little girl
-
చిన్న పిల్లల్ని కూడా వదలని ఐటీడీపీ జీతగాళ్ళు
-
జగన్ మామయ్యని చూసి ఎందుకు ఏడ్చానంటే
-
జగన్ మామ అంటే నాకెంతో ఇష్టం : మహితారెడ్డి
-
మామయ్యా.. నీ లాలన కావాలి.. నీ పాలన రావాలి (ఫొటోలు)
-
ఫుడ్ సపోర్టింగ్
చిన్నారులకు ఆర్నెల్ల వయసు వచ్చాక, వారికి ఇచ్చే తల్లిపాలతో పాటు క్రమంగా ఘనాహారాన్ని ఇవ్వడం మొదలుపెడతారు. ఇలా తల్లిపాలతో పాటు చిన్నారిని ఘనహారం వైపునకు మళ్లించడానికి ఇచ్చే ఆహారాన్ని కాంప్లిమెంటరీ డైట్‌గా చెప్పవచ్చు. అయితే పిల్లలకు ఆర్నెల్లు నిండేవరకు తల్లిపాలు మినహా ఎలాంటి ఇతర ఆహారాలూ ఇవ్వాల్సిన అవసరం ఉండదు. నిజానికి ఆర్నెల్ల వయసు వరకు పిల్లలకు నీళ్లు కూడా తాగించాల్సిన అవసరమూ ఉండదు. వాణిజ్య ప్రయోజనాల దృష్ట్యా ఇలా చిన్నారులను ఘనాహారం వైపునకు మళ్లించేందుకు ఇచ్చే కాంప్లిమెంటరీ ఆహారం గురించి మార్కెట్ ప్రకటనల హడావుడి ఇటీవలి రోజుల్లో చాలా ఎక్కువగానే ఉంటోంది. నిజానికి కాంప్లిమెంటరీ డైట్ అనేది... తల్లిపాలతో పాటు పిల్లలకు ఆర్నెల్ల వయసు నుంచి అదనంగా ఇవ్వాల్సిన అనుబంధ ఆహారం మాత్రమే. కాబట్టి కాంప్లిమెంటరీ ఆహారమంటే అదేదో మార్కెట్లో మాత్రమే లభ్యమయ్యే ఆహారం అని అపోహపడాల్సిన అవసరం లేదు.కాంప్లిమెంటరీ డైట్ ఇవ్వాల్సిందిలా... ఘనాహారంలో భాగంగా పిల్లలకు ఉడికించిన అన్నం (రైస్), ఉడికించిన పప్పు (దాల్), అరటిపండు, ఉడకబెట్టిన కూరగాయలు (ఆలూ వంటివి) చిదిమి, మెత్తగా చేసి పెట్టాలి. అలాగే ఘనాహారం మొదలుపెట్టిన నాటి నుంచి వాళ్లకు కాచి చల్లార్చిన నీళ్లు పట్టాలి. ఇది మినహా మార్కెట్లో లభించే వాణిజ్య ప్రయోజనాలతో తయారు చేసిన ఎలాంటి ఆహారమూ ఇవ్వాల్సిన అవసరం లేదు. పైన చెప్పిన ఈ ఆహారాన్ని ఆర్నెల్ల పిల్లలకు రోజూ 150 నుంచి 200 ఎమ్ఎల్ పరిమాణంలో రెండు నుంచి మూడు సార్లు తినిపించవచ్చు. పాలు ఎక్కువగా పట్టని పిల్లలకు రోజూ 3 నుంచి 5 సార్లు తినిపించవచ్చు. ఇక ఎనిమిది/తొమ్మిది నెలలు నిండిన పిల్లలకు పైన పేర్కొన్న ఆహారమేగాక... ఇకపై మెత్తగా చిదిమిన రోటీ, కాస్తంత గట్టిగా వండిన పప్పు, ఇడ్లీ, రవ్వతో కాస్తంత జావలా వండిన ఆహారం (పారిడ్జ్), సపోటా, బొ΄్పాయి వంటి ఆహారం ఇవ్వవచ్చు. ఇక్కడ మనం పైన పేర్కొన్న ఆహారం కూడా కాంప్లిమెంటరీ ఆహారమే.కాంప్లిమెంటరీ ఆహారానికి నిర్వచమిదీ... అసలు కాంప్లిమెంటరీ ఆహారానికి ఉండాల్సిన లక్షణాలు ఏమిటంటే... పిల్లలకు సరైనది, మృదువుగా ఉండేది, తేలిగ్గా జీర్ణమయ్యేది, స్థానిక సంస్కృతి ఆమోదించేది, తేలిగ్గా వండగలిగేది, భరించగలిగే ఆర్థిక స్తోమతను బట్టి చూస్తే చవకగా లభించేది అని అధ్యయనాల నిర్వచనం. ఇప్పుడు దీన్ని ‘కాంప్లిమెంటరీ ఆహారం’గా అభివర్ణిస్తున్నారు గానీ... గతంలో ఘనాహారాన్ని మొదలుపెట్టే ప్రక్రియను ఇంగ్లిష్‌లో ‘వీనింగ్’ అనేవారు. కానీ ఈ ప్రక్రియను వీనింగ్ అనడం అంత సమంజసం కాదని నిపుణులు అభి్రపాయం. నిజానికి వీనింగ్ అంటే పాలు పట్టడాన్ని క్రమంగా ఆపేస్తూ / నిలిపేస్తూ ఘనాహారానికి మళ్లడం అని అర్థం. కానీ... పిల్లలకు రెండేళ్లు నిండేవరకు తల్లిపాలు పట్టడం కొనసాగిస్తూనే ఈ ఘనాహారాన్ని అనుబంధంగా ఇవ్వాలి కాబట్టి దీన్ని ఇప్పుడు అనుబంధ ఆహారం (కాంప్లిమెంటరీ ఫుడ్) అంటున్నారు. ఇక ఆరు నెలలు నిండిన పిల్లలకు ఈ వయసు నుంచి ఎదుగుదలకు దోహదం చేసే ఆహారం అవసరం కాబట్టి ఈ టైమ్‌లో దీన్ని మొదలుపెట్టాలి. నిజానికి ప్రపంచవ్యాప్తంగా కేవలం 30% నుంచి 35% మంది మాత్రమే పిల్లలకు ఆర్నెల్ల వయసు నుంచి అనుబంధ ఆహారాన్ని మొదలుపెడుతున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) పేర్కొంటోంది.త్వరగా మొదలుపెట్టడమూ, లేట్ చేయడం ఈ రెండూ సరి కాదు... ఇక కొద్దిమంది తల్లిదండ్రులు తమ పిల్లలకు కాస్తంత త్వరగా అంటే... మూడు లేదా నాలుగు నెలల వయసు నుంచే ఘనాహారాన్ని మొదలుపెడుతున్నారు. ఇది సరైన పద్ధతి కాదు. ఇలా మొదలుపెట్టిన పిల్లల్లో కొందరికి ఆహారం గొంతులో తట్టుకోవడం (చోకింగ్), నీళ్లవిరేచనాలు (డయేరియా), అలర్జీ వంటి లక్షణాలు కనిపించవచ్చు. అలాగే ఆలస్యంగా మొదలుపెడితే అది వాళ్ల సాధారణ పెరుగుదలపై దుష్ప్రభావం చూవచ్చు. అందుకే సరైన సమయంలో పిల్లలకు ఘనాహారం / అనుబంధ ఆహారం మొదలుపెట్టడం అన్నది ముఖ్యం. అలాగే ఘనాహారం ఇస్తున్నప్పటికీ పిల్లలకు రెండేళ్లు వచ్చేవరకు తల్లిపాలు ఇవ్వడం మేలు. అదే ఆరోగ్యకరం కూడా. -
వివాహేతర సంబంధం: 22 నెలల చిన్నారిని కొరికి.. నేలకేసికొట్టి!
చివ్వెంల(సూర్యాపేట): వివాహేతర సంబంధానికి అడ్డొస్తుందని చిన్నారిని నేలకేసి కొట్టి హత్యచేసిన సంఘటన సూర్యాపేట జిల్లా చివ్వెంల మండలం ఐలాపురంలో బుధవారం వెలుగులోకి వచ్చింది. ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. నిజామాబాద్ జిల్లా గుండారం గ్రామానికి చెందిన కటకట లక్ష్మణ్‌తో అదే జిల్లా రంజల్ మండలం సాటాపూర్ గ్రామానికి చెందిన రమ్య అలియాస్ నవ్యశ్రీ వివాహం ఆరేళ్లక్రితం జరిగింది. వీరికి ఇద్దరు కుమార్తెలు అరుణ్య (04), మహన్వి (22 నెలలు). కాగా ఏడు నెలలుగా రమ్యశ్రీ అదే గ్రామానికి చెందిన బొల్లెం అరవిందరెడ్డితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. 20 రోజుల క్రితం ఇద్దరు పిల్లలను తీసుకుని ప్రియుడితో కలిసి సూర్యాపేట జిల్లా చివ్వెంల మండలం ఐలాపురం గ్రామానికి వచ్చి అక్కడే నివాసం ఉంటున్నారు. అరవిందరెడ్డి ఇటుకబట్టీల వద్ద ట్రాక్టర్ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. చిన్నారి మహన్వి తమ వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉందని భావించి మంగళవారం రాత్రి అరవిందరెడ్డి ఆమెను కొరికి, కొట్టి హింసించి నేలకేసి కొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందింది. ఈ మేరకు రమ్య అత్త కటికట గంగమణి ఫిర్యాదు మేరకు సూర్యాపేట రూరల్ సీఐ సురేందర్‌రెడ్డి ఆదేశాలతో ఎస్ఐ వెంకట్ రెడ్డి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా చిన్నారికి చెండు చెంపలు, భుజాలు, రెండు చేతులు, పిరుదులపై, తలకు తీవ్ర గాయాలై ఉన్నాయని ఎస్ఐ తెలిపారు. -
గోపాల మురిపాల బాల
కొన్ని వీడియోలు వైరల్ కావడానికి మాటలు, నిడివితో పనిలేదు. ‘హార్ట్‌వార్మింగ్ ఎలిమెంట్’తో మౌనంగానే వైరల్ అవుతాయి. ఈ వీడియో అలాంటి కోవకు చెందింది. ఆరుబయట మంచంపై కూర్చొని ఆడుకుంటున్న ఓ పాప దగ్గరికి ఆవు వచ్చి ‘ఎలా ఉన్నావు పాపా?’ అన్నట్లుగా ఎక్స్ప్రెషన్ ఇచ్చింది. పాప ఆవు ముఖాన్ని చేతుల్లోకి తీసుకొని నిమురుతూ ‘నేను బాగానే ఉన్నాను. నీ సంగతి ఏమిటి?’ అన్నట్లుగా నవ్వుతుంటుంది. ఇన్‌స్టాగ్రామ్‌లో వైరల్ అయిన ఈ వీడియో లక్షలాది వ్యూస్‌తో దూసుకుపోతోంది. -
సెల్ఫీపేరు చెప్పి సుహాసిని, పిల్లలను నదిలోకి తోసేసిన సురేష్
-
దేవదా... నా నటన నచ్చిందా?
సినిమాలలోని పాపులర్ సీన్లను రీక్రియేట్ చేసి ఆనందించడం మనకు కొత్త కాదు. సంజయ్‌లీలా బన్సాలీ ‘దేవదాస్’ సినిమాలో ‘పారు’ పాత్రలోని ఐశ్వర్యారాయ్‌ని అనుకరిస్తూ కైరా ఖన్నా అనే బాలిక చేసిన వీడియో తాజాగా వైరల్ అయింది. ఐకానిక్ సినిమాలలోని పాపులర్ సీన్లను అనుకరిస్తూ కైరా చేసే వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. ‘జిస్ వక్త్ తుమ్హారే సాథ్ హోతి హమ్ ఉస్ వక్త్ బద్నామి కా బీ డర్ నహీ లగ్తా’ ‘దస్ సాల్ పహ్లే తుమ్హరే నామ్ కా దియా జలాయ థా మైనే. ఉసే ఆజ్ తక్ బుజ్నే నహీ దియా’... ఇలా ‘దేవదాస్’ సినిమాలోని ‘పారు’ పాపులర్ డైలాగ్‌లతో ‘వావ్’ అనిపించింది కైరా ఖన్నా. ‘డైలాగుల నుంచి ఎక్స్ప్రెషన్ వరకు అద్భుతం’ ‘అద్భుతమైన యాక్టింగ్ స్కిల్స్ ఉన్న కైరాకు బాలీవుడ్లో బ్రైట్ ఫ్యూచర్ ఉంది’... అంటూ నెటిజనులు కైరా ఖన్నాపై ప్రశంసల వర్షం కురిపించారు. -
ప్లే జోన్ మెషిన్ లో పడి తెగిపోయిన మూడేళ్ల చిన్నారి చేతివేళ్లు
-
ప్రధాని మోదీ మనసు గెలిచిన చిన్నారి
-
ఈ చిన్నారి టాలెంట్‌కు ఫిదా అయిన ప్రధాని మోదీ
మహిళతో కలిసి కన్నడ పాట పాడుతూ, అద్భుతంగా పియానో వాయిస్తున్న ఓ చిన్నారి వీడియో ఇటీవల సోషల్ మీడియాలో వీర లెవల్లో వైరల్ అయిన విషయం తెలిసిందే. అనంత్ కుమార్ అనే యూజర్ ఈ వీడియోను ట్విట్టర్లో షేర్ చేశాడు. ‘పల్లవగల పల్లవియాలి’ అనే పాటకు పియానో వాయిస్తూ చిన్నారి శాల్మలీ ప్రదర్శించిన హావభావాలు నెటిజన్లను విశేషంగా ఆకట్టుకుంది. తాజాగా చిన్నారి టాలెంట్‌కు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఫిదా అయ్యారు. పాప వీడియోను మోదీ తన ట్విటర్ అకౌంట్లో షేర్ చేశారు. చిన్నారి వీడియో ప్రతి ఒక్కరి ముఖంపై చిరునవ్వు తెప్పిస్తుందన్నారు. ఆమెలో అసాధారణమైన ప్రతిభ, సృజనాత్మకత దాగుందన్నారు. భవిష్యత్తులో గొప్ప స్థాయికి ఎదగాలని శాల్మలీకి ఆశీస్సులు అందజేశారు. This video can bring a smile on everyone’s face. Exceptional talent and creativity. Best wishes to Shalmalee! https://t.co/KvxJPJepQ4 — Narendra Modi (@narendramodi) April 25, 2023 కాగా పల్లవగల పల్లవియాలి’ అంటూ చిన్నారి పాడిన పాటను కన్నడ కవి కేఎస్.నరసిహస్వామి రచించారు. ఈ బ్యూటిఫుల్ వీడియో ఇంటర్నెట్లో వైరల్ అయ్యింది. ‘పక్కనే తీయటి సెలయేరు పారుతున్నట్లుగా ఉంది’ ‘మ్యాజిక్ వాయిస్ ప్లస్ బ్యూటీఫుల్ ఎక్స్ప్రెషన్స్’లాంటి కామెంట్స్ ఎన్నో కనిపించాయి. నిజానికి ఆన్లైన్ ప్రేక్షకులకు ఈ చిన్నారి గొంతు కొత్తేమీ కాదు. గత సంవత్సరం బాలీవుడ్ సినిమా ‘కబీర్‌సింగ్’ సినిమాలోని ‘కైసే హువా’ పాటను అద్భుతంగా పాడింది. ఈ వీడియో సోషల్‌మీడియాలో వైరల్ అయింది. -
వైరల్ వీడియో.. అనాధ వృద్ధుడికి నీళ్లు తాగించిన చిన్నారి
-
మొన్న పూజిత.. నేడు అమీక్ష
సాక్షి, హైదరాబాద్: అన్నంలో పురుగులు వస్తున్నాయని ఇటీవల 4వ తరగతి విద్యార్థిని పూజిత నేరుగా పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి ఇన్స్పెక్టర్కు ఫిర్యాదు చేయగా.. తాజాగా 2వ తరగతి చదువుతున్న మరో చిన్నారి ఇంటి పక్కన గొడవ జరుగుతుంది, వచ్చి ఆపాలని రాత్రి 11 గంటలకు డయల్ 100కు కాల్ చేసిన సంఘటన మీర్‌పేట పోలీస్‌స్టేషన్ పరిధిలో సోమవారం చోటు చేసుకుంది. సీఐ మహేందర్‌రెడ్డి తెలిపిన వివరాలు.. ప్రశాంతిహిల్స్ రోడ్ నం–6కు చెందిన అమీక్ష (7) టీచర్స్‌కాలనీలోని భారతి స్కూల్లో 2వ తరగతి చదువుతోంది. ఆదివారం రాత్రి ఇంటి పక్కనే నిర్మాణంలో ఉన్న ఓ భవనం వద్ద ఇద్దరి కూలీలు గొడవ పడుతున్నారు. గొడవ జరుగుతున్నట్లు గ్రహించిన చిన్నారి అమీక్ష రాత్రి 11 గంటలకు తండ్రి సెల్‌ఫోన్ తీసుకొని డయల్ 100కు కాల్ చేసి ఇక్కడ గొడవ జరుగుతుంది.. వెంటనే వచ్చి గొడవను ఆపాల్సిందిగా కోరింది. బాలిక ఫిర్యాదు చేయడంతో మీర్‌పేట పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. గొడవ పడుతున్న ఇద్దరు కూలీలకు సర్ది చెప్పి అక్కడి నుంచి పంపించారు. తొందరగా స్పందించినందుకు థ్యాంక్యూ అంకుల్ అని చిన్నారి చెప్పినట్లు సీఐ మహేందర్‌రెడ్డి తెలిపారు. అమీక్షను స్ఫూర్తిగా తీసుకొని ఎక్కడ ఏ గొడవ జరిగినా, ఆపద వచ్చినా డయల్ 100కు కాల్ చేసి సమాచారం ఇవ్వాలని సీఐ సూచించారు. -
రూ.10తో బర్గర్ షాప్‌లోకి పదేళ్ల పాప.. చిరునవ్వుతో బయటకు..!
నోయిడా: ప్రస్తుత కాలంలో బర్గర్లు, పిజ్జాలు అంటే చిన్నపిల్లలు ఎక్కువగా ఇష్టపడుతున్నారు. ఇలాగే ఓ చిన్నారి బర్గర్ షాప్‌కు వెళ్లి బర్గర్ ఆర్డర్ చేసింది. ఆ తర్వాత తన వద్ద ఉన్న రూ.10 నోటును తీసిచ్చింది. కానీ, ఆమె ఆర్డర్ చేసిన బర్గర్ ధర రూ.90. ఆ విషయం ఆ చిన్నారికి తెలియదు. అయితే, కొద్ది సేపటి తర్వాత ఆ పాప బర్గర్ తింటూ చిరునవ్వుతో బయటకు వచ్చింది. ఇంతకీ లోపల ఏం జరిగిందనే విషయాన్ని బర్గర్ కింగ్ తన ట్విటర్లో పోస్ట్ చేసింది. నొయిడాలోని బొటానికల్ మెట్రో స్టేషన్‌కు దగ్గర్లోని బర్గర్ కింగ్ షాపులోకి 10 ఏళ్ల పాప వచ్చింది. తన పాకెట్లో ఉన్న రూ.10 అక్కడున్న సిబ్బంది చేతికిచ్చి బర్గర్ కావాలని కోరింది. అయితే, దాని ధర రూ.90 ఉన్నప్పటికీ అమాయకంగా చూస్తున్న ఆ చిన్నారిని చూసి క్యాష్ కౌంటర్లోని వ్యక్తి మిగిలిన రూ.80 చెల్లించాడు. బర్గర్ అసలు ధర ఆ పాపకు చెప్పకుండానే కేవలం రూ.10కే బర్గర్‌ను తెప్పించి ఇచ్చాడు. దీంతో బర్గర్ అందుకున్న ఆనందంలో ఆ చిన్నారి చిరునవ్వుతో అక్కడి నుంచి వెళ్లిపోయింది. అక్కడే ఉన్న సోషల్ మీడియా యూజర్ అమాయకంగా బర్గర్ కోసం ఎదురుచూస్తున్న ఆ చిన్నారి ఫొటో తీశారు. ఆ ఫోటోను లైఫ్ మెంబర్ అనే ట్విటర్లో షేర్ చేయటంతో వైరల్‌గా మారింది. ఈ విషయాన్ని తెలుసుకున్న బర్గర్ కింగ్ సంస్థ యాజమాన్యం చిన్నారికి బర్గర్ అందించిన ఉద్యోగి ధీరజ్ కుమార్‌గా గుర్తించింది. తమ షాపులోకి వచ్చిన చిన్నారి పట్ల ధీరజ్ ప్రవర్తించిన తీరుకు ప్రశంసలు కురిపించింది. అంతే కాదు ఆ వ్యక్తిని సన్మానించింది. ఈ ఫోటోలను ట్విటర్లో షేర్ చేసింది బర్గర్ కింగ్ ‘ఈ ప్రపంచ ఆహార దినోత్సవం సందర్భంగా మా నోయిడా బొటానికల్ గార్డెన్ మెట్రో స్టేషన్ వద్ద ఉన్న రెస్టారెంట్లో పని చేస్తున్న ధీరజ్ కుమార్ తన ప్రవర్తనతో అందరిని ఆకట్టుకున్నారు.’ అంటూ జరిగిన సంఘటనను గుర్తు చేసుకూంటూ పలు ఫోటోలు షేర్ చేసింది. #WorldFoodDay2022 पर मेरी नज़र में इससे खूबसूरत तस्वीर और नही हो सकती.. काउंटर स्टाफ के सुनहरे भविष्य की हार्दिक शुभकामनाएं 💖💐@anandmahindra@IAmSudhirMishra @News18India @RandeepHooda @BurgerKing ...👌👌👍💐 pic.twitter.com/RcAp3cKR7R — Life Member (IFTDA) (@Life_Mem_IFTDA) October 19, 2022 This #WorldFoodDay, Dheeraj Kumar, working at our Noida Botanical Garden Metro Station restaurant, has inspired us all with his beautiful act of kindness. We had a very special guest who walked into our restaurant asking for a #burger but had only ₹10 with her. (1/3) pic.twitter.com/89oXh07sOB — BurgerKingIndia (@burgerkingindia) October 20, 2022 ఇదీ చదవండి: యువతి నృత్యం వివాదాస్పదం... పాక్ యూనివర్సిటీ నోటీసులు -
చిన్నారికి సీఎం వైఎస్ జగన్ భరోసా
-
వామ్మో.. 8 నెలల చిన్నారి ఛాతి మధ్యలో ఏముందో తెలిస్తే షాకే..!
సాక్షి, కర్నూలు: మొనదేలిన పిన్నీసును 8 నెలల చిన్నారి మింగడంతో కర్నూలు వైద్యులు చాకచక్యంగా ఎండోస్కోపీ పరికరంతో దాన్ని తొలగించారు. శనివారం స్థానిక గాయత్రి ఎస్టేట్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో గ్యాస్ట్రో ఎంట్రాలజిస్టు డాక్టర్ రాజేంద్రప్రసాద్ వివరాలు వెల్లడించారు. నంద్యాలకు చెందిన చిన్నారి 8 నెలల నక్షత్ర శనివారం ఉదయం ఆడుకుంటూ పొరపాటును పిన్నీసును మింగేసిందన్నారు. చదవండి: స్పా ముసుగులో వ్యభిచారం దీంతో తల్లిదండ్రులు పాపను తమ వద్దకు తీసుకు రాగా ఎక్స్‌రే తీసి చూడగా ఛాతి మధ్యలో ఊపిరితిత్తులకు దగ్గరగా ఉన్నట్లు గమనించామన్నారు. మొనదేలి ఉన్నందున లోపల గుచ్చుకోకుండా ఎండోస్కోపి పరికరంతో చాకచక్యంగా బయటకు తీశామన్నారు. చిన్నారులను తల్లిదండ్రులు ఎప్పుడూ ఓ కంట కనిపెట్టి ఉండాలని, వారికి సమీపంలో ఇలాంటి వస్తువులు లేకుండా జాగ్రత్త పడాలని సూచించారు. -
మీ పిల్లలు బడికి వెళ్తున్నారా.. పేరెంట్స్ ఒక్కసారి ఈ వీడియో చూడండి!
కొన్నిసార్లు మనుషులు చేసే తప్పిదాలు.. తీవ్ర పరిణామాలకు దారితీస్తాయి. క్షణికావేశం, క్షణకాల నిర్లక్ష్యం కారణంగా ఎదుటివారి ప్రాణాలు గాలిలో కలిసే అవకాశం ఉంటుంది. ఇలాంటి వీడియోనే ఒకటి తాజాగా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఓ స్కూల్ బస్సు డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా చిన్నారి తీవ్రంగా గాయపడింది. వివరాల ప్రకారం.. అమెరికాకు చెందిన జెఫ్ఫర్సన్ పబ్లిక్ స్కూల్ బస్సు నుండి ఓ చిన్నారి(6) కిందకు దిగుతోంది. ఈ క్రమంలో బస్సు డ్రైవర్.. డోర్ ఓపెన్ చేసింది. కాగా, చిన్నారి పూర్తిగా స్టెప్స్ దిగకముందే.. డోర్ క్లోజ్ కావడంతో ఆమె బ్యాగ్.. డోర్ మధ్యలో చిక్కుకుపోతుంది. దీంతో, బాలిక.. కిందకు దిగకుండా అలాగే నిల్చుడిపోతుంది. అది గమనించని డ్రైవర్.. బస్సును స్టార్ట్ చేసి వెళ్లిపోతుంటాడు. HOLY SHIT. The little girl is miraculously fine, the bus driver has been fired. pic.twitter.com/uuijsrNn2U — Dean Blundell🇨🇦 (@ItsDeanBlundell) September 23, 2022 దీంతో, చిన్నారి బస్సు డోర్‌కు వేలాడుతూనే వస్తుంది. ఇలా దాదాపు 1000 అడుగుల దూరం వచ్చాక.. బస్సులో ఉన్న వారు చిన్నారిని చూసి కేకలు వేయడంతో డ్రైవర్ బస్సును నిలిపివేస్తుంది. ఈ ప్రమాదంలో బాలిక తీవ్రంగా గాయపడుతుంది. వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలిస్తారు. ఇక, ఈ ఘటన అనంతరం డ్రైవర్‌ను విధుల నుంచి తొలిగిస్తారు. అలాగే, పాఠశాల యాజమాన్యం చిన్నారి పేరెంట్స్‌కు దాదాపు 5 మిలియన్ల డాలర్లను నష్టపరిహారంగా ఇచ్చినట్టు సమాచారం. కాగా, ఈ ప్రమాదం 2015లో జరిగింది. తాజాగా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. వీడియో చూసిన నెటిజన్లు పిల్లల విషయంలో పేరెంట్స్ జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. -
చిట్టిచేతులతో అమ్మకోసం డిన్నర్.. వీడియో వైరల్..
బుడి బుడి అడుగులు వేసే ఓ రెండేళ్ల పసిపాప తన తల్లికోసం పసిప్రాయంలోనే చెఫ్‌గా మారింది. చిట్టిచేతులతో కూరగాయలు కట్ చేసి ప్రత్యేకంగా డిన్నర్ తయారు చేసింది. ఈ చిన్నారి ఎంతో ఓపికతో ఇష్టంగా ఆహారం వండిన తీరు నెటిజన్లను మంత్రముగ్దుల్ని చేసింది. ఆగస్టు చివరి వారంలో అప్లోడ్ అయిన వీడియో ఇప్పుడు వైరల్ అయి నెట్టింట హల్చల్ చేస్తోంది. ఈ వీడియోలో చిన్నారి స్వయంగా కూరగాయలు కట్ చేసింది. వాటిని జాగ్రత్తగా బాయిలర్‌లో పెట్టింది. పాప పని చేస్తూనే క్యారట్ కొరుక్కుని తినడం చాలా క్యూట్‌గా అనిపించింది. అంతేకాదు ఆ తర్వాత చికెన్ కూడా వండింది. టిక్‌టిక్‌టిక్ అంటూ చికెన్ ముక్కలను ఎయిర్ ఫ్రయర్లో వేసింది. ఓ పాకెట్ రైస్‌ను మైక్రోవేవ్‌లో పెట్టి దానికి కాస్త ఆయిల్, యాపిల్ సైడర్ వెనిగర్ యాడ్ చేసింది. ఆ తర్వాత రైస్‌ను ఓ బౌల్లోకి తీసుకుంది. చివరకు మొత్తం డిన్నర్‌ను ప్రిపేర్ చేసి టేబుల్‌పై పెట్టింది ఈ పసిపాప. ఆ తర్వత ఆమె తల్లి వచ్చాక.. ఇద్దరూ కలిసి భోజనం చేశారు. ఈ డిన్నర్ చాలా రుచిగా ఉందంటూ తల్లి కూతుర్ని మెచ్చుకుని మురిసిపోయింది. ఈ క్షణం కోసం, తన వ్యక్తిగత చెఫ్ కోసం చాలా కాలంగా ఎదురుచూస్తున్నట్లు పేర్కొంది. చిన్నారి వీడియోను చూసి నెటిజన్లు ప్రశంసలతో ముంచెత్తారు. వావ్, అమేజింగ్ అంటూ కొనియాడారు. View this post on Instagram A post shared by Bruna Fava and Natalie (@natalieandbruna) చదవండి: నిమిషంలోపే హెయిర్ కట్.. గిన్నిస్ రికార్డు సృష్టించిన హెయిర్ డ్రస్సర్ -
నడిరోడ్డు పై అనూహ్య ఘటన....ఒక్కసారిగా ఆగిపోయిన వాహనాలు: వీడియో వైరల్
నడి రోడ్డుపై ఎవరైన అనుకోకుండా పడిపోతే పట్టించుకునే ఉండేవాడు. అంతేందుకు ఒక చిన్న యాక్సిడెంట్ జరిగిన అదే దారిలో వచ్చే వాహనదారుడు ఆగడం గానీ సాయం కానీ చేయరు. పైగా పోలీసు కేసులు అవి ఉంటాయన్న భయంతో ముందుకు రావడానికే జంకుతారు. అక్కడికి ట్రాఫిక్ పోలీసు అవగాహన కార్యక్రమాలు చేపట్టి ప్రమాదం జరిగిన వెంటనే స్పందించే కాపాడేవాడు గొప్పవాడు అంటూ మంచి రివార్డులు ఇచ్చి సత్కరించిన ముందకు వచ్చి సాయం చేసేవాళ్లు కరువు. ఐతే ఇక్కడ అలాకాకుండా రోడ్డు పై పడిపోయిన ఒక చిన్నారికి సాయం చేసేందుకు చాలా మంది ముందుకు వస్తారు. వివరాల్లోకెళ్తే...చైనాలోని నిగ్బో ప్రాంతంలోని ఒక రద్దీగా ఉండే రోడ్డు పై పలు వాహానాలు ట్రాఫిక్ సిగ్నల్ పడటంతో ఆగిపోతాయి. ఐతే ఇంతలో ఒక చిన్నారి కారు విండోలోంచి అనుహ్యంగా జారి పడిపోతుంది. ఆమె పడే సమయంలో సిగ్నల్ పడటం వాహనాలన్ని కదిలిపోతాయి. ఆ చిన్నారి మాత్రం కిందపడి ఏడుస్తూ ఉంటుంది. ఇంతలో వెనుక నుంచి వేగంగా దూసుకువస్తున్న వాహానాలన్ని ఒక్కసారిగా ఆగిపోతాయి. అంతేకాదు మరో వాహానదారుడు సదరు చిన్నారి వద్దకు వచ్చి ఎత్తకుని ఆమె రోడ్డు పక్కకు తీసుకువచ్చి సపర్యలు చేస్తాడు. ఈ మేరకు ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఆన్లైన్లో తెగ వైరల్ అవుతోంది. మీరు ఓ లుక్కేయండి. A child who fell out of a car window was rescued by drivers and passengers of the following cars in Ningbo, China pic.twitter.com/IF6Kj3viHS — China Xinhua News (@XHNews) August 2, 2022 -
నాలుగేళ్లకే 198 రాజధానుల పేర్లు చెప్పి...రికార్డు సృష్టించింది
తాటిచెట్లపాలెం(విశాఖ ఉత్తర): నాలుగేళ్లకే 198 దేశాలు.. వాటి రాజధానులు టకటకా చెప్పేసింది. అదీ కేవలం రెండున్నర నిమిషాల్లో.. చాలా మందికి అసాధ్యమనుకునే ఈ ఘనతను సాధించి రికార్డులకెక్కింది. స్కూల్ ముఖం కూడా చూడని ఆ వయసులో ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్, ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ రికార్డ్స్, తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో పేరు లిఖించుకుంది. ఆమే ఎండాడకు చెందిన దత్తు ప్రకాష్, దత్తు అపర్ణల ముద్దుబిడ్డ దత్తు శ్రీ నందన. శ్రీనందన చిన్నప్పటి నుంచి టీవీ, మొబైల్‌కు వంటి వాటికి ఆకర్షణకు గురి కాకుండా తల్లిదండ్రులు జాగ్రత్త వహించారు. చిన్నారిలో అంతర్లీనంగా దాగి ఉన్న తెలివితేటలు, జ్ఞాపకశక్తిని గుర్తించి.. కథలో పాటు జనరల్ నాలెడ్జ్ అంశాలు వివరించే ప్రయత్నం చే శారు. అలా 198 దేశాల పేర్లు, రాజధానులు నేర్పించారు. నాలుగేళ్లకే అవన్నీ గుర్తుకు పెట్టుకున్న నందన కేవలం రెండున్నర నిమిషాల్లోనే దేశాలు– రాజధానులు టకటకా చెప్పి.. తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్, లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్, ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు సంపాదించుకుంది. ప్రస్తుతం చిన్నారి వయసు ఏడేళ్లు. ఇప్పుడు ప్రపంచంలోని మొత్తం దేశాలు వాటి తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణ సరిహద్దులను ఠక్కున చెబుతోంది. ఈ చిన్నారి తన మైండ్‌లో గ్లోబ్ మొత్తం గుర్తుకు పెట్టుకుంది. ప్రపంచ దేశాలు, నాలుగు సరిహద్దులకు సంబంధించి దాదాపు 800 ప్రశ్నలకు సమాధానాలను కొన్ని సెకన్లలో చెప్పేస్తోంది. ఇది కేవలం మైండ్ మ్యాపింగ్ అనే పద్ధతి ద్వారా మాత్రమే సాధ్యమని ఆమె తల్లిదండ్రులు అంటున్నారు. ఈ ఈవెంట్‌తోనే గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు కోసం ప్రయత్నం చేసింది. ఇటీవల పిక్ ఏ బుక్ వేదికపై జరిగిన ఈవెంట్లో న్యాయనిర్ణేతల సమక్షంలో శ్రీనందన ప్రదర్శనను రికార్డ్ చేసి.. గిన్నిస్ బుక్ ప్రతినిధులకు పంపించారు. ఆమె ప్రతిభను గుర్తించిన నాటి కలెక్టర్ ప్రవీణ్ ప్రకాష్ మొదలు స్థానిక నాయకులు, గాయకులు, ప్రముఖులు ఇలా ఎందరో శ్రీనందనను ప్రశంసించారు. పలు టీవీ షోలు, ఎఫ్‌ఎంలలో శ్రీనందన తన అనుభవాలను పంచుకుంది. (చదవండి: ఏపీ అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం ) -
జీవితంలో రోజుకు ఒకసారైనా ఇలా చేయండి!!
పార్టీలు , పెళ్లిళ్లలో డీజేలు, డ్యాన్స్‌లు చాలా కామన్ అయిపోయాయి. ముఖ్యంగా మోహన భోగరాజు పాడిన బుల్లెట్ బండి పాటతో ఈ డ్యాన్స్‌లకు మరింత క్రేజ్ పెరిగింది. ఏ ఫంక్షన్లో చూసినా, ఏ మేరేజ్లో చూసినా పాటలకు ఉత్సాహంగా డ్యాన్స్ చేయడం, అది ట్రెండింగ్‌లో నిలవడం సర్వ సాధారణంగా చూస్తున్నాం. తాజాగా ఒక పెళ్లిలో ఒక చిన్నారి డ్యాన్స్ ఇంటర్నెట్లో తెగ చక్కర్లు కొడుతోంది. 2011లో వచ్చిన తమిళ మూవీ మంబియట్టాన్ లోని ఈ పాటకు ఇద్దరు అబ్బాయిలతో కలసి ఒకచిన్నారి డ్యాన్స్ అదరగొట్టేసింది. తన స్టెప్పులతో అక్కడున్న వారందరలోనూ ఫుల్ ఎనర్జీ నింపేసింది. దీంతో తమన్ మేనియాకు ఫ్యాన్స్ మరోసారి మెస్మరైజ్ అయిపోతున్నారు. ఎంత యాక్టివ్‌గా డ్యాన్స్ చేసింది పాప అంటూ నెటిజన్లు అభినందిస్తున్నారు. రోజుకు ఒక్కసారైనా ఇలాంటి స్టెప్స్ వేస్తే..చాలు.. ఒత్తిడి అంతా మాయం అంటూ కమెంట్ చేస్తున్నారు. మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఓ లుక్కేసుకోండి.. ఈ వీకెండ్మూడ్లో మీకు భలే ఎంటర్ టైన్మెంట్.. Damn that little girl🔥🔥 pic.twitter.com/r1MFxvGJ9Y — Miss Disappear! (@_SecretStalker_) March 24, 2022 -
తాతా నీళ్లు తాగు.. గంగిరెద్దు ఇదిగో అరటిపండు! సల్లగుండు బిడ్డా
సోషల్‌మీడియాలో ఈమధ్య ఎందుకు ఏ వీడియో వైరల్ అవుతుందో చెప్పలేకపోతున్నాం. కానీ, కొన్ని వీడియోలు మాత్రం మనసును హత్తుకునేలా ఉంటున్నాయి. అలాంటి వీడియోనే ఒకటి ఇప్పుడు వాట్సాప్ స్టేటస్‌లుగా, ఫేస్‌బుక్‌లోనూ వైరల్‌గా మారింది. గంగిరెద్దును ఆడించే ఓ పెద్దాయన స్పృహ కోల్పోతే.. ఓ చిన్నారి అతనికి చేసిన ఉడతా సాయం పలువురి చేత ప్రశంసలు కురిపిస్తోంది. ఓ తాత గంగిరెద్దును ఆడిస్తూ భిక్షాటన చేస్తూ ఓ గేట్ ముందుకు చేరగా.. ఆ ఇంటి మహిళ ఆయన్ని ఈసడించుకుంది. ఆ పక్కనే మరో ఇంటి ముందుకు వెళ్లగా.. హఠాత్తుగా స్పృహ కోల్పోయి కిందపడ్డాడు ఆ పెద్దాయన. దీంతో గంగిరెద్దు ఆ బసవన్నను లేపే ప్రయత్నం చేసింది. ఇంతలో అటుగా వెళ్తున్న ఓ వ్యక్తి అదేం పట్టన్నట్లు ముందుకు సాగిపోగా.. ఆ పక్కనే వెళ్తున్న ఇద్దరు చిన్నారులు మాత్రం అది గమనించారు. అందులో బ్యాగ్ వేసుకున్న ఓ చిన్నారి ఆ గంగిరెద్దు తాతకు దగ్గరగా వెళ్లింది. బసవన్నకు భయపడుతూనే ఆ తాతను లేపే ప్రయత్నం చేసింది. ఆపై తన బ్యాగ్‌లో ఉన్న వాటర్ బాటిల్‌ను తాతకు అందించి.. ఆపై ఎద్దుకు అరటి పండు అందించింది. చివరికి పైకి లేచిన తాత ఆ చిన్నారిని ఆశీర్వదిస్తూ అక్కడి నుంచి వెళ్లిపోయాడు. సీసీ కెమెరాల్లో రికార్డు అయినట్లు చెప్తున్న వీడియోను చూసి పలువురు ఆ చిన్నారిని ‘చిన్నవయసు-పెద్దమనసు’ అంటూ పొగుడుతున్నారు. ఇది ఎప్పటి వీడియో?.. ఏదైనా షార్ట్‌ఫిల్మ్‌లో భాగమా? అనే విషయంపై స్పష్టత లేదు. కానీ, కంటికి ఇంపుగా ఉండడంతో వైరల్ అవుతోంది. -
వయసులో చిన్నది.. బాధ్యత పెద్దదే! వైరల్ అవుతున్న చిట్టితల్లి
The girl is seen in the video Bad Condition Of Kashmir Roads: ఇంతవరకు మనం చూసే వైరల్ వీడియోలు కొన్ని సందేశాత్మకంగానూ, ప్రజలను ఆలోచింప చేసే విధంగానూ ఉన్నాయి. అయితే కొన్ని వైరల్ వీడియోలైతే ఆనంద్ మహీంద్రలాంటి ప్రముఖులను సైతం కదిలించాయి. అచ్చం అలాంటి సందేశాత్మకమైన ఆలోచింప చేసే క్యూట్ వైరల్ వీడియో ఒకటి నెట్టింట తెగ హల్చల్ చేస్తోంది. అసలు విషయంలోకెళ్తే.. ఈ వైరల్ వీడియోలో ఒక చిన్నపాప రిపోర్టర్లా కశ్మీర్లో రోడ్ల పరిస్థితి ఎంత అధ్వానంగా ఉందో, ప్రజలు ఏవిధంగా చెత్త పారేస్తున్నారో వివరించింది. పైగా ఆ వీడియోలో ఈ రోడ్లు ఇంత దారుణంగా ఉండటం వల్ల తన ఇంటికి అతిధులు కూడా రాలేకపోతున్నారని చెబుతోంది. అంతేకాదు రిపొర్టర్ మాదిరి చెప్పి చివరిలో కెమెరామెన్ అమ్మతో అని ముగిస్తుంది. ఇటీవల కశ్మీర్ లోయలో భారీ మంచు, వర్షం కురిసిన సంగతి తెలిసింది. దీంతో రోడ్లు బురదగా మారి అత్యంత అధ్వానంగా ఉన్నాయి. ఈ మేరకు రెండు నిమిషాల నిడివి గల ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతుంది. అంతేకాదు ఈ వీడియోకి లక్షల్లో వ్యూస్, లైక్‌లు వచ్చాయి. మీరు కూడా ఓ లుక్కేయండి. Meet Youngest reporter from the #Kashmir Valley. pic.twitter.com/4H6mYkiDiI — Sajid Yousuf Shah (@TheSkandar) January 9, 2022 (చదవండి: 60 మిలియన్లకు కోవిడ్ కేసులు..మృతుల సంఖ్య 8 లక్షలకుపైనే!) (చదవండి: అఫ్ఘనిస్తాన్‌లో పేలుడు... తొమ్మిది మంది మృతి) -
కన్నీళ్లు మిగిల్చిన వేడినీళ్లు
చలిగాలి వీచినా.. ఎండ పొడ తాకినా.. తట్టుకోలేని వయసది. అమ్మ ఒడిలో ఒదిగిపోయే ప్రాయమది. రంగుల ప్రపంచాన్ని చూడాలని ఆరాటపడే చిన్ని మనస్తత్వమది. ‘అమ్మా.. నాన్న’ ఈ రెండు పదాలు తప్ప వేరే ప్రపంచమే తెలియని చిన్ని లోకమది. ఆ లోకాన్నే ‘మా లోకం’ అని బతుకుతున్నారు తల్లిదండ్రులు. ఆ బుజ్జాయి జ్ఞాపకాల్ని కడుపులో దాచుకున్న అమ్మ.. ఆ బుజ్జి పలికిన పదాలు మనసులో మననం చేసుకున్న నాన్న. ఆ చిన్నారి షైనీ రాకతో జీవితం ‘షైన్’ అయిందనుకున్నారు. ఆ చిన్నారి స్నానానికి పెట్టిన వేడినీళ్లు.. జీవితాంతం కన్నీళ్లను మిగుల్చుతాయని అస్సలు అనుకోలేదు. హసన్‌పర్తి: మండలంలోని సీతంపేటకు చెందిన బండారి అశోక్, సుజాత దంపతుల కూతురు షైనీ(3) వేడి నీళ్లలో పడి చికిత్స పొందుతూ శనివారం మృతి చెందింది. నవంబర్ 27న షైనీ స్నానం కోసమని తల్లి సుజాత ఇంటి ఆవరణలో హీటర్ పెట్టింది. నీళ్లు బాగా వేడి అయ్యాయని హీటర్ ఆఫ్ చేసింది. ఆ తర్వాత సుజాత వంట పనుల్లో నిమగ్నమైంది. ఈ క్రమంలో షైనీ ఆడుకుంటూ బకెట్‌ను సమీపించింది. తప్పటడుగులేసుకుంటూ బకెట్‌ను తాకింది. ఒక్కసారిగా వేడి నీళ్లు పడడంతో గట్టిగా ఏడ్చింది. తల్లి వచ్చి చూసే సరికి షైనీ ఒళ్లు ఎర్రగా మారింది. ఏడుస్తున్న కూతురుని ఎంజీఎంకు తరలించారు. వైద్యులు వారం రోజులు చికిత్స అందించారు. శనివారం చికిత్స పొందుతున్న షైనీ మృతి చెందింది. చదవండి: (భర్త లింగమార్పిడి.. మరొకరితో సహజీవనం.. అంతలోనే..) ఎమ్మెల్యే పరామర్శ బాధిత కుటుంబాన్ని స్థానిక ఎమ్మెల్యే అరూరి రమేశ్ పరామర్శించారు. çఘటన జరిగిన తీరును తెలుసుకున్నారు. ఎమ్మెల్యే వెంట స్థానిక సర్పంచ్ జనగాం శరత్, ఎంపీటీసీ సభ్యురాలు బండారి రజిత, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు బండి రజనీకుమార్, టీఆర్ఎస్ నాయకులు చేరాలు, తిరుపతి, పీఏసీఎస్ డైరెక్టర్ భగవాన్‌రెడ్డి, ఉపసర్పంచ్ భగవాన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ఆరేళ్ల ఆర్నా ప్రపంచ రికార్డు.. విమానం తోక చూసి..
చిన్నారులకు పదేపదే చెబితేగానీ ఎ.బి.సి.డిలు గుర్తుండవు. అటువంటిది ఆరేళ్ల ఆర్నా గుప్తా విమానం తోక చూసి అది ఏ దేశానికి చెందినదో ఇట్టే చెప్పేస్తుంది. నిమిషంలో 93 దేశాలకు చెందిన విమానాలను గుర్తించి ‘అంతర్జాతీయ బుక్ ఆఫ్ రికార్డ్స్’లో చోటు దక్కించుకుంది. హర్యాణాలోని పంచకులకు చెందిన ఆర్నా ఏదైనా ఒక్కసారి చూసినా, విన్నా వెంటనే తన మెదడు లో నిక్షిప్తం చేసుకుంటుంది. వాటి గురించి ఎప్పుడు అడిగినా టక్కున చెప్పేస్తుంది. రెండేళ్ల వయసునుంచే ఆర్నా చెప్పిన ప్రతివిషయాన్ని ఆపోశన పట్టేస్తుంది. ఇది గమనించిన ఆర్నా తల్లి నేహా గుప్తా.. ఆర్నాను ప్రోత్సహించారు. దీంతో ఈ రోజు ఆర్నా ప్రపంచ రికార్డును సాధించింది. గతేడాది ఆగస్టులో 120 మంది ప్రముఖుల పేర్లను 92 సెకన్లలో చెప్పి రికార్డు సృష్టించింది. -
ఇంజెక్షన్ ఖరీదు రూ.16 కోట్లు.. చిట్టి తల్లికి పెద్ద కష్టం
కాచిగూడ (హైదరాబాద్): చిన్న వయస్సులోనే పెద్ద వ్యాధితో బాధ పడుతోంది. బొమ్మలతో ఆడుకోవాల్సిన వయస్సులో ఈ చిన్నారి మంచానికి అతుక్కుపోతోంది. బుడిబుడి అడుగులతో, బోసి నవ్వులతో సందడి చేసిన తమ కలల పంట ఆరోగ్యం రోజురోజుకు క్షీణిస్తుండటంతో తల్లిదండ్రులు విలవిల్లాడుతున్నారు. ఆమె వైద్యానికి అవసరమైన ఒక్క ఇంజెక్షన్ ఖరీదు రూ.16 కోట్లు కావడంతో.. దయగల దాతలు మానవతా దృక్పథంతో ముందుకు వచ్చి తమ కుమార్తెకు ప్రాణభిక్ష పెట్టాలని ప్రాధేయపడుతున్నారు. అరుదైన వ్యాధి ఎస్ఎంఏ– 3 హైదరాబాద్ కాచిగూడ ప్రాంతానికి చెందిన దోషిలి వినయ్, శిల్ప దంపతులకు ఇద్దరు కుమార్తెలు. మొదటి కుమార్తె సాన్వి జన్యు సంబంధమైన వెన్నెముక కండరాల క్షీణత (ఎస్ఎంఏ టైప్ –3) వ్యాధితో పోరాడుతోంది. సాన్వి కొంతకాలం నుంచి సరిగ్గా నడవలేక పోతుండటంతో వైద్యులకు చూపించగా నరాల బలహీనత ఉందని చెప్పి మందులు వాడాలని, ఫిజియోథెరపీ చేయించాలని చెప్పారు. వారి సూచనల మేరకు వైద్యం చేయిస్తూ, ఫిజియోథెరపీ చేయిస్తున్నా చిన్నారి ఆరోగ్యంలో ఏమాత్రం మార్పు రాలేదు. పైగా రోజురోజుకూ ఆరోగ్యం క్షీణిస్తుండటంతో ఇటీవల నిమ్స్ ఆసుపత్రిలో జెనిటిక్ వైద్య నిపుణురాలు డాక్టర్ ప్రజ్ఞా రంగనాథన్ వద్ద చూపించారు. అన్ని రకాల వైద్య పరీక్షల అనంతరం సాన్వి.. కోట్ల మందిలో ఏ ఒక్కరికో వచ్చే ఎస్ఎంఏ టైప్ 3 వ్యాధితో బాధపడుతున్నట్టుగా వైద్యులు నిర్ధారించారని ఆమె తల్లిదండ్రులు తెలిపారు. ప్రస్తుతం రెయిన్బో ఆసుపత్రి వైద్యుడు డాక్టర్ రమేష్ పర్యవేక్షణలో ఇంటి వద్దే చికిత్స చేయిస్తున్నామని చెప్పారు. ఇంజెక్షన్ ఇవ్వకపోతే జీవితాంతం మంచంపైనే.. ఈ వ్యాధి కోసం ఇవ్వాల్సిన ఇంజక్షన్ ఖరీదు రూ.16 కోట్లు ఉంటుందని డాక్టర్లు చెప్పారని సాన్వి తల్లిదండ్రులు తెలిపారు. పైగా అది ఇక్కడ దొరకదని, విదేశాల నుంచి తెప్పించాల్సి ఉంటుందని, జీఎస్టీతో కలుపుకొని దాదాపు రూ.22 కోట్లు అవుతుందని చెప్పారు. ఐదు సంవత్సరాల వయస్సు లోపే తమ చిన్నారికి ఈ ఇంజెక్షన్ వేయించాల్సి ఉంటుందని, లేనిపక్షంలో జీవితాంతం మంచానికే పరిమితం కావాల్సి ఉంటుందని వైద్యులు చెప్పినట్లు విలపిస్తూ తెలిపారు. ఇటీవల నగరానికే చెందిన ఆయాన్స్ గుప్తాకు నిధుల సమీకరణ ద్వారా ఆ ఇంజెక్షన్ తెప్పించి ఇచ్చారని, జీఎస్టీని ప్రభుత్వం మినహాయించిందని సాన్వి తల్లిదండ్రులు తెలిపారు. తక్కువ సమయమే ఉంది తమ కుమార్తెకు చికిత్స ప్రారంభించడానికి తక్కువ సమయం మాత్రమే ఉందని వినయ్, శిల్ప తెలిపారు. నాలుగు నెలల్లో ఇంజెక్షన్ ఇస్తేనే సాధారణ స్థితికి వస్తుందని చెప్పారు. దాతలు తాము చేయగలిగినంత సాయం చేసి (బ్యాంక్ అకౌంట్ నంబర్ : 50100421831334, ఐఎఫ్ఎస్సీ కోడ్: హెచ్డీఎఫ్సీ 000024, గూగుల్ పే, ఫోన్ పే, పే టీఎం నంబర్ : 9618779839) తమ చిన్నారిని కాపాడాలని వారు కోరుతున్నారు. చదవండి: నేటి నుంచి ఏపీకి ఆర్టీసీ బస్సులు -
కంటతడి పెట్టిస్తున్న చిన్నారి వీడియో; ఒంటి కాలితో..
అన్ని అవయవాలు సరిగా ఉన్నవారే కొన్ని పనులు చేయలేకపోతుంటారు. అనేక విషయాల్లో చాలా బద్దకంగా వ్యవహరిస్తుంటారు. కానీ అంగ వైకల్యం కలిగిన ఓ చిన్నారి ఔరా అనిపించింది. ఆమె సంకల్పించిన బలం ముందు తన వైకల్యం చిన్నబోయింది. పట్టుదల, కృషితో దేన్నైనా సాధించగలనని నిరూపించింది. ప్రొస్తెటిక్ కాలు కలిగిన (కృత్రిమ కాలు) అంటోనెల్లా అనే ఐదేళ్ల చిన్నారి చిన్న లోయలా ఉండే ఓ గుంతలో పడిపోయింది. అక్కడి నుంచి ఎక్కడానికి ప్రయత్నిస్తుంటే మళ్లీ జారీ కిందకే పడిపోతుంది. అసలు తను మీదకు వెళ్లగలుగుతుందో తెలియదు కానీ.. తన తల్లి ప్రొత్సాహపరుస్తుంటే కచ్చితంగా ఎక్కగలను అనే నమ్మకాన్ని కూడగట్టుకుంది. నువ్వు చేయగలవు.. కింద పడవు. నీవు బలవంతురాలివి అంటూ తల్లి ఎంజరేజ్ చేస్తుండటంతో ఒంటి కాలితో మెల్లమెల్లగా పైకి ఎక్కింది. పైకి వెళ్లిన తరువాత వెనక్కి తిరిగి తల్లిని చూస్తూ చిరునవ్వు విసిరింది. దీనికి సంబంధించిన వీడియోను గుడ్ న్యూస్ కరస్పాండెంట్ ట్విటర్లో పోస్ట్ చేశారు. చిన్నారి లోయనుంచి ఎక్కడానికి ప్రయత్నిస్తున్న ఈ వీడియో నెటిజన్లను కంటతడి పెట్టిస్తోంది. అనేకమంది లైకులు, రీట్వీట్లతో ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో వైరలవుతోంది. ‘అంటోనెల్లా తన తల్లిని ఎప్పటికి గుర్తుంటుచుంటుంది. తను పెద్దయ్యాక ఒక పోరాట యోధురాలిగా ఎదుగుతుంది. అందులో ఎలాంటి సందేహం లేదు’. అని కామెంట్ చేస్తున్నారు. చదవండి: వెరైటీగా వంతెన మీద వివాహం.. కారణం ఇదేనా ‘క్యూబూల్ హై’ అనగానే ముద్దుపెట్టేసిన వధువు Antonella wasn’t sure she could do it, but with her encouraging mom cheering her on— she did it! 🙌🏼🥰🇧🇷 (📽antonella.funghetto)👏🏼👏🏼👏🏼 Você é uma campeã 💓 pic.twitter.com/wT04GvfOUh — GoodNewsCorrespondent (@GoodNewsCorres1) May 26, 2021 -
వైరల్: బొమ్మతో చిరుతనే ఆటపట్టించిన చిన్నారి!
వాషింగ్టన్: పిల్లలకి బొమ్మలంటే మహా సరదా. అలాగే ఇంట్లో ఉండే పెంపుడు జంతువులతో ఆడలాడుతుంటారు. వాటి చెవులు పీకుతూ.. జూలు దువ్వుతూ.. సరదాగా గడుపుతారు. తాజాగా ఫిలడెల్ఫియా జూలో చిరుతతో ఓ చిన్నారి ఆట వైరల్‌గా మారింది. తమ బిడ్డతో జూకి వెళ్లిన తల్లిదండ్రులు ఆమెను పులి ఎదుట నిలిపారు. వారు కొంత దూరంలో ఉండి తమ కూతురిని గమనించారు. ఆమె పులిని పెంపుడు పిల్లి అనుకుందో..ఏమో.. దానికి హాయ్ చెప్పింది. తన చేతిలో ఉన్న బొమ్మతో చిరుతను ఆటపట్టించింది. అయితే, చిరుత అమాంతం ఆ పసిపాప పైకి దూకే ప్రయత్నం చేసింది. చిన్నారి చేతిలోని బొమ్మవైపు అదోలా చేసి.. దాన్ని తినేయాలి అనేంత కసిగా.. వారి మధ్య అడ్డుగా ఉన్న గాజు గోడను గోళ్లతో రక్కింది. కాగా, ఈ వీడియోను లారా ఫ్రేజర్ అనే వ్యక్తి రికార్డు చేసి "ప్లే డేట్" క్యాప్సన్‌తో ఇన్‌స్టాగ్రామ్‌లో శనివారం సాయంత్రం పోస్ట్ చేయగా 93 వేల మంది వీక్షించారు. వేల మంది కామెంట్ చేశారు. ఈ వీడియోలో చిన్నారి తన చేతిలోని బొమ్మతో చిరుతను ఆట పట్టిస్తుంది. తన చేతిలో ఉన్న బొమ్మను గాజు ముందు ఉంచిన ప్రతిసారీ చిరుత దాన్ని పట్టుకోవడానికి ప్రయత్నిస్తుంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. " చిన్నారి చిరుతను చూసి పిల్లి అనుకుంటోంది’’ అని ఓ నెటిజన్ కామెంట్ చేయగా.." చిరుత చిన్నారిని చూసి రుచికరమైన ఆహారం అనుకుంటోంది." అని మరో నెటిజన్ రాసుకొచ్చారు. " అడ్డుగా గాజు గోడ లేకుంటే. ఏమై ఉండేదో.."అంటూ మరొకరు ఆందోళన వ్యక్తం చేశారు. (చదవండి: కోడి గుడ్ల కోసం.. ఛీ ఇదేం పాడు పని పోలీసు) -
వంటలతో అదరగొడుతున్న చిన్నారి
-
ప్రపంచాన్ని కదిలిస్తున్న బాల పర్యావరణవేత్తలు
మాడ్రిడ్: వారిద్దరూ స్కూలుకెళ్లి చక్కగా చదువుకుంటూ, ఆడుకుంటూ కాలం గడపాల్సిన వాళ్లు. కానీ పర్యావరణ పరిరక్షణపై వారికున్న ఆసక్తి ప్రపంచ దేశాల నేతల ముందు వక్తలుగా మార్చింది. మణిపూర్‌కు చెందిన ఎనిమిదేళ్ల లిసిప్రియా కంగుజమ్ వాతావరణంలో వస్తున్న మార్పులపై చర్యలు తీసుకోండి అంటూ ప్రపంచ అధినేతలను కోరుతోంది. స్పెయిన్ వేదికగా ఈనెల 13 వరకు జరుగుతున్న సీఓపీ25 వాతావరణ సదస్సులో భాగంగా ఆమె ప్రసంగించారు. ఆడుకోవాల్సిన వయసులో తమ భవిష్యత్తు కోసం పోరాటం చేయాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తంచేశారు. ఆమె తండ్రి కేకే.సింగ్ మాట్లాడుతూ..తమ కూతురు ఇప్పటికే 21 దేశాల్లో వాతావరణ మార్పుల గురించి ప్రసంగాలు చేసిందన్నారు. ఐక్యరాజ్య సమితి సమావేశంలో ‘హౌ డేర్ యూ ?’ అంటూ ప్రపంచ నేతలనుద్దేశించి ప్రశ్నించిన స్వీడన్ టీనేజర్ గ్రెటా థన్‌బర్గ్ (16) టైమ్స్ మేగజీన్ పర్సన్ ఆఫ్ ది ఇయర్ 2019గా నిలిచింది. మానవాళికి ఉన్న ఒకే గృహాన్ని నాశనం చేయవద్దంటూ ఆమె చేసిన పోరాటం మన్ననలు అందుకుందని టైమ్స్ మేగజీన్ బుధవారం తెలిపింది. వ్యక్తిగతంగా ఈ రికార్డును అందుకున్న అతి పిన్న వయస్కురాలు గ్రెటానే అంటూ టైమ్స్ ఆమెను కొనియాడింది. లిసిప్రియా, గ్రెటాలు ఇద్దరూ పర్యావరణం గురించి నిరసనల్లో పాల్గొనేందుకు స్కూలుకు సైతం సరిగా వెళ్లేవారు కాదు. టైమ్ పర్సన్ ఆఫ్ ది ఇయర్‌గా గ్రెటా థన్‌బర్గ్ -
పేద కుటుంబానికి పెద్ద కష్టం
సాక్షి, మందస: ఆ దంపతులిద్దరూ రోజూ కూలీకి వెళ్తే తప్ప కుటుంబ పోషణ గడవదు. పేదరికానికి చెందిన వీరు ఇద్దరు పిల్లలను ఉన్నంతలో బాగానే చూసుకుంటున్నారు. కానీ, విధి బలీయమైనది. ఎప్పుడు.. ఎవరినీ.. ఎలా బాధిస్తుందో తెలియదు. సరిగ్గా ఇదే పరిస్థితి ఆ కుటుంబానికి ఏర్పడింది. ఆ పేద కుటుంబానికి కేన్సర్ రూపంలో కష్టాన్ని తీసుకువచ్చింది. మందస మండలంలోని ఉద్దాన ప్రాంతమైన లొహరిబంద గ్రామానికి చెందిన రెయ్యి రాజు, లక్ష్మీకాంతానికి కుమార్తె నవ్య(ప్రేమకుమారి) నాలుగు తరగతి చదువుతోంది. కుమారుడు నవదీప్ 7వ తరగతి చవుతున్నాడు. చిన్నప్పటి నుంచే చురుగ్గా ఉండే నవ్య చదువులో కూడా ఎంతో తెలివితేటలు చూపింది. కానీ తెలియని బాధ అనుభవిస్తున్న చిన్నారి నవ్యను ఆస్పత్రికి తీసుకెళ్తే.. వైద్యులు కేన్సర్ అని నిర్థారించడంతో తల్లిదండ్రులు తల్లడిల్లిపోయారు. తనకు కలిగిన బాధను భరిస్తూ ఇప్పటికీ నవ్య నవ్వుతూనే ఉంది. బిడ్డను ఎలాగైన బతికించుకోవాలన్న తపనతో అప్పులు చేసి మరీ సుమారు రూ.7 లక్షలు వైద్యానికి ఖర్చు చేశారు. కానీ ఫలితం కనిపించలేదు. నవ్య మెడపై కణితి రోజురోజుకూ పెరిగిపోతుండడంతో తమిళనాడు కేన్సర్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. బోన్‌మారో కేన్సరని చికిత్సకు సుమారు రూ.30 లక్షల వ్యయం అవుతుందని చెప్పడంతో తల్లిదండ్రులకు నోటిమాట రాలేదు. ఈ గండం నుంచి బిడ్డను ఎలా కాపాడుకోవాలో తెలియక మనోవేదన అనుభవిస్తున్నారు. కూలికి వెళ్తే కానీ బతుకుబండి ముందుకు సాగని తల్లిదండ్రులు ఆవేదనకు గురతున్నారు. ఎలాగైనా బిడ్డను బతికించుకోవాలని దాతల సాయం కోరుతున్నారు. ఫోన్ 7993024330 నంబరును సంప్రదించాలని, 33914104113 ఎస్బీఐ ఖాతా నంబరుకు, 8790940529 నంబర్‌కు ఫోన్‌పే ద్వారా సాయం చేయాలని నవ్య తల్లిదండ్రులు కోరుతున్నారు. -
చిన్నారి ప్రాణాలు కాపాడిన కుక్క
-
వైరల్.. చిన్నారి ప్రాణాలు కాపాడిన కుక్క
కుక్కకు ఉన్న విశ్వాసం మనిషికి కూడా ఉండదంటారు పెద్దలు. అయితే కొన్ని ఘటనలు చూసినప్పుడు వారు ఈ మాట ఊరికనే చెప్పలేదని అనిపిస్తుంది. తాజాగా ఓ కుక్క తన విశ్వాసాన్ని ప్రదర్శించడమే కాకుండా.. తెలివిగా వ్యవహరించి చూపరుల మనసును దోచుకుంటుంది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వీడియోలో ఏముందంటే.. నది పక్కన ఆడుకుంటున్న ఓ చిన్నారి.. బాల్‌ను నీళ్లలో పడవేసుకుంటారు. తర్వాత దాన్ని తీసేందుకు నదిలోకి అడుగుపెట్టడానికి ప్రయత్నిస్తారు. దీన్ని గమనించిన ఒక కుక్క వెంటనే అక్కడికి చేరుకుని చిన్నారిని గౌను పట్టుకుని వెనక్కి లాగి పడేస్తుంది. ఇలా చిన్నారి ప్రాణాలు కాపాడటమే కాకుండా.. నీటిలో పడిన బంతిని తీసుకువచ్చి ఆ పాపకు అందజేస్తుంది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌గా మారడంతో.. కుక్క చేసిన పనిని ప్రతి ఒక్కరు అభినందిస్తున్నారు. కుక్కను మెచ్చుకుంటూ ఫన్నీ కామెంట్లు పెడుతున్నారు. కుక్క విశ్వాసం అయింది కాబట్టే చాలా మంది తమ ఇళ్లలో వాటిని పెంచుకుంటారు. కొంత మంది మాత్రం కుక్కను కూడా తమలో ఒక్కరిగా చూస్తారు. -
ఆపదలో ఆదుకున్న చిన్నారి చిట్కాలు
ముంబై: సాధారణంగా ఏదైనా ప్రమాదం జరిగితే అక్కడున్న వారంతా భయంతో వణికిపోతారు.అదే అగ్ని ప్రమాదాల్లాంటివయితే చావు భయంతో తోపుళ్లు, తొక్కిసలాటలతో పరిస్థితి భయానకంగా మారుతుంది.అయితే, ముంబైలోని క్రిస్టల్ టవర్‌లో బుధవారం అగ్ని ప్రమాదం జరిగినప్పుడు ఆరో తరగతి చదువుతున్న పదేళ్ల అమ్మాయి ఎంతో ధైర్యంగా వ్యవహరించి ప్రమాదంలో చిక్కుకున్న వారి ప్రాణాలు కాపాడింది. జెన్ సదావర్తే అనే ఆ బాలిక అగ్ని ప్రమాదం కారణంగా వెలువడిన పొగతో ఉక్కిరిబిక్కిరవుతున్న వారికి చిన్న చిట్కాతో ఉపశమనం కలిగించింది.పొగకు ప్లాట్లలోని జనమంతా ఊపిరాడక ఉక్కిరిబిక్కిరవుతోంటే జెన్ వాళ్లకి ధైర్యం చెప్పింది. తడి గుడ్డను ముక్కుకు కట్టుకుంటే పొగలోని కార్బన్‌డయాక్సెడ్ ఊపిరితిత్తుల్లోకి వెళ్లదు అని చెప్పింది. అంతే కాకుండా అందుబాటులో ఉన్న పాత బట్టల్ని తీసుకొచ్చి వాటిని చిన్న చిన్న ముక్కలుగా(జేబురుమాళ్ల సైజులో)చింపింది. వాటిని తడిపి అందరికీ ఇచ్చి ముక్కుకు కట్టుకోమని చెప్పింది.అంతా అలా చేసి కార్బన్డయాక్సైడ్ బారి నుంచి బయటపడ్డారు.అలాగే, లిఫ్టులో కిందకి దిగకూడదంటూ వారిని వారించింది.తన దగ్గరున్న ఎయిర్ ప్యూరిఫైయర్‌ను కూడా అందరికి ఇచ్చింది.అలాగే అందరూ ఒకేసారి మెట్ల మీదుగా తోసుకుంటూ కిందకి వెళ్లితే జరిగే ప్రమాదాన్ని కూడా వారికి అర్థమయ్యేలా చెప్పింది. -
చిన్నారిని చిదిమేసిన లారీ
గంగాధర (చొప్పదండి) : అప్పటివరకు ఆ చిన్నారి అమ్మ వెంటే ఉంది. అక్కతో కలిసి ఆడుకుంది. శివరాత్రి సందర్భంగా పాఠశాలకు సెలవు రావడంతో ఇంట్లోనే అందరితో ఆనందంగా గడిపింది. మరికొద్దిసేపటికి శివుడిని దర్శించుకునేందుకు ఆలయానికి వెళ్దామని అనుకుంటుండగా.. ఓ లారీ మృత్యురూపంలో వచ్చి ఆ చిన్నారిని చిదిమేసింది. కరీంనగర్–జగిత్యాల ప్రధాన రహదారిపై మంగళవారం జరిగిన ఈ ఘటన పండుగపూట ఆ ఇంట్లో విషాదం నింపింది. అప్పటివరకూ తనపక్కనే ఆడుకుంటూ ఉన్న కూతురు రెప్పపాటులో విగతజీవిగా మారడంతో ఆ తల్లి రోదన కంటతడి పెట్టించింది. సంఘటనకు సంబంధించిన వివరాలు.. గంగాధర మండలం కురిక్యాల గ్రామానికి జంగిలి వసంత, తిరుపతి దంపతులకు ఇద్దరు కూతుళ్లు గంగోత్రి, రక్షిత సంతానం. వారిని అల్లారుముద్దుగా పెంచుకుంటున్నారు ఆ దంపతులు. మంగళవారం శివరాత్రి కావడంతో చిన్నకూతురు రక్షిత (9) ఉదయం నుంచే ఇంటి పనుల్లో నిమగ్నమైంది. శివుడిని దర్శించుకుందామని ఉద్దేశంతో ఉదయమే స్నానాలు పూర్తిచేసుకుంది. పండుగ సామగ్రి కోసం తల్లి వసంత గంగాధర చౌరస్తాకు ఆటోలో వెళ్తుండగా.. తానూ వస్తానని మారాం చేసింది. కూతురును కాదనలేక ఆ తల్లి వెంటతీసుకెళ్లి తిరిగి.. ఇంటికి చేరుకుంది. వసంత ఆటోడ్రైవర్‌కు డబ్బులు ఇస్తుండగా.. రక్షిత ఇంటికెళ్లేందుకు రోడ్డుదాటాలని పరుగెత్తింది. ఇంతలో వేగంగా వస్తున్న లారీ ఢీ కొట్టడంతో అక్కడికక్కడే మృత్యువాత పడింది. లారీ వెనుకటైర్లు తలపై నుంచి వెళ్లడంతో నుజ్జునుజ్జు అయ్యింది. విషయం తెలుసుకున్న ఎస్సై స్వరూప్‌రాజ్ సంఘటనస్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. ఢీ కొట్టిన లారీ డ్రైవర్ ఆపకుండా వెళ్లిపోయాడని ఎస్సై పేర్కొన్నారు. మిన్నంటిన రోదనలు అప్పటివరకు కళ్లముందే ఆడుకున్న తన కూతురు ఇక లేదని తెలిసి ఆ తల్లి రోదించిన తీరు స్థానికులను కలచివేసింది. కుటుంబసభ్యులు, బంధువులు సంఘటనస్థలానికి చేరుకుని శోకసంద్రంలో మునిగిపోయారు. ‘శివుడా.. నీ దర్శనం కోసం వస్తామని అనుకుంటే నీ దగ్గరకే తీసుకెళ్లావా..’ అంటూ తల్లి రోదించిన తీరు కలిచివేసింది. -
ప్రకాశం జిల్లాలో కిడ్నాప్ కలకలం
పెద్దచెర్లపల్లి: జిల్లాలో కిడ్నాప్ కలకలం రేగింది. పాఠశాలకు వెళ్తున్న ఐదేళ్ల బాలికను గుర్తు తెలియని దుండగుడు ద్విచక్ర వాహనంపై ఎత్తు కెళ్లన సంఘటన పెద్దచెర్లపల్లి మండలం పెద్ద ఈర్లపాడు గ్రామంలో గురువారం వెలుగు చూసింది. గ్రామానికి చెందిన బ్రహ్మయ్య, పుష్ప దంపతుల కుమార్తె(5)ను గుర్తు తెలియని వ్యక్తి బైక్ పై ఎక్కించుకొని పరారయ్యాడు. దీంతో చిన్నారి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపడుతున్నారు. జిల్లా వ్యాప్తంగా వాహన తనిఖీలు చేపడుతున్నారు. -
ఈ చిన్నారి కోట్ల హృదయాలు గెలుచుకుంది
-
ఈ చిన్నారి కోట్ల హృదయాలు గెలుచుకుంది
కాలిఫోర్నియా: పక్కవాడి కష్టాన్ని గుర్తించడం సాధరణంగా మంచి మనసున్నవారికే సాధ్యమవుతుంది. అలా గుర్తించగలిగేవారే నిజమైన మనుషులని అనిపించుకుంటారు కూడా. ఒక వేళ గుర్తించినా సహాయం చేయలేని పరిస్థితి ఉండే వారు కొందరైతే.. సహాయం చేసే పరిస్థితి ఉన్నప్పటికీ కష్టం గుర్తించి కూడా దూరంగా తొలిగిపోయేవారుంటారు. ఇలా చివరగా పేర్కొన్న వారి కళ్లు తెరుచుకునేందుకు ఈ సంఘటన చాలా చక్కగా ఉపయోగపడుతుంది. అలా కళ్లు తెరిపించేలా చేసింది కూడా పట్టుమని పదేళ్లు నిండని ఓ బాలిక. అది అమెరికాలోని కాలిఫోర్నియా.. తండ్రితో కలిసి 'ఎల్లా' అనే బాలిక ఓ రెస్టారెంటుకు వెళ్లింది. అందులో ఉన్నవారంతా ఏం చక్కా తమకు నచ్చిన ఫుడ్ ఆర్డర్ ఇచ్చుకొని లాగించేస్తున్నారు. అలాగే ఎల్లా తండ్రి ఎడ్డీ స్కాట్ కూడా వారిద్దరి కోసం ఓ స్పెషల్ ఫుడ్ ఆర్డరిచ్చాడు. అది రాగానే తినేద్దామనుకున్న ఎల్లా.. అలా కిటికీలో నుంచి బయటకు చూసింది. అప్పుడు రోడ్డు పక్కన ఫుట్ పాత్ పై ఓ నిలువ నీడలేని పెద్దాయన కూర్చుని కనిపించాడు. అతడు ఆకలితో ఉన్నాడని ఎలా గుర్తించిందో వెంటనే తండ్రికి తాను చేయబోయే పనిచెప్పి చక్కగా అతడివైపుగా నడిచి వెళ్లింది. తన కూతురు ఏం చేస్తుందా అని ఆసక్తితో వీడియో తీసుకుంటూ ఉన్నాడు. నేరుగా ఆ పాప వెళ్లి ఆ ముసలి తాతకు తాను తీసుకున్న ఆహారాన్ని అతడికి అందించింది. ఆ ఆహారం చూసి వణుకుతున్న చేతులతో ఆత్రుతగా తీసుకొని ఆ పసిదాని వైపు ఓ చల్లని చూపు చూస్తూ అతడు సంతోషంగా తినేశాడు. ఇదంతా వీడియో తీస్తున్న తన తండ్రి మనసు ఉప్పొంగింది. చిన్నవయసులోనే ఓ వ్యక్తి ఆకలి బాధను గుర్తించిన తన చిన్నారి ఎల్లాను మరింత ప్రేమగా దగ్గరకు తీసుకొని ఇలా చేయడం వల్ల ఇప్పుడు నీకు ఏమనిపిస్తుంది అంటూ ప్రశ్నించాడు. ఇలా చేయడమంటే నాకు చాలా ఇష్టం అంటూ బోసినవ్వులు నవ్వడంతో తండ్రి గుండెకు హత్తుకున్నాడు. ఆ వీడియోను ఫేస్ బుక్ లో ఈ నెల 1న షేర్ చేయగా ఇప్పటి వరకు నాలుగు కోట్లమంది(42 మిలియన్లు)కి పైగా వీక్షించారు. -
పాప భయంపై ఫొటోషాప్ పోట్లాట
ఒక్కసారిగా పురివిప్పిన నెమలిని ఎక్కడ తనను పొడుచుకుతింటుందోనన్న భయంతో ప్రాణాలు అరచేతిలోపెట్టుకుని పరుగుపెడుతోన్న ఈ ఆరేళ్ల పాప ఫొటో ప్రస్తుతం సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న సమస్యలన్నీ ఇప్పుడా పాపను చుట్టేశాయి. సంబంధంలేని ఎన్నెన్నో సంఘటనల్లోకి ఆమెను లాగేశారు. ఇదంతా ఎలా జరిగిందంటే.. ప్రఖ్యాత న్యూస్ నెట్ వర్కింగ్ సైట్ రెడిట్ లో ఓ పాఠకుడు తన కూతురి ఫొటోను పోస్ట్ చేశాడు. కూతురిని తీసుకుని చిన్నపిల్లల పార్కుకు వెళ్లామని, అయితే ఆ సందర్శన అనుకున్నంత సజావుగా (నెమలిని చూసి పాప భయపడిపోవడం వల్ల) జరగలేదని ఫొటో కింద కామెంట్ పెట్టాడు. రెడిట్ లో జూన్ 26న ఈ ఫొటో పోస్ట్ అయిన కొద్ది గంటల్లోనే ఫొటోషాప్ కొట్లాట మొదలైంది. ఒక వ్యక్తి .. పాప భయాన్ని బ్రెగ్జిట్ తో ముడిపెడుతూ నెమలిని యురోపియన్ యూనియన్(ఈయూ)గా, పాపను ఈయూ నుంచి భయపడి పారిపోతున్న బ్రిటన్ గా పోల్చుతూ ఫొటోలో మార్పులు చేశాడు. ఇంకొకడు.. అలాకాదంటూ పాపను ట్రంప్ తో పోల్చాడు. ట్రంప్ (పాప) పరుగు పందెంలో ఉస్సేన్ బోల్ట్ తో పోటీపడుతున్నట్లు ఫొటోషాప్ చేశాడు. ఇలా పాప భయంపై లెక్కకు మిక్కిలిగా పుట్టుకొచ్చిన ఫొటోషాప్డ్ ఫొటోల పోట్లాట ఇంటర్నెట్ లో నడుస్తూనేఉంది.. -
ఆ చిన్నారే.. ఇప్పుడు గ్రాడ్యుయెట్!
అది 1998నాటి మాట. అమెరికా కనెక్టికట్‌లోని ఓ అపార్ట్మెంట్లో మంటలు చుట్టుముట్టాయి.అగ్నిమాపక శాఖ ఉద్యోగి పీటర్ గెట్జ్ తన సిబ్బందితోపాటు కూడా అక్కడికి వచ్చాడు. మంటల్లో ఇద్దరు చిక్కుకొని ఉన్నారు. అందులో ఒకరు మరణించగా.. ఐదేళ్ల చిన్నారి సృహతప్పి పడిపోయింది. అగ్నిప్రమాదం వల్ల షాక్‌తో ఆ చిన్నారి గుండె ఆగినంత పనైంది. దీంతో ఆ చిన్నారికి నోటి ద్వారా శ్వాస అందిస్తూ.. సీపీఆర్ ప్రథమ చికిత్స అందించి.. అంబులెన్స్ వచ్చేదాక వేచి చూడకుండా వెంటనే తన బైకు మీద ఆస్పత్రికి తీసుకెళ్లాడు పీటర్ గెట్జ్.. అలా మృత్యుకోరల నుంచి తప్పించుకొని ప్రాణాలు దక్కించుకున్న జోసిబెల్క్ అపోంటె.. ఇప్పుడు ప్రతిష్టాత్మకమైన ఈస్టర్న్ కనెక్టికట్ యూనివర్సిటీ నుంచి డిగ్రీ పట్టా పొందింది. 23 ఏళ్ల జోసి పట్టా అందుకుంటుంటే.. ఆ దృశాన్ని చూసి ఆ కార్యక్రమానికి వచ్చిన పీటర్ గెట్జ్ కళ్లలో కూడా ఆనందంతో నీళ్లు మెదిలాయి. ప్రస్తుతం రిటైరై విశ్రాంత జీవితాన్ని గడుపుతున్న గెట్జ్.. తాను కాపాడిన చిన్నారి జోసిబెల్క్ ఇప్పుడు గ్రాడ్యుయేట్ కావడం ఎంతో గర్వకారణంగా ఉందని చెప్పాడు. 'ఆనాడు నేను చేసింది నా డ్యూటీ మాత్రమే. అందుకు నాకు శిక్షణ కూడా ఇచ్చారు. ఇప్పుడు జోసిని చూస్తే ఎంతో గర్వకారణంగా ఉంది. తన ఎన్నో కష్టాలను అధిగమించింది. అగ్నిప్రమాదంలో ఆత్మీయుల్ని కోల్పోయింది. శారీరకంగా, మానసికంగా ఎంతో క్షోభ అనుభవించింది. అయినా వాటన్నింటినీ తట్టుకొని తను నిలదొక్కుకుంది. ఇప్పుడు ఉజ్వలమైన తారగా ఇప్పుడు మన ముందు నిలిచింది' అని గెట్జ్ ఆనందం వ్యక్తం చేశాడు. అటు జోసిబెల్క్ కూడా గెట్జ్ పట్ల ఎంతో కృతజ్ఞాతభావాన్ని ప్రకటించింది. 'నేను దాదాపు చనిపోయాను. కానీ నాకు పునర్జన్మ దక్కింది. అందుకు కారణం పీటర్ గెట్జ్. ఆ రోజు నాకు సహాయంగా వచ్చిన ఇతర అగ్నిమాపక సిబ్బంది' అని జోసి చెప్పింది. తనకు పునర్జన్మను ఇచ్చిన గెట్జ్‌ను ఫేస్బుక్లో వెతికి పట్టుకొని మరీ ఆయనను తమ యూనివర్సిటీ స్నాతకోత్సవానికి ఆహ్వానించింది. ఆమె పంపిన తొలి మెసేజ్ చదివినప్పుడు తాను ఎంతో భావోద్వేగానికి గురయ్యానని గెట్జ్ చెప్పాడు. -
డ్యాన్స్ కోసం చంటిబిడ్డను వదిలేసి వెళ్లగా..
మెక్సికో: చంటిబిడ్డను ఇంట్లో వదిలేసి డ్యాన్స్ చేసేందుకు వెళ్లిన ఓ తల్లికి విషాదం ఎదురైంది. నిర్లక్ష్యంగా ఆ పాపను వదిలి వెళ్లడంతో ఎలుకలు కరిచి చంపేశాయి. ఈ విషయం డ్యాన్స్ కు వెళ్లి తిరిగి వచ్చాక ఆమెకు తెలిసింది. తొలుత చుట్టుపక్కలవారికి అనంతరం పోలీసులకు ఈ సంగతి తెలిసి ఆమెను అరెస్టు చేసి విచారిస్తున్నారు. మెక్సికోలోని అకోల్మాన్ అనే చిన్న నగరంలో పద్దెనిమిదేళ్ల లిజ్బెత్ జిరోనిమా ఆమె తల్లితో కలిసి నివసిస్తోంది. ఆమెకు ఓ చంటి బిడ్డ ఉంది. అయితే, ఆ పాపను నిర్లక్ష్యంగా ఇంట్లో వదిలేసి డ్యాన్స్ చేసేందుకు వెళ్లింది. ఈ విషయం తల్లికి చెప్పినా ఆమె కూడా పట్టించుకోలేదు. ఈ లోగా రెండు ఎలుకలు ఆ పాపపై దాడి చేసి, ముఖాన్ని చేతి వేళ్లను కొరికేశాయి. ఫలితంగా ఆ పాప ప్రాణాలువిడిచింది. ఆమె తల్లిని కూడా పోలీసులు అరెస్టు చేసినట్లు చుట్టుపక్కల వారు చెబుతున్నారు. -
మిలటరీ ప్రోటోకాల్.. నాకు బలాదూర్!
మిలటరీ ప్రోటోకాల్ కఠినమైనదే కావొచ్చు. క్రమశిక్షణతో కూడిన ఆ ప్రోటోకాల్‌ను ఉల్లంఘించడం కుదరకపోవచ్చు. కానీ ఈ రెండేళ్ల చిన్నారి తన తండ్రి కోసం ఎన్నో నెలలుగా కళ్లు కాయలు కాసేలా ఎదురుచూసింది. రోజూ పడుకునేముందు అమ్మా.. నాన్న ఎప్పుడు వస్తాడు అని అడిగి అడిగి ఆలసిపోయింది. ఇక ఎంతమాత్రం ఆగలేకపోయింది. ఒక రోజు కళ్లముందు కనిపించిన కన్నతండ్రిని చూసి.. ఆనందంతో ఎగిరి గంతేసింది. వెంటనే చేతులు చాచి ప్రేమగా పరిగెత్తింది. తోటి సైనికులతో పాటు అటెన్షన్‌గా నిలబడి ఉన్న తండ్రిని ఆలింగనం చేసుకుంది. తండ్రి కూడా ప్రోటోకాల్‌ను పక్కన పెట్టి, కిందకు వంగి.. ఆత్మీయంగా బిడ్డను హత్తుకుని.. తల నిమిరాడు. ఈ వీడియో ఇప్పుడు లక్షల మంది హృదయాలను హత్తుకుంటోంది. చిన్నారి కేరిస్ ఓజెల్స్ బీ తండ్రి లెప్టినెంట్ డానియల్ ఓజెల్స్ బీ అమెరికా సైన్యంలో పనిచేస్తున్నాడు. 300 ఫోర్ట్ కార్సన్ సైనికుల్లో భాగమైన ఆయన గత తొమ్మిది నెలలు మధ్యప్రాచ్యంలో పనిచేశారు. అమెరికా సైనిక ప్రోటోకాల్ ప్రకారం విదేశాల్లో పనిచేసి వచ్చిన సైనికులకు కమాండర్ అధికారిక స్వాగతం పలకాలి. ఇందులోభాగంగా కొలరాడోలో డానియెల్ బృందానికి సైనిక లాంఛనాలతో స్వాగత కార్యక్రమం నిర్వహిస్తుండగా.. తండ్రిని చూసిన ఆనందంలో మధ్యలోనే చిన్నారి కేరిస్ పరిగెత్తుకుంటూ వెళ్లింది. అమెరికా జెండాను తలపించే దుస్తులు వేసుకున్న కేరిస్.. సైనిక ప్రోటోకాల్ కు అంతరాయం కలిగిస్తూ తండ్రిని ఆత్మీయంగా హత్తుకుంది. ఈ దృశ్యాన్ని ఫేస్బుక్లో ఇప్పటికే 40 లక్షల మందికి పైగా వీక్షించారు. 'తను ఎంతో సంతోషపడింది. నన్ను గుర్తుపట్టగానే.. వెంటనే పరిగెత్తుకువచ్చింది. వద్దు అని నేను కూడా చెప్పలేకపోయాను' అని తండ్రి డానియెల్ ఆ తర్వాత మీడియాకు చెప్పారు. -
చిట్టి తల్లికి పెద్ద దెబ్బ.. క్షమాపణలు!
లండన్: చక్కగా ఎర్రటి గౌను వేసుకొని, తలపై నల్లటోపి పెట్టుకొని చేతిలో పూల బొకేతో చిరునవ్వులు చిందిస్తున్న కనిపిస్తున్న ఆ పాప పేరు మైసీ గ్రాగరీ. ఆరేళ్ల ఈ పాప పూల బొకే ఇస్తుంది ఎవరికనుకుంటున్నారు? బ్రిటన్ మహారాణికి. చక్కగా వందనం చేస్తూ తనకు పూల బొకే అందించిన మైసీని బ్రిటన్ రాణి ఎలిజెబెత్ 2 అభినందించి అలా ముందుకు వెళ్లిందో లేదో ఆ పాప ఆనందం ఇట్టే మాయమైంది. కెవ్వున ఏడుపు కేక పెట్టింది. ఎందుకంటారా.. మరేం లేదు.. బ్రిటన్ రాణి వస్తుండగా ఆమెకు స్వాగతం పలికే సోల్జర్స్లో ఒకతను ఆ పాప మైసీ పక్కనే ఉన్నాడు. పూల బొకే అందుకుని బ్రిటన్ రాణి సరిగ్గా తనను దాటి వెళుతుండగా అతడు వేగంగా తన చేయితో సెల్యూట్ చేశాడు. ఈ క్రమంలో అతడి చేయి మైసీకి బలంగా తగలడంతోపాటు టోపీ కూడా ఊడిపోయింది. దీంతో అప్పటి వరకు నవ్వులు చిందించిన ఆ చిన్నారి ఒక్కసారిగా భయంతో భిక్కమొఖం పెట్టి తన తల్లి చాటుకు వెళ్లి నిల్చుని బుంగమూతితో కాస్త కోపంగా ఆ సైనికుడి వైపు చూసింది. ఆ వెంటనే సైనికుడు దగ్గరికొచ్చి మైసీకి, ఆమె తల్లికి క్షమాపణలు చెప్పాడు. -
చిట్టి తల్లికి పెద్ద కష్టం
ఏలూరు (ఆర్ఆర్ పేట) : ఆ చిట్టి గుండెకు పెద్ద కష్టం వచ్చిపడింది. రెక్కాడితే గాని డొక్కాడని ఆ కుటుంబాన్ని పాతాళంలోకి నెట్టేస్తోంది. జన్యు సంబంధిత వ్యాధితో ఓ చిన్నారి విలవిలలాడుతుంటే.. వైద్యం చేయించేందుకు ఆర్థిక స్థోమత లేక తల్లిదండ్రులు అల్లాడుతున్నారు. ఏలూరు 2వ డివిజన్లోని ఎమ్మార్సీ గోడౌన్స్ వెనుక కాలువ గట్టుపై నివశిస్తున్న బి.ప్రసాద్ తాపీ పని చేస్తుంటాడు. భార్య దివ్య. వారికి పది నెలల క్రితం కెజియా అనే అమ్మాయి పుట్టింది. నాలుగు నెలల వరకూ అందరి పిల్లల్లానే ఎదిగిన కెజియా 5వ నెలలో విరోచనాల బారిన పడింది. నగరంలోని చిన్నపిల్లల ప్రత్యేక వైద్య నిపుణులు పరీక్షించి మందులిచ్చినా నయం కాలేదు. దీంతో తల్లిదండ్రులు కార్పొరేట్ ఆసుపత్రిని ఆశ్రయించారు. అక్కడ అన్ని రకాల పరీక్షలు చేసిన వైద్యులు కెజియా జన్యు సంబంధిత వ్యాధికి గురైందని గుర్తించారు. హైదరాబాద్ నిమ్స్‌కు తీసుకువెళ్లమని సూచించారు. గంపెడాశతో నిమ్స్‌కు తీసుకువెళ్లిన తల్లిదండ్రులకు వ్యాధి విషయం తెలిసింది. మ్యుకోపోలిసచ్చారిడోసిస్ (ఎంపీఎస్) అనే జన్యు సంబంధ వ్యాధితో చిన్నారి బాధపడుతోందని నిమ్స్ వైద్యులు తెలిపారు. ఈ వ్యాధి కారణంగా ఎముకల్లో ఎదుగుదల నిలిచిపోతుందని, మంచి రక్తం వెళ్లాల్సిన నాళాల్లోకి చెడు రక్తం ప్రవేశించి ఆరోగ్యం క్షీణింపజేస్తోందని, వ్యాధి నిరోధక శక్తి కూడా తగ్గుతోందని డాక్టర్లు చెప్పారు. ఎంజైమ్ రీప్లేస్మెంట్ థెరపీ (ఈఆర్టీ)తో వ్యాధిని నయం చేయవచ్చని ఇందుకు సుమారు రూ.24 లక్షలు ఖర్చవుతుందన్నారు. దీంతో తల్లిదండ్రుల గుండెల్లో రాయిపడినంత పనైంది. ఏం చేయాలో తెలియని స్థితిలో ఉన్నదంతా కూడబెట్టి పాప వైద్యానికి వారు శ్రమిస్తున్నారు. ఇంజెక్షన్ల కోసం వారానికి రూ.60 వేల ఖర్చవుతోందని.. ఇక తమకు వైద్యం చేయించే స్థోమత లేదని ప్రసాద్ కన్నీరుపర్యంతమయ్యారు. ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి సాయం కోసం స్థానిక ఎమ్మెల్యే ద్వారా దరఖాస్తు చేసి మూడు నెలలు కావస్తున్నా ప్రయోజనం లేదని చెప్పారు. కూలి పనులకు వెళితే గాని పూడగడవని పరిస్థితిలో ఉన్నామని.. చిన్నారి వైద్యం కోసం దాతలు ముందుకు రావాలని అభ్యర్థిస్తున్నారు. దయగల దాతలు సెల్ 92472 61461లో సంప్రదించాలని ప్రసాద్, దివ్య కోరుతున్నారు. -
అభిమాని అంతిమ కోరిక తీర్చిన శ్రుతి
అభిమానం ఎంత బలమైందంటే కొందరు తమ అభిమాన తారలను పిచ్చగా ప్రేమించేస్తారు. పూణేకు చెందిన అమ్మాయి సీతల్పవర్(17) కేన్సర్‌తో బాధపడుతోంది. ఆమెను వ్యాధి నుంచి బయట పడేయడానికి చివరి వరకు పోరాడిన వైద్యులు ఫలితం లేక చేతులెత్తేశారు. ఇంటికి తీసుకెళ్లి ఆమె చివరి కోరికలు తీర్చే ప్రయత్నం చేయమని సూచించారు. దీంతో కుటుంబ సభ్యులు సీతల్ పవర్ కోరిక తెలుసుకుని షాక్ అయ్యారు. తన అభిమాన తార శ్రుతిహాసన్‌ను ఒకసారి దగ్గరగా చూడాలన్నదే సీతల్ పవర్ చివరి కోరికట. దీంతో ముంబయిలో యారా చిత్ర షూటింగ్లో ఉన్న శ్రుతిహాసన్‌కు మేక్ ఎ విష్ అనే స్వచ్ఛంద సంస్థ నిర్వాహకులు సీతల్ పవర్ చివరి కోరిక గురించి వివరించారు. దీంతో మనసు కరిగిపోయిన శ్రుతిహాసన్ చిత్ర యూనిట్ అనుమతి తీసుకుని వెంటనే పూణేలోని సీతల్ పవర్‌ను ప్రత్యక్షంగా కలిసి ఆమెను ఓదార్చారు. సినిమాలు, ఇతర విషయాల గురించి ఇద్దరు చాలా సేపు ముచ్చటించుకున్నారు. మృత్యువుతో పోరాడుతున్న సీతల్ పవర్ ధైర్యాన్ని శ్రుతి మెచ్చుకుంటూ ఆమె రాసిన ఒక లేఖను ఆమెకు ఇచ్చారు.