
వయసు పెరుగుతున్న కొద్దీ అందం, నటనతో అభిమానులను ఆశ్చర్యానికి లోనయ్యేలా చేస్తున్నారు కొందరి తారామణులు. వారిలో ఇప్పుడు ముందు వరసలో చేరారు మాధురీ దీక్షిత్. విద్యాబాలన్‌తో కలిసి ఇటీవల ‘అమి జె తోమార్ 3.0’ యుగళగీతానికి నృత్యం చేస్తున్న షూటింగ్ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
భూల్ భులయ్యా3 సినిమాలోని ఈ పాట అక్టోబర్ 25న విడుదల అయ్యింది. ఈ సినిమా ట్రైలర్‌లో ఇప్పటికే మాధురీ దీక్షిత్‌ను చూసిన నెటిజనులు చెక్కుచెదరని ఆమె అందాన్ని చూసి ఆశ్చర్యపోతున్నారు. ఇంక ‘అమి జె తోమర్ 3.0’ లో 45 ఏళ్ల విద్యాబాలన్‌తో కలిసి 57 ఏళ్ల మాధురి దీక్షిత్ చేసిన నృత్యం విశేషంగా ఆకట్టుకుంటోంది. 2007లో విడుదలైన భూల్ భులయ్యా సినిమాలోని ఒరిజనల్ ట్రాక్‌కి రీమేక్ ఇది. మ్యూజిక్ డైరెక్టర్ ప్రీతమ్ కం΄ోజ్ చేసిన ఈ పాటను శ్రేయా ఘోషల్ పాడారు.
Comments
Please login to add a commentAdd a comment