డ్యాన్స్ కోసం చంటిబిడ్డను వదిలేసి వెళ్లగా.. | Rats bit 4 month-old baby to death 'after teen mum left her at home to go out dancing' | Sakshi
Sakshi News home page

డ్యాన్స్ కోసం చంటిబిడ్డను వదిలేసి వెళ్లగా..

Published Thu, Jan 7 2016 5:36 PM | Last Updated on Wed, Apr 3 2019 8:07 PM

డ్యాన్స్ కోసం చంటిబిడ్డను వదిలేసి వెళ్లగా.. - Sakshi

డ్యాన్స్ కోసం చంటిబిడ్డను వదిలేసి వెళ్లగా..

మెక్సికో: చంటిబిడ్డను ఇంట్లో వదిలేసి డ్యాన్స్ చేసేందుకు వెళ్లిన ఓ తల్లికి విషాదం ఎదురైంది. నిర్లక్ష్యంగా ఆ పాపను వదిలి వెళ్లడంతో ఎలుకలు కరిచి చంపేశాయి. ఈ విషయం డ్యాన్స్ కు వెళ్లి తిరిగి వచ్చాక ఆమెకు తెలిసింది. తొలుత చుట్టుపక్కలవారికి అనంతరం పోలీసులకు ఈ సంగతి తెలిసి ఆమెను అరెస్టు చేసి విచారిస్తున్నారు.

మెక్సికోలోని అకోల్మాన్ అనే చిన్న నగరంలో పద్దెనిమిదేళ్ల లిజ్బెత్ జిరోనిమా ఆమె తల్లితో కలిసి నివసిస్తోంది. ఆమెకు ఓ చంటి బిడ్డ ఉంది. అయితే, ఆ పాపను నిర్లక్ష్యంగా ఇంట్లో వదిలేసి డ్యాన్స్ చేసేందుకు వెళ్లింది. ఈ విషయం తల్లికి చెప్పినా ఆమె కూడా పట్టించుకోలేదు. ఈ లోగా రెండు ఎలుకలు ఆ పాపపై దాడి చేసి, ముఖాన్ని చేతి వేళ్లను కొరికేశాయి. ఫలితంగా ఆ పాప ప్రాణాలువిడిచింది. ఆమె తల్లిని కూడా పోలీసులు అరెస్టు చేసినట్లు చుట్టుపక్కల వారు చెబుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement