‘నువ్వు చాలా అందంగా ఉన్నావ్‌.. నిన్ను ఎప్పటికీ వదిలిపెట్టను’ | Political Support Person Harassment ICDS Women Officer At Kodada | Sakshi
Sakshi News home page

‘నువ్వు చాలా అందంగా ఉన్నావ్‌.. నిన్ను ఎప్పటికీ వదిలిపెట్టను’

Published Fri, Nov 1 2024 3:48 PM | Last Updated on Fri, Nov 1 2024 5:35 PM

Political Support Person Harassment ICDS Women Officer At Kodada

సాక్షి, సూర్యాపేట: తెలంగాణలో ఓ మహిళా అధికారిపై లైంగిక వేధింపుల అంశం సంచలనంగా మారింది. సదరు మహిళా అధికారికి ఫోన్‌ చేసిన వ్యక్తి.. ఆమెను అందంగా ఉన్నావంటూ వేధింపులకు గురిచేస్తూ.. పదేళ్లు అయినా తనను వదిలిపెట్టే ప్రసక్తే లేదని హెచ్చరించాడు. తాను ఇప్పటికే మూడేళ్లు జైలులో ఉండి వచ్చానని తనను ఎవరూ ఏమీ చేయలేరని బెదిరించడం గమనార్హం.

వివరాల ప్రకారం.. కోదాడకు చెందిన మహిళా అధికారిపై ఓ వ్యక్తి ఫోన్‌లో లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడు. ఈ క్రమంలో సదరు మహిళా అధికారికి వాయిస్‌ మెసేజ్‌లు చేస్తూ వేధింపులకు గురిచేశాడు. దీంతో, ఆ వ్యక్తికి కాల్‌ చేసి మెసేజ్‌ల విషయమై ఆమె ప్రశ్నించారు. ఈ సందర్బంగా సదరు వ్యక్తి మాట్లాడుతూ.. నువ్వు(మహిళా అధికారి) చాలా అందంగా ఉన్నావు. నీ నంబర్‌ సేవ్‌ చేసుకున్నాను. నీ డీపీ ఫొటోను నేను రోజు చూస్తున్నాను. నిన్ను ఎప్పటికీ వదిలిపెట్టను. పదేళ్లు అయినా నిన్ను విడిచిపెట్టేది లేదు. నీ కోసం ఎంత దూరమైనా వస్తాను.  

నాకు పొలిటికల్‌ సపోర్టు ఉంది. మూడు నెలల క్రితమే నేను చర్లపల్లి జైలు నుంచి విడుదలయ్యాను. మూడు సంవత్సరాలు చర్లపల్లి జైలులో ఉన్నాను. నువ్వు నన్ను ఏమీ చేయలేవు. పోలీసులు కూడా నన్ను ఏమీ చేయలేరు. నా లోకేషన్‌ నీకు పంపిస్తాను. చేతనైతే ఏం చేసుకుంటావో చేసుకో.. అని వార్నింగ్‌ ఇచ్చాడు. అయితే, సదరు మహిళా అధికారిని వేధింపులకు గురిచేసిన వ్యక్తి తెలంగాణకు చెందిన ఓ మంత్రి వద్ద పనిచేస్తున్నట్టు సమాచారం.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement