Viral Video: Cute Girl Dancing For Bullet Bandi Song At Marriage - Sakshi
Sakshi News home page

Bullettu Bandi Song: ఈ బుట్టబొమ్మ డ్యాన్స్‌కు ఫిదా అవ్వాల్సిందే!

Published Sat, Sep 11 2021 1:01 PM | Last Updated on Sat, Sep 11 2021 7:10 PM

A Girl cute dance for folk song bullet bandi song going viral - Sakshi

సాక్షి, హైదరాబాద్‌:  ప్రముఖ గాయని మోహన  భోగరాజు ఆలపించిన  బుల్లెట్‌ బండి  పాట హవా ఇంకా కొనసాగుతూనే ఉంది. ‘నీ బుల్లెట్టు బండెక్కి వచ్చేత్తపా.. అందాల దునియానే చూపిత్తపా’ అనే పాట ఏప్రిల్‌ 7న యూ ట్యూబ్‌లో అప్‌లోడ్‌ చేసింది మొదలు దూసుకుపోతోనే ఉంది. ‘ డుగ్గు డుగ్గు’ అంటూ  ఈ పాట నెట్టింట్లో  చేసిన హడావిడి అంతా ఇంతా కాదు.

దీనికి తోడు గోదావరిఖనికి చెందిన  కొత్త పెళ్లి కూతురు సాయిశ్రీ అదిరిపోయే డ్యాన్స్‌తో మరింత క్రేజ్‌ పెంచేసింది. మరోవైపు సీనియర్‌ సిటిజన్లతో  కూడా  స్టెప్పులేయించేస్తోంది ఈ బుల్లెట్‌ బండి. ఇటీవల ఒక పెద్దావిడ చేసిన మరో అద్బుతమైన డ్యాన్స్‌ నెటిజనులను ఆకట్టుకుంది.  ఇక తాజాగా తూర్పుగోదావరికి చెందిన ఓ చిన్నారి మరింత ఫిదా చేస్తోంది. తన చిట్టి చిట్టి పాదాలతో లయబద్ధంగా నృత్యం చేస్తూ చక్కటి అభినయంతో ఈ బుట్టబొమ్మ ఔరా అనిపిస్తోంది.  అదేమిటో మీరూ చూసేయండి ఒకసారి.

చదవండి : ‘బుల్లెట్టు బండి’ పాట 22 రోజుల కష్టం: రచయిత లక్ష్మణ్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement