టోక్యో: అమెరికాలో విమానం మార్గమధ్యంలో కిటికీ ఊడిపడి ప్రయాణికులు నరకం చూసిన ఘటన మరువకముందే దాదాపు అలాంటి ఘటనే జపాన్‌లో జరిగింది. కాక్‌పిట్ కిటికీకి పగుళ్లు రావడంతో అప్రమత్తమైన విమాన పైలెట్లు వెంటనే విమానాన్ని వెనక్కి మళ్లించి ఎమర్జెన్సీ ల్యాండింగ్‌చేశారు. జపాన్‌లోని సప్పోరో నగరంలోని న్యూ చిటోసే ఎయిర్‌పోర్ట్‌లో శనివారం జరిగిన ఘటన ఆలస్యంగా ఆదివారం వెలుగులోకి వచి్చంది.
59 మంది ప్రయాణికులు, ఆరుగురు సిబ్బందితో ఆల్ నిప్పన్ ఎయిర్‌వేస్‌కు చెందిన దేశీయ బోయింగ్ 737–800 రకం విమానం సప్పోరో నుంచి టొయామాకు బయల్దేరింది. మార్గమధ్యంలో కాక్‌పిట్ కిటికీలో పగుళ్లను గుర్తించారు. పైలెట్లు వెంటనే అప్రమత్తమై ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్‌కు సమాచారం ఇచ్చారు. వారి అనుమతితో మళ్లీ అదే ఎయిర్‌పోర్ట్‌లో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేయడంతో పెద్ద ప్రమాదం త్రుటిలో తప్పింది.
Comments
Please login to add a commentAdd a comment