Viral Video: Little Girl Falling Out Of Car Window At Junction In China - Sakshi
Sakshi News home page

Viral Video: నడిరోడ్డు పై అనూహ్య ఘటన....ఒక్కసారిగా ఆగిపోయిన వాహనాలు: వీడియో వైరల్‌

Published Wed, Aug 3 2022 7:05 PM | Last Updated on Wed, Aug 3 2022 7:52 PM

Viral Video: Girl Falling Car Window At Busy Road In China Goes Viral - Sakshi

నడి రోడ్డుపై ఎవరైన అనుకోకుండా పడిపోతే పట్టించుకునే ఉండేవాడు. అంతేందుకు ఒక చిన్న యాక్సిడెంట్‌ జరిగిన అదే దారిలో వచ్చే వాహనదారుడు ఆగడం గానీ సాయం కానీ చేయరు. పైగా పోలీసు కేసులు అవి ఉంటాయన్న భయంతో ముందుకు రావడానికే జంకుతారు. అక్కడికి ట్రాఫిక్‌ పోలీసు అవగాహన కార్యక్రమాలు చేపట్టి ప్రమాదం జరిగిన వెంటనే స్పందించే కాపాడేవాడు గొప్పవాడు అంటూ మంచి రివార్డులు ఇచ్చి సత్కరించిన ముందకు వచ్చి సాయం చేసేవాళ్లు కరువు. ఐతే ఇక్కడ అలాకాకుండా రోడ్డు పై పడిపోయిన ఒక చిన్నారికి సాయం చేసేందుకు చాలా మంది ముందుకు వస్తారు.

వివరాల్లోకెళ్తే...చైనాలోని నిగ్‌బో ప్రాంతంలోని ఒక రద్దీగా ఉండే రోడ్డు పై పలు వాహానాలు ట్రాఫిక్‌ సిగ్నల్‌ పడటంతో ఆగిపోతాయి. ఐతే ఇంతలో ఒక చిన్నారి కారు విండోలోంచి అనుహ్యంగా జారి పడిపోతుంది. ఆమె పడే సమయంలో సిగ్నల్‌ పడటం వాహనాలన్ని కదిలిపోతాయి. ఆ చిన్నారి మాత్రం కిందపడి ఏడుస్తూ ఉంటుంది.

ఇంతలో వెనుక నుంచి వేగంగా దూసుకువస్తున్న వాహానాలన్ని ఒక్కసారిగా ఆగిపోతాయి. అంతేకాదు మరో వాహానదారుడు సదరు చిన్నారి వద్దకు వచ్చి ఎత్తకుని ఆమె రోడ్డు పక్కకు తీసుకువచ్చి సపర్యలు  చేస్తాడు. ఈ మేరకు ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఆన్‌లైన్‌లో తెగ వైరల్‌ అవుతోంది. మీరు ఓ లుక్కేయండి. 


 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement