Little Girl Saves Basavanna and Bull Viral Video - Sakshi
Sakshi News home page

వీడియో: షెక్కరొచ్చి పడ్డ తాత.. దారినపోయే ఆ బిడ్డ, ఎద్దుకు భయపడుతూనే ఏం చేసిందో చూడండి

Published Sun, Jan 16 2022 1:05 PM | Last Updated on Sun, Jan 16 2022 3:47 PM

Little Girl Saves Basavanna And Bull Viral Video - Sakshi

సోషల్‌మీడియాలో ఈమధ్య ఎందుకు ఏ వీడియో వైరల్‌ అవుతుందో చెప్పలేకపోతున్నాం. కానీ, కొన్ని వీడియోలు మాత్రం మనసును హత్తుకునేలా ఉంటున్నాయి. అలాంటి వీడియోనే ఒకటి ఇప్పుడు వాట్సాప్‌ స్టేటస్‌లుగా, ఫేస్‌బుక్‌లోనూ వైరల్‌గా మారింది. గంగిరెద్దును ఆడించే ఓ పెద్దాయన స్పృహ కోల్పోతే.. ఓ చిన్నారి అతనికి చేసిన ఉడతా సాయం పలువురి చేత ప్రశంసలు కురిపిస్తోంది. 


ఓ తాత గంగిరెద్దును ఆడిస్తూ భిక్షాటన చేస్తూ ఓ గేట్‌ ముందుకు చేరగా.. ఆ ఇంటి మహిళ ఆయన్ని ఈసడించుకుంది. ఆ పక్కనే మరో ఇంటి ముందుకు వెళ్లగా.. హఠాత్తుగా స్పృహ కోల్పోయి కిందపడ్డాడు ఆ పెద్దాయన. దీంతో గంగిరెద్దు ఆ బసవన్నను లేపే ప్రయత్నం చేసింది. ఇంతలో అటుగా వెళ్తున్న ఓ వ్యక్తి అదేం పట్టన్నట్లు ముందుకు సాగిపోగా.. ఆ పక్కనే వెళ్తున్న ఇద్దరు చిన్నారులు మాత్రం అది గమనించారు. 

అందులో బ్యాగ్‌ వేసుకున్న ఓ చిన్నారి ఆ గంగిరెద్దు తాతకు దగ్గరగా వెళ్లింది.  బసవన్నకు భయపడుతూనే ఆ తాతను లేపే ప్రయత్నం చేసింది. ఆపై తన బ్యాగ్‌లో ఉన్న వాటర్‌ బాటిల్‌ను తాతకు అందించి.. ఆపై ఎద్దుకు అరటి పండు అందించింది. చివరికి పైకి లేచిన తాత ఆ చిన్నారిని ఆశీర్వదిస్తూ అక్కడి నుంచి వెళ్లిపోయాడు.   

సీసీ కెమెరాల్లో రికార్డు అయినట్లు చెప్తున్న వీడియోను చూసి పలువురు ఆ చిన్నారిని ‘చిన్నవయసు-పెద్దమనసు’ అంటూ పొగుడుతున్నారు. ఇది ఎప్పటి వీడియో?.. ఏదైనా షార్ట్‌ఫిల్మ్‌లో భాగమా? అనే విషయంపై స్పష్టత లేదు. కానీ, కంటికి ఇంపుగా ఉండడంతో వైరల్‌ అవుతోంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement