పార్టీలు , పెళ్లిళ్లలో డీజేలు, డ్యాన్స్‌లు చాలా కామన్ అయిపోయాయి. ముఖ్యంగా మోహన భోగరాజు పాడిన బుల్లెట్ బండి పాటతో ఈ డ్యాన్స్‌లకు మరింత క్రేజ్ పెరిగింది. ఏ ఫంక్షన్‌లో చూసినా, ఏ మేరేజ్‌లో చూసినా పాటలకు ఉత్సాహంగా డ్యాన్స్ చేయడం, అది ట్రెండింగ్‌లో నిలవడం సర్వ సాధారణంగా చూస్తున్నాం. తాజాగా ఒక పెళ్లిలో ఒక చిన్నారి డ్యాన్స్ ఇంటర్నెట్‌లో తెగ చక్కర్లు కొడుతోంది.
2011లో వచ్చిన తమిళ మూవీ మంబియట్టాన్ లోని ఈ పాటకు ఇద్దరు అబ్బాయిలతో కలసి ఒకచిన్నారి డ్యాన్స్ అదరగొట్టేసింది. తన స్టెప్పులతో అక్కడున్న వారందరలోనూ ఫుల్ ఎనర్జీ నింపేసింది. దీంతో తమన్ మేనియాకు ఫ్యాన్స్ మరోసారి మెస్మరైజ్ అయిపోతున్నారు. ఎంత యాక్టివ్‌గా డ్యాన్స్ చేసింది పాప అంటూ నెటిజన్లు అభినందిస్తున్నారు. రోజుకు ఒక్కసారైనా ఇలాంటి స్టెప్స్ వేస్తే..చాలు.. ఒత్తిడి అంతా మాయం అంటూ కమెంట్ చేస్తున్నారు. మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఓ లుక్కేసుకోండి.. ఈ వీకెండ్‌మూడ్‌లో మీకు భలే ఎంటర్ టైన్‌మెంట్..
Damn that little girl🔥🔥 pic.twitter.com/r1MFxvGJ9Y
— Miss Disappear! (@_SecretStalker_) March 24, 2022
Comments
Please login to add a commentAdd a comment