సాక్షి, సూర్యాపేట: కోదాడలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. ‘గేట్’ ఇంజనీరింగ్ కాలేజ్ ఓనర్‌పై హత్యాయత్నం జరిగింది. కాలేజ్ ఓనర్ కాంతారావు హత్యకు కాలేజ్ భాగస్వాములు సుపారీ ఇచ్చారు. కాంతారావు హత్య కోసం రూ.50 లక్షలు ఇచ్చేందుకు సుపారీ గ్యాంగ్‌తో వారు ఒప్పందం చేసుకున్నారు.
వివరాల ప్రకారం.. కోదాడలోని గేట్ ఇంజనీరింగ్ కాలేజ్ ఓనర్‌పై గురువారం ఉదయం హత్యాయత్నం జరిగింది. ఆయనను హత్య చేసేందుకు సుపారీ గ్యాంగ్ రంగంలోకి దిగింది. కాగా, కాంతారావును చంపేందుకు రూ.50 లక్షలకు సుపారీ గ్యాంగ్‌తో ఒప్పందం కుదుర్చుకున్నారు కాలేజ్ భాగస్వాములు. ఈ క్రమంలో సుపారీ గ్యాంగ్‌కు ముందుగా రూ.5లక్షలు కూడా చెల్లించారు. దీంతో, కాంతారావు ప్రయాణిస్తున్న కారును డీసీఎం వ్యాన్‌తో ఢీకొట్టాలని ప్లాన్ చేసుకున్నారు.
ఈ నేపథ్యంలో మునగాల మండలం మద్దెలచెరువు వద్ద కారును ఢీకొట్టేందుకు ప్రయత్నం చేశారు. అయితే, సుపారీ గ్యాంగ్ నుంచి కాంతారావు తప్పించుకుని వెళ్లిపోయారు. కాగా, సుపారీ గ్యాంగ్.. కోదాడలో కాంతారావు కారును డీసీఎంతో ఢీకొట్టడంతో ఆయన స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ఈ క్రమంలో తేరుకున్న కాంతారావు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు.. 12 మందిని అదుపులోకి తీసుకున్నట్టు తెలిపారు.
ఇది కూడా చదవండి: బాలికపై బీఆర్‌ఎస్ నాయకుడి అత్యాచారం.. ఎమ్మెల్యే రియాక్షన్ ఇదే..
Comments
Please login to add a commentAdd a comment