైన ఆదరణ పెరుగుతున్న వేళ 'షేడ్స్ స్టూడియోస్' పోస్ట్ ప్రొడక్షన్ సంస్థతో కలసి 'వోక్స్ బీట్జ్' మ్యూజిక్ ఛానల్ ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా హాజరైన దర్శకులు నక్కిన త్రినాధ్ రావు, శేఖర్ మాష్టర్, హేమంత్ మధుకర్, బాల, సంగీత దర్శకులు ఆర్పీ పట్నాయక్, హీరోయిన్ మాళవిక సతీషన్ హాజరయ్యారు. (ఇది చదవండి: ప్రభాస్ 'సలార్' టీజర్ అఫీషియల్ ప్రకటన ఇదే) ఈ మ్యూజిక్ ఛానెల్ ద్వారా సంగీత ప్రియులను, అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకొనే పాటలను అందించనున్నారు. ఈ సందర్భంగా బ్లైండ్ పర్సన్ లవ్ కాన్సెప్ట్‌పై తీసిన 'నా మది', కాలేజీ వాతావరణంలో జరిగే లవ్ మెలోడీ సాంగ్ 'జారే మనసు జారే', 'వయ్యారి', 'షరీభో షరీభో', 'బులుగు చొక్కా', 'జాబిలివే' వంటి పాటలను రిలీజ్ చేశారు. దర్శకులు నక్కిన త్రినాథ రావు మాట్లాడుతూ.. 'ఇప్పుడు చూసిన సాంగ్స్ అన్నీ కూడా 'స్టోరీ టెల్లింగ్' సాంగ్స్‌లా సినిమా చూస్తున్నట్లే ఉన్నాయి. సినిమాలో పాటలు కంటే చాలా బాగున్నాయి. మంచి కాన్సెప్ట్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ ఛానెల్ ప్రేక్షకాదరణ పొందాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నా.' అని అన్నారు. ప్రముఖ కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ మాట్లాడుతూ.. 'కొత్త వాళ్లయినా ఇంత అద్భుతంగా చేసిన పాటలు సినిమాకు ఏ మాత్రం తీసిపోని విధంగా ఉన్నాయి. మీ ద్వారా చాలామంది కొత్త టాలెంట్ బయటకు వస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఇందులో నటించిన నటీనటులు టెక్నికల్ అందరూ కూడా చాలా బాగా చేశారు. మంచి కాన్సెప్ట్‌తో వస్తున్న షేడ్స్ స్టూడియోస్, వోక్స్ బీట్జ్ మ్యూజిక్ ఛానల్ కు ఆల్ ద బెస్ట్.' అని అన్నారు. (ఇది చదవండి: హీరోతో కీర్తి నిశ్చితార్థం.. వంశాన్ని ముందుకు తీసుకెళ్లలేనంటూ ఎమోషనల్) సంగీత దర్శకులు ఆర్పీ పట్నాయక్ మాట్లాడుతూ..'టాలెంట్ ఉన్న ఆర్టిస్టులు బయట చాలామంది ఉన్నారు. వారందరికీ ఈ ఛానల్ ద్వారా ఒక గుర్తింపు తీసుకొస్తున్న ఉపేంద్ర, దేవి ప్రసాద్‌కు నా ధన్యవాదాలు. వీరందరూ కలసి చేసిన పాటలు చాలా బాగున్నాయి. వీరు ఇలాగే ప్రేక్షకులకు మంచి మెసేజ్ ఇచ్చేటువంటి పాటలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా.' అని అన్నారు. -
‘నా ఫ్రెండ్‌దేమో పెళ్లి..నాకేందిర ఈ లొల్లి’.. భీమ్స్ సాంగ్ అదిరింది
ఈ మధ్య కాలంలో తెలంగాణ జానపద గీతాలకు చిత్ర పరిశ్రమలో మంచి స్పందల లభిస్తోంది. స్టార్ హీరోల సినిమాల్లో సైతం ఫోక్ సాంగ్స్ ఉంటున్నాయి. అలాగే ప్రైవేట్ ఆల్బమ్స్గాను ఈ పాటలు మార్కెట్లోకి వచ్చేస్తున్నాయి. నివృతి వైబ్స్ సంస్థ అత్యుత్తమమైన ప్రొడక్షన్ వేల్యూస్‌తో ఆడియో, విజువల్ కంటెంట్‌తో ఫోక్ సాంగ్స్‌ని చిత్రీకరించి యూట్యూబ్‌లో రిలీజ్ చేసి హిట్ కొట్టేస్తున్నాయి. ఇప్పటికే ఈ సంస్థ విడుదల చేసిన జరీ జరీ పంచెకట్టి.., గుంగులు, సిలక ముక్కుదానా, జంజీరే, వద్దన్నా గుండెల్లో సేరి వంటి పాటలకు ఆడియన్స్‌ని నుంచి మంచి స్పందల లభించిన చింది. (చదవండి: బంగారం' సినిమాలో చిన్నారి.. ఇంతలా మారిపోయిందేంటీ? ) తాజాగా ఈ సంస్థ మరో తెలంగాణ జానపద గీతాన్ని మ్యూజిక్ వీడియోగా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చింది. ‘నా ఫ్రెండ్‌దేమో పెళ్లి..నాకేందిర ఈ లొల్లి’ అంటూ సాగే ఈ పాటలో జయతి ప్రధాన భూమికను పోషించింది. (చదవండి: వెదవలకు అటెన్షన్ ఇస్తే ఇంకా రెచ్చిపోతారు : నిహారిక ) బుల్లి తెరపై వెన్నెల ప్రోగ్రామ్‌తో తిరుగులేని క్రేజ్, ఇమేజ్ను దక్కించుకున్న జయతి ఈ సాంగ్‌లో అద్భుతమైన హావ భావాలతో, మూమెంట్స్‌లో కట్టి పడేసింది. మ్యూజిక్ డైరెక్టర్ భీమ్స్ సిసిరోలియో ఈ పాటకు సాంగ్ కు సంగీత సారథ్యాన్ని వహించారు. కాస్లర్ల శ్యామ్ లిరిక్స్ అందించిన ఈ పాటను శ్రావణ భార్గవి అద్భుతంగా ఆలపించారు. -
ఫోక్ సాంగ్.. స్టెప్పులతో అదరగొట్టిన విష్ణుప్రియ
యాంకర్ విష్ణు ప్రియ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. షార్ట్ ఫిల్మ్స్ ద్వారా గుర్తింపు పొందిన భామ.. సుడిగాలి సుధీర్‌తో కలిసి ఓ షోకు యాంకర్‌గా బుల్లితెరపై రాణించింది. మరోవైపు సోషల్ మీడియాలోనూ ఫుల్ యాక్టివ్‌గా ఉంటోంది. తరచూ తన లేటెస్ట్ హాట్‌హాట్ ఫొటోలను షేర్ చేస్తూ సోషల్ మీడియా షేక్ చేస్తోంది. గతంలో మానస్‌తో కలిసి ఓ పాటకు స్టెప్పులేసిన ముద్దుగుమ్మ మరోసారి సందడి చేసింది. బిగ్ బాస్ ఫేమ్ మానస్, విష్ణు ప్రియ కలిసి డ్యాన్స్ చేసిన ‘గంగులు’ అనే జానపద సాంగ్ తాజాగా రిలీజ్ చేశారు. ప్రస్తుతం ఈ సాంగ్ యూట్యూబ్‌లో అదరగొడుతోంది. ఈ పాటకు మానస్, విష్ణుప్రియ అదిరిపోయే స్టెప్పులతో ఆకట్టుకున్నారు. ఈ సాంగ్‌కు భీమ్స్ సిసిరిలియో సంగీతం అందించగా.. జానీ మాస్టర్ శిష్యురాలు శ్రష్టి వర్మ నృత్య దర్శకత్వం వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ప్రముఖ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్, పద్మిని నాగులపల్లి, ప్రముఖ నిర్మాత జయతి పాల్గొన్నారు. -
జంపలకిడి జారు మిఠాయి సింగర్‌ని కలిసిన మంచు మనోజ్..
జంపలకడి జారు మిఠాయా.. సోషల్ మీడియా ఫాలో అవుతున్న వారికి ఈ సాంగ్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. జిన్నా మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్లో సింగర్ భారతమ్మ పాడిన ఈ పాట నెట్టింట ఎంతగానో వైరల్ అయ్యింది. సాధారణంగానే సినిమా పాటలకు, జానపథ పాటలకు ఎంతో తేడా ఉంటుంది. ఈ మధ్యకాంలో జానపథ పాటలకు ఆడియెన్స్‌లోనూ మంచి రెస్పాన్స్ కనిపిస్తుంది. ఇక జిన్నా ప్రీ రిలీజ్ ఈవెంట్లో మోహన్ బాబు స్వయంగా సింగర్ భారతమ్మని పరిచయం చేయడమే కాకుండా స్టేజి మీదకి పిలిచి ఆవిడ మా ఊరి నుంచి వచ్చారు పాట పాడతారు అంటూ ఎంకరేజ్ చేశారు. ఇక జంపలకడి జారు మిఠాయి.. అంటూ భారతమ్మ పాడిన ఈ సాంగ్ నెట్టింట తెగ వైరల్ అయ్యింది. మరోవైపు ట్రోల్స్ కూడా అదే రేంజ్లో సోషల్ మీడియాలో హల్చల్ చేశాయి. రీసెంట్గా ఈ సాంగ్‌కు రీమిక్స్ యాడ్ చేసి ఇన్‌స్టాలో రీల్స్ బాగా ట్రెండ్ అవుతున్నాయి. ఈ క్రమంలో హీరో మంచు మనోజ్ తాజాగా సింగర్ భారతమ్మను కలిశారు. ఆమెతో జంపలకడి జారు మిఠాయి పాట పాడించారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. Happy Birthday @iVishnuManchu anna :) Be positive and stay healthy always 🙌🏽❤️ #HBDVishnuManchu #JambaLakadiJaaruMittaya pic.twitter.com/elhBkboqHE — Manoj Manchu🙏🏻❤️ (@HeroManoj1) November 23, 2022 -
బతుకమ్మ, జానపద సాంగ్స్‌తో ఉర్రూతలూగిస్తున్న సింగర్స్
సాక్షి, కరీంనగర్: బతుకమ్మ తెలంగాణ సంస్కృతిని చాటిచెప్పే పండుగ. ఇందులో ప్రధానంగా పువ్వులను పూజిస్తారు. ఆడబిడ్డలు అందంగా బతుకమ్మలు పేర్చి, ఒక్కచోట ఆడిపాడతారు. బతుకమ్మ అంటే అందరికీ గుర్తొచ్చేవి బతుకులోంచి పుట్టిన బతుకమ్మ పాటలు. పండుగ సమయంలో 9 రోజులు ఈ పాటలతో వీధులన్నీ మార్మోగుతుంటాయి. కాలానికనుగుణంగా తెలంగాణలో సంప్రదాయ బతుకమ్మ పాటలు సరికొత్త సొబగులు అద్దుకొని, సామాజిక మాధ్యమాల్లో సందడి చేస్తున్నాయి. వీటికి ఎంతోమంది గాయనీగాయకులు కొత్త రెక్కలు తొడిగారు. తమ ప్రతిభతో శ్రోతలను ఉర్రూతలూగిస్తున్నారు. కరీంనగర్లో బతుకమ్మ మ్యూజిక్ చానల్ ద్వారా గేయ రచయిత పొద్దుపొడుపు శంకర్ ‘పూతాపూలన్ని పూచే లేత కొమ్మలు అక్కాసెల్లేలు తల్లిగారిల్లు’ అంటూ కొత్త పాటను విడుదల చేశారు. ఉయ్యాలో రామ ఉయ్యాలో అంటూ కరీంనగర్‌కు చెందిన అమూల్య కోటి కొత్త పాటను యూట్యూబ్‌లో సోమవారం విడుదల చేయగా ఇప్పటివరకు వేలాది మంది వీక్షించారు. తమ పాటలతో ప్రజాదరణ పొందుతున్న ఇలాంటి పలువురు గాయకులపై ప్రత్యేక కథనం. చిన్నీ మా బతుకమ్మ : తేలు విజయ కరీంనగర్‌కు చెందిన దంపతులు తేలు వెంకటరాజం–నర్సమ్మ దంపతులకు 1980లో జూన్ 21న తేలు విజయ జన్మించింది. చిన్ననాటి నుంచే తన కుటుంబసభ్యులు పాడే జానపదాలు వింటూ పెరిగింది. 1998లో ‘తండాకు వోతాండు గుడుంబా తాగుతాండు..’ అంటూ పాడి, తొలి పాటతోనే గుర్తింపు తెచ్చుకుంది. 2007లో ‘బతుకమ్మ’ సినిమాలో ‘ఊరికి ఉత్తరానా వలలో..’ అనే పాట పాడింది. 2015లో ‘చిన్నీ మా బతుకమ్మ’ పాటకు 8 లక్షల వ్యూస్ వచ్చాయి. రాష్ట్ర ప్రభుత్వం నుంచి ‘ఉత్తమ ఉద్యమ గాయనిగా’ అవార్డు అందుకుంది. ఈ ఏడాది పువ్వుల బతుకమ్మతోపాటు మరో 6 బతుకమ్మ పాటలు పాడింది. బతుకమ్మా.. బతుకమ్మా : చిలివేరు శ్రీకాంత్ కరీంనగర్‌లోని సాయినగర్ చెందిన చిలివేరు పోచమ్మ–విజయ్ దంపతులకు శ్రీకాంత్ 1985 నవంబర్ 24న జన్మించారు. నాన్న స్వయంగా భజనలు, కీర్తనలు, అక్క భక్తి పాటలు పాటడంతో వాటిపై ఇతనికి మక్కువ ఏర్పడింది. ఇంటర్మీడియట్ నుంచే ప్రముఖ టెలివిజన్ షోలో గాయకుడిగా తన ప్రతిభ చాటుకున్నాడు. పాడుతా తీయగా, వన్స్‌మోర్ ప్లీజ్, స్టార్ అంత్యాక్షరీ షోలో పాల్గొని, పేరు తెచ్చుకున్నాడు. గాన గంధర్వుడు బాల సుబ్రహ్మణ్యంపై పాటలు రాసి, పాడాడు. బతుకమ్మా.. బతుకమ్మా.. మా తల్లీ బతుకమ్మ పాటను శ్రీకాంత్ స్టూడియో యూట్యూబ్ చానల్ ద్వారా గత సోమవారం సాయంత్రం విడుదల చేయగా 19 గంటల్లో 4,500 వ్యూస్ వచ్చాయి. ఓ నిర్మలా.. : వొల్లాల వాణి కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలంలోని ఆసిఫ్‌నగర్‌కు చెందిన వొల్లాల వాణి 2016లో పాడిన ఘల్లు ఘల్లునా.. ఓ నిర్మలా అనే బతుకమ్మ పాటతో గుర్తింపు పొందింది. దీనికి ఇప్పటివరకు 72 లక్షల వ్యూస్ వచ్చాయి. ఏటా బతుకమ్మ పండుగకు ఏ గ్రామంలో చూసినా ఇదే పాట మారుమోగుతోంది. ఆస్ట్రేలియా, దుబాయ్, ఖతర్ దేశాల్లో జరిగిన వేడుకల్లో తన పాటలతో హోరెత్తించింది. తెలంగాణ ఆవిర్భావం తర్వాత జిల్లా ఉత్తమ గాయనిగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి అవార్డు అందుకుంది. ఈ నెల 24న విడుదలైన కోడి కూత వెట్టగానే రాంభజన అనే పాటకు 2 లక్షలకు పైగా వ్యూస్ రావడం గమనార్హం. నల్లమద్ది చెట్టు కింద.. : సుంకోజు నాగలక్ష్మి సుంకోజు నాగలక్ష్మిది రాజన్నసిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలంలోని బందనకల్. బతుకుదెరువు కోసం సిరిసిల్లకు వచ్చిన ఈమె కుటుంబం తంగళ్లపల్లి మండల కేంద్రంలో స్థిరపడింది. చిన్నతనం నుంచే నాగలక్ష్మికి పాటలన్నా, పాడటం అన్నా ఇష్టం. అర్కమిత్ర ఫౌండేషన్ నిర్వహించిన పోటీల్లో గెల్చుకున్న బహుమతి ఆమెకు స్ఫూర్తినిచ్చింది. బొజ్జ రేవతి దగ్గర కర్నాటక సంగీతాన్ని సాధన చేసి, తన పాటకు శాస్త్రీయతను జోడించింది. మొదటి రెండేళ్లలోనే సుమారు 80 జానపద గీతాలను ఆలపించింది. నల్లమద్ది చెట్టు కింద అనే పాటతో పేరు తెచ్చుకుంది. యూట్యూబ్ చానల్ నిర్వహిస్తూ 30 మిలియన్లకు పైగా వ్యూయర్షిప్ సంపాదించింది. ఇటీవల బతుకమ్మ కోసం ఆలపించిన పాటలూ జనాదరణ పొందాయి. ఏమే పిల్లా అన్నప్పుడల్లా.. : శిరీష రాజన్నసిరిసిల్ల జిల్లా కేంద్రంలోని బద్దం ఎల్లారెడ్డినగర్‌కు చెందిన ఆర్ఎంపీ వైద్యుడు అశోక్ కూతురు శిరీష. పాటల ప్రయాణంలో దూసుకుపోతోంది. చిన్ననాడు దసరా ఉత్సవాల్లో పాడాలని ప్రోత్సహించిన నాన్న మాటలే ఆ తర్వాత కాలంలో తనకో కెరీర్‌ను సృష్టించాయి. పసితనంలో అక్కడే ఆర్కెస్ట్రా నిర్వహిస్తున్న ప్రదీప్ శిరీష స్వర మాధుర్యం, లయ జ్ఞానాన్ని గుర్తించాడు. శిక్షణ ఇస్తే మంచి గాయని అవుతుందని ఆమె తండ్రిని ఒప్పించాడు. ఫలితంగా ఆర్కెస్ట్రా సింగర్‌గా చాలాచోట్ల కచేరీలు చేసింది. తర్వాత యూట్యూబ్ స్టార్ అయ్యింది.నాలుగేళ్లలోనే వెయ్యి పాటలు ఆలపించిన శిరీష, పాటలు, వాటి షూటింగ్‌లతో బిజీ అయిపోయింది. ఏమే పిల్లా అన్నప్పుడల్లా.. అనే జానపద పాటతో ప్రజల గుండెల్లో చోటు దక్కించుకుంది. సినీ తారలు సైతం ఈ పాటకు స్టెప్పులేశారు. ప్రస్తుతం యూట్యూబ్‌లో శిరీష పాటలకు లక్షల సంఖ్యలో వ్యూయర్స్ ఉన్నారు. ఇటీవల రూపొందించిన బతుకమ్మ పాటలు కూడా మంచి గుర్తింపు పొందాయి. -
వర్షిణి వేదికెక్కి స్టెప్పేసిందంటే చాలు...
కరీంనగర్ (కోల్‌సిటీ) : సాధారణ కుటుంబంలో పుట్టిన ఓ యువతి సొంత ప్రతిభతో యూట్యూబ్ స్టార్ గా రాణిస్తోంది. తన డ్యాన్స్‌తో ఆకట్టుకుంటూ మల్టీ టాలెంటెడ్ కళాకారిణిగా గుర్తింపు పొందింది. ఆమె గోదావరిఖని మార్కండేయకాలనీకి చెందిన వరుమణి వర్షిణి. తెలంగాణ జానద పాటలు, దుమ్మురేపే డీజే సాంగ్స్‌కు వర్షిణి వేదికెక్కి స్టెప్పేసిందంటే చాలు... ఈలలు, చప్పట్లు. యువతను ఉర్రూతలాడించే జానపద నృత్యాలతో ఆకట్టుకుంటున్న వర్షిణీ డ్యాన్సర్‌గా, నటిగా, సింగర్‌గా, యాంకర్, యూట్యూబ్ స్టార్‌గా బహుముఖ రంగాల్లో గుర్తింపు తెచ్చుకుంటోంది. అనేక సాంస్కృతిక కార్యక్రమాల్లో నృత్య ప్రదర్శనలిస్తూ తన ప్రత్యేకతను చాటుకుంటోంది. ఉత్తమ నృత్యకారిణిగా అవార్డు... జానపద నృత్యంపై ఇంట్రెస్ట్ ఉన్న వర్షిణి... కరోనా లాక్డౌన్ సమయంలో చేసిన నృత్య ప్రదర్శన వీడియోను టిక్‌టాక్‌లో అప్లోడ్ చేయగా, ఆ వీడియో వైరల్ అయ్యింది. వర్షిణి నృత్య ప్రదర్శకు అబ్బురపడిన ఎన్ఎస్ మ్యూజిక్ యూట్యూబ్ ఛానల్ నిర్వాహకులు మైపాల్ ‘ఓ పిల్లగో...’ పాటకు వర్శిణితో నృత్య ప్రదర్శన చిత్రీకరించారు. ఇటీవల చిత్రీకరించిన ‘ఏమి జేద్దునే అవ్వో...’ ఈ పాటలో వర్షిణి చేసిన నృత్య ప్రదర్శనకు మూడు మిలియన్స్ వరకు వ్యూస్ వచ్చాయి. ‘పున్నాపు వెన్నెల వలలో...’ పాటకు కూడా 10 మిలియన్స్ వరకు వ్యూస్ రావడం గమనార్హం. ఇప్పటి వరకు 135 జానపదం పాటలపై నృత్య ప్రదర్శన చేసిన వర్షిణి, నాలుగైదు షార్ట్‌ఫిల్మ్‌ల్లో కూడా నటించింది. జబర్దస్త్ బృందం వెంకీ–మంకీ, రాజమౌళి ఫేంలో ‘మోరియా మెరియా..’ పాటకు, అలాగే ‘కర్రెకోడి గరం మసాలా...’ పాటలకు ఆకట్టుకునే నృత్యం చేసింది. ఈ ఏడాది ఏప్రిల్‌లో జగిత్యాలలోని రాయికల్ మండలంలో వర్షిణిని, ‘ఉత్తమ నృత్యకారిణి’ అవార్డుతో ఆణిముత్యం కల్చరల్ డ్యాన్స్ అకాడమీ సత్కరించింది. ఇటీవల గోదావరిఖనిలో జరిగిన ఓ కార్యక్రమంలో మంత్రి కొప్పుల ఈశ్వర్, ఎమ్మెల్యే కోరుకంటి చందర్ కూడా వర్షిణిని ఘనంగా సత్కరించారు. సినిమాల్లో నటించాలనే కోరిక.. మంచి డ్యాన్సర్, నటిగా గుర్తింపు తెచ్చుకోవడానికి క్రమశిక్షణతో శ్రమిస్తున్నాను. సినిమాల్లో నటించాలని కోరిక. అలాగే వృత్తిపరంగా మంచి ప్రభుత్వ ఉపాధ్యాయురాలిగా ఉద్యోగం సాధించి, ఉత్తమ టీచర్‌గా ఎదగాలని ఉంది. మా తల్లిదండ్రుల ప్రోత్సాహం ఎక్కువగా ఉంది. – వరుమణి వర్షిణి తల్లిదండ్రుల ప్రోత్సాహంతో.. ప్రైవేట్ విద్యాసంస్థల్లో ఉపాధ్యాయులుగా పనిచేస్తున్న తల్లిదండ్రులు వాణి, వేణుమాధవ్ కూతురు వర్షిణిని జానపద నృత్యంలో ప్రోత్సహిస్తున్నారు. ప్రైవేట్ కాలేజీలో డిగ్రీ సెకండియర్ చదువుతున్న వర్షిణికి నృత్యం అంటే ప్రాణం. అలాగే నటన, యాంకరింగ్ అంటే కూడా చాలా ఇష్టం. కూతురు ఇష్టాలను గుర్తించిన తల్లిదండ్రులు, చదువు తోపాటు జాపనద నృత్యంలో రాణించేలా అండగా నిలుస్తున్నారు. సర్వేశ్ డ్యాన్స్ ఇన్స్టిట్యూట్లో 2వ తరగతి నుంచే ప్రత్యేక నృత్య శిక్షణ తీసుకుంది. -
గ్లిజరిన్ లేకుండానే ఏడ్చేశాను
Krithi Shetty: ‘‘బంగార్రాజు’ కథని 2020లో విన్నాను. ఆ తర్వాతే ‘సోగ్గాడే చిన్ని నాయనా’ సినిమాను చూశాను. అందులోని కామెడీ టైమింగ్ నాకు బాగా నచ్చింది. ఆ రెఫరెన్స్‌తో ‘బంగార్రాజు’ చేసేటప్పుడు ఒత్తిడి అనిపించలేదు. సంక్రాంతి లాంటి చక్కని సినిమా ‘బంగార్రాజు’. ఇందులో తొలిసారి ఫోక్ సాంగ్ చేశాను’’ అని హీరోయిన్ కృతీశెట్టి అన్నారు. అక్కినేని నాగార్జున, రమ్యకృష్ణ, నాగచైతన్య, కృతీ శెట్టి కాంబినేషన్లో తెరకెక్కిన చిత్రం ‘బంగార్రాజు’. కల్యాణ్ కృష్ణ దర్శకత్వంలో అక్కినేని నాగార్జున నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 14న విడుదలవుతోంది. ఈ సందర్భంగా ‘బంగార్రాజు’లో నాగచైతన్యకి జోడీగా నటించిన కృతీశెట్టి విలేకరులతో మాట్లాడుతూ... ► ‘బంగార్రాజు’ లో నా పాత్ర నాగలక్ష్మి గురించి కల్యాణ్ కృష్ణగారు చెప్పినప్పుడు నవ్వేశాను. ఇలాంటివారు కూడా ఉంటారా? అనిపించింది. అందుకే ఈ పాత్ర చేయడానికి ఒప్పుకున్నా. సినిమా చూశాక ప్రేక్షకులు కూడా అలాగే ఫీలవుతారనుకుంటున్నా. బీటెక్ చదివిన గ్రామ సర్పంచ్‌గా చేశాను. నా పాత్ర ఫన్‌గా ఉంటుంది. నాగార్జున సార్‌తో సినిమా అన్నప్పుడు ఎలా రిసీవ్ చేసుకుంటారో? అనిపించింది. కానీ ఆయన తోటి నటులపై చూపించిన గౌరవం, హుందాతనం చూసి ఆశ్చర్యపోయాను. నేను జూనియర్ అని కాకుండా తోటి టీమ్మేట్లా చూశారు. నాగచైతన్యగారు కూడా చాలా కూల్‌గా, సరదాగా ఉంటారు. ► నేను చదివిన సైకాలజీ సినిమా రంగానికి బాగా ఉపయోగపడింది. సైకాలజీ స్టూడెంట్‌గా అందర్నీ గమనిస్తుంటాను. నాగార్జున సార్ షాట్ లేనప్పుడు చాలా క్లాసీగా మాట్లాడతారు. షాట్ రెడీ అనగానే వెంటనే పాత్రలో లీనమవుతారు.. అది చాలా గ్రేట్. రమ్యకృష్ణగారి నుంచి కూడా చాలా నేర్చుకున్నాను. ► నేను గ్లిజరిన్ లేకుండా ఏడుపు సీన్స్ చేస్తాను. నటిగా ఎదగడానికి ఉపయోగపడే, నాకు నచ్చిన పాత్రలనే ఎంపిక చేసుకుంటాను. నాకు సంక్రాంతి గురించి పెద్దగా తెలీదు.. కానీ ‘బంగార్రాజు’ చేస్తున్నప్పుడు తెలిసింది. సంక్రాంతికి ఏ సినిమా విడుదలయినా చూస్తామని నాకు తెలిసిన తెలుగువారు చెప్పడంతో ఇక్కడివారు సినిమాని ఎంతగా ప్రేమిస్తారో అర్థమయింది. ► ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’ సినిమా పూర్తి చేశాను. ప్రస్తుతం ‘మాచర్ల నియోజకవర్గం’, రామ్‌తో మరో సినిమా చేస్తున్నాను. లేడీ ఓరియంటెడ్ కథ ఇంకా ఫైనల్ కాలేదు. -
భీమ్లానాయక్: దూసుకుపోతున్న దుర్గవ్వ.. ట్రెండింగ్‌లో ‘అడవి తల్లి’
సాక్షి, కోటపల్లి(ఆదిలాబాద్): టాలీవుడ్లో జానపదాల హోరు వినిపిస్తోంది. చిన్న సినిమాలకే కాకుండా.. పెద్ద సినిమాలు సైతం జానపద జపం చేస్తున్నాయి. కూలీనాలి చేసుకుంటూ అలసట తెలియకుండా జీవనశైలిని వర్ణిస్తూ.. ప్రకృతిని ఆరాధిస్తూ.. దేవతలను కొలుస్తూ పాడేదే జానపదం. జనం నుంచి పుట్టిన పాటకు సమాజంలో ఎప్పటికీ ఆదరణ ఉంటుంది. ప్రస్తుతం పల్లె పాటలకు మళ్లీ ఆదరణ లభిస్తుండటంతో జానపద కళాకారులు సినిమా రంగంలో రాణిస్తున్నారు. ఈ కోవలోనే పల్లె పాటలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న మంచిర్యాల జిల్లాకు చెందిన కుమ్మరి దుర్గవ్వ అనూహ్యంగా ఓ స్టార్ హీరో సినిమాలో పాటపాడే అవకాశం దక్కించుకుంది. ఆమె పాడిన ‘అడవి తల్లి’ పాట రెండు తెలుగు రాష్ట్రాల్లో మారుమోగుతోంది. సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో ఉంది. పల్లె పాటను ప్రాణం పెట్టి పాడిన సింగర్ కోసం నెటిజన్లు తీవ్రంగా వెతుకుతున్నారు. దుర్గవ్వ పాటకు ప్రతిఒక్కరూ ఫిదా అవుతున్నారు. గతంలోనూ ఈమె తెలుగుతోపాటు మరాఠీలోనూ అనేక పాటలు పాడింది. కళాకారులతో కుమ్మరి దుర్గవ్వ మారుమూల గ్రామం నుంచి.. మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం రొయ్యలపల్లి గ్రామానికి చెందిన కుమ్మరి దుర్గవ్వ భర్త రాజయ్య చాలా ఏళ్ల క్రితమే మరణించాడు. దుర్గవ్వకు కుమార్తె శైలజ, కుమారుడు ప్రభాకర్ ఉన్నారు. నిరుపేద కావడంతో కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తుండేది. వరినాట్లు, పొలం పనులకు వెళ్లినప్పుడు దుర్గవ్వ తనకు వచ్చిన జానపద పాటలు పాడేది. మంచిర్యాలలో నివాసం ఉంటున్న ఆమె కుమార్తె శైలజ తల్లితో పాటలు పాడిస్తూ యూట్యూబ్ అప్లోడ్ చేసేది. ఇలా దుర్గవ్వ పాడిన పాటలు హిట్ కావడంతో మంచిర్యాలకు చెందిన పలువురు జానపద కళాకారులు తమ ఆల్బమ్‌లలో పాటలు పాడించారు. ఆ పాటలు కూడా పాపులర్ కావడంతో మల్లిక్‌తేజ, మామిడి మౌనిక వంటి జానపద కళాకారులు దుర్గవ్వ కళను గుర్తించి అవకాశం ఇచ్చారు. సిరిసిల్ల చిన్నది.. నాయితల్లే.. అనే పాటతోపాటు ‘ఉంగురమే.. రంగైనా రాములాల టుంగూరమే’ అనే పాటకు ప్రజల్లో మంచి గుర్తింపు వచ్చింది. మామిడి మౌనిక, సింగర్ మల్లిక్‌తేజ సహకారంతో టాలీవుడ్ స్టార్హీరో సినిమాలో పాడే అవకాశం వచ్చిందని దుర్గవ్వ కుమార్తె శైలజ తెలిపారు. ‘అమ్మకు సినిమాలో పాడే అవకాశం రావడం చాలా సంతోషంగా ఉందని’ శైలజ ‘సాక్షి’కి ప్రత్యేకంగా తెలిపారు. ప్రస్తుతం దుర్గవ్వ హైదరాబాద్‌లో షూటింగ్లో బిజీగా ఉన్నట్లు కుటుంబసభ్యులు వెల్లడించారు. -
Bheemla Nayak: ‘అడవి తల్లి’ పాట పాడిన దుర్గవ్వ ఎవరు? ఆమె నేపథ్యం ఏంటి?
Adavi Thalli Mata Singer: పవర్ స్టార్ పవన్ కల్యాణ్, రానా దగ్గుబాటి మల్టీసారర్‌గా వస్తున్న చిత్రం 'భీమ్లా నాయక్'. ఈ సినిమాకు సాగర్ కె చంద్ర దర్శకత్వ వహించగా తమన్ స్వరాలు సమకూరుస్తున్నారు. త్రివిక్రమ్ స్క్రీన్ ప్లే – మాటలు అందిస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా చిత్రాన్ని జనవరి 12న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. రిలీజ్ డేట్ దగ్గరపడుతుండడంతో మేకర్స్ ప్రమోషన్స్ స్టార్ట్ చేశారు. అందులో భాగంగా ఇప్పటికే మూడు పాటలను విడుదల చేశారు. తాజాగా ఈ సినిమా నుంచి నాలుగో సాంగ్ విడుదలైంది. ‘అడవి తల్లి’అనే ఈ పాట విడుదలైన కొన్ని గంటల్లోనే యూట్యూబ్‌లో రికార్ట్ స్థాయి వ్యూస్‌తో దూసుకెళ్తుంది. ‘కిందున్న మడుసులకా పోపాలు తెమలవు.. పైనున్న సామేమో కిమ్మని పలకడు... దూకేటి కత్తులా కనికరమెరగవు.. అంటుకున్న అగ్గిలోన ఆనవాళ్లు మిగలవు..’అంటూ సాగా ఈ ‘అడవి తల్లి మాట’పాటకు రామజోగయ్యశాస్త్రీ లిరిక్స్ అందించగా, కుమ్మరి దుర్గవ్వ, సాహితి చాగంటి అద్భుతంగా ఆలపించారు. ఈ పాటకు మంచి రెస్పాన్స్ వస్తుండడంతో ఈ పాట పాడిన సింగర్ గురించి వెతకడం ప్రారంభించారు నెటిజన్స్. కుమ్మరి దుర్గవ్వ ఎవరు? ఆమె నేపథ్యం ఏంటి? అని నెటిజన్స్ ఆరా తీస్తున్నారు. దుర్గవ్వ మంచిర్యాల జిల్లాకు చెందినది. ఆమె చదువుకోలేదు. పొలం పనులకు వెళ్లినప్పుడు జానపదాలను పాడుతూ ఉంటుంది. తెలుగుతో పాటు మరాఠీలోనూ ఎన్నో పాటలు పాడారు. ఆమె పాడిన జానపదాల్లో.. 'ఉంగురమే రంగైనా రాములాల టుంగురమే', 'సిరిసిల్లా చిన్నది' వంటి పాటలు బాగా పాపులర్ అయ్యాయి. దీంతో ఆమెకు 'భీమ్లా నాయక్'లో ‘అడవి తల్లి’పాట పాడే అవకాశం వచ్చింది. ఈ పాటతో దుర్గవ్వ మరింత హైలైట్ అయింది. -
బతుకమ్మ కొత్త పాట: ‘తెల్ల తెల్లారింది తమ్ముళ్లు..’ వైరల్
తెలంగాణ ప్రజలు జరుపుకునే అతి పెద్ద పండగల్లో బతుకమ్మ ఒకటి. సహజ సౌందర్యానికి ప్రతీక బతుకమ్మ పండగ. ఒకప్పుడు పల్లెల్లో మాత్రమే కనిపించే బతుకమ్మ వేడుకలు ఇప్పుడు పట్టణ ప్రజలు సైతం అంగరంగ వైభవంగా జరుపుకుంటారు. ఇక తెలంగాణ ప్రత్యేక రాష్టం వచ్చినప్పుటి నుంచి బతుకమ్మ పండగ దేశవ్యాప్తంగా గుర్తింపు పొందుతుంది. అంతేగాక ప్రతి ఏడాది బతుకమ్మ పాటలు రాష్ట్రంతో పాటు ప్రపంచ దేశాల్లోను మారుమోగుతున్నాయి. బతుకమ్మ పండగ వచ్చిందంటే చాలు.. పలు ప్రైవేట్ ఆల్బమ్స్ పుట్టుకొస్తాయి. తాజాగా ఓ ప్రైవేట్ ఆల్బమ్ ‘సాక్షి’వేదికగా రిలీజ్ అయింది. ‘తెల్ల తెల్లారిదింది తమ్ముళ్లు.. బతుకమ్మ పండగ నేడు తమ్ముళ్లు’అంటూ సాగే ఈ పాట.. బతుకమ్మ పండగ విశిష్టతను తెలియజేస్తుంది. -
బిగ్‌బాస్: లేడీ అర్జున్‌రెడ్డికి వరుస ఆఫర్లు
Bigg Boss 5 Telugu: బుల్లితెర రియాలిటీ షో బిగ్‌బాస్‌కున్న క్రేజ్ గురించి ప్రత్యకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ ఒక్క షోతో రాత్రికి రాత్రే స్టార్స్‌గా మారిన వాళ్లు ఎంతో మంది ఉన్నారు. బిఫోర్ బిగ్‌బాస్, ఆఫ్టర్ బిగ్‌బాస్ ఎఫెక్ట్ అనేంతలా కొందరి జీవితాలనే మార్చేసింది ఈ షో. ఇక బిగ్‌బాస్ అనంతరం కంటెస్టెంట్లకు ఉన్న క్రేజ్‌ను బట్టి ఆఫర్స్ వెల్లువెత్తుతాయి. తాజాగా బిగ్‌బాస్ సీజన్-5 లేడీ అర్జున్ రెడ్డి పేరు సంపాదించిన లహరికి హౌస్ నుంచి బయటకు వచ్చాక బాగానే ఆఫర్లు వస్తున్నాయి. తాజాగా ఓ ఫోక్ సాంగ్ కోసం డీ గ్లామరస్ లుక్‌లో కనిపించి ఆశ్చర్యపరిచింది. ఇప్పటికే ఈ సాంగ్‌కు సంబంధించిన ప్రోమో రిలీజ్ అయ్యింది. దీంతో పాటు సినిమాల్లో సైతం లహరికి మంచి ఆఫర్లు వస్తున్నట్లు టాక్. కాగా సారీ నాకు పెళ్లైంది, అర్జున్‌రెడ్డి, జాంబిరెడ్డి చిత్రాల్లో నటించిన ఈ భామకు ఇండస్ట్రీలో అనుకున్నంత గుర్తింపు రాలేదు. అయితే బిగ్‌బాస్ షోతో కాస్త గుర్తింపు వచ్చిందనుకున్న సమయంలో దురదృష్టం కొద్దీ ఆమె మూడో వారమే ఎలిమినేట్ అయ్యింది. అయితే సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ అభిమానులతో టచ్‌లో ఉంటుంది. View this post on Instagram A post shared by Lahari Shari (@lahari_shari) -
యూట్యూబ్‌ను షేక్ చేస్తున్న మరో ఫోక్‌సాంగ్
ఈ మధ్యకాలంలో ఫోక్ సాంగ్స్‌కి మంచి ఆధరణ లభిస్తుంది. దీంతో భారీ బడ్జెట్ సినిమాల్లో కశ్చితంగా ఒక ఫోక్ సాంగ్ ఉండేలా ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. ఈ క్రమంలో ఇటీవలె విడుదలైన సారంగదరియా, బుల్లెట్ బండి వంటి పాటలు ఎంతలా హిట్ అయ్యాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తాజాగా ‘వరుడు కావలెను’సినిమా నుంచి రిలీజైన “దిగు దిగు నాగ” అనే ఫోక్ సాంగ్ యూట్యూబ్‌ను షేక్ చేస్తుంది. ఇప్పటివరకు ఈ పాటకు 20 మిలియన్‌కి పైగా వ్యూస్ వచ్చాయి. అనంత్ శ్రీరామ్ రాసిన ఈ పాటను శ్రేయా గోషల్ ఆలపించింది. థమన్ సంగీతం అందించారు. నాగ శౌర్య, రీతూ వర్మ జంటగా నటించిన ఈ సినిమా నవంబర్ 4న ప్రేక్షకుల ముందుకు రానుంది. లక్ష్మీ సౌజన్య ఈ సినిమాతో దర్శకురాలిగా పరిచయం కానుంది. సితార ఎంటర్టైన్మెంట్ పతాకంపై సూర్య దేవర నాగవంశీ నిర్మించిన ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. త్వరలోనే ప్రమోషన్స్‌ను మొదలుపెట్టేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. 20M+ Views for Folk Sensation #DiguDiguDiguNaaga💥🥁 ▶️https://t.co/U7F59YlUAV 🎵 @MusicThaman 🎤 @shreyaghoshal ✍️ #AnanthaSriram#VaruduKaavalenu @IamNagashaurya @riturv @LakshmiSowG @vamsi84 @Composer_Vishal @SitharaEnts @adityamusic pic.twitter.com/MByedtS4Nc — Aditya Music (@adityamusic) October 11, 2021 -
‘బుల్లెట్టు బండి’ పాట సరికొత్త రికార్డ్
వెబ్ ప్రత్యేకం: తెలంగాణ యాసలో ఓ అమ్మాయి పెళ్లిపై పెట్టుకున్న ఆశలను ‘నీ బుల్లెట్టు బండెక్కి వచ్చేత్తా పా’ అనే పాట కళ్లకు కట్టేలా ఉంది. ఈ పాట సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఈ పాట లేనిది ఏ వేడుక కూడా జరగడం లేదు. తాజాగా ఈ పాట యూట్యూబ్‌లో సరికొత్త రికార్డు సృష్టించింది. ఏకంగా వంద మిలియన్ల క్లబ్లో చేరిపోయింది. అత్యధిక వ్యూస్ పొందిన జానపద పాటగా నిలిచింది. చదవండి: ఎంఏ, బీఈడీ చదివి మేస్త్రీ పనికి యువతి రచయిత లక్ష్మణ్ సాహిత్యం అందించగా ప్రముఖ గాయని మోహన భోగరాజు పాడారు. బ్లూ రాబిట్ ఎంటర్టైన్మెంట్ సంస్థ నిర్మాణంలో ఎస్కే బాజి సంగీతం అందించిన ఈ పాట ఈ ఏడాది ఏప్రిల్ 7వ తేదీన యూట్యూబ్‌లో విడుదలైంది. ఆడపిల్ల పుట్టింటి నుంచి మెట్టినింటికి వెళ్లేందుకు ఎలాంటి ఆశలు.. ఊసులు పెంచుకుని ఉంటుందో ఈ పాటలో ఎంతో హృద్యంగా ఉంటుంది. ఆడవారినే కాక పురుషులను కూడా ఈ పాట ఆకట్టుకుంటోంది. అయితే ఈ పాటకు ఓ నవ వధువు డ్యాన్స్‌తో మరింత వైరల్‌గా మారిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి ఈ పాట తెలుగు రాష్ట్రాలతో పాటు తెలుగువారు ఉండే ప్రతి చోటకు వెళ్లింది. తాజాగా ఆ పాట వంద మిలియన్ల క్లబ్లో చేరింది. పది కోట్ల మందికి పైగా ఆ పాటను విని ఎంజాయ్ చేశారు. ఇది ఒక్క యూట్యూబ్‌లోనే. మిగతా సోషల్ మీడియాలను పరిగణనలోకి తీసుకుంటే వ్యూస్ భారీగా ఉంటాయి. వంద మిలియన్లు దాటడంపై గాయని మోహన భోగరాజు స్పందిస్తూ.. ‘నా తొలి పాట మీ అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నా’ అని పోస్టు చేసింది. చదవండి: కీడు శంకించిందని గాంధీ విగ్రహాన్ని పక్కన పడేశారు -
వైరల్ వీడియో: బుట్టబొమ్మ అదిరిపోయే స్టెప్స్... ఫిదా అవ్వాల్సిందే!
-
బుట్టబొమ్మ అదిరిపోయే స్టెప్స్... ఫిదా అవ్వాల్సిందే!
సాక్షి, హైదరాబాద్: ప్రముఖ గాయని మోహన భోగరాజు ఆలపించిన బుల్లెట్ బండి పాట హవా ఇంకా కొనసాగుతూనే ఉంది. ‘నీ బుల్లెట్టు బండెక్కి వచ్చేత్తపా.. అందాల దునియానే చూపిత్తపా’ అనే పాట ఏప్రిల్ 7న యూ ట్యూబ్‌లో అప్లోడ్ చేసింది మొదలు దూసుకుపోతోనే ఉంది. ‘ డుగ్గు డుగ్గు’ అంటూ ఈ పాట నెట్టింట్లో చేసిన హడావిడి అంతా ఇంతా కాదు. దీనికి తోడు గోదావరిఖనికి చెందిన కొత్త పెళ్లి కూతురు సాయిశ్రీ అదిరిపోయే డ్యాన్స్‌తో మరింత క్రేజ్ పెంచేసింది. మరోవైపు సీనియర్ సిటిజన్లతో కూడా స్టెప్పులేయించేస్తోంది ఈ బుల్లెట్ బండి. ఇటీవల ఒక పెద్దావిడ చేసిన మరో అద్బుతమైన డ్యాన్స్ నెటిజనులను ఆకట్టుకుంది. ఇక తాజాగా తూర్పుగోదావరికి చెందిన ఓ చిన్నారి మరింత ఫిదా చేస్తోంది. తన చిట్టి చిట్టి పాదాలతో లయబద్ధంగా నృత్యం చేస్తూ చక్కటి అభినయంతో ఈ బుట్టబొమ్మ ఔరా అనిపిస్తోంది. అదేమిటో మీరూ చూసేయండి ఒకసారి. చదవండి : ‘బుల్లెట్టు బండి’ పాట 22 రోజుల కష్టం: రచయిత లక్ష్మణ్ -
‘బుల్లెట్టు బండి’ పాట 22 రోజుల కష్టం: రచయిత లక్ష్మణ్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ యాసలో వచ్చిన వినసొంపైన పాట ‘బుల్లెట్టు బండి’ సోషల్ మీడియాను షేక్ చేసింది. ఆ పాటకు ఓ నవ వధువు డ్యాన్స్ చేసి భర్తను సర్ప్రైజ్ చేసిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి ఆ పాట జనాల్లో మార్మోగుతోంది. ఏ వేడుక జరిగినా.. ఏ శుభకార్యం జరిగినా ‘బుల్లెట్టు బండి’ పాట లేనిది జరగడం లేదు. అంతగా ట్రెండింగ్ అయిన ఆ పాటను రాసిన రచయిత గురించి సర్వత్రా చర్చ జరుగుతోంది. పాట రాసింది లక్ష్మణ్ అని తెలుసు కానీ.. ఆయన ఎక్కడి వ్యక్తో... ఏం చేస్తుంటాడో తెలుసుకోండి. చదవండి: ‘బుల్లెట్టు బండి’ వధువుకు బంపర్ ఆఫర్ పాటల రచయిత కాటికె లక్ష్మణ్ స్వస్థలం రంగారెడ్డి జిల్లా కేశంపేట మండలం నిర్దవెల్లి గ్రామం. వీరిది పేద కుటుంబం. లక్ష్మణ్‌తో పాటు రామ్ కూడా జన్మించాడు. అంటే వీరిద్దరూ కవల పిల్లలు. వీరిద్దరినీ రామ్‌లక్ష్మణ్‌గా పేర్కొంటారు. రామ్ గాయకుడిగా గుర్తింపు పొందగా లక్ష్మణ్ రచయితగా రాణిస్తున్నారు. వీరిద్దరూ కలిసి జానపద పాటల ఆల్బమ్స్ చేస్తూ సోషల్ మీడియాలో గుర్తింపు పొందారు. తెలంగాణ యాసలో ఎంతో ఆకట్టుకునేలా రాయడం లక్ష్మణ్ ప్రత్యేకం. సినిమా రంగంపై ఆసక్తితో రామ్ లక్ష్మణ్ హైదరాబాద్‌కు వచ్చారు. ఉపాధి కోసం ఎన్నో ప్రైవేటు ఆల్బమ్స్, జానపద పాటలు పాడారు. లక్ష్మణ్ ఇప్పటివరకు దాదాపు 300 వరకు పాటలు రాశాడు. ఆ పాటలను రామ్ పాడాడు. ఆ పాటలు కొన్ని సినిమాల్లో కూడా వచ్చాయి. ‘నువ్వంటే పిచ్చి, గాయపడిన మనసు’ ఆల్బమ్స్‌తో ఈ సోదరులు ఎంతో గుర్తింపు పొందారు. అచ్చమైన పల్లె భాషలో రాయాలని నిర్ణయించుకున్నట్లు లక్ష్మణ్ తెలిపారు. అయితే ఒకరోజు ప్రముఖ గాయని మోహన భోగరాజు లక్ష్మణ్‌కు ఓ పాట రాయమని అడిగింది. అడిగిన కొన్ని రోజుల్లోనే ‘బుల్లెట్టు బండి’ రాసి ఇచ్చాడు. ఆ పాటను మోహన భోగరాజు పాడి యూట్యూబ్‌లో విడుదల చేయడంతో మంచి గుర్తింపు వచ్చింది. ఆ పాటకు ఓ నవ వధువు డ్యాన్స్‌తో సోషల్ మీడియానే ట్రెండింగ్‌లోకి వచ్చింది. చదవండి: ఒక్క డ్యాన్స్‌తో సెలబ్రిటీగా ‘బుల్లెట్టు బండి’ వధువు ఈ పాట తర్వాత ఆ ఇద్దరి సోదరులకు భారీగా అవకాశాలు వచ్చాయంట. మున్ముందు కూడా మరిన్ని మంచి పాటలతో ప్రేక్షకుల ముందుకు రావాలని ఆశిద్దాం. 8వ తరగతి నుంచి పాటలు రాస్తున్నాడు. చంద్రబోస్, గోరటి వెంకన్న, అందెశ్రీ పాటలు వింటూ అభిరుచి పెంచుకున్నా. ఈ పాటతో 22 రోజుల్లో ఈ పాట రాసినట్లు లక్ష్మణ్ చెప్పుకొచ్చాడు. తాను చూసిన అక్కాచెల్లెళ్లను చూస్తూ ఆ పాట రాసినట్లు తెలిపారు. ఆ నవ వధువుకు శుభకాంక్షలు తెలిపాడు. -
‘బుల్లెట్టు బండి’ పాటకు వధువు సూపర్ డ్యాన్స్.. భర్త ఫిదా
తెలంగాణలో జానపద పాటలు కోకొల్లలు. ఇప్పుడు యూట్యూబ్‌లో ఆ పాటలే హల్చల్ చేస్తున్నాయి. ఏ వేడుక ఉన్నా జానపదం ఘల్లుమంటోంది. ఆ పాటలు మార్మోగుతున్నాయి. తాజాగా ఓ వధువు తన బరాత్‌లో ఓ జానపద పాటకు సూపర్‌గా డ్యాన్స్ చేసి వరుడిని బంధుమిత్రులను ఆశ్చర్యంలో ముంచెత్తింది. ఆమె డ్యాన్స్‌కు ఫిదా అయిన భర్త అలా చూస్తుండి నిల్చుండిపోయాడు. దీనికి సంబంధించిన వీడియో తెలుగు నేలపై వైరల్‌గా మారింది. అయితే ఆమె ఎవరు? ఎక్కడ డ్యాన్స్ చేసిందీ.. ఈ వివరాలు ఏమీ తెలియవు. ‘నీ బుల్లెట్టు బండెక్కి వచ్చేత్తా పా’ అనే యూట్యూబ్‌లో అత్యధిక వ్యూస్ పొందింది. రచయిత లక్ష్మణ్ సాహిత్యం అందించగా ప్రముఖ గాయని మోహన భోగరాజు పాడారు. ఎస్కే బాజి సంగీతం అందించారు. ఈ ఏడాది ఏప్రిల్ 7వ తేదీన యూట్యూబ్‌లో విడుదలైన పాట ఇప్పటివరకు మూడు కోట్లకు పైగా వ్యూస్ సొంతం చేసుకోగా ఇక లైక్‌లు లక్షల్లో.. షేర్లు, కామెంట్లు వేలల్లో వస్తున్నాయి. అచ్చమైన తెలంగాణ యాసలో ఉన్న ఈ పాట ఒక్క యూట్యూబ్‌లోనే కాదు బయట కూడా మార్మోగుతోంది. ఈ క్రమంలోనే వివాహ వేడుక అనంతరం తీసిన బరాత్‌లో వధువు ఈ పాటకు డ్యాన్స్ చేసి అందరినీ మంత్రముగ్ధులను చేసింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మీరు కూడా ఆ యువతి డ్యాన్స్ చూసి ఆనందించండి. చదవండి: నీరజ్ చోప్రాకు అస్వస్థత.. ఆస్పత్రికి తరలింపు చదవండి: ‘ట్విటర్ పక్షి’ని వండి లాగించేసిన కాంగ్రెస్ నాయకులు -
‘మంగ్లీ చేసింది తప్పే... క్షమిద్దాం’
బోనాలపై సింగర్ మంగ్లీ పాడిన పాట వివాదానికి దారి తీసిన విషయం తెలిసిందే. బోనాల పాటలో అభ్యంతరకర పదాలు వాడారంటూ బీజేపీ కార్పొరేటర్లు ఏకంగా పోలీసులకు ఫిర్యాదు చేశారు. తక్షణమే సామాజిక మాధ్యమాల నుంచి పాటను తొలగించాలని బీజేపీ కార్పొరేటర్లు డిమాండ్ చేశారు. మంగ్లీపై కేసు నమోదు చేయాలని పలువురు బీజేపీ కార్పొరేటర్లు సీపీని కోరారు. దీంతో ఈ పాటపై మంగ్లీ వివరణ ఇచ్చింది. ఈ పాటపై విమర్శలు వచ్చిన రోజేనే మార్చేశామని తెలిపారు. గ్రామదేవతను ఎలా పూజిస్తారో తెలుసుకుని విమర్శిస్తే మంచిదని మంగ్లీ పేర్కొన్నారు. ఇక మంగ్లీ పాటపై సోషల్ మీడియాలోభిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నారు. ఈ నేపథ్యంలో ‘సాక్షి’మంగ్లీ పాటపై డిబేట్ పెట్టింది. ఈ చర్చలో సింగర్ పవన్ కుమార్, సంగీత దర్శకుడు భోలే సావలి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మంగ్లీ పాడిన పాటలో అంత అసభ్యకరమైన పదాలేమి లేవన్నారు. మోతెవరి అంటే గ్రామంలో పెద్ద అనే అర్థంలో సాగుతుందని, ప్రస్తుతం ఆపదం వ్యతిరేక అర్ధంలో వాడుతున్నామని చెప్పారు. విమర్శలు వచ్చిన నేపథ్యంలో లిరిక్స్ కూడా మార్చారని, పెద్దమనసు చేసుకొని మంగ్లీ క్షమించాలని కోరారు. ఇకపై అలాంటి తప్పులు రాకుండా కళాకారులు చూసుకుంటామని చెప్పారు. ఇంకా డిబేట్లో ఏంఏం చర్చించారో వీడియో చూడండి. -
రాథోర్ పాటలకు పడి పోవాల్సిందే!
న్యూఢిల్లీ : ‘గౌరీ లంకేష్‌కు పట్టిన గతి నీకు పట్టవచ్చు’ అంటూ నేహా సింగ్ రాథోర్‌ను ఆమె స్నేహితులు ఎప్పుడూ హెచ్చరిస్తూనే ఉంటారు. ఆ హెచ్చరికను ఆమె బుగ్గలపై చెదరని చిరు నవ్వుతో ఓ అభినందనగా స్వీకరిస్తున్నారు. హిందూ మత ఛాందస వాదులను విమర్శించినందుకు జర్నలిస్ట్, రచయిత గౌరీ లంకేష్‌ను 2017, సెప్టెంబర్‌లో బెంగళూరులో మతోన్మాదులు హత్య చేశారు. ‘ప్రశ్నించడం ప్రజాస్వామ్యం ఇచ్చిన హక్కు’ అంటూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పనితీరును ఎప్పటికప్పుడు తన భోజ్‌పురి జానపద పాటల ద్వారా సునిశితంగా విమర్శిస్తోన్న నేహా సింగ్ రాథోర్‌కు గౌరీ శంకర్‌కు పట్టిన గతి పడుతుందన్నది ఆమె మిత్రులు, సామాజిక కార్యకర్తల ఆందోళన. ( అందరూ చస్తారు: ప్రయాణికురాలి హల్చల్) పాలక వర్గాలను విమర్శిస్తూ నేహా సింగ్ రాథోర్ పాడిన భోజ్‌పూర్ జానపదాలు సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతూ ఆమెకు మంచి పేరు తెస్తున్నాయి. ‘ప్రజలకు ఉద్యోగాలిస్తారా లేదా నాటకాలేసుకుంటూ బతకమంటారా? నీవు అలంకరించిన అధికార పీఠం వంశపారంపర్యంగా నీ తండ్రి నుంచి వచ్చింది కాదనే విషయాన్ని తెలుసుకో!, అచ్చా దిన్ (మంచి రోజులు) వస్తాయని కేంద్ర ప్రభుత్వం హామీ ఇచ్చింది, సంకలో జోలి, చేతికి చిప్ప ఇవ్వడమే మంచి రోజని తెలుసుకోలేక పోయాం!’ అనే భావాలతో ఆమె రాసి పాడిన పాటలు ప్రజలను విశేషంగా ఆకర్షిస్తున్నాయి. ఉత్తర ప్రదేశ్, బీహార్ సరిహద్దులోని జాండహ గ్రామంలో నివసిస్తోన్న రాథోర్, 2019 నుంచి పాటలు రాస్తూ, వాటికి సొంతంగా బాణీలు కూరుస్తూ పాడుతున్నారు. ‘ధరోహర్’ పేరిట ఆమె ప్రారంభించిన యూట్యూబ్ ఛానల్‌కు దాదాపు లక్ష మంది సబ్‌స్రై్కబ్ చేశారు. ఆమె ఫేస్బుక్, ట్విట్టర్ ద్వారా మంచి ప్రజాదరణ సంపాదించారు. ఆమె అభిమానుల్లో సినిమా దర్శకులు, జర్నలిస్టులు, మాజీ అధికారులు, ప్రతిపక్ష రాజకీయ నాయకులు ఉన్నారు. వారణాసికి వంద, పట్నాకు రెండు వందల కిలోమీటర్ల దూరంలోని జాండవ గ్రామంలో 8వ తరగతి వరకే పాఠశాల ఉండడంతో రాథోర్, రామ్‌గఢ్‌లో సెకండరీ ఎడ్యుకేషన్, యూపీలోని కాన్పూర్‌లో బీఎస్సీ చదివారు. -
వాల్తేరు రైలు నుంచి వెండితెరకు
కళను వెతుక్కుంటూ ప్రజలు రానప్పుడు ప్రజల్ని వెతుక్కుంటూ కళ వెళుతుంది. తన కళకు వేదిక దక్కని అసిరయ్య రైలు కంపార్ట్‌మెంట్‌నే వేదిక చేసుకున్నాడు. ప్రయాణికుల్నే ప్రేక్షకులుగా మార్చుకున్నాడు. ఇవాళ అతని ప్రయాణం సినిమా పరిశ్రమ వరకు చేరింది. ‘పట్టుసీర కట్టమన్నది మాయత్త కట్టేక వద్దన్నది మరదలు మందారమాల’... ‘నా కాళ్లకు పట్టీలు లేవండో కన్నోరింటికి రానండి’.... ‘బావొచ్చాడో లక్క బావొచ్చాడొ... ఎత్త బావున్నాడో బావ బాగున్నాడు’... ‘ఓరి, ఇటూరికి ఇగురు కూర... పైఊరూకి రొయ్యల కూర’... రైల్లో ఈ పాటలు వినిపించాయంటే మనం వాల్తేరు చుట్టుపక్కల ఉన్నట్టు. కంపార్ట్మెంట్లోకి జముకు కళాకారుడు బోనెల అసిరయ్య ఎక్కినట్టు. ఉత్తరాంధ్రలో జముకు వాయిద్యానికి ప్రత్యేక ఆదరణ ఉంది. అక్కడి గ్రామాల్లో రాములవారి సంబరాలు, ఎల్లమ్మ పేరంటాలు జరిగిన సమయాల్లో జముకులకుండ కళను ప్రదర్శించే కళాకారులు ఉన్నారు. వారిలో మంచి గుర్తింపు తెచ్చుకున్నవాడు సంతకవిటి మండలంలో వాల్తేరు గ్రామానికి చెందిన అసిరయ్య. ఆ కళను నమ్ముకునే అతను తన కుటుంబాన్ని పోషించుకునేవాడు. దాని ఆధారంగానే ముగ్గురు ఆడపిల్లలకు వివాహం జరిపించాడు. కుమారుడిని ఎంఏ, బీఈడీ చదివించాడు. అయితే కాలం మారిపోయింది. జముకుల కథ పాటకు గ్రామాల్లో డిమాండ్ తగ్గింది. కల చెదిరింది. దీంతో చేసేదిలేక అసిరయ్య ప్రతిరోజూ ఇంటి వద్ద నుంచి బయలుదేరి దగ్గర్లోని పొందూరు రైల్వే స్టేషన్‌కు చేరుకుని ట్రైన్లో తాను నమ్ముకున్న జముకుల కథను వినిపించడం మొదలుపెట్టాడు. విశాఖపట్నం–అనకాపల్లి మార్గంలో రైలులో పాడుతూ ప్రయాణికులు ఇచ్చే డబ్బులతో జీవిస్తున్నాడు. రోజుకి రూ.300 – రూ. 400 సంపాదించి ఇంటికి చేరుకుంటాడు. అయితే అందరి చేతుల్లో సెల్ఫోన్లు ఉండటం వల్ల చాలామంది ఇతని పాటలను రికార్డు చేసి సోషల్ మీడియాలో పెట్టారు. అవి వైరల్ అయ్యాయి. అవి మెల్లగా అతణ్ణి సినిమా పరిశ్రమకు తీసుకెళ్లాయి. రఘు కుంచె చొరవతో రైలు ప్రయాణంతో జీవనం సాగిస్తున్న అసిరయ్య పాట ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ రఘు కుంచె చెవిలో పడింది. ఆయన ఈ కళాకారుడిని గుర్తించడంతోపాటు హైదరాబాద్‌కు రప్పించుకుని ‘పలాస 1978’ సినిమా టైటిల్ సాంగ్‌కు జముకును ఉపయోగించుకున్నారు. అసిరయ్య ఒక పాట కూడా పాడారు. రఘు కుంచె స్వయంగా ఈ విషయాన్ని చెప్పడంతో ప్రస్తుతం అసిరయ్య గురించి సోషల్ మీడియా హల్చల్ చేస్తుంది. అసిరయ్య అందరి దృష్టిలో పడ్డారు. సోషల్ మీడియాలో సెలబ్రిటీ అయిపోయారు. – కథనం: కందుల శివశంకర్, సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం ఫొటోలు: వి.వి.దుర్గారావు, సాక్షి, రాజాం. నా పాటే అన్నం పెడుతుంది గతంలో నా వద్ద రెండు మూడు కుటుంబాలు బతికేవి. ఇప్పుడు నా జీవనమే కష్టంగా మారింది. కళను విడిచిపెట్టి ఉండలేకపోతున్నాను. ట్రైన్లలో కళను ప్రదర్శించి జీవనోపాధి పొందుతున్నాను. ఇప్పటికీ నా జీవనాన్ని నా కళే నడుపుతుంది. జానపద పాటలే కాకుండా, భారతం, సుభద్ర కళ్యాణం, శశిరేఖ పరిణయం, సారంగధర కథలు వంటివి చెప్పగలను. – బోనెల అసిరయ్య -
గజల్ గమనం
నేలతల్లి ఒడిలో ‘సాగు’ సమయాన కాయకష్టాన్ని మరపించేందుకు అమ్మ పాడిన ముడుపుపాటలే అతనికి ఊపిరి పోసాయి. నాన్న భజన పాటల ఆలంబనలో పాటగాడ్ని చేశాయి.సరదాగా తీసే కూని రాగం జానపదాల వైపు నడిపించింది. ఓ చిన్ని ఆలాపనే అతనిని గాయకుణ్ణి చేసింది. నడకతో ఎన్నో నేర్చుకుని.. ప్రకృతిని తన పాటలో కలుపుకునిఅందంగా వినిపిస్తూ పదేళ్లుగా అతని పాటల ప్రస్థానం సాగుతోంది. దేశభక్తి గీతాలు,సామాజిక గేయాలు, జానపదాలు, గజల్స్ అతని గానంలో భాగమయ్యాయి. అమ్మానాన్నలే గురువులుగా.. పాట, మాట, గేయం, గజల్ ఏదైనా విని నేర్చుకున్న ఆ యువకుడు గజల్‌నే తన ఇంటిపేరుగా మార్చుకుని గజల్ వినోద్‌గా గుర్తింపు పొందాడు. అతని గజల్ సవ్వడుల ప్రస్థానం అతని మాటల్లోనే.. అమ్మానాన్నలే నా గురువులు విజయనగరం జిల్లా పార్వతీపురం మండలం నా జన్మ స్థలం. నా భార్య స్రవంతి. అమ్మ గేదెల చింతల్లి, నాన్న గేదెల దుర్గారావు, అన్నయ్య, తమ్ముడు ఉన్న మాది రైతు కుటుంబం. అమ్మ పొలం పనులకు వెళుతుండేవారు. ఆమె జానపదాలు పాడుతుంటే విని నాకూ వాటిపై ఇష్టం ఏర్పడింది. నాన్న భజన పాటలు పాడుతుంటే చూసి లయబద్ధంగా పాటలు పాడటం నేర్చుకున్నాను. సాహిత్యంలో గంటేడ గౌరీ నాయుడు, డాక్టర్ సినారె, సిరివెన్నెల, గోరేటి వెంకన్న, వంగపండు వంటి మహనీయులకు నేను ఏకలవ్య శిష్యుడిని. ఎం.ఏ తెలుగు, ఆంధ్ర విశ్వవిద్యాలయంలో పూర్తి చేశాను. గజల్స్ పాడుతూ సమాజ చైతన్యానికి నా వంతు కృషి చేస్తున్నాను.సరదాగా పాడుతున్న నన్ను కె. ఎస్. జన కళ్యాణ సమాఖ్య స్వచ్ఛంద సేవా సంస్థ వారు గుర్తించారు. ఆదరించారు. నన్ను ఎంతగానో ప్రోత్సహించారు. డాక్టర్ వంశీ సహకారంతో ఫ్లాష్ టీమ్ ఏలూరు వారికి నేను పరిచయం అయ్యాను. దీంతో ఉత్తరాంధ్రకే పరిమితమైన నా పాట ఉభయ గోదావరి జిల్లాలను దాటుతూ రాష్ట్రమంతా పలికింది. మల్లం మహేష్ కళారత్న వారి ప్రోత్సాహంతో రవీంద్రభారతిలో నా పదేళ్ల ప్రస్థానం వేడుక జరుపుకోవడం జరిగింది. యూ ట్యూబ్, ఫేస్బుక్, వాట్సాప్ లాంటి సామాజిక మాధ్యమాల్లో కోట్లాది మందికి నేను దగ్గరయ్యాను. అందరూ నన్ను గుర్తించి పలకరించి ప్రోత్సహించడం.. ఇలా ఎన్నో మంచి మంచి అనుభవాల సాధనతో నా పదేళ్ల ప్రస్థానం పూర్తయింది. తోటికళాకారులతో సరదాగా ఉంటాను. అందుకే అందరూ ఇష్టపడతారు. గౌరవిస్తారు. ప్రపంచమంతా నా గజల్స్ వినిపిస్తాను తెనాలి స్వచ్ఛంద సేవా సంస్థ వారు గజల్ గాన కోయిల బిరుదును ఇచ్చి ప్రోత్సహించింది. రెండుసార్లు అమెరికా వెళ్లే అవకాశం వచ్చినా వీసా సమస్యల కారణంగా వెళ్ళలేకపోయాను. ఎప్పటికైనా ప్రపంచమంతా నా గజల్స్ వినిపిస్తాను. రెండుసార్లు జానపద గీతాలలో రాష్ట్రస్థాయిలో ప్రథమ బహుమతి పొందాను. మాజీ ముఖ్యమంత్రి రోశయ్య చేతుల మీదుగా జాతీయ పురస్కారం అందుకున్నాను. రవీంద్రభారతిలో సన్మానం మరువలేనిది. ఐ.ఎ.ఎస్‌ల చేతుల మీదుగా, యూత్ ఎక్స్‌లెన్స్ అవార్డులను అందుకున్నాను. మన రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు ఒరిస్సా, బీహార్, మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు వంటి ప్రాంతాలలో ఎన్నో ప్రదర్శనలు ఇవ్వగలిగాను. మార్పు రావాలి నేను స్వయంగా కొన్ని పుస్తకాలు రాసాను. కొన్ని ఆల్బమ్స్ కూడా రిలీజ్ చేశాను. వాటికి మంచి స్పందన వచ్చింది. కళాకారునిగా ఈ సమాజం నన్ను గుర్తించింది. మంచిని పంచే బాధ్యతను అప్పగించింది. అయితే దురదృష్టవశాత్తూ ఈ సమాజంలో కళ అంటే గౌరవం ఉంది. కళాకారుడు అంటే చిన్న చూపు ఉంది. కొందరి తప్పిదాలు అందుకు కారణం కావచ్చు. ఈ పరిస్థితిలో మార్పు రావాలి. బోణం గణేష్, సాక్షి, విజయనగరం ఫొటో: డి.సత్యనారాయణమూర్తి పేరు తెచ్చిన పాటలు నేను పాడిన వాటిలో ‘నా చిట్టి చేతులు చక్కని రాతలు నేర్వలేదయ్యో’ అంటూ బాల కార్మిక గీతం. ఇది ఊరేనా.. నే నడిచిన నేలేలా అన్న పల్లె పాట.. కమ్మనైన అమ్మ పాట అంటే ఎంతో మధురము వంటి పాటలు నాకు ఎంతో పేరు తీసుకుని వచ్చాయి. గజల్స్ పాడటం వలన గజల్ వినోద్ గా ప్రసార మాధ్యమాలు నన్ను చూపించాయి. నా వంతుగా సమాజాన్ని చైతన్యం చేసే చాలా పాటలు పాడాను, రాసాను. విద్యార్థులను, మహిళలను, రైతులను, చైతన్యం చేస్తున్నాను. నాపైనా, కళలపైనా అందరి ఆశీర్వాదం ఇలానే ఉండాలని కోరుకుంటున్నాను. -
చేయవలసినవి చాలా ఉన్నాయి
ప్రముఖ జానపద, శాస్త్రీయ లలిత సంగీత గాయని వింజమూరి అనసూయాదేవి (99) అమెరికాలోని హ్యూస్టన్‌లో ఆదివారం కన్ను మూశారు. జానపద గేయాలు రాయడంలో, బాణీలు కట్టడంలో, పాడడంలో అనసూయాదేవి ప్రావీణ్యం సాటిలేనిది. అనసూయ 1920 మే 12న కాకినాడలో జన్మించారు. ఆమెకు ఐదుగురు సంతానం. కవి స్వర్గీయ దేవులపల్లి కృష్ణశాస్త్రి మేనకోడలు కూడా అయిన అనసూయ ఇటీవల చెన్నై వచ్చినప్పుడు ‘సాక్షి’కి ఇచ్చిన ఇంటర్వ్యూలోని విశేషాలివి. తొమ్మిదవ ఏటనే జానపదాలకు, భావగీతాలకు బాణీలు కట్టి ప్రాణప్రతిష్ట చేసిన అపర బ్రహ్మ అనసూయ. మేనమామ కృష్ణశాస్త్రి రచించిన ‘ప్రాభాత ప్రాంగణాన’ గీతాన్ని ఒకే రోజు ఆరు వేదికల్లో ప్రత్యక్షంగా పాడిన దివ్యగాయని. గాంధీజీ సమక్షంలోనూ అనసూయ గీతాలాపన చేశారు. తొమ్మిది దశాబ్దాలు పూర్తయినా కూడా కూడా పసిపిల్లలకు ఉండే ఉత్సాహం పోగొట్టుకోని చిన్ని శిశువు. ఆమె జీవనరాగంలోని సరిగమల్ని ఆమె చెప్పిన క్రమంలోనే వినడం శ్రావ్యంగా ఉంటుంది. ఆ రోజు నా డ్రస్సూ హిట్టయింది! ‘‘మొదటి స్వాతంత్య్ర దినం నేను మర్చిపోలేని రోజు. ఆ రోజు మా మామయ్య రాసిన ‘ప్రాభాత ప్రాంగణాన మోగేను నగారా’ అనే దేశభక్తి గేయాన్ని 1947 ఆగస్టు 15 న పొద్దున్నే ఆరుగంటలకి మద్రాసు రేడియోలో లైవ్‌లో పాడాను. తరవాత తొమ్మిది గంటలకి ఆంధ్ర విజ్ఞాన సమితిలో పాడాను. 10 గం.లకి వై.యమ్.సి.ఏ.లో పాడాను. సాయంత్రం నాలుగు గంటలకి ఆంధ్రమహిళాసభలోను, ఆరు గంటలకి ఆంధ్రమహాసభలోను, రాత్రి 8 గం.లకి రేడియో వారు రూపకల్పన చేసిన ‘స్వాతంత్య్ర రథం’ కార్యక్రమంలోను ఒకే రోజున అన్నీ లైÐŒ గా పాడాను. ఆ రోజే మరో చిత్రమైన సంఘటన. నాకు అలంకరణ అంటే చాలా ఇష్టం. నేనే ఒక ఫ్యాషన్ క్రియేట్ చేశాను. 5 గజాల తెల్ల చీర కొనుక్కుని వచ్చి, ఎరుపు, ఆకుపచ్చ రంగుల శాటిన్ రిబ్బన్లు కొనుక్కుని వచ్చి వాటిని పొడవుగా కట్‌చేసి చీర మీద నిలువు చారలుగా వేసుకున్నాను. జాకెట్కి కూడా బోర్డర్ వేసుకున్నాను. టైలర్ని రాత్రింబవళ్లు కూచోపెట్టి దగ్గరుండి కుట్టించుకున్నాను. నా పాటలాగే నా డ్రస్ కూడా హిట్ అయ్యింది. ‘అయ్యో కుయ్యోడో’ నా ఫస్ట్ సాంగ్ చిన్నప్పుడే నేను నా చెల్లి సీత కలిసి పాడటం మొదలుపెట్టాం. సుమారు 23 ఏళ్లు కలిసి పాడాము. నేను జానపదాల మీద రీసెర్చి చేద్దామనుకున్నాను. నా సంగీత గురువు మునిగంటి వెంకట్రావుపంతులుగారు. ఆయన నాకు క్షేత్రయ్య పదాలు నేర్పారు. ఆ పదాల మీద రీసెర్చి చేద్దామనుకున్నాను. నాకు ఫోక్ ఇష్టం. అప్పటికే చాలా జానపదాలు రాశాను. పాడాను. అలా సుమారు 30 ఏళ్లు పాడాక రేడియోలో జానపదాలు మొదలుపెట్టాక నాకు అవకాశం వచ్చింది. నేను పాడిన మొదటి పాట ‘అయ్యోకుయ్యోడో’. హిట్ అయింది. కృష్ణశాస్త్రిగారు పాటలు రాసేవారు, నేను బాణీలు కట్టేదానిని. అలా ఎన్నో భావగీతాలు పాడాను. నేను కట్టిన బాణీలన్నీ కర్ణాటక సంగీతం ఆధారంగానే. నాకు నేర్పిందీ, నన్ను తీర్చిందీ కర్ణాటక సంగీతమే. తొమ్మిదవ ఏటనే రెండు మూడు వందల పాటలకి రాగాలు కట్టాను. అందరికీ తెలిసిన ‘మొక్కజొన్నతోటలో’ నేనే రాగం కట్టి పాడాను. 1931లో రాజమండ్రి నాళం వారి సభలో, కాకినాడ సభలో జానపదాలను పాడాను. అలాగే రేడియోలోను ఈ జాన పదాలు ప్రసిద్ధి చెందేలా కృషి చేశాను. ‘చెత్తపాట పాడిస్తున్నారు’ అన్నారు! జానపద గీతాలన్నీ జానపదులు పాడినట్లే పాడగలను. త్యాగరాజు ఎలా పాడాడో తెలీదు. నగుమోములాంటివి బాలమురళి బాగా పాడాడు. జానపదాలను బాగా పాడి, బాగుందనిపించి, సభల్లో ప్రవేశపెట్టాను. అప్పుడు ఎన్నో కాంప్లిమెంట్స్ వచ్చాయి. క్షేత్రయ్య పదాలలాగ ‘కోటిరత్సపు ముద్దు కోమలాంగి’ అనే గీతాన్ని పాడాను. ఆ పాటని ముందుగా అమ్మకి వినిపించి, ఆవిడ బావుందని అన్నాకే బయట పాడాను. అమ్మ అనుమతి ఇచ్చాక, నాకు బలం వచ్చింది. ఆ పాట విన్నాక ఒక కవయిత్రి నాళం వారి సభలో పాడుతుంటే ఆక్షేపించారు. అమ్మ వెంకటరత్నమ్మతో ‘‘కవి కుటుంబంలో పుట్టిన మీరు మీ అమ్మాయి చేత చెత్త పాట పాడిస్తున్నారు’’ అని అన్నారు. ఆ మాటకు అమ్మ నన్ను సమర్థిస్తూ సమాధానం ఇచ్చారు. ఎప్పుడయితే అమ్మ నన్ను బలపరిచిందో అప్పటి నుంచి వెనుదిరగలేదు. ఎనభై ఏళ్లుగా పాడుతూనే ఉన్నాను. నన్ను ప్రోత్సహించింది రజనీకాంతరావుగారు. దేశదేశాల్లో జానపదాలు ప్రచారం చేసింది మాత్రం నేనే. కచేరీలకు సిలోన్, లండన్, పారిస్ దేశాలకు వెళ్లాను. పారిస్‌లో నాకు ‘క్వీన్ ఆఫ్ ఫోక్’ మ్యూజిక్ అని బిరుదు ఇచ్చారు. 1977లో అమెరికాలో మొట్టమొదటి తానా సభలో పాడాను. అక్కడే 23 కచేరీలు చేశాను. ఆ కచేరీలను 22 శృతులతో పోల్చి, ‘అమెరికాలో నా సంగీత యాత్ర’ అని పుస్తకం రాశాను. రేడియోలో రూ. 250 జీతం చిన్నప్పటి నుంచి కొత్త పాటలు పాడటం సరదా. ఒక కాంపిటిషన్లో నేను వేరేదో పాడుతుంటే, నన్ను పిలిచి ‘నీకు త్యాగరాజ కీర్తనలు రావా’ అని అడగగానే ‘నిధి చాల సుఖమా’ పాడాను. అది విన్న వారు పిట్ట కొంచెం కూత ఘనం అన్నారు. మద్రాసు పంపిస్తే సినిమాలో పాడిస్తాం అన్నారు. ఆడపిల్లను ఒక్కతినే పంపడం ఇష్టం లేదని నాన్నవాళ్లు అనడంతో మా కుటుంబం అంతా రావడానికి ఏర్పాటు చేశారు. అప్పుడు నా చేత ‘కిట్టమ్మా గోపాలబాలా కిట్టమ్మా’ పాడించారు. నేను కచేరీ ఇచ్చేటప్పుడు ముందుగా క్లాసికల్, భావగీతాలు, తరవాత చివరలో ఒక జానపద గీతం పాడేదానిని. నాకున్న ఇంటరెస్ట్ కారణంగా జానపదాలు పాడాను. రేడియో పని మీద నా చెల్లి సీత వెడుతున్నప్పుడు నేను కూడా సీతతో వెళ్లి చాలా సేకరించాను. అన్నీ సేకరించాక వాటి మీద పరిశోధన చేద్దామనుకున్నాను. అయతే నా రీసెర్చి కొన్ని కారణాల వల్ల కుదరలేదు. నా పాటల స్వరాలన్నీ నేను బుక్‌గా రాసిపెట్టుకున్నాను. సంగీత నాటక అకాడమీ వాళ్లు దానిని పబ్లిష్ చేశారు. పునర్ముద్రణ కూడా చేశారు. 1938లో ఆలిండియా రేడియో ప్రారంభోత్సవం నాడు ‘రారమ్మ రారమ్మ’ అని, ముగింపులో ‘పోయినది దానిమ్మ’ అని నా చేత పాడించారు. 1939లో ‘ఊర్వశి’లో పాటలు ప్లే బ్యాక్ లేకపోయినా కూడా నేను పాడాను. అదొక క్రెడిట్. అది రేడియో వారిదే. ఉత్తర రామచరితంలో లక్ష్మణమూర్ఛలో పద్యాలు చదువుతుంటే ఎస్.ఎన్.మూర్తికి నాకు ఉద్యోగం ఇస్తానన్నారు. 250 రూ.ల జీతం అన్నారు. 1940 లో చేరాను. రేడియోలో ఊర్వశి, విద్యాపతి, శ్రీకృష్ణుడు, నవరసాలు, గోదాదేవి, దక్షయజ్ఞం మొదలయిన దేవులపల్లివారి నాటకాలు వేశాం. ఓ పక్కన నవ్యసాహిత్య పరిషత్‌లో కచ్చేరీలు చేసేవాళ్లం. వెన్నెల్లో బ్రహ్మసమాజంలో పాడేవాళ్లం. ఆ తర్వాత ఉద్యోగంలోంచి మామమ్య, నాన్న నన్ను వెనక్కి తీసుకువెళ్లిపోయారు. 1943లో బి.ఏ. చేశాను. పి.సుబ్రహ్మణ్యం గారు నా పాట విని ‘నర్తన మురళి’లో పాడడానికి నన్ను మద్రాసు తీసుకెళ్లారు. 1945లో వివాహం జరిగింది. అనసూయ పెళ్లి కబుర్లు అని అందరికీ మామయ్య చెప్పేవారు. ‘మధూదయంలో’ అనే పాట నా మీదే రాశారు.కొన్నాళ్లు స్టెల్లామేరీస్‌లో మ్యూజిక్ లెక్చరర్‌గా చేశారు. కళాక్షేత్రంలో ఆఫర్ వచ్చింది వదిలేశాను. అన్నమయ్య పాటలను రాళ్లపల్లి అనంతకృష్ణశర్మగారు బయటకి తీసుకొచ్చినప్పుడు ఆ పాటలకు నన్ను ట్యూన్ చేసి పాడమన్నారు. అందుకోసం తాళ్లపాక రమ్మన్నారు. ఆ టైమ్‌లో మా వారికి చెయ్యి విరిగింది. మా అమ్మాయికి బాగా జ్వరంగా ఉంది. వెళ్లలేకపోయాను. బదులుగా మల్లిక్ వెళ్లారు. పాడగలిగినా ప్లే బ్యాక్‌కి వెళ్లలేదు. ట్యూన్ చేయగలిగినా చేయలేదు. యాక్ట్ చేయగలిగినా చేయలేదు. అయిన వాటి గురించి బాధపడి లాభంలేదు. చేయవలసినవి చాలా ఉన్నాయి. తొందరపడుతున్నాను చేయడానికి. దక్షిణభారతంలో నేనే మొట్టమొదటి సంగీతదర్శకురాలిని. హార్మనీపట్టుకుని వాయిస్తూ పాడతాను. స్త్రీల పాటలు పాడితే, సెంట్రల్ గవర్నమెంటు వారు ఫెలోషిప్ ఇచ్చారు. పెళ్లిపాటలు, సరదా పాటలు, మేలుకొలుపులు, లాలిపాటలు, గొబ్బిపాటలు, కోలాటం, మంగళహారతులు పండుగలు, పూజలు అన్నిటినీ మ్యూజిక్ నొటేషన్‌తో చేశాను. సంగీతం గొప్ప గనిలాంటిది. ఎంత తవ్వితే అంత వస్తుంది. అలాగే కలెక్ట్ చేశాను. ఎక్కడ వింటే అక్కడ పట్టేసేదాన్ని. ఫోటోలు: వి. శ్రీనివాసులు, చెన్నై వీలునామాలో ‘అంతిమ యాత్ర’ ఘనతగా చెప్పడం కాదు కానీ పల్లెల్లో ఉండే ఈ జానపదాలను బాణీలు కట్టి జన బాహుళ్యంలోకి తెచ్చిన తొలి ప్రయత్నం నాదే. ఆలిండియా రేడియోలో ప్రవేశపెట్టిందీ నేనే. కానీ అప్పుడప్పుడు అనిపిస్తుంది.. నాకు రావలసిన గుర్తింపు రాలేదని. మామయ్య రాసిన ‘మల్లీశ్వరి’ సినిమా పాటలకి హార్మనీ పట్టుకుని ముందుగా బాణీలు కట్టింది కూడా నేనే. ‘పోయిరావే తల్లి’ని పున్నాగ వరాళి రాగంలో ట్యూన్ చేశాను. నా పాట విని వాహినిలో పాడతావా అని అడిగారు. వెంటనే ఒప్పుకున్నాను. పాట విని బి.యన్.రెడ్డి గారు మెచ్చుకున్నారు. పాట తీసుకున్నారు. రాగాలు నేనే సజెస్ట్ చేశాను. ఇదంతా ఎలా జరిగిందంటే.. అక్కడొక పెళ్లిలో ధీరసమీరే యమన్ కళ్యాణిలో పాడాను. ఆ పెళ్లికి వచ్చిన బియన్‌రెడ్డి, కెవిరెడ్డి, నాగిరెడ్డి అందరూ ముగ్ధులయ్యారు. ముందర నన్ను సినిమాలో నటించమని కోరారు. కాని నేను నటించను పాడతాను అని చెప్పాను. ధీరసమీరే లాంటిది కావాలన్నారు. అప్పుడు వచ్చినదే ‘మనసున మల్లెల మాలలూగెనే’. అది నా ట్యూనే. అప్పటివరకు నేను కేవలం మామయ్య పాటలకే రాగాలు కట్టాను. మల్లీశ్వరి పాటలు విన్న యం.వి.శాస్త్రిగారు పాటలన్నీ అనసూయ నోట విన్నట్టుగానే ఉంది అన్నారు. మల్లీశ్వరి ఫంక్షన్లో అందరూ మామయ్యనీ, మిగిలిన వారినీ అభినందిస్తుంటే నాకు బాధ అనిపించింది. మొట్టమొదటి సంగీత దర్శకురాలిని పరిచయం చేసిన ఘనత వారికి వచ్చేది. కాని అలా కాకుండా నా రాగాలు వాడుకుని నన్ను పక్కన పెట్టేశారు. తరవాత ‘బంగారుపాప’కి చేశాను. పక్కనే స్టూడియోలో ఉన్న ప్రొడ్యూసర్ కోరిక మేరకు కోయంబత్తూరు వెళ్లి ‘అగ్గిరాముడు’కి చేశాను. అందులో ఎఎం.రాజా, భానుమతి, సాయి సుబ్బలక్ష్మి చేత పాడించాను. నేను రాగం కట్టిన పాట జనం విని పొగిడితే సరదా. అప్పుడు ఉత్సాహంగా పాడతాను. అలాగే అలంకరణ బాగా సరదా. నా వీలునామాలో నన్ను ఎర్రచీరతో అలంకరించి, తల నిండా పూలు పెట్టి నా అంతిమయాత్ర సాగించాలని రాసుకున్నాను. -
అంగన్వాడీ టీచర్‌గా పనిచేస్తూ.. రచనలు..
కమ్మర్పల్లి(బాల్కొండ): కమ్మర్పల్లి మండల కేంద్రంలో అంగన్వాడీ టీచర్‌గా పనిచేస్తున్న మగ్గిడి లక్ష్మి కవయిత్రిగా రాణిస్తోంది. వృత్తి అంగన్వాడీ టీచరే అయినా సాహితీ కళా రంగంపై మక్కువతో కవితలు రాస్తూ కళాకారిణిగా గుర్తింపు పొందుతోంది. ఫలితంగా ప్రముఖుల నుంచి ప్రశంసలు అందుకుంటుండడంతో పాటు, సాహిత్య కళా రంగ సంస్థల నుంచి అవార్డులను దక్కించుకుంటోంది. గత ఐదేళ్లలో వందకుపైగా కవితలు రాయగా, పలు కవితలు పుస్తక రూపంలో ఆవిష్కరింపబడ్డాయి. పాటలు, జానపద గేయాలతో మొదలై.. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ సమయంలో నిర్మల్‌కు వచ్చిన ఎన్టీఆర్ ముందు లక్ష్మి ‘ఎన్టీఆర్ ఎందుకు ముఖ్యమంత్రి కావాలనే’ సారాంశంతో పాట పాడడంతో మంత్రముగ్ధుడైన ఎన్టీఆర్ లక్ష్మిని అభినందించారు. అదే స్ఫూర్తితో ఆమె ఆడుతూ, పాడుతూ పాటలు రాయడం మొదలు పెట్టారు. ఆ తర్వాత అంగన్వాడీ ఉపాధ్యాయురాలిగా ఉద్యోగంలో చేరి, గేయాలతో పాటు జానపద గేయాలు రాయడం వైపు దృష్టి సారించారు. అయితే వాటికి తానే స్వరకల్పన చేస్తూ, ఆలపించడం అలవాటు చేసుకున్నారు. ఉవ్వెత్తున లేచిన తెలంగాణ ఉద్యమంలో తాను రాసిన పాటలు పాడి ఉద్యమకారులను ఉత్సాహపరిచారు. 2014 నుంచి కవితలు రాయడంపై దృష్టి సారించిన లక్ష్మి ఐదేళ్లలో కవయిత్రిగా మంచి గుర్తింపు పొం దింది. వందకుపైగా కవితలు రాసి ప్రముఖుల మన్ననలను పొందింది. జిల్లాలోనే కాకుండా పలు జిల్లాల్లో సాహిత్య కళా రంగాలు, చారిటబుల్ ట్రస్ట్ నిర్వహించే కవి సమ్మేళనాల్లో పాల్గొని ఉత్తమ ప్రతిభావంతురాలైన కవయిత్రిగా పేరు పొందుతోంది. ప్రశంసలు, అవార్డులు 2017లో నిర్వహించిన ప్రపంచ మహాసభల సందర్భంగా నిర్వహించిన కవి సమ్మేళనంలో తెలంగాణ విజయం అనే అంశంపై రాసిన 21 వరసల కవిత పుస్తక రూపంలో ఆవిష్కరింపబడింది. గోదావరిఖనిలో దేశభక్తుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన జాతీయ స్థాయి దేశభక్తి కవి సమ్మేళనంలో విప్లవాత్మక కవిత రాసి ఆలపించి ప్రముఖుల నుంచి ప్రశంసా పత్రం అందుకుంది. రాష్ట్ర ప్రభుత్వం యాదాద్రి శిల్పకళా వైభవంపై నిర్వహించిన కవితా సంపుటికి లక్ష్మి కవితలు ఎంపికై, ప్రశంసా పత్రం అందుకుంది. కొఱవి గోపరాజు సాహిత్య వైభవ సమాలోచన, రాష్ట్రస్థాయి సదస్సులో సాహితీ ప్రియత్వాన్ని ప్రదర్శించి ప్రశంసా పత్రం అందుకుంది. ఆకాంక్ష చారిటబుల్ ట్రస్ట్, త్యారాయ గానసభ ఆధ్వర్యంలో నిర్వహించిన కవి సమ్మేళనంలో కవితలను రాసి ఆలపించండంతో ప్రశంసా పత్రం అందుకుంది. తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవంలో ఉత్తమ కవయిత్రిగా అవార్డును సొంత చేసుకుంది. -
జానపదమే నృత్యపథం..
అమ్మలారా.. అయ్యలారా.. ఊరోన్ని నేను.. పల్లెటూరోన్ని నేను.. అంటూ ప్రారంభమైన ప్రస్థానం సినీపరిశ్రమ వరకు సాగింది. జానపద నృత్యంలో అంతర్జాతీయ స్థాయిలో ప్రతిభచూపాడు. ఎన్నో అవార్డులు, రివార్డులు పొందాడు. సత్తుపల్లికి చెందిన ఓ అరటిపండ్ల వ్యాపారి నృత్య ప్రదర్శనలో ఎంతో ఖ్యాతిని ఆర్జించాడు. సత్తుపల్లిటౌన్: పట్టణంలో పేదకుటుంబానికి చెందిన బొమ్మారెడ్డి శ్రీనివాసరెడ్డి జీవనాధారం కోసం అరటిపండ్లు అమ్ముకుంటూ జానపదంపై పట్టు సాధించారు. బాల్యం నుంచే అనేక నృత్య పోటీల్లో పాల్గొని బహుమతులు సాధించారు. అంతర్జాతీయ నర్తకి, సినీనటి మంజుభార్గవి సరసన నృత్య ప్రదర్శన చేశాడు. దాదాపు 28 ఏళ్లుగా జానపదంపై పట్టు సాధించిన ఈయన అనేక పాఠశాలల విద్యార్థులతో పాటు సరిహద్దున ఉన్న కృష్ణా, పశ్చిమగోదావరి, విశాఖపట్నం ప్రాంతాలలోని చిన్నారులకు కూడా నృత్యంలో శిక్షణ ఇస్తూ.. జానపద కళకు ప్రాణం పోస్తున్నారు. ఈయన చేస్తున్న కృష్టికి ఇటీవల డాక్టరేట్ కూడా సాధించారు. దేశ,విదేశాలలో ప్రదర్శనలు దేశంలోని వివిధ ప్రాంతాలతో పాటు సింగపూర్, మలేషియా, థాయిలాండ్, బ్యాంకాక్, చైనా, కాట్మాండ్ దేశాలలో కూడా బొమ్మారెడ్డి అనేక నృత్యం ప్రదర్శించారు. అమ్మలారా.. అయ్యలారా అనే ఒకే జానపద నృత్యాన్ని 1800 సార్లు ప్రదర్శించి ఇటీవల తెలుగుబుక్ ఆఫ్ వరల్డ్ రికార్డుల్లో స్థానం సంపాదించారు. బెంగుళూరు క్రిష్టయన్ యూనివర్సిటీ నుంచి జానపద నృత్యంలో డాక్టరేట్ కూడా సాధించారు. వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్, జీనియర్స్ బుక్ఆఫ్ రికార్డ్స్‌లో కూడా స్థానం సంపాదించారు. ఇలా ఇప్పటి వరకు 27 జాతీయ అవార్డులు, ఒక అంతర్జాతీయ అవార్డును సొంతం చేసుకున్నారు. ప్రస్తుతం తెలుగుబుక్ ఆఫ్ రికార్డ్స్ సంస్థ సీఈఓగా పని చేస్తున్నారు. మాజీ గవర్నర్ ఎన్డీ తివారీ, సినీహీరో చిరంజీవి, సినినటీ జయసుధ వంటి ప్రముఖుల నుంచి కూడా అభినందనలు పొందారు. తండ్రి పేరిట ఉచిత శిక్షణలు దేశ, విదేశాలలో ప్రదర్శనలు, ప్రశంసలు పొందుతూనే.. మరో వైపు తన తండ్రి పేరున స్థాపించిన బీఎన్ రెడ్డి మెమోరియల్ ట్రస్ట్ ద్వారా వివిధ జిల్లాల్లో ప్రతినెలా 400 మంది పేద విద్యార్థులకు వివిధ సంస్థల ద్వారా ఉచిత శిక్షణలు ఇస్తున్నారు. సినీ కొరియో గ్రాఫర్‌గా.. సినీరంగంపై బొమ్మారెడ్డి శ్రీనివాసరెడ్డికి ఉన్న ఆసక్తి కొరియో గ్రాఫర్‌గా అవకాశం లభించింది. జాతీయ సినీ నృత్య దర్శకులు డాక్టర్ శివశంకర్ మాస్టర్ వద్ద శిక్షణ పొందారు. రాష్ట్ర వ్యాప్తంగా విడుదలైన చందమల్ల అభిలాష్ డైరెక్టర్‌గా ఉన్న డేంజర్‌జోన్ అనే హరర్ తెలుగు చిత్రంలో సింగిల్‌కార్డు నృత్యదర్శకునిగా పని చేశారు. కందాల వంశీ దర్శకత్వంలో ‘ఏదో కలవరం’ చిత్రంలో కొరియో గ్రాఫర్‌గా.. మిరియాల రవికుమార్ దర్శకత్వంలో సుమన్ హీరోగా నటించిన త్యాగాల వీణ చిత్రం, రామచంద్రారెడ్డి దర్శకత్వంలోని ప్రేమశక్తి చిత్రానికి, మువ్వా దర్శకత్వంలో జగపతిబాబు, చార్మి నటీనటులుగా ఉన్న ‘శబ్దం’ చిత్రానికి కొరియో గ్రాఫర్‌గా పని చేశారు. క్లీన్ ఇండియా, శ్రీనుగాడి ప్రేమ, ప్రేమనీదే చిత్రాలకు కొరియో గ్రాఫర్‌గా పనిచేశారు. ఇలా 8 చిత్రాలకు కొరియో గ్రాఫర్‌గా పనిచేయగా 4 చిత్రాలు విడుదలయ్యాయి. ఇటీవల లేపాక్షి ఉత్సవాలలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు చేతుల మీదుగా లేపాక్షి అవార్డును అందుకున్నారు. కళాకారులనుతయారు చేయాలని.. నా లాగే జానపద కళలో ఎంతోమంది నిరుపేద కళాకారులు ఉన్నారు. వారిని కూడా ఈ కళలో తీర్చిదిద్దాలనుకుంటున్నా.. 28 ఏళ్లుగా జానపదకళకు సేవ చేస్తున్నాను. ప్రతీ జిల్లాలో నృత్య పాఠశాలను ఏర్పాటు చేసి అంతరించి పోతున్న జానపద కళను పైకి తేవాలనేది నా ఆశయం. –బొమ్మారెడ్డి శ్రీనివాసరెడ్డి, నృత్య కళాకారుడు, సత్తుపల్లి