వివాహేతర సంబంధం: 22 నెలల చిన్నారిని కొరికి.. నేలకేసికొట్టి! | Little Girl Murdered By Mother Over Extramarital Affair In Suryapeta, Details Inside | Sakshi
Sakshi News home page

వివాహేతర సంబంధం: 22 నెలల చిన్నారిని కొరికి.. నేలకేసికొట్టి!

Jun 13 2024 9:52 AM | Updated on Jun 13 2024 10:13 AM

little girl murdered by Mother extramarital affair

    వివాహేతర సంబంధానికి అడ్డొస్తుందనే ఘాతుకం 

చివ్వెంల(సూర్యాపేట): వివాహేతర సంబంధానికి అడ్డొస్తుందని చిన్నారిని నేలకేసి కొట్టి హత్యచేసిన సంఘటన సూర్యాపేట జిల్లా చివ్వెంల మండలం ఐలాపురంలో బుధవారం వెలుగులోకి వచ్చింది. ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. 

నిజామాబాద్‌ జిల్లా గుండారం గ్రామానికి చెందిన కటకట లక్ష్మణ్‌తో అదే జిల్లా రంజల్‌ మండలం సాటాపూర్‌ గ్రామానికి చెందిన రమ్య అలియాస్‌ నవ్యశ్రీ వివాహం ఆరేళ్లక్రితం జరిగింది. వీరికి ఇద్దరు కుమార్తెలు అరుణ్య (04), మహన్వి (22 నెలలు). కాగా ఏడు నెలలుగా రమ్యశ్రీ అదే గ్రామానికి చెందిన బొల్లెం అరవిందరెడ్డితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. 20 రోజుల క్రితం ఇద్దరు పిల్లలను తీసుకుని ప్రియుడితో కలిసి సూర్యాపేట జిల్లా చివ్వెంల మండలం ఐలాపురం గ్రామానికి వచ్చి అక్కడే నివాసం ఉంటున్నారు. 

అరవిందరెడ్డి ఇటుకబట్టీల వద్ద ట్రాక్టర్‌ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు.  చిన్నారి మహన్వి తమ వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉందని భావించి మంగళవారం రాత్రి అరవిందరెడ్డి ఆమెను కొరికి, కొట్టి హింసించి నేలకేసి కొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందింది. ఈ మేరకు రమ్య అత్త కటికట గంగమణి ఫిర్యాదు మేరకు సూర్యాపేట రూరల్‌ సీఐ సురేందర్‌రెడ్డి ఆదేశాలతో  ఎస్‌ఐ వెంకట్‌ రెడ్డి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా చిన్నారికి చెండు చెంపలు, భుజాలు, రెండు చేతులు, పిరుదులపై, తలకు తీవ్ర గాయాలై ఉన్నాయని ఎస్‌ఐ తెలిపారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement