rat bites
-
రక్తపు మడుగులో బాలుడు.. ఎలుకలే చంపాయా..?
న్యూయార్క్: అమెరికాలో దారుణం వెలుగులోకి వచ్చింది. ఆర్నెళ్ల బాలుడు రక్తపు మడుగులో విలవిల్లాడుతూ ప్రాణాలు కోల్పోయాడు. శిశువు మృతదేహం చుట్టూ ఎలుకలు విచ్చలవిడిగా సంచరిస్తున్నాయని పోలీసులు తెలిపారు. ఇళ్లంత చెత్తమయంగా ఉందని పేర్కొన్నారు. బాలుని శరీరంపై ఎలుకలు కొరికిన ఘాట్లు ఉన్నాయని వెల్లడించారు. ఎలుకల దాడిలోనే చిన్నారి మరణించి ఉండవచ్చని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. డేవిడ్, ఏంజెల్ స్కోనాబామ్‌లు ఇండియానాలో ముగ్గురు పిల్లలతో కలిసి నివసిస్తున్నారు. అదే ఇంటిలో బాలుని అత్త, డెలానియా థుర్మాన్‌లు నివాసం ఉంటున్నారు. ఘటనాస్థలానికి చేరుకునేప్పటికి బాలుడు రక్తపు మడుగులో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. తల, ముఖం మొత్తం ఎలుకలు కొరికిన గాయాలు ఉన్నాయని వెల్లడించారు. శిశువు వేళ్లు సగం మేర కొరికి ఉన్న ఒళ్లు జలదరించే దృశ్యాలను చూసినట్లు చెప్పారు. శిశువును ఆస్పత్రికి తీసుకెళ్లే సమయానికే అప్పటికే మరణించినట్లు పోలీసులు తెలిపారు. తాము వెళ్లే సమయానికి బాధిత ఇళ్లంతా చెత్తతో నిండి ఉందని తెలిపిన పోలీసులు.. ఎక్కడ చూసినా ఎలుకలు సంచరిస్తున్నాయని చెప్పారు. బాధిత శిశువు తండ్రి ఫోన్ చేయగా.. తాము ఆ ఇంటికి వెళ్లినట్లు పోలీసులు తెలిపారు. బాధిత శిశువు తల్లిదండ్రులతో పాటు అత్తామామలను కూడా అరెస్టు చేశారు. ఎలుకలు పిల్లల్ని కరవడం ఇదే మొదటిసారి కాదని ఇంతకు ముందు కూడా జరిగినట్లు బాధిత కుటుంబానికి చెందిన పిల్లలు చదివే పాఠశాల ఉపాధ్యాయులు తెలిపారు. బాధిత కుటుంబానికి చెందిన ఓ పిల్లవాడి కాలును ఎలుక కొరికినప్పుడు తాము ఫిర్యాదు కూడా చేసినట్లు తెలిపారు. బాధిత పిల్లల్ని శిశు సంరక్షణ గృహానికి పంపించారు. శిశువు మృతదేహాన్ని పోస్టుమార్టానికి తరలించారు. ఇదీ చదవండి: Jaahnavi Kandula: జాహ్నవి మృతికి కారణమైన పోలీసు అధికారిని శిక్షించాలని డిమాండ్ -
ఐసీయూలో రోగిపై ఎలుకల దాడి
సాక్షి, ముంబై: ఘాట్కోపర్లో బీఎంసీకి చెందిన రాజావాడి ఆస్పత్రిలో ఐసీయూలో చికిత్స పొందుతున్న ఓ రోగిపై ఎలుకలు దాడిచేశాయి. ఘటనలో బాధితుడి కన్నుకు గాయం అయినట్లు తెలిసింది. ఈ సంఘటనను సీరియస్‌గా తీసుకున్న బీఎంసీ పరిపాలన విభాగం దర్యాప్తునకు ఆదేశించినట్లు మేయర్ కిశోరీ పేడ్నేకర్ తెలిపారు. మంగళవారం రాత్రి ఈ సంఘటన జరిగి ఉండవచ్చని అనుమానిస్తున్నారు. మరోవైపు ఈ సంఘటనపై రోగి బంధువులు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. సాధారణంగా ప్రభుత్వ లేదా కార్పొరేషన్ ఆస్పత్రుల్లో జనరల్ వార్డులో ఎలుకలు, పిల్లులు, కుక్కలు అటు, ఇటూ తిరుగుతుంటాయి. కానీ, ఐసీయూలో ఏకంగా ఎలుక దూరడం, ఆ తరువాత బెడ్‌పై చికిత్స పొందుతున్న రోగి కన్ను కొరకడం ఆస్పత్రి నిర్లక్ష్యానికి అద్దం పడుతోంది. నిద్రలో ఉండగా.. కుర్లా, కమానీ ప్రాంతానికి చెందిన శ్రీనివాస్ ఎల్లప్ప (24) శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడటంతో కుటుంబ సభ్యులు రెండు రోజుల కిందట రాజావాడి ఆస్పత్రికి తీసుకొచ్చారు. పరీక్షలు నిర్వహించిన వైద్యులు మెదడువాపు, కాలేయానికి సంబంధించిన సమస్యలుండటంతో ఐసీయూలో చేర్పించి వైద్యం ప్రారంభించారు. మంగళవారం ఉదయం ఐసీయూలోకి వచ్చిన బంధువులు శ్రీనివాస్ కంటి నుంచి రక్తస్రావం జరుగుతున్నట్లు గమనించారు. వెంటనే ఆస్పత్రి సిబ్బంది దృష్టికి తీసుకెళ్లగా వారు పరీక్షించారు. రోగి నిద్రలో ఉండగా ఎలుకలు కన్ను కొరికినట్లు నిర్ధరణకు వచ్చారు. అదృష్టవశాత్తు కన్నుగా ఎక్కువగా గాయం కాలేదు. ఈ విషయం తెలుసుకున్న కిశోరి పేడ్నేకర్ వెంటనే ఆస్పత్రికి చేరుకున్నారు. వార్డులు, ఆస్పత్రి పరిసరాలను పరిశీలించారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలని ఆదేశించారు. ఇదిలాఉండగా నాలుగేళ్ల కిందట కాందివలిలోని శతాబ్ధి ఆస్పత్రిలో ఇలాగే ఓ రోగి ముఖాన్ని ఎలుకలు కాటేశాయి. ఆ తరువాత మార్చురిలో ఉన్న శవాలను గుర్తుపట్టలేనంతగా ఎలుకలు కొరిన సంఘటనలు అనేకం వెలుగులోకి వచ్చాయి. అయినప్పటికీ బీఎంసీ, ప్రభుత్వాసుపత్రుల్లో మార్పు రాకపోకడంపై రోగుల బంధువులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. -
ఎలుకల దాడిలో మరో పసికందు బలి
గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో ఓ పసికందుపై ఎలుకల దాడి ఉదంతం గుర్తుండే ఉంటుంది. వైద్యుల నిర్లక్ష్యంతో ఎలుకల దాడిలో చిన్నారి మృతిచెందిన ఘటన తీవ్ర సంచలనం రేగింది. ఇప్పుడు మళ్లీ అదేమాదిరి విచారకర సంఘటన జమ్మూకశ్మీర్‌లోని కిశ్వత్వార్ ప్రభుత్వాసుపత్రిలో చోటు చేసుకుంది. అప్పుడే పుట్టిన బిడ్డను రాక్కాసి ఎలుకలు కాటేశాయి. వివరాల్లోకి వెళ్తే.. జమ్మూలోని మారుమూల ప్రాంతమైన చత్రూ ప్రాంతానికి చెందిన గులామ్ హస్సాన్ తన భార్యను ప్రసవానికి ప్రభుత్వానికి తీసుకునివచ్చాడు. ఆమె గురువారం మగబిడ్డకు జన్మనిచ్చింది. ఆ చిన్నారిని వైద్యచికిత్స నిమిత్తం మెటర్నిటీ వార్డుకు తరలించారు. శనివారం బాబును చూద్దామని వెళ్లిన తండ్రి హస్సాన్కు ఎలుకల దాడిలో తీవ్రంగా గాయపడిన బాబు కనిపించాడు. బాబు శరీరమంతా తీవ్ర రక్తపుస్రావమై ఉంది. కంగారు పడిన హస్సాన్ వెంటనే అక్కడి వైద్యులకు సమాచారమిచ్చాడు. అయితే ఆ బాబు అప్పటికే మరణించాడని వైద్యులు గుర్తించారు. హస్సాన్ వెళ్లిన సమయానికి కూడా బాబును ఎలుకలు కొరుకుతూనే ఉన్నాయని జమ్మూ హైల్త్ సర్వీసెస్ డైరెక్టర్ గుర్జిత్ సింగ్ తెలిపారు. ఈ ఘటనపై విచారణకు ఆదేశించామని, జిల్లా చీఫ్ మెడికల్ ఆఫీసర్ దీనిపై విచారణ చేస్తారని ఆయన చెప్పారు. బేబీ అప్పటికే కొన్ని ఆరోగ్యసమస్యలతో జన్మించాడని, ఎలుకలు కొరకడంతో వెంటనే మరణించినట్టు భావిస్తున్నట్టు పేర్కొన్నారు. హెల్త్ డిపార్ట్మెంట్లో ఎవరైనా తప్పుచేసినట్టు విచారణలో వెల్లడైతే వారిపై కఠినచర్యలు తీసుకుంటామన్నారు. -
డ్యాన్స్ కోసం చంటిబిడ్డను వదిలేసి వెళ్లగా..
మెక్సికో: చంటిబిడ్డను ఇంట్లో వదిలేసి డ్యాన్స్ చేసేందుకు వెళ్లిన ఓ తల్లికి విషాదం ఎదురైంది. నిర్లక్ష్యంగా ఆ పాపను వదిలి వెళ్లడంతో ఎలుకలు కరిచి చంపేశాయి. ఈ విషయం డ్యాన్స్ కు వెళ్లి తిరిగి వచ్చాక ఆమెకు తెలిసింది. తొలుత చుట్టుపక్కలవారికి అనంతరం పోలీసులకు ఈ సంగతి తెలిసి ఆమెను అరెస్టు చేసి విచారిస్తున్నారు. మెక్సికోలోని అకోల్మాన్ అనే చిన్న నగరంలో పద్దెనిమిదేళ్ల లిజ్బెత్ జిరోనిమా ఆమె తల్లితో కలిసి నివసిస్తోంది. ఆమెకు ఓ చంటి బిడ్డ ఉంది. అయితే, ఆ పాపను నిర్లక్ష్యంగా ఇంట్లో వదిలేసి డ్యాన్స్ చేసేందుకు వెళ్లింది. ఈ విషయం తల్లికి చెప్పినా ఆమె కూడా పట్టించుకోలేదు. ఈ లోగా రెండు ఎలుకలు ఆ పాపపై దాడి చేసి, ముఖాన్ని చేతి వేళ్లను కొరికేశాయి. ఫలితంగా ఆ పాప ప్రాణాలువిడిచింది. ఆమె తల్లిని కూడా పోలీసులు అరెస్టు చేసినట్లు చుట్టుపక్కల వారు చెబుతున్నారు. -
నేనురాను బిడ్డో సర్కారు దవాఖానకు!