window
-
రైల్లో మంటలు! క్షణాల్లో తప్పించుకునేలా..
రైలు వేగంగా వెళ్తోంది.. బోగీలోని ప్రయాణికుల్లో కొందరు ఫోన్ చూస్తున్నారు.. ఇంకొందరు బంధువులతో ముచ్చటిస్తున్నారు.. చిన్న పిల్లలు ఆడుతున్నారు. పెద్దవారు తమ ఆరోగ్య విషయాలను చర్చించుకుంటున్నారు..అంతలోనే అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. క్షణాల్లో అగ్ని జ్వాలలుగా మారాయి. పెద్దగా శబ్దం చేస్తూ ‘మంటలు.. మిమ్మల్ని మీరు కాపాడుకోండి’ అంటూ ప్రయాణికులు అరుస్తున్నారు. చెయిన్ లాగినా ట్రెయిన్ ఆగాలంటే చాలా సమయం పడుతుంది. అలాంటి సమయంలో వారికి ‘రెడ్ విండో’ గుర్తొచ్చింది. బోగీలోని యువకుల సాయంతో అందరూ అందులో నుంచి దూకి ప్రాణాలు కాపాడుకున్నారు. అసలు రైల్వే బోగీల్లో ‘రెడ్ విండో’ అవసరం ఏమిటి.. దాన్ని గుర్తించడం ఎలా.. అనే విషయాలు తెలుసుకుందాం.మనుషులు దూరేందుకు వీలుగా..మీరు రైలు ప్రయాణం చేసినప్పుడు దాదాపు అన్ని కోచ్‌ల్లో ప్రత్యేకమైన ఎరుపు రంగు విండోను గమనించే ఉంటారు. ఈ ఎరుపు రంగు విండో ప్రయాణీకుల భద్రతలో, ముఖ్యంగా అత్యవసర పరిస్థితుల్లో కీలక పాత్ర పోషిస్తుంది. రైలు కోచ్‌ల్లో ఈ విండోను ప్రత్యేకంగా ఎమర్జెన్సీ ఎగ్జిట్‌గా రూపొందించారు. రైల్లో ఇతర కిటీకీల మాదిరిగా దీనికి ఇనుప కడ్డీలుండవు. ఇది ఎలాంటి అడ్డంకులు లేకుండా మనుషులు దూరేందుకు వీలుగా ఉంటుంది. అత్యవసర సమయంలో వెంటనే తెరిచేలా దీన్ని డిజైన్ చేశారు.బోగీ మధ్యలో ఉన్నవారికి అనువుగా..అగ్నిప్రమాదాలు సంభవించినప్పుడు, రైలు పట్టాలు తప్పడం వంటి మరేదైనా ఎమర్జెన్సీ సమయాల్లో ప్రయాణికులు తమను తాము రక్షించుకోవడానికి ఈ రెడ్ విండోను వినియోగిస్తారు. బోగీ మెయిన్ డోర్‌కు దగ్గరగా ఉన్నవారు ఎలాగైనా ఆ డోర్లో నుంచి దూకి తమ ప్రాణాలు కాపాడుకునేందుకు అవకాశం ఉంటుంది. మరి మధ్యలో ఉన్నవారికి ఆ అవకాశం ఉండదు. కాబట్టి రైల్వే విభాగం బోగీ మధ్యలో ఎమర్జెన్సీ విండోను అందుబాటులో ఉంచింది.ఇదీ చదవండి: షేర్లు.. ఉరితాళ్లు కాకూడదంటే..!ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు డోర్లు తెరుచుకోని సందర్భాల్లో రెస్క్యూ టీమ్ ఈ ఎమర్జెన్సీ విండోస్ నుంచి బోగీలోకి ప్రవేశించి ప్రయాణికులను కాపాడేందుకు వీలుంటుంది. రైల్లో ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉన్నప్పుడు మధ్యలో ఉన్న వారు డోర్ నుంచి దిగిపోయి తమ వస్తువులను ఈ విండో ద్వారా తీసుకునేందుకు అవకాశం ఉంటుంది. -
చరిత్ర సృష్టించిన గాజు కిటికీ
దూరం నుంచి చూస్తే నల్లని వస్త్రంపై చిత్రకారుడి కలం నుంచి జాలువారిన అద్భుత చిత్రరాజం అనిపించకమానదు. కానీ దగ్గరికెళ్లి తరచిచూస్తే సప్తవర్ణశోభితమై ప్రకృతి రమణీయతకు అద్దం పట్టే ఒక అద్దం కిటికీ అని వెంటనే తెలుస్తుంది. అపురూప కళాఖండంగా దశాబ్దాల క్రితమే ఘన కీర్తిని మూటగట్టుకున్న ఈ గాజు కిటీకి మళ్లీ రెండు పుష్కరాల తర్వాత కొచ్చింది. 24 ఏళ్ల క్రితం రూ.16 కోట్లకుపైబడి ధర పలికి ఔరా అనిపించిన ఈ గాజు కిటికీ తాజాగా సోమవారం ఏకంగా రూ.105 కోట్లకు అమ్ముడుపోయి తన విశిష్టతకు ఏ అద్దమూ సాటిరాదని నిరూపించుకుంది. 20వ శతాబ్దానికి చెందిన అమెరికన్ కళాకారుడు లూయిస్ కంఫర్ట్ టిఫానీ ఈ గాజు కిటికినీ తయారుచేశారు. అలంకార, సౌందర్య కళల్లో లూయిస్‌ది అందె వేసిన చేయి. స్టెయిన్ గ్లాస్‌తో ఆయన చేసిన కళాకృతులు ప్రపంచవ్యాప్తంగా ఖ్యాతిపొందాయి. ఓహియో రాష్ట్రంలోని క్యాంటన్ సిటీలో తొలి బాప్టిస్ట్ చర్చి వ్యవస్థాపకుల్లో ఒకరైన జాన్ థెరిసా డ్యానర్ గౌరవార్థం లూయిస్ ఈ కిటికీని తయారుచేశారు. అందుకే దీనిని ‘డ్యానర్ మెమోరియల్ విండో’అంటారు. 16 అడుగుల కళాఖండం సోమవారం న్యూయార్క్‌లోని సోత్బే వేలంసంస్థ నిర్వహించిన వేలంలో కేవలం ఆరున్నర నిమిషాల్లో ఊహించినదానికంటే నాలుగు రెట్లు అధిక ధరకు ఇది అమ్ముడుపోవడం విశేషం. బిలియనీర్ అలెన్ గెర్రీ దీనిని విక్రయించగా ఒక గుర్తు తెలియని వ్యక్తి దీనిని కొనుగోలుచేశారని సోత్బే సంస్థ ప్రకటించింది. టిఫానీ రూపొందించిన కిటీకీల్లో ఇంతవరకు ఇంత భారీ ధరకు అమ్ముడుపోయిన తొలి గాజు కిటికీ ఇదే. వాస్తవానికి చర్చి కోసం దీనిని తయారుచేసినా చివరకు వినియోగించకుండా వదిలేశారు. గలగలపారే సెలయేరుకు ఇరువైపులా విరగగాసిన ఫలాలతో అలరారుతున్న వృక్షాలు ఊసులాడుకుంటున్నట్లు ఎంతో రమ్యంగా రంగులద్దారు. డిజైన్ ఆగ్నిస్ నార్త్రోప్ ఈయనకు సాయపడ్డారు. 1913లో దీని తయారీ పూర్తయింది. ‘‘టిఫానీ రూపొందించిన గాజు కిటికీలు ఇన్నేళ్లు గడిచినా మార్కెట్లో తమ హవా కొనసాగిస్తున్నాయనడానికి ఈ కిటికీ వేలమే నిదర్శనం’’అని సోత్బే చైర్మన్ జోడీ పొల్లాక్ అన్నారు. లూయిస్ టిఫానీ వాళ్ల నాన్నకు అమెరికాలో టిపానీ అండ్ కో. పేరిట స్టెయిన్ గ్లాస్ తయారీ కర్మాగారం ఉండేది. అందులో పనిచేస్తూనే టిఫానీ ఎన్నో కళాఖండాలను సృష్టించారు. గాజు దీపాలు, పుష్పలంకరణ వస్తువులను తయారుచేశారు. అమెరికాలోని న్యూయార్క్‌తోపాటు బ్రిటన్‌లోని లండన్, ఫ్రాన్స్‌లోని పారిస్ సొంత స్టోర్లలో ఈయన కళారూపాలకు విపరీతమైన డిమాండ్ ఉండేది. పెన్సిల్వేనియా, మసాచు సెట్స్, న్యూయార్క్‌లోని చాలా చర్చిల్లో ఈయన గాజు కిటీకీలే మనకు దర్శనమిస్తాయి. – సాక్షి, నేషనల్ డెస్క్ -
బే విండోకు.. డిజైన్ ఎక్స్‌లెన్స్!
నగరంతో పాటు పలుచోట్ల అందుబాటులోని ఫ్యాషన్ ప్రీమియర్ మిడ్–లగ్జరీ బ్రాండ్ బే విండోకు ప్రతిష్టాత్మక డిజైన్ ఎక్సలెన్స్ అవార్డ్ లభించింది. ఈ విషయాన్ని సంస్థకు చెందిన డిజైన్ లీడ్ సిద్ధాంత్ ఆనంద్ తెలిపారు.బ్రాండ్‌ను ప్రారంభించిన సంవత్సరంలోనే ఈ ప్రశంసలు లభించడం తమ డిజైన్ల వైవిధ్యానికి నిదర్శనమని, భారతీయతను ప్రతిబింబించే దాదాపు 1000కిపైగా అత్యాధునిక డిజైన్ల రూపకల్పన ద్వారా ఈ అవార్డుకు అర్హత పొందామని సంతోషం వ్యక్తం చేశారు.ఇవి చదవండి: ‘తాన్సేన్’ మొఘల్ వైభవం.. -
త్రుటిలో తప్పిన మరో విమాన ప్రమాదం
టోక్యో: అమెరికాలో విమానం మార్గమధ్యంలో కిటికీ ఊడిపడి ప్రయాణికులు నరకం చూసిన ఘటన మరువకముందే దాదాపు అలాంటి ఘటనే జపాన్‌లో జరిగింది. కాక్‌పిట్ కిటికీకి పగుళ్లు రావడంతో అప్రమత్తమైన విమాన పైలెట్లు వెంటనే విమానాన్ని వెనక్కి మళ్లించి ఎమర్జెన్సీ ల్యాండింగ్చేశారు. జపాన్‌లోని సప్పోరో నగరంలోని న్యూ చిటోసే ఎయిర్‌పోర్ట్‌లో శనివారం జరిగిన ఘటన ఆలస్యంగా ఆదివారం వెలుగులోకి వచి్చంది. 59 మంది ప్రయాణికులు, ఆరుగురు సిబ్బందితో ఆల్ నిప్పన్ ఎయిర్వేస్కు చెందిన దేశీయ బోయింగ్ 737–800 రకం విమానం సప్పోరో నుంచి టొయామాకు బయల్దేరింది. మార్గమధ్యంలో కాక్‌పిట్ కిటికీలో పగుళ్లను గుర్తించారు. పైలెట్లు వెంటనే అప్రమత్తమై ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్‌కు సమాచారం ఇచ్చారు. వారి అనుమతితో మళ్లీ అదే ఎయిర్‌పోర్ట్‌లో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేయడంతో పెద్ద ప్రమాదం త్రుటిలో తప్పింది. -
Alaska Airlines Boeing 737-9 Max: గాల్లో గజగజ
అది అమెరికాలో ఓరెగాన్‌లోని పోర్ట్లాండ్ విమానాశ్రయం. శుక్రవారం సాయంత్రం 4.52 గంటలు. అలస్కా ఎయిర్‌లైన్స్‌కు చెందిన అత్యాధునిక బోయింగ్ 737 మాక్స్ 9 విమానం 174 మంది ప్రయాణికులు, ఆరుగురు సిబ్బందితో కాలిఫోర్నియాలోని ఒంటారియో బయల్దేరింది. టేకాఫ్ తీసుకుని, చూస్తుండగానే వేగం పుంజుకుని దాదాపు 5 కిలోమీటర్ల ఎత్తుకు వెళ్లింది. బయల్దేరిన ఆరు నిమిషాలకే విమానం రెక్క వెనక ప్రయాణికుల వరుసను ఆనుకుని ఉన్న కిటికీతో పాటు కొంత భాగం ఉన్నట్టుండి ఊడి గాల్లో కలిసిపోయింది. ఒక ఫ్రిజ్‌ను మించిన పరిమాణంలో పెద్ద రంధ్రం పడింది. దాంతో విపరీతమైన వేగంతో పెను గాలులు లోనికి దూసుకొచ్చాయి. వాటి దెబ్బకు విమానం పిచ్చి పట్టినట్టు అటూ ఇటూ ఊగిపోవడం మొదలుపెట్టింది. లోపల వాయు పీడనం పూర్తిగా తగ్గిపోవడంతో ప్రయాణికులంతా ప్రాణ భయంతో వణికిపోయారు. రంధ్రంలోంచి దూసుకొస్తున్న పెను గాలుల వేగానికి ఆ వరుసలోని సీట్లోనే కూర్చున్న ఒక చిన్నారి చిగురుటాకులా వణికిపోయాడు. గాలి విసురుకు అతని షర్టు ఒంటి నుంచి విడివడి అమాంతంగా బయటికి దూసుకెళ్లింది. దాంతో పాటే బాబు కూడా గాల్లోకి లేవడంతో తల్లి పెను కేకలు వేసింది. బలమంతా ఉపయోగించి అతన్ని గట్టిగా కౌగిలించుకుని ఆపింది! ఇంకో ప్రయాణికుని చేతిలోని సెల్ ఫోన్ గాలి విసురుకు శరవేగంగా విమానంలోంచి బయటికి దూసుకెళ్లింది. దాంతో విమానమంతటా హాహాకారాలు చెలరేగాయి. ప్రాణభయంతో ప్రయాణికులు ఆర్తనాదాలు చేశారు. సీట్ బెల్టులు పెట్టుకుని సీట్లను గట్టిగా కరుచుకున్నారు. అందరి ప్రాణాలూ అక్షరాలా గాల్లో వేలాడాయి. 10 నిమిషాలకు పైగా నరకం చూసిన అనంతరం విమానాన్ని పైలట్ కల్లోలం మధ్యే అతి కష్టంగా వెనక్కు మళ్లించింది. నిబ్బరంగా కిందికి దించి సాయంత్రం 5.27కు తిరిగి పోర్ట్లాండ్ విమానాశ్రయంలోనే సురక్షితంగా లాండ్ చేసింది. దాంతో బతుకు జీవుడా అంటూ అంతా ఊపిరి పీల్చుకున్నారు. అచ్చం హాలీవుడ్ సినిమాను తలపించిన ఈ ప్రమాదం బారి నుంచి కొద్దిపాటి గాయాలు మినహా అంతా సురక్షితంగా బయట పడ్డారు. నరకం అంచులకు వెళ్లొచ్చాం... ప్రమాదం జరిగిన తీరును వివరిస్తూ ప్రయాణికుల్లో పలువురు భయోద్వేగాలకు లోనయ్యారు. ‘‘విమానం వెనక వైపు నుంచి పెద్ద శబ్దం విని్పంచింది. ఏమిటా తిరిగి చూసేలోపే పెను గాలులు విమానమంతటినీ ఈ డ్చి కొట్టడం మొదలైంది’’ అని ఎవాన్ స్మిత్ చెప్పాడు. ‘‘నేను పక్క వరుసలో కూర్చుని ఉన్నాను. చూస్తుండగానే నా కళ్లముందే అటువైపున్న కిటికీతో పాటు దాని చుట్టుపక్కల భాగమంతా ఎవరో బయటి నుంచి లాగేసినట్టుగా ఊడి కొట్టుకుపోయింది. ఆ కిటికీ సీట్లో ఎవరూ లేరు కాబట్టి సరిపోయింది’’ అంటూ జెస్సికా అనే ప్రయాణికురాలు చెప్పు కొచి్చంది. అక్షరాలా నరకం అంచుల దాకా వెళ్లి అదృష్టం కొద్దీ సురక్షితంగా బయట పడ్డామంటూ వణికిపోయింది. ‘‘ఎమర్జెన్సీలో చిక్కుకున్నాం. గాలి పీడనం పూర్తిగా తగ్గిపోయింది. మేం తక్షణం ల్యాండవ్వాలి’’ అని గ్రౌండ్ కంట్రోల్‌ను పైలట్ రిక్వెస్ట్ చేస్తున్న ఆడియో క్లిప్ వైరల్‌గా మారింది. ఆ విమానాల నిలిపివేత... ప్రయాణికులకు ఎదురైన భయానక అనుభవాన్ని తలచుకుంటేనే గుండె తరుక్కుపోతోందని అలస్కా ఎయిర్‌లైన్స్ సీఈఓ బెన్ మినికుచి తీవ్ర విచారం వెలిబుచ్చారు. ప్రమాదం నేపథ్యంలో పూర్తిస్థాయి తనిఖీలు, భద్రతా పరీక్షలు జరిగేదాకా తమ వద్ద ఉన్న మొత్తం 65 బోయింగ్ 737 మాక్స్ 9 రకం విమానాలనూ పక్కన పెడుతున్నట్టు ప్రకటించారు. తనిఖీలకు పూర్తిగా సహకరిస్తామని బోయింగ్ సంస్థ ప్రకటించింది. ఈ ఉదంతంపై నేషనల్ ట్రాన్స్‌పోర్టేషన్ సేఫ్టీ బోర్డ్ విచారణ జరుపుతోంది. – పోర్ట్‌ల్యాండ్ (అమెరికా) తొలిసారి కాదు.. బోయింగ్ 737 మాక్స్ రకం విమానాలు ప్రమాదాల బారిన పడటం ఇది తొలిసారేమీ కాదు. 2018, 2019ల్లో ఈ రకానికి చెందిన రెండు విమానాలు కూలిపోయి వాటిలో ఉన్నవారంతా దుర్మరణం పాలయ్యారు. దాంతో ప్రపంచమంతటా ఈ విమానాల వాడకాన్ని ఏడాదిన్నర పాటు నిలిపేశారు. కానీ వాటితో పోలిస్తే తాజా ప్రమాదం చాలా భిన్నమైనదని నిపుణులు చెబుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా 1,300కు పైగా బోయింగ్ 737 మాక్స్ రకం విమానాలు వాడకంలో ఉన్నాయి. వీటిలో మాక్స్ 9 అత్యాధునిక విమానాలు. భారత్‌లోనూ ఆకాశ ఎయిర్, స్పైస్‌జెట్, ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ సంస్థలు 40కి పైగా బోయింగ్ 737 మాక్స్ 8 రకం విమానాలను దేశీయ రూట్లలో నడుపుతున్నాయి. అమెరికా విమాన ప్రమాదం నేపథ్యంలో వాటన్నింట్లనూ తక్షణం క్షుణ్నంగా భద్రతా తనిఖీలు నిర్వహించాలని డీజీసీఏ ఆదేశించింది. -
అపార్ట్మెంట్ విండోలో భారీ కొండచిలువ..చూస్తే హడలిపోతారు!
ఇళ్లలోకి కొడచిలువలు రావడం అనేది ఆస్ట్రేలియాలోనే ఎక్కువగా జరుగతుంది. అక్కడ గ్రామాలు, పట్టణాల్లోని అపార్టమెంట్లోకి కూడా కొండ చిలువలు వస్తాయి. ఎందుకంటే ఈ కొడచిలువలను పెంపుడు జంతువులుగా పెంచుకుంటుంటారు. దీంతో పొరపాటున జొరబడటం లేదా అటాక్ చేయడం వంటి సంఘటనలు జరుగుతుంటాయి. అలాంటి ఘటన తొలిసారిగా భారత్‌లో చోటు చేసుకుంది. భారత్‌లో గ్రామాల్లోని ఇళ్ల మద్య కొండచిలువ కనపడటం అరుదు. అందులోనూ అపార్టమెంట్లోకి చొరబడటం అనేది అస్సలు జరగుదు. అలాంటిది భారత్‌లోనే ఓ అపార్ట్మెంట్లో ఈ అరుదైన ఘటన జరగడం అదర్నీ ఆశ్చర్యపరిచింది. వివరాల్లోకెళ్తే.ఈ అనూహ్య ఘటన మహారాష్ట్రాలోని థానే జిల్లాలో చోటు చేసుకుంది. ఓ భవనంలోని అపార్టమెంట్ విండోలోకి భారీ కొండచిలువ చొరబడింది. పాపం అది ఆ విండోకి ఉండే గ్రిల్స్ మధ్య ఇరుక్కుపోయింది. దీంతో ఇద్దరు వ్యక్తులు రంగంలోకి దిగిన దాన్ని రక్షించే యత్నం చేశారు. ఒకరు కిటికిలోంచి దాన్ని బయటకు తీసే ప్రయత్నం చేయగా మరొకరు కిటికి బయటకు వచ్చి దాన్ని ఆ గ్రిల్ నుంచి విడిపించే యత్నం చేశారు. ఐతే చివరికి ఆ కొండచిలువ ఆప్రయత్రంలో అంత ఎత్తున్న ఉన్న అపార్ట్మెంట్ నుంచి కిందకు పడిపోయింది. అయితే ఆ తర్వాత ఆ కొండచిలువ అక్కడ నుంచి నెమ్మదిగా వెళ్లిపోయింది. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతుంది. అయితే నెటిజన్లు మాత్రం ఆ పామును రక్షించే యత్నం చేసిన ఆ వ్యక్తులను ప్రశంసిస్తున్నారు కానీ ఆ భారీ కొండచిలువ అంత ఎత్తు నుంచి పడిపోయింది కాబట్టి ఎన్నో రోజులు అది బతకదు అంటూ ఆందోళన వ్యక్తం చేయగా, మరికొందరూ అస్సలు అది ఎలా అపార్ట్మెంట్లోకి చొరబడిందని ప్రశ్నిస్తూ మరొకరు కామెంట్లు చేస్తూ ట్వీట్లు పెట్టారు. A huge snake was spotted at a Thane Building, it was rescued by two brave persons, rescue video. 👇. #thane #mumbai pic.twitter.com/j2ZWrs9mR9 — Sneha (@QueenofThane) September 25, 2023 (చదవండి: కొత్తగా.. ఎనిమిదో ఖండం! 375 ఏళ్లుగా !..వెలుగులోకి షాకింగ్ విషయాలు) -
10 అడుగుల పైథాన్‌తో పోరు..!
ముంబయి: మహారాష్ట్రాలోని థాణె జిల్లాలో భయానక ఘటన వెలుగులోకి వచ్చింది. దాదాపు 10 అడుగుల పైథాన్ ఓ ఇంటి బెడ్రూంలోకి ప్రవేశించే ప్రయత్నం చేసింది. అపార్ట్మెంట్ బిల్డింగ్‌లో కిటికి గుండా ఏకంగా బెడ్రూంలోకి ఎంట్రీ ఇచ్చింది. ఇది గమనించిన కుటుంబ సభ్యులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. ఇద్దరు యువకులు పైథాన్‌తో ఫైట్ చేసి చివరికి దానిని కిటికీ నుంచి కిందికి పడేశారు. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ఇంత పెద్ద పైథాన్ ఏకంగా బెడ్రూంలోకి ఎంట్రీ ఇస్తే ఎలా ఉంటుందంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. Imagine a massive python hanging from your bedroom window. It happened in Mumbai's Thane.#Thane #Python pic.twitter.com/dbL1IIbasZ — IndiaToday (@IndiaToday) September 26, 2023 ఇదీ చదవండి: బుల్లెట్ నడిపిన సీఎం ఖట్టర్ -
సమయానికి దేవుడిలా రక్షించారు! లేదంటే ఆ చిన్నారి..
ఓ చిన్నారి ఎనిమిదో అంతస్తు కిటికి నుంచి వేలాడుతున్నాడు. ఆ చిన్నారి తల కిటికిలో ఇరుక్కుపోవడంతో అలా వేలాడుతున్నాడు. ఏ క్షణంలో పడిపోతాడో అని నరాలు తెగే ఉత్కంఠ సాగుతుండగా.. అనూహ్యంగా ఆ చిన్నారి ప్రాణాలతో బయటపడ్డాడు. ఈ ఘటన కజికిస్తాన్లో చోటుచేసుకుంది. అసలేం జరిగిందంటే.. ఓ మూడేళ్ల చిన్నారి అకస్మాత్తుగా ఎనిమిదో అంతస్తు కిటికీ గుండా పడిపోయాడు. ఐతే అతడి తల ఇరుక్కుపోవడంతో అలా వేలాడుతూ ఉన్నాడు. ఆ ఇంటిలోని వారు సైతం ఆ చిన్నారిని గమనించకపోవడంతో.. ఆచిన్నారి అలా చాలా సేపు ఏ చేయాలో తెలియక ఇబ్బంది పడ్డాడు. ఇంతలో కింద అంతస్తులో ఉన్న ఇద్దరు వ్యక్తులు దీన్ని గమనించారు. ఐతే ఆ కుర్రాడిని రక్షించేందుకు ఏం చేయాలో తొలుత వారికి అర్థం కాలేదు. ఎందుకంటే ఆ పిల్లాడి తల విండోలో ఇరుక్కుపోయింది. కాబట్టి అతన్ని కిందకి లాగితే ఆ చిన్నారికి ప్రమాదం. కాబట్టి కింద ఏ స్టూలో వేసి సాయం చేసి.. ఆ చిన్నారిలో ఉత్సాహం నింపాలనుకున్నారు. అనుకున్నట్లుగానే రెండు స్టూల్స్‌ని ఆ చిన్నారి కాళ్ల వద్ద ఉంచారు. కానీ ఆ చిన్నారి మాత్రం స్పృహ కోల్పోయాడు. ఎంతసేపు ఆ స్టూల్‌పై కాళ్లు నిలబడకుండా వేలాడిపోతుంటాయి. దీంతో వారు కూడా ఆ భవనంపై స్టూల్స్ పట్టుకుని ఆ చిన్నారి స్పృహలోకి వచ్చేంత వరకు అలా నుంచొని ఉంటారు. సరిగ్గా ఇంతలో ఆ చిన్నారి పేరెంట్స్ వచ్చి కంగారుపడుతూ, అరుస్తూ.. ఆ చిన్నారిని కిటికి గుండా పైకి లాగే యత్నం చేస్తారు. దీంతో ఆ చిన్నారి స్పృహలోకి వస్తాడు. హమ్మయ్యా! ఆ చిన్నారి బతికే ఉన్నాడనుకుని ఆ ఇద్దరు వ్యక్తులు ఊపిరి పీల్చుకుంటారు. ఎట్టకేలకు ఆ ఉత్కంఠకు తెరదించుతూ.. ఆ పిల్లాడు ప్రాణాలతో సురక్షితంగా బయటపడ్డాడు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఆ ఇద్దర్ని రియల్ హీరోలు అంటూ ప్రశంసలతో ముంచెత్తుతున్నారు నెటిజన్లు. Amazing men🙏 pic.twitter.com/WOQNoFP8ZB — Tansu YEĞEN (@TansuYegen) April 26, 2023 (చదవండి: సోనియా గాంధీ విషకన్య!: బీజేపీ స్ట్రాంగ్ కౌంటర్) -
ఓ తల్లి కిరాతక చర్య.. ప్రెగ్నెంట్ అని తెలియక పసికందుని..
ఓ మహిళ ప్రసవించిన కొద్దిసేపిటికే బిడ్డను కిటికిలోంచి పడేసిన ఘటన తీవ్ర కలకలం రేపింది. ఆ బిడ్డ ఏడుపు విని కలవరపడి ఆమె బాత్రూం కిటికీలోంచి విసిరేసింది. ఈ అనూహ్య ఘటన పశ్చిమబెంగాల్లోని కోల్‌కతాలో చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే..పశ్చిమ బెంగాల్‌లోఇన కోల్‌కతాలో ఓ మహిళ తన ఇంటి బాత్రూంలోనే పండంటి మగబిడ్డకు ప్రసవించింది. ఐతే ఆమె నవజాత బిడ్డ ఏడుపు విని కలవరపడి కిటికిలోంచి విసిరేసింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి వచ్చి విచారించగా..సమీపంలోని ఓ మహిళ ప్రసవించినట్లు గుర్తించి ఆరా తీశారు. ఐతే తాను ప్రెగ్నెంట్ అని తనకు తెలియదని, రెగ్యూలర్‌గా పిరియడ్స్ వస్తున్నట్లు తెలిపింది. అందువల్లే విసిరేశానని చెప్పింది ఆ తల్లి. ఆ బిడ్డ పుట్టిన వెంటనే ఏవడవడంతో భయం వేసిందని అందుకే అలా చేశానని చెప్పుకొచ్చింది. ఈ మేరకు పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు. ఈ విషయమై ఆమె కుటుంబసభ్యులను ప్రశ్నించగా..వారు కూడా ఆమె ప్రెగ్నెంట్ అని తెలియదని చెప్పడంతో విస్తుపోవడం పోలీసులు వంతైంది. ఐతే విచారణలో..ఆమె భర్త మద్యానికి బానిసని, ఆమె మానసిక పరిస్థితి కూడా సరిగా లేదని తేలింది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేయడం ప్రారంభించారు. (చదవండి: మొబైల్ ఫోన్ పేలి ఎనిమిదేళ్ల చిన్నారి మృతి) -
వైరల్ వీడియో : నాలుగో అంతస్తులో నిలబడి కిటికీ అద్దాలు శుభ్రం చేస్తూ..!
-
Video: కిటికీ అద్దాలు తుడిచేందుకు మహిళ సాహసం.. నాలుగో అంతస్తు నుంచి!
ఏ పండుగ, శుభకార్యం అయినా షాపింగ్, ఇంట్లో పనులు, అందంగా రెడీ అవ్వడం ఇవన్నీ ముఖ్యంగా ఉండే విధులు. వీటన్నింటిలో ఇళ్లు శుభ్రం చేసుకోవడం మెయిన్ టాస్క్. ఇంటిని శుభ్రం చేయడంలో ఆడవారిదే అందెవేసిన చేయి. ఇళ్లు తళతళా మెరిసిపోవాలన్న ఉద్ధేశంతో ఓపిక ఉన్నా లేకున్నా వారం రోజుల ముందు నుంచే క్లీన్ చేస్తుంటారు. అయితే ఈ క్రమంలో కొంతమంది తెలిసి తెలియక కొన్ని పొరపాట్లు, సహసాలు చేస్తుంటారు. అచ్చం ఇలాగే ఓ మహిళ ప్రాణాలను లెక్కచేయకుండా ఇళ్లు శుభ్రం చేస్తూ అందరిని ఉలక్కిపడేలా చేసింది. సాధారణంగా అపార్టుమెంట్లలో పై అంతస్తులో ఉండే వాళ్లు ఇల్లు శుభ్రం చేసుకునేటప్పుడు కిటికీ అద్దాలు తుడవాలంటే లోపలి నుంచే తుడవాలి. బయటకు వెళ్లి శుభ్రం చేయడం సాధ్యం కాదు. కానీ ఓ అపార్ట్మెంట్లో నాలుగో అంతస్తులో నివసిస్తున్న మహిళ గోడ బయటవైపు నిలబడి కిటికీ అద్దాలు తుడిచింది. కిటికీ గోడ అంచులపై నిర్లక్ష్యంగా ఉండి ఎలాంటి భయం లేకుండా ఆమె పని ఆమె చకచకా చేసుకుపోయింది. కిటికీ ఊచల్ని మాత్రమే పట్టుకుని అద్దాలు తుడుస్తున్న ఈ వీడియోను చూస్తే గుండె ఆగిపోవడం ఖాయం. ఎందుకంటే ఏమాత్రం పట్టుజారినా ప్రమాదమే. ఎదురింట్లో ఉన్న వ్యక్తి ఎవరో ఈ దృశ్యాన్ని వీడియో తీసి ట్విటర్లో షేర్ చేశారు. ‘ఈ దీపావళికి గనుక మహాలక్ష్మి ఆమె ఇంటికి రాకపోతే ఇంక ఎవరి ఇంటికి రాదు’ అనే క్యాప్షన్‌తో పోస్టు చేసిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీనిని చూసిన నెటిజన్లు షాక్ అవుతున్నారు. ‘వామ్మో నాకు గుండె ఆగినంత పనైంది. ఇంత రిస్క్ అవసరమా. ఇలాంటి సహసాలు చేయవద్దు) అని రకరకాలుగా కామెంట్ చేస్తున్నారు. Agar inke ghar Laxmi ji nahi aayi toh kisi ke ghar nahi aayegi Diwali pe pic.twitter.com/SPTtJhAEMO — Sagar (@sagarcasm) October 20, 2022 -
కదులుతున్న రైలులో మొబైల్ చోరీకి యత్నం.. పాపం వాడి పనైపోయింది!
దొంగతనం.. చట్టరీత్యా నేరం అయినా నిత్యం ఈ పదం వింటూనే ఉన్నాం. ఇంటికి తాళం కనిపిస్తే చాలు ఇల్లు గుల్ల అవ్వాల్సిందే. ఒక ఇంట్లోని వస్తువులేనా.. ఇంటి ముందు పార్క్ చేసిన వాహనాలు, విలువైన వస్తువులు సైతం కొట్టేస్తుంటారు. ఇక రైలు, బస్సుల్లో వంటి రద్దీగా ఉండే ప్రదేశాల్లోనూ దొంగలు తమ చేతి వాటాన్ని చూపిస్తూనే ఉంటారు. ఎంత తెలివిగా తప్పించుకున్నా కొన్నిసార్లు దొంగ దొరికిపోతుంటాడు. తాజాగా ఓ దొంగ రైల్వే స్టేషన్ నుంచి కదులుతున్న రైలులో మొబైల్ ఫోన్ చోరీకి ప్రయత్నించి చివరికి ఊహించని విధంగా విఫలమయ్యాడు. ఈ ఘటన సెప్టెంబర్ 14న బిహార్‌లో చోటుచేసుకుంది. బెగుసరాయ్ నుంచి ఖగారియాకు వెళ్తున్న రైలులో కిటికీలోంచి ప్రయాణికుడి మొబైల్‌ను కొట్టేసేందుకు ఓ దొంగ ప్రయత్నించాడు. రైలు సాహెబ్‌పూర్ కమల్ స్టేషన్ దగ్గరకు రాగానే దొంగ మొబైల్ దొంగిలించేందుకు వ్యక్తి చేతిని పట్టుకున్నాడు. కానీ అక్కడే అతని ప్లాన్ బెడిసి కొట్టింది. మొబైల్ తీసుకుంటుండగా అప్రమత్తమైన ప్యాసింజర్ దొంగ చేతులను కిటికీలోంచే గట్టిగా పట్టుకున్నాడు. రైలు కదలడం ప్రారంభమవ్వడంతో దొంగ క్షమాపణలు కోరుతూ, చేతులు వదిలేయమని వేడుకున్నాడు. అప్పటికే రైలు వేగం పెరగడంతో ఏం చేయాలో తోచని దొంగ తన రెండో చేతిని కూడా కిటికీ ద్వారా లోపలికి అందించాడు. ప్రయాణికుడు దొంగ రెండు చేతులను గట్టిగా పట్టుకున్నాడు. దాదాపు 10 కిలోమీటర్లు దొంగ అలాగే కిటికీకి వేలాడుతూ ప్రయాణం చేశాడు. చివరికి రైలు ఖగారియా దగ్గరకు రాగానే ప్రయాణికుడు స్నాచర్ చేయి వదలడంతో అతడు పారిపోయాడు. దీనిని తోటి ప్రయాణికులు వీడియో తీశారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది. చదవండి: చిన్న కారులో 29 మంది.. ‘ఇంకెంత మందిని ఎక్కించేస్తార్రా బాబు’ Though #unverified yet chilling. A mobile snatcher caught in a moving train when his failed attempt probably led to his worst day of life. The thief was hung by a window in a moving train from Begusarai to Khagaria. The passengers handed him over to GRP. IS this act justified? pic.twitter.com/o3ja5qWggi — Kumar Saurabh Singh Rathore (@JournoKSSR) September 15, 2022 -
పులినే రమ్మంటూ బస్ విండో తెరిచాడు... అంతే ఒక్క జంప్ చేసి...
క్రూరమృగాలతో జాగ్రత్తగా వ్యవహరించాలి. ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్న అంతే సంగతులు. ఒక్కోసారి ఏ జరుగుతుందో కూడా ఊహించలేం. ఇక్కడొక వ్యక్తి చిన్న మాంస ముద్దతో ఉన్న స్టిక్‌ని ఎర చూపి బస్ విండో తీసి మరీ రమ్మంటూ సైగ చేశాడు. అంతే ఆ తర్వాత ఘటన చూస్తే షాక్ అయిపోతాం. ఏం జరిగిందంటే...ఒక వ్యక్తి కారు విండో కొద్దిగా తెరిచి పులిని రమ్మంటూ ఒక మాంస ముద్ద ఉన్న స్టిక్‌ని చూపిస్తాడు. అంతే పులి వేగంగా వస్తూ.. ఒక్క జంప్ చేసి విండో వద్ద నుంచుని ఆ స్టిక్‌ని లాగేసుకుంటుంది. అంతే అతను ఆ హఠాత్పరిణామానికి భయపడుతూ...నెమ్మదిగా డోర్ వేసేసుకుంటాడు. లేదంటే ఇక అంతే సంగతులు. అయినా క్రూర మృగాలతో పరాచాకాలంటే ప్రాణాలతో చెలగాడటమే. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఆన్లైన్లో తెగ వైరల్ అవుతోంది. ఆ వ్యక్తి కి ఎంత థైర్యం ఏదైనా జరిగితే అంటూ నెటిజన్లు చివాట్లు పెడుతూ ట్వీట్ చేశారు. (చదవండి: ఇంద్రుడి ఐరావతం భూమిపై పుట్టింది! ఏడు రకాల ప్రత్యేకతలు కూడా.. ) View this post on Instagram A post shared by the amazing tigers (@the_amazing_tigers) -
నడిరోడ్డు పై అనూహ్య ఘటన....ఒక్కసారిగా ఆగిపోయిన వాహనాలు: వీడియో వైరల్
నడి రోడ్డుపై ఎవరైన అనుకోకుండా పడిపోతే పట్టించుకునే ఉండేవాడు. అంతేందుకు ఒక చిన్న యాక్సిడెంట్ జరిగిన అదే దారిలో వచ్చే వాహనదారుడు ఆగడం గానీ సాయం కానీ చేయరు. పైగా పోలీసు కేసులు అవి ఉంటాయన్న భయంతో ముందుకు రావడానికే జంకుతారు. అక్కడికి ట్రాఫిక్ పోలీసు అవగాహన కార్యక్రమాలు చేపట్టి ప్రమాదం జరిగిన వెంటనే స్పందించే కాపాడేవాడు గొప్పవాడు అంటూ మంచి రివార్డులు ఇచ్చి సత్కరించిన ముందకు వచ్చి సాయం చేసేవాళ్లు కరువు. ఐతే ఇక్కడ అలాకాకుండా రోడ్డు పై పడిపోయిన ఒక చిన్నారికి సాయం చేసేందుకు చాలా మంది ముందుకు వస్తారు. వివరాల్లోకెళ్తే...చైనాలోని నిగ్బో ప్రాంతంలోని ఒక రద్దీగా ఉండే రోడ్డు పై పలు వాహానాలు ట్రాఫిక్ సిగ్నల్ పడటంతో ఆగిపోతాయి. ఐతే ఇంతలో ఒక చిన్నారి కారు విండోలోంచి అనుహ్యంగా జారి పడిపోతుంది. ఆమె పడే సమయంలో సిగ్నల్ పడటం వాహనాలన్ని కదిలిపోతాయి. ఆ చిన్నారి మాత్రం కిందపడి ఏడుస్తూ ఉంటుంది. ఇంతలో వెనుక నుంచి వేగంగా దూసుకువస్తున్న వాహానాలన్ని ఒక్కసారిగా ఆగిపోతాయి. అంతేకాదు మరో వాహానదారుడు సదరు చిన్నారి వద్దకు వచ్చి ఎత్తకుని ఆమె రోడ్డు పక్కకు తీసుకువచ్చి సపర్యలు చేస్తాడు. ఈ మేరకు ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఆన్లైన్లో తెగ వైరల్ అవుతోంది. మీరు ఓ లుక్కేయండి. A child who fell out of a car window was rescued by drivers and passengers of the following cars in Ningbo, China pic.twitter.com/IF6Kj3viHS — China Xinhua News (@XHNews) August 2, 2022 -
హోమ్ క్రియేషన్స్; చీరంచు టేబుల్.. లుక్ అదుర్స్
రాబోయే రోజులన్నీ రీ సైక్లింగ్ డేసే. ఉన్నవాటిని పొదుపుగానే కాదు కళాత్మకంగా వాడుకునే నైపుణ్యాన్ని సొంతం చేసుకోవాలని గతానుభవాలు కళ్లకు కడుతున్నాయి. వాటిలో ఇంటిని శారీ‘కళ’తో ఇంపుగా తీర్చిదిద్దడం ప్రస్తుత ట్రెండ్. అది ఎలా శోభిల్లుతుందో చూద్దాం.. వాల్ డెకర్ ఎంబ్రాయిడరీ చేసే ఫ్రేమ్స్ మార్కెట్లో లభిస్తాయి. వీటికి మీ పాత చీరలను డిజైన్లను బట్టి ఎంచుకొని, వాటిపై ఉన్న ఎంబ్రాయిడరీ వర్క్‌ను కావల్సిన విధంగా కట్ చేసుకొని, ప్యాచ్ వర్క్ చేసుకోవచ్చు. ఈ ఫ్యాబ్రిక్ ఎంబ్రాయిడరీ ఫ్రేమ్స్ మీ ఇంటి వాల్‌ను ప్రత్యేకంగా మార్చేస్తాయి. ఎవరి అభిరుచిని బట్టి వారు ఫ్యాబ్రిక్ డిజైన్, కలర్ కాంబినేషన్స్ ఎంచుకోవచ్చు. టేబుల్ మ్యాట్ ఉడెన్ లేదా గ్లాస్ టేబుళ్లు బోసిగా ఉంటే వాటిని చీర అంచులతో మెరిపించవచ్చు. సగం శారీని టేబుల్ కవర్గానూ, మిగతా భాగాన్ని ప్లేట్స్ పెట్టుకునే మ్యాట్స్గానూ డిజైన్ చేసుకోవచ్చు. డైనింగ్ టేబుల్ మాత్రమే కాదు సెంటర్ టేబుల్, సైడ్ టేబుల్ సోఫా కవర్గానూ జరీ అంచు చీరను అందంగా మలచవచ్చు. ఆ కళను కళ్లారా చూసుకోవచ్చు. ఇంటికి వచ్చిన అతిథుల మన్ననలూ పొందవచ్చు. కాటన్ ఇక్కత్ల కళ టేబుల్ మ్యాట్స్‌లో విశేషంగా ఆకట్టుకుంటున్న డిజైన్స్ ఇక్కత్ కాటన్ శారీతో రూపొందినవి. గ్లాస్ హోల్డర్స్, బౌల్ మ్యాట్స్గానూ తమకు నచ్చిన విధంగా క్రియేట్ చేసుకునే అవకాశాన్ని కలిగిస్తుంది చక్కటి ఈ ఫ్యాబ్రిక్. కిటికీ తెరలు పాత జరీ అంచు చీరలు ఉంటే, వాటిని ఎవరికి ఇవ్వాలా అని ఆలోచించనక్కర్లేదు. చిన్నపాటి మార్పులతో విండోస్‌కి కర్టెన్స్‌గా వాడుకోవచ్చు. శారీ కొనుగోలు చేసిన సందర్భం లేక ఎవరైనా కానుకగా ఇచ్చుంటే ఆ జ్ఞాపకాలను గాలితో పాటు మోసుకొచ్చి మీ మనసును తడతాయి తెరలు తెరలుగా. కుషన్ కవర్ మార్కెట్లో లభించే కవర్స్తోనే కుషన్స్‌ని అలంకరించాలని రూలేం లేదు. ఇప్పుడు జరీ చీరల కవర్లు కుషన్స్‌ని మరింత కళగా మార్చేస్తున్నాయి. వీటి మోతాదు ఎంత ఎక్కువ ఉంటే ఇంట్లో ఆ కళాత్మకత అంతగా పెరుగుతందనేది నేటి హోమ్ డెకర్ లవర్స్ మాట. -
నా భార్య, బిడ్డను వెతికి తీసుకువచ్చిన వారికి రూ.5000 బహుమతి!!
ఇటీవలకాలంలో భార్యలే భర్తలను వదిలి వెళ్లిపోతున్నారు. వాళ్లు వ్యక్తి గత కారణాల రీత్యానో లేక మరేదైనా కారణమో తెలియదు గానీ భర్తలను వదిలి వెళ్లిపోతున్నారు. కానీ భర్తలు మాత్రం తమ భార్యల తిరిగి వస్తే చాలు పాతవాటిని గురించి పట్టించుకోం మాతో ఉంటే చాలు అంటూ ఆవేదనగా వాపోతున్న సంఘటనలు ఎక్కువగా చూశాం. అచ్చం అలాంటి సంఘటన బెంగాల్‌లోని పింగ్లా గ్రామంలో చోటుచేసుకుంది. (చదవండి: ప్రేమానుబంధాలు మీకేనా? మాకూ ఉంటాయి) అసలు విషయంలోకెళ్లితే....బెంగాల్‌లోని పింగ్లా గ్రామం నివాసి అయిన ఒక వ్యక్తి వృత్తిరీత్యా వడ్రంగి పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. అయితే అతను డిసెంబర్ 9న పని మీద హైదరాబాద్ వెళ్లాడు. ఆ సమయంలో తన భార్య, బిడ్డను తీసుకుని ఇంట్లో నుంచి పారిపోయిందని అతనికి ఇంట్లో సభ్యులు తెలిపారు. దీంతో అతను మరుసటి రోజే ఇంటికి వచ్చి తన భార్య ఆచూకి కోసం గాలించడం మొదలు పెట్టాడు. అయితే అతని ప్రయత్నం ఫలించ లేదు. చివరి ప్రయత్నంగా సోషలో మీడియాలో తన బాధనంతా పోస్ట్ చేశాడు. ఈ మేరకు అతను సోషల్ మీడియాలో" నేను పని నిమిత్తం హైదరాబాద్‌లో ఉన్న సమయంలో నా భార్య చిన్నారితో సహా కిటికి గుండా పారిపోయింది. ఆమెను ఎవరైన వెతికి తీసుకు వస్తే రూ 5000 పారితోషకం ఇస్తాను" అని ప్రకటించాడు. అంతేకాదు తన ఇంట్లో మొబైల్ ఫోన్ లేదని అందువల్లే తన భార్య మొబైల్ ఫోన్ తీసుకువచ్చే వ్యక్తితో వెళ్లిపోయిందంటూ అనుమానం వ్యక్తం చేశాడు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేసినా స్పందించలేదని అతను చెప్పగా, తమకు ఎటువంటి ఫిర్యాదు రాలేదని పోలీసులు చెబుతున్నారు. పైగా తన భార్య ఒక్కత్తే కిటికి పగలకొట్టి పారిపోలేదని అతని సహాకారంతోనే ఈ ఘటనకు పాల్పడిందని వాపోయాడు. ఇంట్లోంచి వెళ్లే ముందు డబ్బు, నగలు, ఓటర్ ఐడీ, ఆధార్ కార్డు, పిల్లల జనన ధృవీకరణ పత్రాలు కూడా తీసుకుపోయిందని అన్నాడు. పైగా ఆ రోజు రాత్రి తమ ఇంటి ముందు నెంబర్ ప్లేట్ లేని నానో కారు ఆగిందని కూడా చెబుతున్నాడు. ఈ మేరకు సదరు వ్యక్తి తన భార్య బంగారు వస్తువులకు ప్రలోభ పడి అతనితో వెళ్లిపోయిందంటూ ఆరోపించాడు. పైగా పెద్దగా చదువుకోలేదు కాబట్టి సులభంగా ఆ వ్యక్తి మాయమాటలకు పడిపోయి వెళ్లిపోయిందంటూ ఆందోళన వ్యక్తం చేశాడు. ఆమె పారిపోయిన దాని గురించి తానేం ఆలోచించటం లేదని పైగా తాను తన కుటుంబసభ్యులు ఆమె రాక కోసం ఎదురుచూస్తున్నాం అని చెప్పుకొచ్చాడు. (చదవండి: పాములతో మ్యూజిక్ షూట్... షాకింగ్ వీడియో!) -
WTC: ‘రసవత్తరంగా ఉండాలంటే ప్రత్యేక విండో ఉండాలి’
ప్రారంభ ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ (డబ్యూటీసీ) ఈవెంట్ నిర్వహించడానికి ప్రత్యేక విండో ఏర్పాటు చేస్తే బాగుండేదని మాజీ పాకిస్తాన్ క్రికెటర్ రమీజ్ రాజా అభిప్రాయపడ్డారు. ప్రేక్షకాదరణ పెరగాలంటే నూతన పద్ధతులను ప్రవేశపెట్టాలని సూచించారు. ఆగస్టు, 2019 లో ఇంగ్లండ్‌లో జరిగిన ఐసిసి ప్రపంచ కప్ తర్వాత డబ్యూటీసీ తొలిఎడిషన్ ప్రారంభమైంది. ఈ టోర్నమెంట్ ఫైనల్ జూన్ 18 నుంచి సౌతాంప్టన్‌లోని అగాస్ బౌల్ స్టేడియంలో భారత్, న్యూజిలాండ్ మధ్య జరుగనుంది. కాగా, టెస్టు ఫార్మాట్లో మరింత ఆదరణ పెంచడానికి ప్రవేశపెట్టిన డబ్యూటీసీకి మరింత వన్నెతేవాలంటే ప్రత్యేక విండో ఉండాల్సిందేనన్నాడు. భవిష్యత్తులోనైనా ఈ టోర్నమెంట్ కోసం ప్రత్యేక విండోను ఏర్పాటు చేయాలని ఐసీసీ పెద్దలకు విన్నవించాడు. "ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ పూర్తిగా భిన్నమైన విండోలో నిర్వహించాలని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే టెస్ట్ క్రికెట్‌కు ఆదరణ, ఆసక్తి పెరగాలంటే సరికొత్త రీతిలో దీన్ని నిర్వహించడం అవసరమని రాజా ఇండియా న్యూస్ స్పోర్ట్స్‌తో మాట్లాడుతూ తన అభిప్రాయాన్నివ్యక్తం చేశాడు. టీమిండియా ఫైనల్‌కు చేరినందువల్లే డబ్యూటీసీ ముగింపు రసవత్తరంగా మారిందన్నారు. కాగా, బుధవారం రాత్రి ముంబై నుంచి ఇంగ్లండ్‌కు బయల్దేరిన భారత జట్టు.. సౌతాంప్టన్ వేదికగా జూన్ 18న న్యూజిలాండ్‌తో ప్రపంచ ఛాంపియన్షిప్ ఫైనల్లో తలపడనుంది. ఇప్పటికే భారత జట్టు, ముంబైలో 14 రోజుల క్వారంటైన్‌ను ముగించుకుని స్పెషల్ ఛార్టెర్ ప్లైట్‌లో ఇంగ్లండ్ గడ్డపై అడుగు పెట్టింది. చదవండి: గంగూలీ 25 ఏళ్ల కిందటి రికార్డు బ్రేక్.. -
అర్జంట్ అని బాత్రూమ్కు వెళ్లాడు, కిటికీలో నుంచి దూకే క్రమంలో..
నొయిడా: పోలీసుల నుంచి తప్పించుకునే ప్రయత్నంలో ఓ క్రిమినల్ రెండో అంతస్థులో ఉన్న బాత్రూమ్ కిటికీలో నుంచి దూకాడు. దీంతో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని నోయిడాలో జరిగింది. ఇటీవల పోలీసులపైకి కాల్పులకు తెగబడిన మహ్మద్ ఇమ్రాన్ కోసం పోలీసు శాఖ తీవ్రంగా గాలిస్తోంది. పోలీసులకు అందిన సమాచారం ప్రకారం ఇమ్రాన్ గ్రేటర్ నోయిడాలోని ఒమైక్రాన్ ప్రాంతంలో ఉన్నట్లు తెలిసింది. దీంతో నేరస్థుడి ఉన్న ఇంటిపై పోలీసులు దాడి చేయగా ఇమ్రాన్ ఇద్దరు బామ్మర్దులు లక్మాన్, చాంద్ మహమ్మద్‌లు పట్టుబడ్డారు. వారిని ఇమ్రాన్ ఆచూకీ కోసం విచారణ చేస్తుండగా.. చాంద్ మహమ్మద్ బాత్రూమ్కు వెళ్లాలని పోలీసులకు చెప్పి అక్కడి నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నించాడు. బాత్రూమ్ కిటికీలో నుంచి కిందికి దూకాడు. అయితే చాండ్ ఉన్నది రెండో అంతస్థు కావడంతో కిందపడి తీవ్రం గాయాల పాలయ్యాడు. పోలీసులు అతడిని హుటాహుటిన ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచాడని గ్రేటర్ నోయిడా డీసీపీ రాజేష్ కుమార్ సింగ్ తెలిపారు. చాంద్ పై డజనుకు పైగా దొమ్మి, హత్య కేసులు ఉన్నాయని, ఇన్స్పెక్టర్ అక్తర్ ఖాన్ హత్య కేసులో కూడా అతడు ప్రధాన నిందితుడని వెల్లడించారు. ( చదవండి: జువైనల్ హోం నుంచి యువతి పరార్.. ) -
బతికుండగానే సమాధి.. దానికో కిటికి.. ఏమా రహస్యం
వాషింగ్టన్: ఇటీవల కాలంలో కొన్ని సార్లు స్మశానానికి చేరుకున్న తర్వాతో, అంత్యక్రియలు జరుగుతున్నప్పుడో సడెన్‌గా మృతదేహాలు లేచి కూర్చుంటున్న ఘటనలు చూశాం. బతికున్న వ్యక్తులను కూడా చనిపోయారని వైద్యులు చెప్పడం వల్లే ఇలా జరుగుతోంది. అయితే ఇలాంటి సంఘటనను ఓ వ్యక్తి వందల ఏళ్ల క్రితమే ఊహించాడు. ఒకవేళ తనను బతికుండానే సమాధి చేస్తే.. ఆ తర్వాత తనకు స్పృహ వస్తే.. ఏంటి పరిస్థితి అని ఆలోచించాడు. ఒకవేళ ఇదే జరిగితే తాను చావలేదని ప్రపంచానికి తెలపడం కోసం ఓ ఆలోచన చేశాడు. దానిలో భాగంగా మరణించడానికి ముందే సమాధి కట్టించుకున్నాడు. దానికి ప్రత్యేకంగా కిటికీ, గంట కూడా పెట్టించుకున్నాడు. చదవడానికి.. వినడానికి ఆశ్చర్యంగా ఉన్న ఈ సంఘటన అమెరికాలో చోటు చేసుకుంది. ఆ వివరాలు.. అమెరికాలోని వెర్మాంట్‌కు చెందిన డాక్టర్ తిమోతీ క్లార్క్ స్మిత్ అనే వ్యక్తి.. ముందు చూపుతో తన సమాధి తానే కట్టించుకున్నాడు. దానికి ప్రత్యేకంగా ఒక కిటికీ, గంటను కూడా ఏర్పాటు చేసుకున్నాడు. ఒక వేళ బతికుండగానే తనని ఖననం చేస్తే.. అవి పనికొస్తాయని, ప్రాణాలతో ఉంటే ఆ గంటను కొట్టి బయట ఉన్న వ్యక్తులను అప్రమత్తం చేయవచ్చనేది అతడి ఆలోచన. అయితే ఈ ఘటన ఇప్పుడు జరిగింది కాదు. 18వ శతాబ్దంలో చోటు చేసుకుంది. మరణించడానికి ముందే సమాధిని ఏర్పాటు చేసుకున్న డాక్టర్ తిమోతీ 1893లోనే చనిపోయాడు. ఆ సమాధిలోనే తిమోతీని ఖననం చేశారు. వందల ఏళ్లు గడుస్తున్నప్పటికి ఆ సమాధి ఇప్పటికి ఇంకా చెక్కుచెదరలేదు. పైగా, ఇది ప్రముఖ పర్యాటక కేంద్రంగా వెలుగొందుతుంది. వందల ఏళ్ల క్రితం నాటి ఈ విషయం ఓ టిక్‌టాక్ యూజర్ వల్ల మరోసారి తెర మీదకు వచ్చింది. ఈ విషయాన్ని బాబీకర్టిస్లీ(@bobbiecurtislee) అనే టిక్‌టాక్ యూజర్ ఈ వింత సమాధి గురించి వివరించింది. ‘‘తిమోతీ మరణానికి ముందు తన సమాధికి సంబంధించిన మోడల్ తయారు చేయించుకున్నాడు. దీనికి ప్రత్యేకంగా పేటెంట్ కూడా తీసుకున్నాడు. మరణించకుండానే తనని ఖననం చేస్తే అప్పుడు సమాధికి ఏర్పాటు చేసిన బెల్, కిటికీలు ఉపయోగపడతాయనేది అతడి ఉద్దేశం’’ అని పేర్కొంది. ఆ తర్వాత తిమోతీని ఆ సమాధిలోనే పెట్టి ఖననం చేశారని ఆమె తెలిపింది. కానీ అతడు ఊహించినట్లు గంట కొట్టి.. సాయం కోరే అవకాశం తిమోతీకి లభించలేదని పేర్కొంది. అయితే, సమాధి లోపల చీకటిగా ఉండటం వల్ల ప్రస్తుతం అతడి శవాన్ని చూడటం కష్టమేనని తెలిపింది. వెర్మాంట్‌లోని న్యూ హెవెన్‌లోని ఎవర్గ్రీన్ స్మశానవాటికలో ఈ సమాధి ఉందని వెల్లడించింది. అయితే అప్పట్లో చాలా మంది ఈ సాంప్రదాయాన్ని పాటించేవారట. మరణం తర్వాత జీవితం ఉందని నమ్మేవాళ్లు సైతం ఇలా తమకు తోచిన విధంగా సమాధిలో ఏర్పాట్లు చేసుకొనేవారట. ఈజిప్టులోని మమ్మీలు కూడా ఈ కోవలోకే వస్తాయి. చదవండి: శ్మశానాన్ని కాపాడలేని ఈ బతుకు ఎందుకు!! -
కరోనా కట్టడికి కిటికీలు తెరవాలి!
గ్వాంగ్జౌ : కరోనా రోగులతో సన్నిహితంగా ఉన్నా, వారు తుమ్మినప్పుడు, దగ్గినప్పుడు శ్లేష్మం తుంపర్లు మీద పడినా కరోనా వైరస్ ఒకరి నుంచి ఒకరికి సోకుతుందని అందరికి తెల్సిందే. కరోనా వైరస్ బాధితుడు తుమ్మినా, దగ్గినా తుంపర్ల ద్వారా బాహ్య వాతావరణంలోకి వెలువడే కరోనా వైరస్ కొన్ని గంటలపాటు అలా గాలిలో జీవిస్తాయని, అవి ఆవహించి ఉన్న ప్రాంతం నుంచి వెళ్లేవారికి కూడా అవి సోకుతాయని జూలై నెలలో దేశంలోని 200 మంది శాస్త్రవేత్తలు ఓ అభిప్రాయానికి వచ్చారు. అంటే కరోనా వైరస్ గాలి ద్వారా కూడా సోకుతుందన్నమాట. ‘జర్నల్ క్లినికల్ ఇన్ఫెక్సియస్ డిసీసెస్’లో ఈ మేరకు జూలై 6వ తేదీన ఓ వ్యాసాన్ని కూడా ప్రచురించారు. ఈ విషయాన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా అంగీకరించింది. ఈ కారణంగా మన ప్రమేయం లేకుండా మన ఇళ్లలోకి కూడా కరోనా వైరస్ వచ్చే ప్రమాదం ఉంది. ఆ దాడి నుంచి తప్పించుకోవాలంటే ఇంట్లో గాలిపోయే మార్గాలను, అంటే తలుపులను, కిటికీలను వీలైనంత వరకు తెరచి ఉంచాలని.. భవనాలు లేదా ఇళ్ల నిర్మాణాలు కూడా గాలి, వెలుతురు వచ్చేలా, ఇంట్లో గాలి బయటకు వెళ్లేలా ఉండాలని శాస్త్రవేత్తలతోపాటు ఆర్కిటెక్ట్‌లు సూచిస్తున్నారు. వెంటిలేషన్ సరిగ్గా లేని రెస్టారెంట్లు, పబ్బులు, మందిరాల్లో కరోనా కేసులు ఎక్కువగా వ్యాపించిన విషయాన్ని వారు గుర్తు చేస్తున్నారు. చైనాలోని గ్వాంగ్జౌ నగరంలో కిటికీలులేని ఐదో అంతస్తు రెస్టారెంట్లో మధ్యాహ్నం భోజనం చేసిన పది మందికి కరోనా వచ్చింది. కరోనా నుంచి తప్పించుకోవాలంటే మాస్క్‌లు, శానిటైజర్లు ఉపయోగించడం ఎంత అవసరమో, ఇంటికి కిటికీలు, వెంటిలేటర్లు తెరచి ఉంచడం కూడా అంతే అవసరమని పరిశోధకులు సూచిస్తున్నారు. (చదవండి: కరోనా కట్టడిలో ఆ నగరాలు ఫస్ట్) -
కిటికి కోసం ఫ్లయిట్లో ఫైట్
బస్సులో కానీ, రైలులో కానీ ప్రయాణించేటప్పుడు అందరూ కొరుకునేది ఒకటే. సీటు దొరకాలి. అదీ కూడా కిటికి పక్కన ఉన్న సీటు దొరికితే బాగుండు అని అనుకుంటారు. దాని కోసం కర్చీప్ వేసిమరీ వెళ్తారు. అయితే అందరికీ అదే సీటు దొరకడం అంటే కష్టం. ఇక సీటు దొరికిన వ్యక్తి అయితే తనకు ఇష్టం ఉన్నప్పుడు తెరుస్తాడు, క్లోజ్ చేస్తాడు. చిన్నపిల్లలు అయితే కిటికి పక్కన కూర్చొని ప్రతిసారి తెరుస్తూ, మూస్తూ ఆటలాడుతారు. అది ఇతరులకు చిరాకు తెప్పించినా.. తెలిసి తెలియని వయసు కాబట్టి వదిలేస్తారు. కానీ ఇద్దరు పెద్ద వాళ్లు కిటికి కోసం గొడవ పడితే? అది కూడా ఏ రైలో , బస్సు కాకుండా విమానంలో గొడవ పడితే? వినడానికి కాసింత కామెడీగా ఉంది కదా..! విమానంలో కిటికి తెరవడం, మూయడం కోసం ఇద్దరు వ్యక్తులు గొడవపడ్డారు. ఒకరు తెరిస్తూ, మరొకరు క్లోజ్ చేస్తూ చిన్నపిల్లల్లా తిట్టుకున్నారు. దీనికి సంబంధించిన రెండు నిమిషాల వీడియో క్లిప్లింగ్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది. వీడియో ప్రకారం.. విమానంలో ముందు, వెనుక సీటులో ఉన్న ఇద్దరు వ్యక్తులు ప్రతిసారి కిటికి తెరుస్తూ, మూస్తు గొడవకు దిగారు. ముందు కూర్చు వ్యక్తి కిటికి తెరవగా.. ప్లీజ్ క్లోజ్ చేయడంటూ వెనుక కూర్చున్న కిటికి మూశాడు. దీనికి కోపగించిన వ్యక్తి మళ్లీ కిటికి తెరిచాడు. రెండో వ్యక్తి మూశాడు. ఇలా దాదాపు రెండు నిమిషాల పాటు వారి మధ్య కిటికి వార్ జరిగింది. చివరకు విమాన సిబ్బంది వచ్చి చెప్పిన వినలేదు. ముందు కూర్చున్న వ్యక్తి కిటికి ఓపెన్ చేసి చేతులు అడ్డంపెట్టాడు. అయితే గొడవ ఎక్కడదాకా వెళ్లిందో, విమానం ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుందో అనే వివరాలు మాత్రం తెలియలేదు. -
డాడీ
‘‘ఇంక నావల్ల కాదు.. భరించలేను’’అంటూ పొత్తి కడుపు పట్టుకొని లుంగలు చుట్టుకుపోతోంది చందన.‘‘ఓర్చుకో చందూ.. ప్లీజ్.. చూడు ఈ మంత్ తప్పకుండా పీరియడ్స్ మిస్ అవుతావ్’’ ఆమె పక్కన కూర్చోని తల నిమురుతూ అన్నాడు అనిరుద్.ఆ మాటకు అతని కళ్లల్లోకి చూసింది చందన. ‘‘నిజం.. ఈసారి కన్సీవ్ అవడం ఖాయం...’’భరోసా ఇస్తున్నట్టుగా ఆమె చేయిని తన చేతుల్లోకి తీసుకున్నాడు. తన చేయి విడిపించుకుంటూ దిండు ఆసరాగా గోడకు ఒరిగి కూర్చుంది చందన. కిటికీలోంచి గార్డెన్‌లోకి చూస్తూ.. ‘‘ఈ ట్రీట్మెంట్... ఈ పెయిన్ నా వల్ల కాదు అనిర్.. ఎవరినైనా అడాప్ట్ చేసుకుందాం...’’అంది. ఆ మాట అతనికి కొత్త కాదు కాని.. ఆ స్వరం కొత్తగా వినిపించింది. స్థిరమైన అభిప్రాయం మోస్తున్నట్టు. ఆమెకు ఇంకాస్త దగ్గరగా జరిగి చందన తలను తన వైపు తిప్పుకుంటూ ‘‘ఒక్క చాన్స్ చూ..ద్...’’ అని అతను మాట పూర్తి చేసేలోపలే.. ‘‘నీడ్ టు టేక్ రెస్ట్’’ అంటూ అటువైపు తిరిగింది చందన. ఇంకో మాట మాట్లాడకుండా ఆ గదిలోంచి బయటకు వెళ్లిపోయాడు అనిరు«ద్. పెళ్లయి ఆరేళ్లవుతున్నా పిల్లల్లేరు. ఆస్తి, అంతస్తు.. మంచి ఉద్యోగం.. పెద్ద ఇల్లు.. అన్నీ ఉన్నాయి. ఆ ఇంటికి కళ తెచ్చే పిల్లలే లేరు. ఇద్దరూ ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. అనిరు«ద్ లోపం సరిచేయరానిది. ఆ విషయం తెలిసినా.. చందన మీదే ప్రెషర్. నరకం అనుభవిస్తోంది ఆమె. అర్థమైనా కృత్రిమ గర్భధారణ కోసం పదేపదే ప్రయత్నిస్తున్నాడు అనిరు«ద్. రక్తం పంచుకుపుట్టిన బిడ్డ కావాలని. ఆ చాదస్తం చందన ప్రాణం తీస్తోంది. దిండులో తల దూర్చి పొగిలి పొగిలి ఏడుస్తోంది ఆమె. గది బయటకు వచ్చేసిన అనిరు«ద్కూ తెలుసు చందన ఏడుస్తోందని. నిట్టూరుస్తూ.. ‘‘ఏమైనా ఇంకో చాన్స్ చూడాల్సిందే’’ అనుకున్నాడు. ఆఫీస్‌కు వెళ్లడానికి సిద్ధమవుతుంటే ఫోన్.. బీప్.. మెస్సేజ్‌ను ఇండికేట్ చేస్తూ!చూసుకున్నాడు.. ‘‘డాడీ.. వాంట్ రిమోట్ కంట్రోల్ కార్’’ అని ఉంది. రెడిక్యులస్.. చిరాగ్గా అనుకుంటూ మెస్సేజ్ డిలీట్ చేశాడు. ఆఫీస్‌కు కార్ డ్రైవ్ చేశాడు. గుయ్.. గుయ్.. ..... ..... .... .... గుయ్.. గుయ్‘‘అబ్బా.. ఆ ఫోన్ చూడు అనిర్..’’ మధ్య రాత్రి ఫోన్ వైబ్రేషన్ సౌండ్‌కి ఇరిటేట్ అవుతూ చందన. ‘‘ఊ.. పోనిద్దూ.. పడుకో’’ అంటూ అటు తిరిగి ముసుగేసుకున్నాడు అనిరు«ద్.గుయ్.. గుయ్... ..... .... .... గుయ్.. గుయ్ ‘‘అబ్బా...’’ అని విసుక్కుంటూ అనిరు«ద్ ఫోన్ తీసింది. కళ్లునులుముకుంటూ చూసింది.. మెస్సేజెస్.. స్క్రీన్ మీద నోటిఫికేషన్స్‌లో.. ‘‘డాడీ...’’ అని కనిపించింది. ‘‘అనిర్.. ఏవో మెస్సేజెస్ ..’’ భర్తను తట్టి లేపుతూ.‘‘పొద్దున చూసుకుంటాలే.. ’’ నిద్ర మత్తుతోనే అనిరు«ద్. పక్కన పెట్టబోతుంటే మళ్లీ ఓ మెస్సేజ్ వచ్చింది. చూసింది. ‘‘డాడీ...’’ అని ఒక మెస్సేజ్... ‘‘డాడీ... వై డింట్ యు గివ్ రిప్లయ్?’’ అని ఒకటి.. ‘‘డాడీ.. రిమోట్ కంట్రోల్ కార్ తేలేదూ?’’ అని ఓ మెస్సేజ్, ‘‘డాడీ.. గిమ్మీ రిప్లయ్.. ’’, ‘‘డాడీ.. ప్లీజ్.. ప్లీజ్..’’ అంటూ ఓ అయిదారు మెస్సేజ్లున్నాయి. అన్నీ చదివింది. నిద్ర ఎగిరిపోయింది ఆమెకు. వెంటనే అనిరు«ద్‌ను లేపి.. ఏంటిది? అని అడిగాలన్నంత ఆవేశం వచ్చింది. కాని ఆలోచనలో పడింది. అనిరు«ద్‌కు పిల్లలా? మరి మెడికల్ రిపోర్ట్? అతనిలో కౌంట్ తక్కువనే కదా చెప్పారు డాక్టర్! అబద్ధమా? నాకు పిల్లలు పుట్టట్లేదని ఇంకో... ఛ.. ఇలా ఆలోచిస్తుందేంటి తను? మరో అమ్మాయి, ఆమెతో పిల్లలు ఉంటే తననెందుకు ఇబ్బంది పెడ్తాడు ట్రీట్మెంట్స్తో? ఏమో.. తనకు అనిరు«ద్ పట్ల అలాంటి థాట్ రాకుంటా ఉండడానికి ట్రీట్మెంట్ అంటూ హాస్పిటల్స్ చుట్టూ తిప్పుతున్నాడేమో? ఆ డాక్టర్ అనిరుద్ ఫ్రెండే కదా.. ఇద్దరూ కలిసి డ్రామా ఆడుతున్నారా? ఆ చాన్స్ ఉందా? అందుకే అడాప్షన్ వద్దంటున్నాడా? లాంటి ఆలోచనలతో.. అనుమానాలతో తెలీకుండానే నిద్రలోకి జారుకుంది చందన. ‘‘డాడీ.... డాడీ...’’ అయిదేళ్ల అమ్మాయి గుసగుసగా పిలుస్తున్నట్టు.ఒకేసారి ఇద్దరికీ మెలకువ వచ్చింది. ‘‘డాడీ... డాడీ..’’ మళ్లీ పిలుపు. గాబరాగా అనిరు«ద్ లైట్ వేయబోయాడు. వెలగలేదు. అప్పటిదాకా వెలిగిన బెడ్‌లైట్ కూడా ఆరిపోయింది. పక్కనే ఉన్న సెల్‌ఫోన్ తీసుకొని టార్చ్ ఆన్చేసింది చందన. అనిరు«ద్ వంక చూసింది. మొహం నిండా చెమటలతో వణుకుతున్నాడు. ఉన్నట్టుండి గాలి.. వెర్రెత్తినట్టు బెడ్రూమ్ కిటికీలను.. కర్టెన్లూ ఊపేస్తోంది.. కిటికీ తలుపులు ఊడిపడిపోతాయేమోనన్నంతగా! ‘‘పిల్లలు కావాలా డాడీ?’’ మళ్లీ ఆ పిల్ల గొంతే! ‘‘ఏయ్.. ఎవరు నువ్వు?’’కంపిస్తున్న స్వరంతో అనిరు«ద్. ‘‘నీ కూతురిని డాడీ.. పొద్దున ... మధ్యాహ్నం మెస్సేజెస్ పెట్టా కదా.. చూసుకొనీ డిలీట్ చేశావ్. ఇందాక కూడా పెట్టా. నువ్వు పట్టించుకోలేదు.. అందుకే వచ్చా డాడీ..’’ పలుకుతోంది పిల్ల గొంతు. ‘‘ఏయ్.. ఏంటా ముదురు మాటలు? డాడీ ఎవరు ? డాడీ అట డాడీ?’’ భయం ప్లేస్‌లో చిరాకు, కోపం వచ్చాయి అనిరు«ద్‌కి. మళ్లీ గాలి విసురుగా.. ఒక్కసారి ఆ ఇంటినే ఊపేసింది. ‘‘అనిర్...’’ భయంతో గట్టిగా అరిచింది చందన. ‘‘చందూ..’’ అంటూ ఆమెను పొదివి పట్టుకున్నాడు అతను. ‘‘అనిర్.. ఏంటిదంతా? ఎవరా పాపా? కనిపించదేంటి?’’ అంత భయంలోనూ భర్త మీదఅనుమానంతో ఆమె. ‘‘తెలీదు.. నాకూ కన్ఫ్యూజన్గానే ఉంది’’చెమటలు తుడుచుకుంటూ అతను. ‘‘అబద్ధం..’’ అరిచింది ఆ పిల్ల గొంతు. ఒక్కసారిగా వణికారు ఇద్దరూ. ‘‘డాడీ.. అబద్ధం చెప్పకు డాడీ.. ’’ అంతలోకే మార్దవంగా ఆ పిల్ల. మెల్లగా బెడ్ దిగి.. ‘‘ఏయ్ ఎవరు నువ్వు? నన్నెందుకు ఇలా వెంటాడుతున్నావ్?’’ ‘‘అదేంటి డాడీ.. నన్ను మర్చిపోయావా?’’ అని వినిపించగానే ఒక్కసారిగా గదిలో లైట్ వెలిగింది. గదంతా చూశారిద్దరూ .. ఎవరూ లేరు.చందనకు కోపం వస్తోంది. అనిరు«ద్ తనను మోసం చేశాడని. ఆ ఆగ్రహంతోనే భర్త టీషర్ట్ కాలర్ పట్టుకుంది.. ‘‘అనిర్.. నన్నెందుకు చీట్ చేస్తున్నావ్? ఆ పాపఎవరు?’’అంటూ!‘‘వ్వాట్..?’’ఖంగుతిన్నఅనిరు«ద్ షర్ట్ కాలర్ విడిపించుకుంటూ ‘‘గాన్ మ్యాడ్?’’ అరిచాడు. బిత్తరపోయింది చందన. ‘‘ఏం జరుగుతుందో చూసే ఆ మాట అంటున్నావా చందూ?’’ బాధగాఅతను.‘‘రాత్రి నీ సెల్‌కు వచ్చిన మెస్సేజెస్ చూశా.. ఈ అమ్మాయే కాబోలు’’ అంటూ సెల్ ఫోన్ తీసి అతని చేతికి ఇచ్చింది. చదవబోతూంటే బయట కార్ హార్న్ మోగింది గట్టిగా.. ఉలిక్కిపడ్డారిద్దరూ.మోగుతూనే ఉంది.. గబగబా పోర్టికోలోకి పరిగెత్తారు. హెడ్లైట్లు వెలుగుతూ... ఆరుతూ.. ఆరుతూ వెలుగుతూ.....!కార్ దగ్గరకు వెళ్లారు.. విండో గ్లాసెస్ మీద ‘‘డాడీ.. నన్ను ఇంటికి తెచ్చుకోండి... ప్లీజ్’’అని రాసుంది. అది చూసి ఆవేశంతో తుడిచేయబోయాడు అనిరు«ద్.. మళ్లీ హార్న్ మోగింది! అనిరు«ద్ చేయి పట్టి ఆపింది చందన.. తుడిచేయొద్దు అన్నట్టుగా! మళ్లీ మాటలు వినిపించాయి.. ‘‘డాడీ.. ప్లీజ్ మమ్మీ మాట వినండి.. అనా«థను దత్తత తీసుకోండి.. నాలా చెత్తకుప్పలో చనిపోనివ్వకండి.. డాడీ.. ప్లీజ్.. మమ్మీని అలా హాస్పిటల్‌కి తిప్పకండి. అడాప్ట్ చేసుకోండి.. నన్నూ.. మమ్మీని కాపాడండీ.. ప్లీజ్ డాడీ.. ప్లీజ్ డాడీ...’’ అంటూ ఆ పాప స్వరం ఏడుస్తోంది.. చందనాకూ దుఃఖం ఆగలేదు! - సరస్వతి రమ -
నన్ను చూడండి
ఊచల కిటికీలోంచి నేను అలసిన చేతులతో ఒక పెద్ద రూపాయి కాగితాల కట్ట లెక్క పెట్టడం చూశాడు ఒకసారి. నా ముఖం కేసి ఒక సెకను చూసి మళ్లీ కళ్లు మరల్చాడు. నాకు తెలుసు అప్పుడు కూడా అతను నన్ను సరిగ్గా చూడలేదు. ఇంక 2 గంటలు కొట్టేందుకు 15 నిమిషాలు ఉంది. అప్పుడు నేను క్యాష్ అంతా మూసేసి టిఫిన్ తినేందుకు కిందకు వెళ్లాను. అప్పుడు ఒకవేళ అతను నన్ను త్రోవలో చూస్తే, ఫుట్‌పాత్ పక్కన ఉన్న దుకాణంలో నేను బిస్కట్టు తిని, టీ తాగుతుండగా చూస్తే అతను నన్ను గుర్తుపడతాడా? దయచేసి నన్కొకసారి చూడండి. ఇంతకు కొంచెం ముందు నేను తోసుకుంటూ బస్సు ఫుట్‌బోర్డ్ ఎక్కాను. తర్వాత ఆ జనసమూహం మధ్య అటూ ఇటూ దూరి, సరిగ్గా ఒక ఎలుక గొయ్యిత్రవ్వినట్లు త్రోవ చేసుకొని ఇంతదూరం వచ్చి పడ్డాను. బస్సుపై ఊచలు చాలా ఎత్తు. వాటిని అందుకుని వ్రేళ్లాడలేను. నేను పొట్టివాణ్ని. అంచేత సీట్ల వెనకాల పట్టుకుని నిలబడ్డాను. బస్సు కుదుపికి ఊగవలసి వచ్చినప్పుడు, ప్రక్క వాళ్ల మీద పడి సర్దుకోవలసి వచ్చినప్పుడు, చుట్టు పక్కల ఉన్న జనం నన్ను కోపగించుకోలేదు. కారణమేమిటంటే నా బరువు చాలా తక్కువ. నేనెవరి మీదైనా పడ్డా వాళ్లకు దెబ్బ తగలదు. నా ఇరువైపులా ఉన్న మనుష్యులు పర్వతాలంత ఎత్తుగా ఉన్నారు. వాళ్లు నన్నెంతగా మూసేవారంటే, అసలు వాళ్లు నన్ను చూడలేదనిపిస్తోంది. లేకపోతే చూసికూడా నన్ను ఎవరూ లెక్కచేయడం లేదు. ఇదే చిక్కు.నేను ఉన్నా లేకపోయినా వాళ్లకు లాభం కాని నష్టం కాని లేదు. నా ముఖంలో కూడా ఏమి ప్రత్యేకత లేదు...ఎవరైనా నన్ను వేరేగా గుర్తుపట్టేందుకు. 40 సంవత్సరాల తరువాత నా తల క్రమంగా పండిపోయింది. నా జుట్టు పలచబడిపోయింది. నా పెళ్లి అయ్యాక నన్ను కలవరపరిచే తమాషా సంఘటన ఒకటి జరిగింది. నేను నా భార్యను తీసుకొని బజారు పని మీద బైటకు వెళ్లాను. కాపురానికి తీసుకురావడం కోసం కొన్ని లాంఛనాలు బట్టలూ మొదలైనవి కొనవలసి వచ్చింది. ‘‘న్యూ మార్కెట్‌కు వెళదామా?’’ అని నా భార్యను అడిగాను. న్యూమార్కెట్‌లో సరుకులు కొనేందుకు తగిన డబ్బు లేదు. బస్సు పక్కన ఉన్న అంగడిలో ఏవో చవక బట్టలు కొనేందుకు చాలిన డబ్బు మాత్రం ఉంది. అయినా ఆ మాట ఎందుకన్నానంటే ఒకటి నా భార్య పల్లెటూరిది. ఎప్పుడూ న్యూమార్కెట్ చూడలేదు. రెండోది నాతో పోలిస్తే మా అత్తింటివాళ్లు కాస్త ధనవంతులు. అంచేత నేను న్యూమార్కెట్ అని చెప్పేసరికి నా నూతన వధువు చాలా సంతోషిస్తుందని, అక్కడ బట్టలు గిట్టలూ కొంటే ఆ సంగతి తెలుసుకొని మా అత్తవారి తాలూకు వాళ్ల కనుబొమలు కాస్త పైకిలేస్తాయని. కానీ ఈ న్యూమార్కెట్ సంఘటన ప్రాణసంకటం చేసే తప్పయింది. ఏమయిందంటే, న్యూమార్కెట్లోకి ప్రవేశించి ఆ తళతళలాడే కొట్లలోని సరుకులు చూసేçసరికి మా ఆవిడకు ఒళ్లు తెలియలేదు. నా వైపు చూడడమే మరిచిపోయింది. ఆమె ఏ ఒక వస్తువుపైనా ప్రత్యేకించి శ్రద్ధ చూపించక, అన్ని వస్తువులనూ పరిశీలిస్తూనే ఉంది. గార్డ్ ఆఫ్ ఆనర్ ఇచ్చేటప్పుడు సోల్జర్లు ఎలా నడుస్తారో ఆ పద్ధతిలో ఆమె దుకాణాలలో సరుకులు చూస్తూ నడుస్తోంది,మధ్యమధ్య ఆమె ఏదైనా నేను ప్రక్కన ఉన్నాననుకొని మాట్లాడినా, నిజానికి నేను ఉన్నానా లేదా అన్న సంగతి పట్టించుకోలేదు. ఎప్పుడైతే నేను కనిపించలేదో నన్ను వెతుక్కుంటూ నిలబడింది. నాలుగువైపులా వ్యాకులా భావంతో చూస్తోంది నా కోసం. తమాషా చేద్దామని ఆమెకు కనిపించేలా ముందుకు వెళ్లలేదు. గుండ్రంగా ఉన్న సందుల్లో ఒకచోట హఠాత్తుగా వెళ్లిదాక్కున్నాను. పల్లెటూరిపిల్ల నా కోసం వెదుకుతూనే ఉంది. నాలో నేను నవ్వుకున్నాను.ఒక ప్రక్క నుంచి ఆమె ఏడుపు ముఖంతో ఇటూ అటూ నా కోసం నాలుగు ప్రక్కలా వెతికి బయలుదేరిన చోటికి తిరిగి రావడం కనిపెడుతున్నాను. ఎన్నిసార్లు తిరిగినా ఆమె నన్ను కనిపెట్టలేదు. గాభరలో నన్ను వెతుకుతున్న మనిషి నన్ను ప్రక్క నుంచి దాటిపోయింది. కానీ గుర్తుపట్టలేకపోయింది. ఈ పల్లెటూరిపిల్ల గడుసుదే కాబట్టి ఆమె కావాలనే నన్ను చూసీచూడనట్లు నటిస్తుందేమో అనుకున్నాను. కానీ ఆమె ముఖం చూస్తే ఆమె అలా తమాషా చేస్తుందని అనుకోలేకపోయాను. ఆఖరికి ఒక గడియారం దుకాణం ముందు ఆమె త్రోవకు అడ్డువెళ్లి అన్నాను....‘‘హేయ్!’’ ఆమె ఉలిక్కిపడి నోటమాట లేకుండా నా వైపు చూసింది. అలా చాలాసేపు చూసి జోరుగా ఊపిరి విడిచి, వణుకుతూ నవ్వి అంది: ‘‘ఎక్కడున్నావు ఇంతసేపు నువ్వు? నేనెంత సేపటి నుంచి నిన్ను వెదుకుతున్నానో!’’ఆమె నిజం చెబుతుందని అనుకున్నాను. బస్సులో తిరిగివెళ్లేటప్పుడు ఆమెతో చెప్పాను–ఇలా నేను దాగుడు మూతలు ఆటలాడేటప్పుడు ఆమెకు చాలాసార్లు దగ్గరగానే ఉన్నానని, ఆమెముందే నిలబడ్డానని. మొదట ఆమె నా మాటలు నమ్మలేదు. కానీ నేను తిరిగితిరిగి నొక్కి చెప్పాక ఆశ్చర్యపడి అంది. ‘‘నిజంగానా! ఇంకెప్పుడు అలా దాక్కోక. అలా చేస్తే చాలా ప్రమాదకరం’’ ఆపు, కండక్టర్ భాయి, నేనిక్కడ దిగుతా....చూడు, దాదా చూడండి, భాయి, నా కళ్లజోడుని కాస్త కనిపెట్టండి...అయ్యో చూడండి, ఎవ్వరూ నా మాట వినరా, నేను దిగే ముందరే కండక్టరు బస్సు వెళ్లే గంటకొట్టాడు. తలుపుకి అడ్డంగా మొద్దుబండలాగా ఒక అతను కదలకుండా నిలబడ్డాడు. హవాయ్ షర్టు కట్టుకున్న కుర్రవాడు, మోచేతితో త్రోసుకుంటూ వచ్చిన కళ్లజోడు వంకర చేశాడు. అందుకే అన్నాను:‘‘ఎవ్వరూ నన్ను లెక్క చెయ్యరు–బస్సులో కానీ, ట్రాములో కానీ, రోడ్డు మీద కానీ...’’ వర్షాకాలం కాబట్టి ఎండవేడి తక్కువగా ఉంది.కొంచెం దూరంలో ఒక క్రాసింగు. దాని తర్వాత మా ఆఫీసు. నేను క్రాసింగు దగ్గరకు వచ్చి రోడ్డు దాటటానికి కాలుపెట్టేసరికి ట్రాఫిక్ పోలీసువాడు చెయ్యి అడ్డుపెట్టి చాపాడు. నేను దాటవలసిన రోడ్డే అడ్డుపడింది.‘‘ఏం ట్రాఫిక్ పోలీసుభాయి, నేను రోడ్డు దాటాలని చూడడం లేదా? కాస్త నీ చేయి దింపితే నీ చేతికేమైనా హాని కలుగుతుందా’’ నేను ఫస్ట్‌ఫ్లోరు పైకి వెళ్లేందుకు ఎక్కే లిఫ్టు ఒక వందసంవత్సరాల పూర్వానిది. గత 13 సంవత్సరాల నుంచి నేను ఈ లిఫ్ట్ వాడుతున్నాను. ఈ 13 సంవత్సరాలు లిఫ్ట్బాయి రామస్వరూప్ నన్ను పైకితీసుకువెళుతున్నాడు.‘‘ఏం భాయి రామస్వరూప్ నా 26వ ఏట లేక 27వ ఏట నుంచి నన్ను చూస్తున్నావు. ఇప్పుడు చెప్పు నా పేరేమిటి?’’ అని అడిగేసరికి రామస్వరూప్ నవ్వుతూ అంటాడుగదా–‘‘తమరు అరవింద బాబుగారు కదా?’’అది నా పేరేం కాదు. నేనెప్పుడూ అరవిందబాబుని కాను. చిన్నప్పటి నుంచి అరిందమ్ బమాని మాత్రమే.పదేళ్ల నుంచి క్యాషియర్‌గా ఉంటున్నాను. నేను అవలీలగా డబ్బు లెక్కపెట్టగలను. అందుచేత నాకు క్యాష్ పని తప్ప మరొకటి ఎక్కడా ఇయ్యరు. ఒకవేళ ఇచ్చినా క్యాషియర్‌గా మళ్లీ తిరిగిరావలసిందే.ఒకప్పుడు పేమెంట్, రిసీవింగ్ పేమెంటే ఎక్కువ. ఎందుకంటే మానవులకు ధనం ఇవ్వడం కంటే పుచ్చుకోవడానికి ఎక్కువ అవసరం ఉంటుంది కాబట్టి.ఒక తీగపంజరం మధ్య నేను కూర్చుంటాను. నా గుండెకాయకు దగ్గరగా అనేక సొరుగులు గల ఒక డ్రాయరు. దాని మూలల్లో ఎన్ని రూపాయల నోట్లున్నాయో, ఎంత చిల్లర ఉందో నేను కళ్లు మూసుకుని తప్పు లేకుండా చెప్పగలను.పేమెంట్ చేసేటప్పుడు నేను డ్రాయరు తెరిచి లెక్కగా డబ్బు బైటకు తీసి, తర్వాత డ్రాయరు మూసి, మళ్లీ డబ్బు లెక్కపెట్టి, మళ్లీ డబ్బు ఇచ్చాక మరో పేమెంట్ కోసం చెయ్యి జాపి టోకెన్ తీసుకుని, మళ్లీ డ్రాయర్ తెరిచి డబ్బు బైటకు తీసి లెక్కపెట్టి దాని తర్వాత మళ్ళీ ఇలాగేవ్యవహారం నడుస్తుంది. నా ఎదురుగుండా కదులుతున్న వాళ్లు నా పని చూసి బహుశా....‘‘ఏమిటి ఈ మానవుడు ఒకే విసుగు పుట్టే పద్ధతిలో పనిచేస్తున్నాడు!’’ అని అనుకుంటూ ఉంటారు. రామ్‌బాబు మాకు బాగా పాత ఖాతాదారు. అతనికి పెద్ద ఫ్యాక్టరీ ఉంది. ఏజెంటు కూడా అతడిని బాగా గౌరవిస్తాడు. చాలా ఛాదస్తపు నిక్కచ్చి అతనిది. చాలామటుకు ఎవళ్లనీ పంపించకుండా తనే చెక్కులుక్యాష్ చేసుకుంటాడు. నేనెప్పుడు అతనికి పేమెంట్ చేసినా, అతను ఊచల మధ్య నుంచి ప్రసన్నముఖంతో నాకు ధన్యవాదాలు చెబుతాడుఒకమారు నా పెద్దబావమరిది కలకత్తా వచ్చి పట్టణం అంతా తిరుగుతూ చాలా డబ్బు తగలపెట్టాడు. ఆ సందర్భంలో అతను నన్ను పార్కుస్ట్రీటులోని ఒక రెస్టారెంట్‌కు తీసుకెళ్లాడు. అక్కడ మాకు రామ్‌బాబు కనిపించాడు. ఒక్కడే కూర్చున్నాడు. చేతిలో తెల్లజిన్. కళ్లుఏవో కలలు కంటున్నట్లున్నాయి. నిజం చెప్పాలంటే డబ్బున్నవాళ్ల మాట నేను ఏమంత గొప్పగా భావించను. అందుమూలాన రామ్బాబుతో మాట్లాడాలని నాకనిపించలేదు. అందుచేత నాకు తెలిసున్న పాత స్నేహితులున్న చోటుకు ముందుకు నడిచాను.రామ్‌బాబు కనుబొమ్మలు ఆశ్చర్యంతో ఎత్తి అన్నాడు:‘‘ఎక్కడో చూసినట్లుందే! జ్ఞాపకం రావడం లేదు’’అప్పుడు నా బావమరిది ముందు నాకు చాలా సిగ్గేసింది. అతను నిజంగా గుర్తు పట్టలేకపోతే, నిజంగా ఇటువంటి అహంకారాన్ని ప్రదర్శిస్తే నాకు గౌరవహీనం అనిపిస్తుంది. అప్పుడు నేను చేసేది లేక మాబ్యాంకు పేరు చెప్పి, నేనెక్కడ క్యాషియర్ని అని చెప్పాను...అప్పుడు అతని చేతిలోనిజిన్లాగే అతని ముఖం స్వచ్ఛంగా పరిష్కరించబడినట్లయింది.గుర్తు పట్టాను అని, ప్రసన్నతతో ఇంకా ఇలా అన్నాడు.‘‘ఏం చెప్పను. ఈ ఊచల మధ్య ఆ పంజరం మధ్య మిమ్మల్ని చూడడం అలవాటైన వాళ్లు, అకస్మాత్తుగా ఇలాంటి చోట చూస్తే ‘తెలియదు’ అని చెప్పవచ్చు. అసలు సంగతి ఏమిటంటే, ఈ పర్స్పెక్టివ్ తప్పిస్తే,ఒక మనిషిని ఇంకో మనిషి గుర్తుపట్టాలంటే వేరే మార్గం ఏముంది.ఆ పంజరం మధ్య ఊచల లోపల నుంచి మీరు ఈ కోటూ, పాంటూ, బట్టతలా వీటితో ఉన్న నన్ను చూడండి. వీటి నుంచి వేరే చేస్తే, అప్పుడు మీకు తెలుస్తుంది. మీకూ, నాకూ నిజమైన పరిచయం లేదని. ఈమాటగ్రహించారా, ఇప్పుడే నేను పర్స్పెక్టివ్ మాట ఎత్తాను. నా చిన్నప్పుడు నేను రైల్వేకాలనీలో ఉండేవాణ్ణి. మా నాన్నగారు టాలీక్లబ్లో ఉద్యోగం చేసేవారు. ‘కాటిహార్’లోని రైల్వేక్వార్టర్సులో మా ప్రక్క ఇంటి నుంచి ఒక అమ్మాయి వచ్చేది. ఆ అమ్మాయి తన తల్లి ఇంట్లో ఆదరం లేక, మా ఇంటికి వచ్చి, అప్పుడప్పుడూ మా అమ్మకి వంటింట్లో సాయం చేస్తుండేది. ముడతలు పడి, చిరిగిపోయిన గౌనులోమోకాలుదూర్చి పరోటా వత్తేది. అప్పుడప్పుడూ మా అమ్మ అంటూ ఉండేది ‘దీనితో నీకు పెళ్లి చేస్తాను’ అని. ఆ మాట విని ఆ పిల్లను నేను ప్రేమతో చూసేవాడిని. కానీ ఈ జగత్తులో ఎక్కువ రోజులు అలా ఉండలేదు ఆ పిల్ల’’అంతవరకు చెప్పిన రామ్‌బాబు ఒక దీర్ఘమైన నిట్టూర్పు విడిచాడు. అప్పుడు నేను బాధతో అడిగాను–‘‘తర్వాత ఏమైంది, ఆమె చనిపోయిందా?’’. ఆయన తలాడించి ‘‘లేదు లేదు.పెద్దయ్యాక దాన్ని నేను పెళ్లాడాను. అది ఇప్పుడు నా భార్య. ఎప్పుడూ విసుక్కుని సాధించే స్వభావం దానిది. ఆమె దూషణం వింటుంటే కష్టపురోజుల్లో మా అమ్మ రెండు నారింజపళ్లు ఇస్తే, నోటినిండానవ్వే ఆమనిషేనా ఈ మనిషి అని ఆశ్చర్యం కలుగుతుంది. ఇప్పుడు చూడండి. దానితో దెబ్బలాడి బయటికివచ్చాను. ఆ పూర్వపురోజులూ, అది వంటింట్లో కూర్చొని నిప్పంటించడం, ముడతలుపడిన, చిరుగుగౌనులో దాని మోకాళ్లు దాచుకోవడం, దాని అప్పటి కూర్చునే తీరూ అవన్నీ జ్ఞాపకం వస్తున్నాయి. మళ్లీ ఇప్పుడు నా మనసు ప్రేమతో నిండుతుంది. ఇంటికి తిరిగివెళ్లి దాని కోపాన్ని పోగొట్టాలి. అర్థం అయిందా!’’ అని రామ్‌బాబు ఆ తెల్లటిజిన్తో కొంత డోస్ వేసుకుని నవ్వాడు. ‘‘ఈ ఊచల కిటికీ ఉందే–దేనిలోంచైతే మిమ్మల్ని చూస్తానో అదే అసలు. ఈ ఊచలకిటికీ ఇప్పుడు 23–26 సంవత్సరాల మధ్య యువకుడొకడు పేమెంట్ కోసం వచ్చి నిలబడ్డాడు. అతనికి నేను తెలుసు. వాళ్ల నాన్నకి పాతకార్లు కొని అమ్మడం వ్యాపారం. ఇంతకు పూర్వం వాళ్ల నాన్న వస్తూ ఉండేవాడు. ఇప్పుడు ఇతడొస్తున్నాడు బ్యాంకుకి. ‘మీ నాన్నగారు బాగున్నారా?’ అని అడిగాను. ‘‘అ’’ అన్నాడు. కానీ నాకేమని అనుమానం ఉందంటే ఒకరోజు ఎప్పుడైనా ఇక్కడ నుంచి నన్ను బదిలీ చేస్తే ఈ స్థానంలో ఇంచుమించు అందరిలాగా ఉండే ముఖం గలవాడెవ్వడైనా కూర్చుంటే, అప్పుడు అతను ఆ తేడా కనిపెట్టలేడని. అప్పుడు కూడా ఇతను కౌంటర్ మీద డప్పు వేస్తూ, కొత్తగా వచ్చిన క్యాషియర్ కంటపడితే, అతని వైపు కూడా పూర్వపరిచయం ఉన్నట్లు చిరునవ్వు నవ్వుతాడు. తన తప్పు కనిపెట్టుకోవడానికి కొంతకాలం పడుతుంది అతనికి. ఎందుకంటే అతను నన్నింత క్రితం ఎప్పుడూ సరిగ్గా చూడలేదు.బహుశా అతని కొత్తగర్ల్ఫ్రెండ్ మాట ఆలోచించుకుంటూ ఉండవచ్చు. అతను మెడతిప్పి రిసెప్షన్ పిల్లకేసి చాలాసార్లు చూశాడు.ఊచల కిటికీలోంచి నేను అలసిన చేతులతో ఒక పెద్ద రూపాయి కాగితాల కట్ట లెక్క పెట్టడం చూశాడు ఒకసారి. నా ముఖం కేసి ఒక సెకను చూసి మళ్లీ కళ్లు మరల్చాడు. నాకు తెలుసు అప్పుడు కూడా అతను నన్ను సరిగ్గా చూడలేదు. ఇంక 2 గంటలు కొట్టేందుకు 15 నిమిషాలు ఉంది. అప్పుడు నేను క్యాష్ అంతా మూసేసి టిఫిన్ తినేందుకు కిందకు వెళ్లాను. అప్పుడు ఒకవేళ అతను నన్ను త్రోవలో చూస్తే, ఫుట్‌పాత్ పక్కన ఉన్న దుకాణంలో నేను బిస్కట్టు తిని, టీ తాగుతుండగా చూస్తే అతను నన్ను గుర్తుపడతాడా? ∙∙ అప్పుడప్పుడూ నాకీ సందేహం వస్తుంది. నేను నిజంగా ఉన్నానా అని. బ్యాంకులోని ఈ ఊచల మధ్య నుంచి ప్రజలు నా చేతిలోంచి డబ్బు తీసుకుని లెక్కపెడతారు. కొందరు నాకు ధన్యవాదాలు చెబుతారు. కానీ నా స్థానంలో మరెవరైనా వస్తే, ఈ డబ్బు లెక్క పెట్టుకునేవాళ్లూ, ఈ కృతజ్ఞత తెలియజేసే కొందరూ, ఈ ఊచలకిటికీకి అవతల ఉన్న వ్యక్తిలో మార్పు గమనించరు. ఆ న్యూమార్కెట్ సంఘటన తీసుకోండి. నా భార్యే నడుస్తూ నడుస్తూ నన్ను వెతికింది కానీ, ఎదురుగుండా కళ్లముందు ఉన్న నన్ను గమనించకుండా దాటి వెళ్లిపోయిందంటే, ఇంక మిగతావాళ్లు నన్ను గమనించకపోవడంలో ఆశ్చర్యం ఏముంది? ‘‘నాన్నా, రథోత్సవానికి వెళ్లాలి. తొరగా ఇంటికొచ్చెయ్యి’’ అన్నాడు మా చిన్న అబ్బాయి హావనేను మెట్టు మీద అడుగు పెట్టానో లేదో వాడు పై నుంచి పరిగెట్టుకుంటూ దిగి వచ్చేశాడు. ‘‘ఇంత ఆలస్యం చేశావేం, నాన్నా? వెళదామా?’’ అన్నాడు.‘‘వెళదాం బాబూ, చాలా ఆకలేస్తుంది. కాస్త విశ్రాంతి తీసుకొని ఏదైనా కొంచెం తిన్నాక వెళదాంలే’’ అన్నాను.హావూ చాలా అల్లరి పిల్లాడు. తీర్థంలో అడుగుపెట్టాడో లేదో నా చెయ్యి విడిపించుకుని నడవడం మొదలెట్టబోయాడు. ‘‘నా చెయ్యి పట్టుకుని ఉంటేనే నీకు తీర్థం చూపిస్తాను’’ అన్నాను. వాడు గట్టిగా అరిచాడు:‘అదేంటి నానా? ఇక్కడ కూడానా? నన్ను స్వతంత్రంగా అన్నీ చూడనీ’’చేతిలో ఒక పాపిడి పట్టుకుని రంగులరాట్నం ఎక్కాడు హావూ. ఆ రాట్నం ఆకాశం పైకి ఎగురుతున్నప్పుడు, మళ్లీ నేలపై దిగుతున్నప్పుడు ఒళ్లు తెలియని ఆనందంతో నవ్వుతున్నాడు. ఆ తర్వాత మేమిద్దరం ఒక అరగంటసేపు సర్కస్ చూశాం. వాడి కళ్లు మటుకు తళతళ మెరుస్తున్నాయి. బయటకు వచ్చాక వాడిచేయివదిలేశాను. నా ప్రక్కగా నడుస్తున్నాడు. దుకాణంలో చక్కగా ప్రదర్శించబడిన ఈలలు చూశాడు. ఇంకొంచెం ముందుకు వెళ్లి ఏరోప్లేన్‌ల వరుస చూశాడు. తర్వాత మెల్లిమెల్లిగానడుస్తూఆటతుపాకీలు, రంగురంగుల బొమ్మలూ చూస్తున్నాడు.నెమ్మదిగా అడుగు వేస్తున్నాడు. క్రమంగా జనసమూహంలోకి చొచ్చుకుపోయాడు హావూ.హావూ ఎక్కడా కనిపించడం లేదు. ‘హావూ’ అని పిలుస్తూ ముందుకు వెళ్లాను.అవును సార్, మీరెక్కడైనా చూశారా నీలం చొక్కా తొడుక్కున్న నాలుగేళ్ల అబ్బాయిని? వాడి పేరు హావూ. చాలా అల్లరికుర్రాడు.ఈ బొమ్మలకొట్టు ముందు నిలబడ్డవాడు కాదు–వాళ్లిద్దరూ చూడడానికి ఒకేలా ఉన్నారనుకోండి. వాడి ముఖంలోని ప్రత్యేక గుర్తులు నాకిప్పుడు తట్టడం లేదు. ముఖం నా ముఖంలాంటిదే. నీలం చొక్కాతొడుక్కున్న కుర్రాళ్లు ఇక్కడ చాలామంది ఉన్నారు. అలాగే నాలుగేళ్ల వాళ్లూనూ. లేదండి, నేను నిక్కచ్చిగా చెప్పలేను...ఈ వేలకొలది ఉన్న బాలబాలికల మధ్య మా హావూ ఎవరో నా మట్టుకి. వాడి మట్టుకి వాడు చెప్పలేడు కూడా. ఈ జనసమ్మర్దంలో నేను ఎవరో మరిచిపోకండి. వాళ్లమ్మ కూడా ఒకప్పుడు నన్ను గుర్తుపట్టలేకపోయింది.ఒకవేళ మీరు హావూని చూస్తే దయచేసి వాడితో చెప్పండి. నేనే, నేనే వాళ్ల నాన్ననని.ఈ నన్ను కాస్త చూస్తూ ఉండండి. ఎక్కడికి వెళ్లినా ఈ మాటలు మరవకండి. - బెంగాలీ మూలం : శీర్షేందు ముఖోపాధ్యాయ్ - తెలుగు : రాధాకృష్ణమూర్తి చల్లా -
ఉప్పుతిప్పలు
నేను ఎనిమిదో తరగతి చదువుతున్న రోజులవి. మాది ఒక గవర్నమెంట్ హైస్కూల్. సుమారు పది ఎకరాల స్థలంలో బ్రిటిష్‌కాలంలో కట్టించిన స్కూల్ అది. స్కూలు ప్రాంగణంలో రకరకాల చెట్లు, అక్కడక్కడా పాడుబడిన కట్టడాలు, కాడమల్లె, పొగడమల్లె పూలచెట్లు, చింత, తాటి, మామిడి, రేగు వంటి పండ్ల చెట్లు, పెద్ద ఊడల మర్రిచెట్లు, పెద్ద బావి ఉండేవి. సువిశాలమైన మా స్కూలు ప్రాంగణం చిన్నసైజు పల్లెటూరిలా ఉండేది. మా స్కూలు ప్రాంగణం లోపల కొన్ని కుటుంబాలు కూడా నివాసం ఉండేవి. నేను ఎనిమిదో తరగతి చదివేటప్పుడు నా స్నేహితులు జ్యోతి, నాగలక్ష్మి; రాఘవ, బషీరు క్లాసులో చాలా ఉత్సాహంగా ఉండేవాళ్లం. మా క్లాసులో ఒక విరిగిపోయిన కిటికీ ఒక మనిషి పట్టేంత సైజులో ఉండేది. ఆ కిటికీకి కొంచెం దూరంలోనే ఎడంగా కొన్ని కుటుంబాలు నివసించేవి. మా క్లాసులోని అమ్మాయిలు, అబ్బాయిలు కలసి రకరకాల ఆటలు ఆడుకొనేవాళ్లం. అబ్బాయిలు మాకోసం మామిడి కాయలు, రేగుపళ్లు, రకరకాల పండ్లు కోసుకొచ్చి ఇచ్చేవాళ్లు. మధ్యాహ్నం లంచ్ అయ్యాక మేం చాలా ఎంజాయ్ చేస్తూ వాటిని తినేవాళ్లం.ఒకరోజు మాక్లాసు అబ్బాయిలు బోలెడు చింతకాయలు తీసుకొచ్చి మాకు ఇచ్చారు. నాకు చింతకాయలంటే చాలా ఇష్టం. అయితే అవి వట్టిగా తినలేంకదా. ఉప్పు రాసుకుని తింటే మరింత రుచిగా ఉంటాయని ఉప్పు కోసం వెతికాము. అయితే ఇంటి దగ్గ్గర నుంచి మజ్జిగ కోసం తెచ్చుకున్న ఉప్పు అయిపోయింది. అప్పుడు ఏం చేయాలా అని ఆలోచిస్తే మాఫ్రెండ్ జ్యోతి ఒక ఐడియా ఇచ్చింది. అదేంటంటే పక్కనే ఇళ్ళు ఉన్నాయి కదా వాళ్లని అడిగి తెచ్చుకుందాం అని.ఈ ఐడియా మాకు బాగా నచ్చింది.అయితే అప్పటికే ఇంటర్వెల్ టైం అయిపోయింది. క్లాసు టీచర్ వచ్చేస్తారు. కానీ చింతకాయల మీదకు మనసు లాగేస్తుంది ఎలా?? మా అబ్బాయిలను వెళ్ళమంటే ‘‘మేము వెళ్లము మీరే తెచ్చుకోండి’’ అనేశారు. ఇక సరే అని మేము ఆగలేక క్లాసు డోర్ నుంచి బయటకు వెళితే ఎక్కడ టీచరుకి దొరికిపోతామో అని మాక్లాసులో ఉన్న కిటికీ నుంచి ఒకళ్ల తరువాత ఒకళ్లం బయటకు దూకేశాము. నేను, రాఘవ, జ్యోతి, బషీరు, నాగలక్ష్మి మేము ఐదుగురం ఒక ఇంటికి వెళ్ళాం. అక్కడ ఇళ్ళు చాలా అందంగా రకరకాల పూలమొక్కలు, పందిళ్లు, చెట్లతో తాటాకు ఇళ్ళు అయినా చూడ్డానికి బొమ్మరిళ్లలా ఉండేవి. మేము ఒకపెద్ద నారింజ చెట్టు ఉన్న ఇంటికి వెళ్ళాము.ఆ చెట్టుకు పెద్దపెద్ద నారింజకాయలు మాకు అందేంత దగ్గరగా ఉన్నాయి. వాటిని చూడగానే మా జ్యోతికి నోరూరింది. ఇంతలో మేము ఇంట్లో వాళ్లని పిలిచాము ‘‘ఆంటీ.. అంకుల్’’ అని. ఇంటి లోపల నల్లగా లావుగా కుర్చీలో కూర్చున్న ఒక ఆకారం మాకు కనపడింది. ‘‘ఏమికావాలి?’’ అని అడిగాడాయన. వెంటనే మేము‘‘కొంచెం సాల్ట్ ఉంటే ఇస్తారా’’ అని అడిగాము. వెంటనే ఆయన ఒక అమ్మాయిని పిలిచి సాల్ట్ ఇమ్మని పురమాయించాడు. బయట ఉన్న మాకు ఆయన కనిపించట్లేదు. ఆకారం మాత్రమే కనిపిస్తోంది. ఇంతలో మా జ్యోతికి ఒక చిలిపి ఆలోచన వచ్చింది. ‘‘ఒసేయ్! మీరు మాకు అడ్డుగా ఉండండి. నేను, బషీరు కాయలను కోసి స్కర్టులో వేసుకుంటాం. లోపల ఉన్న ఆయనకు మనం కనపడం’’ అని చెప్పింది. మేము ‘‘వద్దే బాబూ! ఎందుకు రిస్క్’’ అని చెప్పినా వినకుండా కాయలను కోసేసింది. అంతలో ఇంటి లోపల ఉన్న ఆయన ‘‘ఏం చేస్తున్నారు మీరు’’ అని కేకలేస్తూ బయటికొచ్చాడు. ఆ దెబ్బతో మా జ్యోతి భయపడిపోయి కోసిన కాయలను పక్కింట్లోకి విసిరేసింది. మేము ‘‘ఏమీ లేదు అంకుల్’’ అంటే ఆయన గబగబా వచ్చేసి ‘‘కాయలను ఎందుకు కోశారు? నన్ను అడిగితే ఇవ్వనా? అలా దొంగతనంగా కోయొచ్చా? ఉండండి ఈ విషయం మీ హెడ్మాస్టర్గారితో చెప్తాను’’ అని అన్నాడు. వెంటనే మా పై ప్రాణాలు పైనే పోయాయి. ‘‘సారీ అంకుల్ ఏదో తెలీక చేశాము’’ అని చెప్పినా అయన వినిపించుకోలేదు. అంతలో లోపల నుంచి సాల్ట్ తీసుకొస్తున్న అమ్మాయిని ఆపి ‘‘సాల్ట్ లేదు ఏమీ లేదు వెళ్లిపోండి’’ అని గద్దించే సరికి దెబ్బతో అక్కడి నుంచి పారిపోయి వచ్చేశాం. జ్యోతిని ‘‘ఇదంతా నీవల్లే అయింది. ఇంకెప్పుడూ ఇలాంటి చెత్తపనులు చేయకు’’ అని తిట్టాము. ట్విస్ట్ ఏమిటంటే మేము ఒక లాజిక్ మిస్ అయ్యాము. చీకట్లో ఉన్నది ఆయనని మేము కాదని బయట ఎండలో వెలుతురులో నించున్న మమ్మల్ని ఆయన స్పష్టంగా చూడగలడని మా మట్టిబుర్రలకు తట్టలేదు. ఆయన అంత సీరియస్‌గా ఉంటే నేను మళ్లీ సాల్ట్ కోసం అడగడం ఇంకా విచిత్రం. మా స్కూల్లో ప్రతి ఉదయం అసెంబ్లీ జరుగుతుంది. స్కూలుకి సంబంధించింది లేదా మరి ఏ ఇతర విషయాలైనా అసెంబ్లీలో చెప్పేవారు. ఆ సంఘటన జరిగిన వారంరోజుల వరకు మేమెవరం స్కూలుకి వెళ్ళలేదు. ఎందుకంటే ఎక్కడ ఆయన మా సంగతి మా హెడ్మాస్టరుతో చెప్తాడో ఆ విషయం అసెంబ్లీలో చెప్పి మమ్మల్ని తిడుతారన్న భయంతో స్కూలుకి డుమ్మా కొట్టేశాం. ఆ తర్వాత అలాంటిదేమీ జరగలేదని తెలిసి ఊపిరి పీల్చుకున్నాం. ఇప్పటికీ ఆ సంఘటన గుర్తొచ్చినప్పుడల్లా నవ్వుకుంటూనే ఉంటాను. – ఎం.సుధా మాధురి, కాకినాడ -
అయినవారికి క్యూ కష్టాలుండవు