kantaRao
-
ఇంజనీరింగ్ కాలేజ్ పార్ట్నర్స్ భారీ స్కెచ్.. ఓనర్ హత్యకు సుపారీ
సాక్షి, సూర్యాపేట: కోదాడలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. ‘గేట్’ ఇంజనీరింగ్ కాలేజ్ ఓనర్‌పై హత్యాయత్నం జరిగింది. కాలేజ్ ఓనర్ కాంతారావు హత్యకు కాలేజ్ భాగస్వాములు సుపారీ ఇచ్చారు. కాంతారావు హత్య కోసం రూ.50 లక్షలు ఇచ్చేందుకు సుపారీ గ్యాంగ్‌తో వారు ఒప్పందం చేసుకున్నారు. వివరాల ప్రకారం.. కోదాడలోని గేట్ ఇంజనీరింగ్ కాలేజ్ ఓనర్‌పై గురువారం ఉదయం హత్యాయత్నం జరిగింది. ఆయనను హత్య చేసేందుకు సుపారీ గ్యాంగ్ రంగంలోకి దిగింది. కాగా, కాంతారావును చంపేందుకు రూ.50 లక్షలకు సుపారీ గ్యాంగ్‌తో ఒప్పందం కుదుర్చుకున్నారు కాలేజ్ భాగస్వాములు. ఈ క్రమంలో సుపారీ గ్యాంగ్‌కు ముందుగా రూ.5లక్షలు కూడా చెల్లించారు. దీంతో, కాంతారావు ప్రయాణిస్తున్న కారును డీసీఎం వ్యాన్‌తో ఢీకొట్టాలని ప్లాన్ చేసుకున్నారు. ఈ నేపథ్యంలో మునగాల మండలం మద్దెలచెరువు వద్ద కారును ఢీకొట్టేందుకు ప్రయత్నం చేశారు. అయితే, సుపారీ గ్యాంగ్ నుంచి కాంతారావు తప్పించుకుని వెళ్లిపోయారు. కాగా, సుపారీ గ్యాంగ్.. కోదాడలో కాంతారావు కారును డీసీఎంతో ఢీకొట్టడంతో ఆయన స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ఈ క్రమంలో తేరుకున్న కాంతారావు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు.. 12 మందిని అదుపులోకి తీసుకున్నట్టు తెలిపారు. ఇది కూడా చదవండి: బాలికపై బీఆర్ఎస్ నాయకుడి అత్యాచారం.. ఎమ్మెల్యే రియాక్షన్ ఇదే.. -
విద్యాసంస్థల తీరు మారడం లేదు: జస్టిస్ కాంతారావు
సాక్షి, అమరావతి: విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి అధిక ఫీజు వసూలు చేస్తే కఠిన చర్యలు తప్పవని రాష్ట్రంలోని విద్యాసంస్థల హెచ్చరించినప్పటికీ తమ తీరు మార్చుకోవడం లేదని పాఠశాల విద్య నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్ చైర్మన్ జస్టిస్ ఆర్. కాంతారావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. విద్యార్థుల ఫీజు, ఉద్యోగులకు జీతాలు చెల్లించే విషయంలో కమిషన్, ప్రభుత్వాలు ఇది వరకే ఆదేశాలు ఇవ్వడం జరిగిందన్నారు. అయినప్పటికీ ఇంకా ఫిర్యాదులు వస్తూనే ఉన్నాయని మండిపడ్డారు. కోవిడ్ నేపథ్యంలో ఆన్లైన్ క్లాసులు ప్రారంభించిన కొన్ని విద్యాసంస్థలు అధిక ఫీజు వసూలు చేస్తున్నట్టు తమ దృష్టికి వచ్చిందని చెప్పారు. ఆన్లైన్ క్లాసులకు అనుమతి ఇచ్చినంత మాత్రాన ఇష్టం వచ్చిన రీతిలో ఫీజులు వసూలు చేసుకోమని చెప్పినట్లు కాదని ఆసహనం వ్యక్తం చేశారు. (చదవండి: విద్యార్థుల అభీష్టమే ఫైనల్) ప్రైవేటు పాఠశాలలు, జూనియర్ కళాశాలలు తప్పనిసరిగా గత సంవత్సరం ట్యూషన్ ఫీజు మాత్రమే కట్టించుకోవాలని తెలిపారు. అది కూడా వాయిదాల్లో చెల్లించే అవకాశాన్ని తల్లిదండ్రులకు ఇవ్వాలని ఆయన స్పష్టం చేశారు. దీనికి అదనంగా ఎలాంటి ఫీజులు వసూలు చేయరాదని విద్యాసంస్థలను హెచ్చరించారు. మరోవైపు మార్చి నెల నుంచి ప్రైవేటు విద్యాసంస్థలు ఉపాధ్యాయులను, ఇతర సిబ్బందిని మౌఖిక ఆదేశాలతో ఉద్యోగాల నుంచి తొలగించినట్లు, జీతాలు ఇవ్వట్లేదని ఫిర్యాదులు అందుతున్నాయని చెప్పారు. తక్షణమే సిబ్బందికి జీతాలు అందించాలని, తొలగించిన సిబ్బందిని విధుల్లోకి తీసుకోవాలని ఆదేశించారు. దీన్ని బేఖాతరు చేసే విద్యాసంస్థలపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. తల్లిదండ్రులతో, ప్రైవేట్ ఉపాధ్యాయులతో సమావేశాలు నిర్వహించి అధిక ఫీజులు వసూలు చేస్తున్న విద్యాసంస్థలను, ఉద్యోగులకు జీతాలు ఇవ్వని విద్యాసంస్థలను గుర్తించాలని డీఈఓలు, ఆర్జేడీలు, ఆర్ఐవోలు ఆయన సూచించారు. (చదవండి: నిబంధనలు పాటించని స్కూళ్లు, కాలేజీల రద్దు!) తమ స్థాయిలో సమస్యల పరిష్కారానికి ఒక హెల్ప్ లైన్ నెంబర్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఉల్లంఘనలకు పాల్పడిన విద్యాసంస్థలపై వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పారు. విద్యార్థులు, తల్లిదండ్రులు, ప్రైవేటు ఉపాధ్యాయులు తమ సమస్యలను నేరుగా రాష్ట్ర పాఠశాల విద్య నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్‌కు ఫిర్యాదుల చేయోచ్చని చెప్పారు. 9150381111 కు ఫోన్ ద్వారా (ఫోన్ ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు, ప్రభుత్వ పని దినాల్లో మాత్రమే అందుబాటులో ఉంటుంది), apsermc2020@gmail.com కు ఈ - మెయిల్ ద్వారా, www.apsermc.ap.gov.in పోర్టల్ లో గ్రీవెన్స్ అనే లింక్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చని ఆయన వెల్లడించారు. -
నిబంధనలు పాటించని స్కూళ్లు, కాలేజీల రద్దు!
సాక్షి, విజయవాడ: చాలా చోట్ల పాఠశాలలు, కాలేజీలు కనీస నిబంధనలు పాటించడం లేదని పాఠశాల విద్య నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్ చైర్మన్ జస్టిస్ రెడ్డి కాంతారావు అసంతృప్తి వ్యక్తం చేశారు. వాటి గుర్తింపును రద్దు చేయమని ప్రభుత్వానికి సిఫారసు చేస్తామన్నారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తొలి విడత తనిఖీలో భాగంగా పదమూడు జిల్లాల్లో ప్రైవేటు జూనియర్ కళాశాలలు, పాఠశాలలను పర్యవేక్షించామని తెలిపారు. అధిక ఫీజుల వసూలుపై ప్రత్యేక దృష్టి సారించామన్నారు. ఫీజులతో పాటు ఫ్యాకల్టీ, మౌలిక సదుపాయాలను పరిశీలించామన్నారు. విద్యాబోధనలో లోపాలున్నాయి వైఎస్ చైర్పర్సన్ విజయ శారద రెడ్డి మాట్లాడుతూ.. తనిఖీలు చేసిన 120 కాలేజీల్లో చాలా చోట్ల కనీస వసతులు లేవన్నారు. పైగా అధిక ఫీజులు వసూలు చేస్తున్నారు కానీ అందుకు తగ్గట్టు విద్యాబోధన లేదని వెల్లడించారు. విద్యాబోధనలో చాలా లోపాలను గుర్తించామన్నారు. విద్యార్థులకు మానసిక ఒత్తిడి పెంచి ఆత్మహత్యలు చేసుకునేలా చేస్తున్నారని మండిపడ్డారు. మూత్ర విసర్జనకు వెళ్తారని డ్రింకింగ్ వాటర్‌కు నో సెక్రటరీ ఆలూరు సాంబశివారెడ్డి మాట్లాడుతూ.. ‘కళాశాలలు, పాఠశాలలు చెత్తకుప్పలుగా ఉన్నాయి. శుభ్రం అనేదే లేకుండా అంతా చెత్తతో నింపేస్తున్నారు. మరోవైపు నారాయణ, చైతన్య సిండికేట్ లాగా ఏర్పడి విద్యను వ్యాపారం చేశారు. ఈ కాలేజీలు చంద్రబాబుకు బినామీలుగా మారాయి. టీడీపీకీ పార్టీ ఫండ్ ఇస్తూ బాబును మేనేజ్ చేసుకుంటూ వచ్చాయి’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. చాలా పాఠశాల్లలో విద్యార్థులు యూరినల్స్‌కు వెళ్తారని తాగునీరు సదుపాయాన్ని తగ్గించారని విస్తుపోయారు. (‘ఇంగ్లిష్’తో బాలలకు బంగారు భవిత ) -
ఇంతింతై...వటుడింతై!
బీఏ సుబ్బారావు దర్శక నిర్మాణంలో యస్వీరంగారావు, కాంతారావు, బాలయ్య... ముఖ్య పాత్రలు పోషించిన ఒక పౌరాణిక చిత్రంలోని సన్నివేశాలు ఇవి. సినిమా పేరేమిటో చెప్పుకోండి చూద్దాం... ‘‘మహాత్మా...తమ ఆగమనంతో ఈ యజ్ఞం సఫలమైంది. అపూర్వ మహిమా శోభితులైన తమ దర్శనభాగ్యంతో నా జన్మచరితార్థం అయింది’’ ఆనందడోలికల్లో ఊగిపోతూ అన్నాడు బలిచక్రవర్తి.‘‘తామెవ్వరు? నివాసస్థానం ఏది?’’ అని అడిగాడు బలిచక్రవర్తి తన ఎదురుగా ఉన్న వటుడిని.‘‘బలిరాజా! తానెవరో తెలసి తెలియజెప్పేవాడు పరమాత్ముడు ఒక్కడే. ఇక నివాసమందువా...ఈ విశాల విశ్వమంతయూ నా ఆవాసమే. సకల సజ్జన హృదయాలు నా సంచార స్థలాలు’’ మార్మికభాషలో తన గురించి చెప్పాడు వటుడు.‘‘వటుడా! బాలుడవైనా పరమార్థజ్ఞానపూర్వకమైన నీ సంభాషణతో నా హృదయంలో అమృతధారలు వర్షించినవి. నా వల్ల తమకు కాగల కార్యం ఏమిటి?’’ అని వినయంగా అడిగాడు బలిచక్రవర్తి.‘‘మహారాజా! బ్రహ్మచారులకు, తాపసులకు లోకకళ్యాణమే ప్రధాన లక్ష్యం. ఆ లక్ష్యసాధనకు నిన్ను యాచించడానికి వచ్చాను’’ అన్నాడు వటుడు.‘‘స్వామి! ఈ యాగదీక్షా సాక్షిగా ఆజ్ఞాపించండి...మీ కామితం ఏదైనా నెరవేరుస్తాను’’ ఆనందంగా అన్నాడు బలిచక్రవర్తి.‘‘నాయనా బలిచక్రవర్తి! తొందరపడకు... ఈ వటువు దేవతలకు బాసటగా వచ్చిన మహావిష్ణువే అని నా భావన’’ అంటూ బలిచక్రవర్తిని అప్రమత్తం చేయడానికి ప్రయత్నించారు ఆయన పక్కనే ఉన్న ఆచార్యులవారు. అయినప్పటికీ...‘‘ఆచార్యా! ఆ మహావిష్ణువు మన చెంతకు వచ్చి అర్థి అయి ప్రార్థిస్తే అంతకంటే మహాభాగ్యం ఉన్నదా’’ అన్నాడు బలిచక్రవర్తి.పరిస్థితిని గ్రహించిన వటువు...‘‘నా రాక మీ గురువర్యులకు కంటకప్రాయమైనట్లున్నది. నా వలన మీకే భేదాభిప్రాయాలు రాకుండా ఉండుగాక... అనుమతి అయినచో వెళ్లివస్తాను’’ అని అన్నాడో లేదో బలిచక్రవర్తి ఆందోళన పడ్డాడు.‘‘నా చెంతకు వచ్చి మీరు రిక్తహస్తాలతో పోవడం యాగసంకల్పానికే కళంకం! నాపై కరుణించి తమ ఈప్సితార్థం ఏమిటో సెలవియ్యండి’’ అని వటువును అడిగాడు.‘‘మహారాజా! ఏకాకి బ్రహ్మచారిని. నాకంటూ కావల్సింది ఏమీలేదు. నీకంత కోరిక ఉంటే మూడు అడుగుల నేల దానం ఇవ్వు’’ అని బలిచక్రవర్తిని కోరాడు వడుగు.‘‘మహాత్మా! ఇదేమి హాస్యం. దాత ఘనతనైనా గుర్తించవద్దా! మేరుపర్వతం దగ్గరకు వెళ్లి తృణఘనం కోరుకుంటారా?’’ ఆశ్చర్యపోయాడు బలిచక్రవర్తి.‘‘ముష్ఠి మూడు అడుగుల దానం అడిగి నన్ను చిన్నబుచ్చుతారా...మరేదైనా అడగండి. కాంచనాలా? సిరులా? చింతామణిపీఠమా? ఇంతెందుకు ఈ త్రిభువనాధిపత్యమే మీకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నా’’ అని కూడా అన్నాడు. ‘‘చక్రవర్తి! యాచకులకు పేరాశ ఉండకూడదు. అదృష్టవంతులకు అణువు లభించినా అదే బ్రహ్మాండం అవుతుంది. నీకిష్టమైతే నా కోరిక తీర్చు’’ అని చల్లగా అడిగాడు వటుడు.‘‘ఇష్టమా! ఇంత చిన్నకోరిక కష్టమా!! ఆవశ్యం నెరవేర్చుతా’’ వటుడి కోరిక తీర్చడానికి సిద్ధపడ్డాడు బలిచక్రవర్తి.మళ్లీ రంగంలోకి దిగారు ఆచార్యులవారు.‘‘బలిచక్రవర్తీ...తొందరపడకు. ఇందులో ఏదో మోసం ఉన్నది. ఈనాడు నీవు కావించే ఈ దానం మన దానవవంశ వైభవానికి అగ్నిపరీక్ష అని మాత్రం గుర్తుంచుకో. ఇతడు దనుజకులాన్నే దగ్ధపటలం చేయడానికి వచ్చాడు. నా మాట విని ఇతడిని తిరస్కరించు. ఆత్మహాని కోరితెచ్చుకుంటావా నాయనా!’’’ అన్నారు ఆచార్యులవారు.‘‘గురుదేవా! ఈ రాజ్యవైభవములు, అధికార ప్రాభవములు దానధర్మముల కన్నా మిన్న కాదు. ఆత్మహాని అని ఆడిన మాట తప్పడం న్యాయమేనా’’ అంటూ వటుడు అడిగినవాటిని ఇవ్వడానికి సిద్ధమయ్యాడు బలిచక్రవర్తి.‘బ్రహ్మార్పణమస్తు’‘‘బలిచక్రవర్తి! ఇంకో అడుగు?’’ అడిగాడు వటుడు.‘‘ఇదిగో ప్రభు...నా శిరస్సు...దీనిపై మోపండి’’ అని తలవంచాడు బలిచక్రవర్తి. ‘‘శుక్రాచార్యులవారు! శిష్యబృందంతో ఆనందకోలాహలంగా ఉన్నారు, ఏదో విశేషం ఉండకపోదూ’’ అన్నాడు అప్పుడే అక్కడకు వచ్చిన నారదుడు. ‘‘ఉన్నది. ఈనాడు మా దానవజాతికి పర్వదినం. ఇంతకాలం తమకు ఎదురులేదని విర్రవీగిన ఆ దేవతల పతనానికి ఇది ప్రారంభోత్సవం నారదా’’ కసిగా అన్నారు శుక్రాచార్యులవారు.శుక్రాచార్యులవారి మాట విని ‘నారాయణ నారాయణ’ అన్నాడు నారదుడు.‘‘శివ శివా! మా ఆశ్రమప్రాంతంలో అన్యస్మరణ అపచారం నారదా! ఎన్నిసార్లు మందలించినా నీ పెడబుద్ధి మానవా’’ కోపంగా అన్నారు శుక్రాచార్యులు. ఆయన చేతుల్లో శిశువు కనిపిస్తుంది.‘‘నా బుద్ధికేంగానీ, ఈ బుద్ధి నీకెప్పటి నుంచి! పూజాపునస్కారాలు మాని సంసార ఝంజాటనంలో పడినట్లువు. పుత్రుడా. పుత్రికా?’’ శుక్రాచార్యుల వారి చేతుల్లో ఉన్న శిశువును చూస్తూ అడిగాడు నారదుడు.‘‘మాపై అనుగ్రహించి, మా కష్టాలను తొలగించడానికి మహేశ్వరుడు ఒసంగిన వరప్రసాదం ఈ చిరంజీవి. మహత్తర దానవ మహాసామ్రాజ్య పునరుద్ధరణకు అంకురార్పణ జరగబోతుంది. నారదా! సురపక్షపాతి విష్ణువుకుతంత్రాలకు త్వరలోనే తగిన శాస్తి లభిసుం్తది’’ కళ్లనిండా సంతోషంతో అన్నారు శుక్రాచార్యులు.‘‘అయితే మహేశ్వరుని శక్తితో మహావిష్ణువును సాధించడానికి ఈ ప్రయత్నమన్నమాట’’ అన్నాడు నారదుడు.‘‘అవును’’‘‘అంతా నీ వెర్రి. సిద్ధాంతచర్చల్లో శివకేశవుల వాదమే కాని ఆదిమూర్తులకు ఆ భేదమే లేదు. నామరూపాలు వేరైనా లోకపాలకులైన ఆ మహానుభావులు ఇద్దరూ ఒక్కటే. ఒకరు ఎక్కువ కాదు. మరొకరు తక్కువ కాదు.’’ అన్నాడు నారదుడు.‘‘చాలించు నారదా! ఆశ్రితపక్షపాతి అయిన ఆ దామోదరుడికి, భక్తజనసులభుడైన పరమేశ్వరుడికి సామ్యమా! నేను నమ్మిన మహాదేవుడు చతుర్దశ భువనాలకు ఆరాధ్యుడు. ఆ విష్ణువు, జిష్ణువు అతని పాదధూళికి సరిరారు’’ శుక్రాచార్యుల వారి గొంతులో నుంచి ఆగ్రహజ్వాలలు.‘‘ఈ విష్ణుద్వేషమే ఆది నుంచి మీ దానవ జాతిని అడుగంట చేసింది. అయిననూ నాకెందుకు. కైలాసనాథుడు చేసినా వైకుంఠవాసుడు చేసినా నాకు కావల్సింది లోకళ్యాణమే’’ అంటూ అక్కడి నుంచి వెళ్లాడు నారదుడు. -
పనితీరు మెరుగుపరుచుకోవాలి
శాంతి భద్రతలను పరిరక్షించాలి వరంగల్ రేంజ్ డీఐజీ కాంతారావు వరంగల్ క్రైం : పోలీసులు తమ పనితీరును ఎప్పటికప్పు డు మెరుగు పరుచుకోవాలని వరంగల్ రేంజ్ డీఐజీ డాక్టర్ ఎం.కాంతారావు అన్నారు. వరంగల్ అర్బన్ అర్థ సంవత్సర నేర సమీక్ష సమావేశం గురువారం నిట్ సెమినార్ హాల్లో జరిగింది. ఈ సందర్భంగా ఎస్పీ వెంకటేశ్వర్రావు అధ్యక్షతన జరిగిన సమావేశానికి డీఐజీ కాంతారావు ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. పోలీ సులు ప్రజలకు మరింత చేరువయ్యేందుకు పాటుపడాలని కోరారు. అలాగే శాంతిభద్రతలను పరిరక్షించేందు కు చిత్తశుద్ధితో పనిచేయాలని సూచించారు. విధుల పట్ల అంకితభావాన్ని ప్రదర్శించే ఉద్యోగులకు తప్పక గుర్తిం పు ఉంటుందని ఆయన పేర్కొన్నారు. కలెక్టర్ కిషన్ మాట్లాడుతూ పోలీసులు ప్రజలతో స్నేహ పూర్వకంగా మెలగాలని, సామాన్యుడు పోలీస్‌స్టేషన్‌కు ధైర్యంగా వచ్చేందుకు కావాల్సిన వాతావరణం కల్పించాలని సూచించారు. అర్బన్ పరిధిలో భూ కబ్జాలను అరికట్టేం దుకు కలెక్టరేట్లో భూమి సెల్‌ను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. నగరంలో ట్రాఫిక్ సమస్య రోజురోజుకు పెరి గిపోతుందని, దీనిని అరికట్టేందుకు పోలీసులు పకడ్బం దీ చర్యలు తీసుకోవాలన్నారు. అర్బన్ ఎస్పీ వెంకటేశ్వర్రావు మాట్లాడుతూ రానున్న రోజుల్లో అర్బన్ పోలీసు విభాగం కమిషనరేట్‌గా ఏర్పడనుందని, దీనికి తగినట్లు గా పోలీసులు విధులు నిర్వర్తించాలని కోరారు. కాగా, న్యాయశాఖ, ఆర్టీసీ, రోడ్డు రవాణా, వైద్యశాఖ, ఫోరెన్సి క్, జైళ్లు, తదితర ప్రభుత్వ విభాగాల నుంచి ఎదురవుతున్న సమస్యలను పోలీసు అధికారులు కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చారు. అనంతరం అర్బన్ పరిధిలో ఆరు నెలలు గా జరిగిన సంఘటనలు, నమోదైన కేసులు, పురోగతి పై డీఐజీ, కలెక్టర్, అర్బన్ ఎస్పీలు సమీక్షించారు. సమావేశంలో అర్బన్ అదనపు ఎస్పీ ఎం.యాదయ్య, ఓఎస్డీ అంబర్ కిషోర్‌ఝా, ట్రాఫిక్ ఓఎస్డీ వాసుసేనా, ఫోరెన్సిక్ డెరైక్టర్ నర్సింహరావు, ప్రభుత్వ న్యాయవాది రామానుజారెడ్డి, ఆర్టీసీ వరంగల్ రీజియన్ మేనేజర్ యాదగిరి, జైలు సూపరింటెండెంట్ రమేష్, హన్మకొం డ, కాజీపేట, మామునూర్, క్రైం, ట్రాఫిక్, స్పెషల్ బ్రాంచ్, ఏఆర్ డీఎస్పీలు దక్షిణమూర్తి, రాజిరెడ్డి, సురేష్‌కుమార్, రాజమహేంద్రనాయక్,ప్రభాకర్, జనార్దన్, రమేష్, సబ్ఇన్ స్పెక్టర్లు, ఎస్సైలు పాల్గొన్నారు.