cockpit
-
త్రుటిలో తప్పిన మరో విమాన ప్రమాదం
టోక్యో: అమెరికాలో విమానం మార్గమధ్యంలో కిటికీ ఊడిపడి ప్రయాణికులు నరకం చూసిన ఘటన మరువకముందే దాదాపు అలాంటి ఘటనే జపాన్‌లో జరిగింది. కాక్‌పిట్ కిటికీకి పగుళ్లు రావడంతో అప్రమత్తమైన విమాన పైలెట్లు వెంటనే విమానాన్ని వెనక్కి మళ్లించి ఎమర్జెన్సీ ల్యాండింగ్చేశారు. జపాన్‌లోని సప్పోరో నగరంలోని న్యూ చిటోసే ఎయిర్‌పోర్ట్‌లో శనివారం జరిగిన ఘటన ఆలస్యంగా ఆదివారం వెలుగులోకి వచి్చంది. 59 మంది ప్రయాణికులు, ఆరుగురు సిబ్బందితో ఆల్ నిప్పన్ ఎయిర్వేస్కు చెందిన దేశీయ బోయింగ్ 737–800 రకం విమానం సప్పోరో నుంచి టొయామాకు బయల్దేరింది. మార్గమధ్యంలో కాక్‌పిట్ కిటికీలో పగుళ్లను గుర్తించారు. పైలెట్లు వెంటనే అప్రమత్తమై ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్‌కు సమాచారం ఇచ్చారు. వారి అనుమతితో మళ్లీ అదే ఎయిర్‌పోర్ట్‌లో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేయడంతో పెద్ద ప్రమాదం త్రుటిలో తప్పింది. -
కాక్‌పిట్‌లోకి గర్ల్‌ఫ్రెండ్.. వరుస వివాదాల్లో ఎయిరిండియా!
ప్రముఖ దేశీయ ఏవియేషన్ దిగ్గజం ఎయిరిండియా (airindia) వివాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలుస్తోంది. మధ్యం మత్తులో ప్రయాణంలో తోటి ప్రయాణికులపై తప్పతాగి మూత్రం పోయడం, ఒకరినొకరు కొట్టుకోవడం,కాక్‌పిట్‌లో స్నేహితురాలిని ఆహ్వానించడం వంటి ఘటనలతో తరచు వార్తల్లో కెక్కుతుంది. తాజాగా, గత వారం ఎయిరిండియా విమానానికి చెందిన ఇద్దరు పైలెట్లు తన స్నేహితురాలని కాక్‌పిట్‌లోకి ఆహ్వానించినట్లు తెలుస్తోంది. ఎయిరిండియాకు చెందిన ఏఐ-445 విమానం ఢిల్లీ నుంచి లేహ్‌కు (లద్దాఖ్) వెళ్లిన విమానంలో పైలెట్, కో-పైలెట్ తన స్నేహితురాల్ని కాక్‌పిట్(cockpit)లో కూర్చోబెట్టుకున్నారు. అయితే, ఎంత సేపు కాక్‌పిట్‌లో ఉన్నారనే అంశంపై స్పష్టత రాలేదు. ఈ ఘటనపై క్యాబిన్ క్రూ సిబ్బంది ఫిర్యాదు చేయడంతో ఎయిరిండియా యాజమాన్యం ఉద్యోగులపై చర్యలు తీసుకునేందుకు సిద్ధమైంది. మరోవైపు, దీనిపై డీజీసీఏ స్పందించింది. నియమ నింబంధనల్ని ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకుంటామని తెలిపింది. ఎయిరిండియా విచారణ నిమిత్తం ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసినట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. ఈ అంశంపై ఎయిరిండియా అధికారిక ప్రకటన చేయలేదు. దేశంలో అత్యంత సున్నిత ప్రాంతమైన లేహ్ వైమానిక మార్గం అత్యంత సున్నితమైంది. క్లిష్టమైనది. ఈ మార్గంలో ప్రయాణించే విమానంలో పైలట్లు నిబంధనలను ఉల్లంఘించడంపై వైమానిక నిపుణులు ఆందోళన వ్యక్తంచేశారు. ఫిబ్రవరి 27న దుబాయ్ నుంచి ఢిల్లీ మార్గంలో ఎయిర్ ఇండియా విమానం ఏ1-915 కాక్‌పిట్‌లోకి తన మహిళా స్నేహితురాలిని స్వాగతించిన ఎయిర్ ఇండియా పైలట్ లైసెన్స్‌ను డీజీసీఏ సస్పెండ్ చేసింది. కాక్‌పిట్ ఉల్లంఘన ఘటనలో సత్వర, సమర్థవంతమైన చర్య తీసుకోలేదని ఆరోపించినందుకు డీజీసీఏ ఎయిరిండియాకు రూ. 30 లక్షల జరిమానా విధించింది. ఇదీ చదవండి : వాట్సాప్ చాట్ విడుదల, మూత్ర విసర్జన ఘటనలో శంకర్ మిశ్రాను ఇరికించారా? -
దిగుతున్న టైంలో విమానం డోర్ లాక్ అయ్యింది!..పాపం ఆ ప్రయాణికుడు..
విమానం గమ్యస్థానానికి చేరకోగానే ప్రయాణికులు దిగిపోవడం సర్వసాధారణం. ఐతే ఓ విమానంలో చివరిగా దిగుతున్న ప్రయాణికుడు దిగే సమయంలో సడెన్‌గా డోర్లు లాకయ్యాయి. ఆ విమానం తిరిగి మరో జర్నీకి రెడీ అవతుండగా అసలు విషయం బయట పడింది. పాపం ఆ ప్రయాణికుడుని బయటకు తీసుకొచ్చేందుకు పైలట్ కాక్‌పీట్ విండో గుండా వెళ్లాల్సి వచ్చింది. ఈ అరుదైన ఘటన అమెరికాలోని శాన్ డియాగో అంతర్జాతీయ విమానాశ్రయంలో చోటు చేసుకుంది. అసలేం జరిగిందంటే..శాన్ డియాగో అంతర్జాతీయ విమానాశయంలో శాక్రమెంటోకు వెళ్లే సౌత్‌వెస్ట్ ఎయిర్‌లైన్స్‌లో ఓ ప్రయాణికుడు అనుకోకుండా ఇరుక్కుపోయాడు. నిజానికి సౌత్‌వెస్ట్ ఎయిర్‌లైన్స్ శాన్ డియాగో విమానాశ్రయం చేరుకోగానే ప్రయాణికులంతా దిగిపోతున్నారు. సరిగ్గా అదే సమయంలో బోర్డింగ్ ప్రక్రియలో ఇతర ప్రయాణికులు, ఫ్లైట్ అటెండెంట్లు ఆన్‌బోర్డ్‌లో ఉండగా.. చివరగా దిగుతున్న ప్రయాణికుడు ఫార్వార్డ్ లావేటరీ డోర్‌ని తెరిచాడు. అంతే ఒక్కసారిగా విమానం డోర్ లాక్ అయ్యిపోయింది. దీంతో ఆప్రయాణికుడు ఆ విమానంలో అలానే ఉండిపోయాడు. ఇంతలో మరో ట్రిప్‌కి విమానం సిద్దమయ్యే నిమిత్తం పైలట్లు ఆ విమానాన్ని ఆపరేట్ చేసేందుకు రావడంతో అసలు విషయం బయటపడింది. దీంతో పైలట్ డెక్ కాక్‌పీట్ వద్ద ఉండే విండో గుండా వెళ్లి ఆ ప్రయాణికుడిని బయటకు తీసుకొచ్చాడు. ఆ ప్రయాణికుడు ఒక్కడే ఆ విమానం నుంచి చివరిగా బయటకు వచ్చాడు. అందుకు సంబంధించిన ఫోటోను అదే విమానంలో ప్రయాణించేందుకు వెళ్తున్న రెక్స్ రోడ్ అనే మరో ప్రయాణికుడు ఆ దృశ్యాలను నెట్టింట షేర్ చేయడంతో ఈ విషమం నెట్టింట తెగ వైరల్‌గా మారింది. ఈ అనుహ్య ఘటనతో తాము తొమ్మది నిమిషాలు ఆలస్యంగా బయలుదేరినట్లు తెలిపాడు. ప్రతిస్పందనగా సదరు ఎయిర్‌లైన్స్ ట్విట్టర్లో మీరు ఎప్పుడూ చూడని అరుదైన దృశ్యం అని పేర్కొంది. No joke… yesterday last passenger got off plane with no one else on board, he shut the door. Door locked. Pilot having to crawl through cockpit window to open door so we can board. @SouthwestAir pic.twitter.com/oujjcPY67j — Matt Rexroad ✌🏼🇺🇸 (@MattRexroad) May 25, 2023 (చదవండి: తొలిసారిగా సాధారణ పౌరుడిని అంతరిక్షంలోకి పంపనున్న చైనా!) -
ఎయిరిండియా పైలెట్ ఘనకార్యం..కాక్‌పిట్‌లో స్నేహితురాలితో ముచ్చట్లు!
పౌర విమానయాన సంస్థ (డీజీసీఏ) ఎయిరిండియా (ఏఐ)పై ఆగ్రహం వ్యక్తం చేసింది. విమానంలో భద్రతా లోపాలపై ఎయిరిండియా సీఈవో క్యాంప్‌బెల్ విల్సన్, విమానం రక్షణ విభాగాధిపతికి ఏప్రిల్ 21న షోకాజ్ నోటీసులు ఇచ్చింది. ఎయిరిండియాకు చెందిన ఓపైలెట్ నిబంధనల్ని ఉల్లంఘించి తన స్నేహితురాల్ని కాక్‌పిట్‌లో కూర్చోబెట్టుకున్నాడు. దీనిపై ఎయిరిండియా సకాలంలో స్పందిచకపోవడంపై డీజీసీఏ మండిపడింది. 15 రోజుల్లో వివరణ ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది. ఎయిరిండియా విమానంలో అసలేం జరిగింది ఫిబ్రవరి 27న దుబాయ్ నుంచి ఢిల్లీ వెళ్తున్న ఎయిరిండియా 915 విమానానికి చెందిన పైలెట్ నిబంధనల్ని ఉల్లంఘించి కాక్‌పిట్‌లోకి తీసుకెళ్లాడు. ప్రయాణం ముగిసే వరకు అక్కడే కూర్చోపెట్టుకున్నాడు. అయితే ఈ ఘటనపై మార్చి 3న కేబిన్ సూపర్వైజర్ ఎయిరిండియా యాజమాన్యానికి ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదుపై పట్టించుకోకపోవడంతో డీజీసీఏని ఆశ్రయించారు. దీంతో డీజీసీఏ తక్షణ చర్యలకు ఉపక్రమించిన ఎయిరిండియా 915 విమానం పైలెట్ కమాండ్ కెప్టెన్ హర్ష్ సూరీ, కేబిన్ క్రూ, కాక్‌పిట్‌లో కూర్చున్న ఎకానమీ క్లాస్ ప్రయాణికురాలికి సమన్లు అందించింది. కాగా, సకాలంలో జోక్యం, చర్యలు తీసుకోకపోవడం విజిల్ బ్లోయర్ ఈ విషయాన్ని డీజీసీఏకి చెప్పాల్సి వచ్చినట్లు పలు నివేదికలు పేర్కొన్నాయి. మహిళా సిబ్బందిపై వేధింపులు సీఈవో క్యాంప్‌బెల్ విల్సన్, విమానం రక్షణ విభాగాధిపతి హెన్రీ డోనోహోకు పంపిన నోటీసులో ఫిర్యాదు దారుడు మాట్లాడుతూ.. కమాండర్‌ని బెదిరించడం, అవమానించడం, తిట్టడం, అసభ్యంగా ప్రవర్తించడంపై చింతిస్తున్నాను. షాక్‌కు గురయ్యాను. మహిళా ప్రయాణీకురాలిని కాక్‌పిట్‌లోకి అనుమతించడాన్ని పైలట్ ఉల్లంఘించడమే కాకుండా, తాను చెప్పినట్లు చేయలేదనే అకారణంగా మహిళా సిబ్బందిని వేదించినట్లు మైలెట్ చేసింది. కాగా, విజిల్ బ్లోయర్ ఫిర్యాదుతో డీజీసీఏ విచారణకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. చదవండి👉 జీతాలు తక్కువే ఇస్తామంటున్నా.. ఉద్యోగులు ఎగబడుతున్నారు.. కారణం ఇదే! -
గర్ల్ ఫ్రెండ్‌ను కాక్‌పిట్‌లోకి తీసుకెళ్లిన ఎయిరిండియా పైలట్..
న్యూఢిల్లీ: విమానాల్లో కొందరు ప్రయాణికుల పిచ్చి చేష్టలు రోజురోజుకీ మితిమీరిపోతున్నాయి. తోటి ప్రయాణికులపై అసభ్యంగా ప్రవర్తిస్తున్న వార్తలు ఇటీవల తరచూ వెలుగులోకి వస్తున్నాయి. ఇప్పటి వరకు ప్రయాణికులే అనుకుంటే తాజాగా ఎయిరిండియా విమానంలో ఓ పెలైట్ చేసిన పనికి అందరూ ఆశ్చర్యపోతున్నారు. దుబాయి-ఢిల్లీ విమానంలో ప్రయాణిస్తున్న తన స్నేహితురాలిని పైలట్ కాక్‌పిట్‌లోకి తీసుకెళ్లడమే గాక.. ప్రయాణ సమయమంతా ఆమెను పక్కనే కూర్చోబెట్టుకున్నాడు. ఫిబ్రవరి 27 జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అసలేం జరిగిందంటే.. దుబాయి నుంచి ఢిల్లీ వస్తున్న విమానంలో పైలట్ స్నేహితురాలు కూడా ప్రయాణిస్తుంది. ఈ విషయం తెలుసుకున్న పైలట్.. విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికి తన స్నేహితురాలిని కాక్‌పిట్‌లోకి ఆహ్వానించాడు. చదవండి: వ్యక్తి ప్రాణాలు తీసిన వందేభారత్-ఆవు ప్రమాదం.. చూస్తుండగానే.. అంతేగాక విమానం ఢిల్లీకి చేరుకునేంతవరకు అంటే.. దాదాపు మూడు గంటల పాటు ఆ మహిళను కాక్‌పిట్‌లోనే ఫస్ట్ అబ్జర్వర్ సీట్లో కూర్చోబెట్టుకున్నాడు. అయితే ఈ విషయంపై క్యాబిన్ సభ్యుల్లో ఒకరు అధికారులకు ఫిర్యాదు చేయడంతో అసలు సంగతి బయటపడింది. దీంతో మహిళా స్నేహితురాలిని పైల్ కాక్‌పిట్‌లోకి అనుమతించిన ఘటనపై పౌరవిమానయాన డైరెక్టరేట్ జనరల్ (డీజీసీఏ) శుక్రవారం దర్యాప్తును చేపట్టింది. పైలట్ చర్యలు భద్రతా ప్రమాణాలను ఉల్లంఘించడమే కాకుండా, విమాన ప్రయాణికుల భద్రతను ప్రమాదంలోకి నెట్టేసిందని అధికారులు తెలిపారు. ఈ ఘటనపై విచారణ జరుగుతోందని, దాని బట్టి పైలట్‌పై సస్పెన్షన్ లేదాలైసెన్స్‌ను రద్దు చేయడంతో సహా క్రమశిక్షణా చర్యలు తీసుకోవచ్చని పేర్కొన్నారు. చదవండి: అసెంబ్లీ ఎన్నికల వేళ.. డీకే శివకుమార్‌కు హైకోర్టులో ఎదురుదెబ్బ -
విమానం నడిపిన 84 ఏళ్ల బామ్మ
న్యూఢిల్లీ: మన అనేవాళ్లు ఏదైనా అడిగితే సాధ్యమైనంత వరకు కాదనకుండా చేయడానికే ప్రయత్నం చేస్తాం. అదే స్వయంగా మన తల్లి దండ్రులే కోరి మరీ అడిగితే అసలు కాదనలేం కదా. పైగా ఏం చేసి అయినా వాళ్లు కోరింది ఇవ్వడానికీ తపిస్తాం కదా. అచ్చం అలానే చేశాడు ఎర్ల్గేజ్ అనే వ్యక్తి. తన తల్లి మాజీ పైలట్ అయిన మైర్తాగేజ్(84) పార్కన్సన్స్ అనే కదలికకు సంబంధించిన వ్యాధితో బాధపడుతుంది. పైగా తన రోజు వారి పనులు చేసుకోవడానికీ కూడా చాలా కష్టపడుతోంది. (చదవండి: ప్రపంచంలోనే తొలి చైల్డ్ ఆర్టిస్ట్ అయితే తాను చివరిసారిగా విమానం నడపాలని ఉందిరా అంటూ తన కొడుకుని అడిగింది. దీంతో ఆమె కొడుకు తన తల్లి కోరిక ఏవిధంగానైనా నెరవేర్చాలని నిర్ణయించుకున్నాడు. ఈ మేరకు విమానాశ్రయ అధికారి కూడా అభ్యర్థించాడు.అయితే సదరు విమానాధికారి ఆమె వయసు రీత్యా మొదట అంగీకరించలేదు. కానీ తర్వాత తన సాటీ మాజీ పైలెట్‌కి సాయం చేయడానికి ముందుకు వచ్చాడు. దీంతో ఎర్ల్గేజ్ తన తల్లి కోరికను నెరవేర్చడమే కాదు తన తల్లి కాక్‌పీట్‌లో కూర్చోని విమానం నడుపుతుంటే తాను వెనుక నుంచి ఆమెను ఉత్సాహపరుస్తూ ఒక వీడియోనూ కూడా చిత్రికరీంచాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. భావోద్వేగాలకు సంబంధించిన ఈ వీడియో చూసి నెటిజన్లు తెగ ఫిదా అవుతున్నారు. (చదవండి: వీయోడి క్యాసెట్ల స్టోర్) -
కాక్‌పిట్‌లోకి వెళ్లే ప్రయత్నం; విమానం నుంచి దూకేశాడు
లాస్ ఏంజిల్స్: కదులుతున్న విమానం నుంచి ఓ ప్రయాణికుడు కిందకు దూకేసిన ఘటన లాస్ ఏంజిల్స్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టులో చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో యువకుడు తీవ్రంగా గాయపడి ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నాడు. వివరాలు.. సాల్ట్ లేక్ సిటీకు వెళ్లాల్సిన యునైటెడ్ ఎక్స్‌ప్రెస్ విమానం 5365ను స్కై వెస్ట్ నిర్వహిస్తోంది. కాగా సాయంత్రం 7 గంటల తర్వాత డోర్ తీసేందుకు ప్రయత్నించిన యువకుడు విమానంలో నుంచి బయటకు దూకేశాడు. అంతకముందు పైలట్లు ఉన్న కాక్‌పిట్ గదిలోకి వెళ్లేందుకు ప్రయత్నించి విఫలమయ్యాడు.ఆ తర్వాత సర్వీస్ డోర్ ఓపెన్ చేయాలనుకోగా.. చివరికి ఎమర్జెన్సీ డోర్ ఓపెన్ కావడంతో అక్కడినుంచి దూకేశాడు. ఇది గమనించిన ఎయిర్పోర్ట్ అధికారులు అతన్ని కస్టడీలోకి తీసుకుని ట్యాక్సీవేలో ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఈ ఘటనతో విమానం టేకాఫ్ తీసుకొని మూడు గంటలు ఆలస్యంగా బయల్దేరింది. అతను విమానం నుంచి దూకేయడం వెనుక ఉన్న కారణాలు తెలియరాలేదు. కాగా ఈ ఘటనపై ఎఫ్‌బీఐ విచారణ చేయనుంది. చదవండి: వార్నీ.. మంచం కింద ఇంత పెద్ద సొరంగమా..! -
ప్రకృతి పిలిచినా.. రైలు ఆగలేదు!
వెబ్‌డెస్క్: జపాన్‌లో బుల్లెట్ రైలు నడిపే ఓ డ్రైవర్ నిర్లక్ష్యం అందరినీ కాసేపు టెన్షన్ పెట్టింది. ప్రకృతి పిలుపుతో డ్రైవర్ బాత్రూంకి వెళ్లగా, డ్రైవర్ లేకుండానే బులెట్ రైలు కొన్ని నిమిషాలు పరుగులు పెట్టింది. ఈ ఘటనపై అధికారులు సీరియస్ కావడంతో డ్రైవర్, కండక్టర్లపై చర్యలకు సిద్ధమయ్యారు. అసలేం జరిగిందంటే.. హికరీ 633 సూపర్ ఫాస్ట్ బుల్లెట్ రైలు శుక్రవారం ఉదయం టొకైడో-షిన్కన్సేన్ రైల్వే లైన్ల మధ్య నడుస్తోంది. ఆ టైంలో హఠాత్తుగా కడుపు నొప్పి రావడంతో డ్రైవర్ బాత్రూమ్కి వెళ్లాల్సి వచ్చింది. అయితే ఆ టైంలో కండక్టర్ని తన సీట్లో ఉంచి వెళ్లాలి. కానీ, ఆ కండక్టర్‌కి లైసెన్స్ లేదు. దీంతో కాక్‌పిట్‌ను ఖాళీగానే వదిలి బాత్రూంకి వెళ్లాడు. కనీసం రైలు వేగాన్ని తగ్గించే ప్రయత్నం కూడా చేయలేదు. అప్పుడు ట్రైన్ గంటకు150 కిలోమీటర్ల వేగంతో వెళ్తోంది. రైళ్లో 160 మంది ప్యాసింజర్లు ఉన్నారు. బుల్లెట్ ట్రైన్ మానిటరింగ్ చేస్తున్న అధికారులు.. డ్రైవర్ ఇంజిన్ కాక్‌పిట్‌లో లేకపోవడంతో కంగారుపడ్డారు. అయితే అదృష్టవశాత్తూ ప్రమాదేమీ జరగకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. చర్యలు తప్పవు సెంట్రల జపాన్ రైల్వే జపాన్ రూల్స్ ప్రకారం.. బుల్లెట్ ట్రైన్ నడిపే డ్రైవర్‌తో పాటు కండక్టర్‌కి డ్రైవింగ్ లైసెన్స్ ఉండాల్సిందే. ఒకవేళ డ్రైవర్ ఆకస్మాత్తుగా అనారోగ్యానికి గురైనప్పుడు, అత్యవసర సమయాల్లోనూ ఆ కండక్టర్ ట్రైన్‌ను నడపొచ్చు. అలాకాని పక్షంలో డ్రైవర్ ఎంత ఎమర్జెన్సీ అయిన కాక్‌పిట్‌ను వదిలేసి వెళ్లకూడదు. -
హాహాహా... ఊహించలేని సంఘటన ఇది!
సాక్షి, న్యూఢిల్లీ: గయా నుంచి న్యూఢిల్లీ వెళుతున్న విమానంలో ఓ సరదా సన్నివేశం చోటుచేసుకుంది. విమానంలో ప్రయాణిస్తున్న ఓ మహిళ పైలట్‌ను చూసి ఆశ్చర్యపోతూ చేసిన వ్యాఖ్యలు ప్యాసింజర్లను కడుబ్బా నవ్వించాయి. గత శనివారం జరిగిన సంఘటనను స్వయంగా సదరు మహిళ పైలట్ హనా ఖాన్ తన ట్విటర్ ఖాతాలో షేర్ చేశారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ‘ఈ రోజు ఢిల్లీ-గయా-ఢిల్లీ విమానంలో పనిచేశాను. ఈ క్రమంలో పెద్దావిడా గయా నుంచి ఢిల్లీ వెళుతోంది. ఈ సందర్భంగా ఆమె కాక్‌పిట్ చూడాలనుకుంది. ఇక అక్కడ నన్ను చూసి ఆమె ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురయ్యారు. (చదవండి: వైరల్ వీడియో: అసలు నిజం ఇదే..) Did a Delhi-Gaya-Delhi flight today. An elderly lady wanted to look into the cockpit & when she saw me, she exclaimed in an haryanvi accent “Oi yahan to chorri baithi!” Could not stop laughing!#aviationstories — Hana Khan (@girlpilot_) November 15, 2020 వెంటనే హర్యానీ బాషలో ‘‘ఈ అమ్మాయి ఏంటి ఇక్కడ కూర్చుంది’’ అని ఆశ్యర్యపోతూ చేసిన వ్యాఖ్యలు ఫ్లైట్‌లో అందరిని నవ్వించాయి’ అని హనా తనకు ఎదురైన సరదా సన్నివేశాన్ని ట్వీట్లో రాసుకొచ్చారు. ఇక తన ట్వీట్‌కు ఇప్పటి వరకు వేలల్లో లైక్‌లు వందల్లో కామెంట్స్ వచ్చాయి. అంతేగాక హనాపై నెటిజన్లు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. ఆ వృద్ద మహిళ తనకు ఎదురైన ఆశ్చర్యకరమైన క్షణాన్ని తప్పకుండా అందరితో పంచుకుంటుంది. అందులో సందేహం లేదు. ఇది నిజం స్పూర్తిదాయకమైనది. హనా నువ్వు ఎంతోమందికి ఆదర్శం. హాహాహా ఇది ఆ వృద్ద మహిళ ఊహించలేని సంఘటన కాబోలు. తన జీవితకాలం దీన్ని మరిచిపోదు’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. (చదవండి: భూమ్మీద నూకలుండాలి గానీ..) -
కుప్పకూలడానికి ముందు.. భయంకరమైన క్షణాలు
కరాచీలో దిగడానికి ప్రయత్నిస్తూ కుప్పకూలిన పాకిస్తాన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌లైన్స్ (పీఐఏ) విమాన ప్రమాద ఘటనకు సంబంధించి ఆఖరి నిమిషంలో చోటు చేసుకున్న కాక్‌పిట్ సంభాషణల వివరాలు వెలుగులోకి వచ్చాయి. విమానం పైలట్లలో ఒకరు, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ మధ్య జరిగిన సంభాషణ వివరాలు ఫ్లైట్-ట్రాకింగ్ వెబ్సైట్లో నమోదయ్యాయి. ప్రపంచవ్యాప్తంగా ఎయిర్‌లైన్స్‌రాకపోకలను గమనించే ప్రసిద్ధ వెబ్సైట్ లైవ్ఏటీసీ.నెట్ పోస్ట్ చేసిన ఆడియో క్లిప్‌లో ఆఖరి నిమిషంలో పైలట్ రెండు ఇంజిన్లు చెడిపోయాయంటూ ఆందోళన చెందారు. తాము తీవ్ర ప్రమాదంలో ఉన్నామనేందుకు సంకేతంగా "మేడే, మేడే, మేడే" అనే సందేశాన్నిచ్చారు. రాడార్ నుంచి సంబంధాలు తెగిపోయే కొన్ని క్షణాల ముందు ల్యాండింగ్ గేర్ సమస్య కారణంగా ఇబ్బంది ఏర్పడిందని పైలట్ ఏటీసీకి సమాచారం ఇచ్చారు. దీనికి స్పందించిన ఏటీసీ రెండు రన్ వేలు సిద్దంగా ఉన్నాయని చెప్పినా, పైలట్ (ఎ) గో-రౌండ్ చేయాలని నిర్ణయించుకున్నాడని, ఇది చాలా విషాదకరమైన సంఘటన అని పీఐఏ అధికార ప్రతినిధి అబ్దుల్లా హెచ్. ఖాన్ తెలిపారు. సంభాషణ ఇలా ఉంది పీకే8303 పైలట్: అప్రోచ్ ఏటీసీ: జీ సర్ పైలట్: మేం ఎడమవైపు తిరగాలా? ఏటీసీ: ఒకే (ధృవీకరణ) పైలట్: మేం డైరెక్టుగా వెళుతున్నాం. రెండు ఇంజన్లను కోల్పోయాము. ఏటీసీ: మీరు బెల్లీ ల్యాండింగ్ (గేర్-అప్ ల్యాండింగ్) చేస్తున్నారని నిర్ధారించండి? పైలట్: వినిపించడంలేదు. ఏటీసీ: ల్యాండింగ్ కోసం 2- 5 రన్‌వే అందుబాటులో ఉంది పైలట్: రోజర్ పైలట్: సర్, మేడే, మేడే, మేడే, పాకిస్తాన్ 8303 ఏటీసీ: పాకిస్తాన్ 8303, రోజర్ సర్. రెండు రన్వేలు అందుబాటులో ఉన్నాయి. అంతే ఇక్కడితో ఆడియో కట్ అయిపోయింది. కొద్దిసేపటి తరువాత, విమానాశ్రయానికి సమీపంలోని జనావాసప్రాంతంలో కుప్పకూలిపోయింది. ఈ ప్రమాదంలో ఇద్దరు తప్పా మిగిలిన అందరూ చనిపోయి వుంటారని భావిస్తున్నారు. ప్రత్యక్ష సాక్షి అందించిన సమాచారం ప్రకారం ముందు టవర్ ను ఢీకొట్టిన విమానం, తరువాత జనావాసాలపై కూలిపోయింది. చదవండి : ఘోర ప్రమాదం: ఆయనొక్కరే అదృష్టవంతుడు? -
విమానయాన రంగానికి ఉజ్వల భవిష్యత్తు
సాక్షి, హైదరాబాద్: దేశంలో పౌర విమానయాన రంగం తాత్కాలికంగా కొన్ని ఒడిదుడుకులకు లోనవుతున్నా ఈ రంగానికి ఉజ్వల భవిష్యత్తు ఉందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కె.తారక రామారావు పేర్కొన్నారు. భాగస్వామ్య పెట్టుబడులతో విమానయాన రంగం బలోపేతం అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. డైరక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ), యూరోపియన్ ఏవియేషన్ సేఫ్టీ ఏజెన్సీ (ఈఏఎస్ఏ) సహకారంతో ఫ్లైట్ సిమ్యులేషన్ టెక్నిక్ సెంటర్ (ఎఫ్ఎస్టీసీ) హైదరాబాద్‌లో కొత్తగా ఏర్పాటు చేసిన అత్యాధునిక పైలట్ శిక్షణ కేంద్రాన్ని కేటీఆర్ గురువారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పౌర విమానయాన శాఖ, డీజీసీఏ అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ ఎనిమిది విమానాలు నిలిపే సామర్థ్యమున్న (8–బే) పైలట్ ట్రైనింగ్ సెంటర్లో ఇప్పటికే ఏ–320 నియో, బాంబార్డియర్ డాష్–8, ఏటీఆర్ 72–600 సిమ్యులేటర్లను హైదరాబాద్ బేలో ఏర్పాటు చేయగా ఢిల్లీ శివార్లలోని గురుగ్రామ్‌లోనూ ఇప్పటికే మరో ఐదు సిమ్యులేటర్లను ట్రైనింగ్ సెంటర్ ఏర్పాటు చేసిందన్నారు. గురుగ్రాం, హైదరాబాద్‌లో ఏర్పాటైన ఎఫ్ఎస్టీసీ శిక్ష ణ కేంద్రాల ద్వారా పైలట్లకు అత్యాధునిక శిక్షణ సాధ్యమవుతుందన్నారు. స్వల్ప వ్యవధిలో తక్కువ ఖర్చుతో అత్యాధునిక శిక్షణ లభిస్తుండటంతో ఆగ్నేయాసియా దేశాలకు చెందిన వైమానిక సంస్థలతోపాటు దేశీయ సంస్థలు కూడా భారత్‌లో శిక్షణ భాగస్వాములుగా ఉండేందుకు ఆసక్తి చూపుతున్నాయ న్నారు. ఎఫ్ఎస్టీసీని ప్రారంభించిన అనంతరం మంత్రి కేటీఆర్ సిమ్యులేటర్‌ను కాసేపు సరదాగా నడిపారు. 2011లో ఎఫ్ఎస్టీసీ ప్రస్థానం ప్రారంభం... వైమానిక రంగంలో ప్రాంతీయ శిక్షణా కేంద్రాన్ని ఏర్పాటు చేసే ఉద్దేశంతో ఏర్పాటైన ఎఫ్ఎస్టీసీ 2012లో ఎయిర్‌బస్ ఏ– 320, బోయింగ్ బి–737 సిమ్యులేటర్లను అందుబాటులోకి తెచ్చింది. కార్యకలాపాలను విస్తరించుకుంటూ 2015లో యూరోపియన్ ఏవియేషన్ సేఫ్టీ ఏజెన్సీ గుర్తింపు కూడా పొందింది. 2018లో హైదరాబాద్ శిక్షణ కేంద్రాన్ని శంకుస్థాపన చేయడంతోపాటు గుజరాత్ ఫ్లయింగ్ క్లబ్ నిర్వహణ బాధ్యతలు చేపట్టింది. ఇప్పటికే 1,100 మందికి శిక్షణ ఇచ్చిన ఎఫ్ఎస్టీసీ... హైదరాబాద్ శిక్షణా కేంద్రం ద్వారా దక్షిణాదిలో పైలట్ల శిక్షణ అవసరాలను తీరుస్తుందని అంచనా వేస్తున్నారు. -
విమానం నుంచి బయటికి పంపాలని నానా రభస..
విమానం హఠాత్తుగా నిలిపివేయడంతో వెంటనే మమ్మల్ని బయటికి పంపాలంటూ సిబ్బందిపై ప్రయాణికులు దౌర్జన్యం చేసిన వీడియో ఒకటి ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే.. ఎయిర్ ఇండియాకు చెందిన విమానం ఢిల్లీ నుంచి ముంబయికి గురువారం సాయంత్రం ప్రయాణికులతో బయలుదేరింది. కానీ కొద్ది సేపటికే ఇంజిన్‌లో సాంకేతికత లోపించడంతో విమానంలోని పైలట్ తిరిగి రన్‌వే మీదకు తీసుకువచ్చాడు. ఈ సమయంలో విమానంలో ఉన్న ప్రయాణికులు అసలేం జరిగిందో తెలుసుకోకుండా క్యాబిన్ క్రూ సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. అంతటితో ఊరుకోకుండా కాక్‌పిట్ డోర్‌ను పగలగొట్టడానికి ప్రయత్నించారు. 'ఒక ప్రయాణికుడు మేము ఎంత చెప్పినా వినకుండా ఇప్పుడు పైలట్ బయటికి రాకుంటే కాక్‌పిట్ డోరును బద్దలు కొడాతానంటూ నానా రభస చేశాడు. మరో మహిళ ఏకంగా మా సిబ్బందిలో ఒకరి చేయి పట్టుకొని వెంటనే మెయిన్ ఎగ్జిట్ గేట్‌ను తొందరగా ఓపెన్ చేయాలంటూ దురుసుగా ప్రవర్తించారు. అసలేం జరిగిందో తెలుసుకోకుండా ప్రయాణికులు ఇలా దౌర్జన్యం చేయడం మాకు చాలా బాధగా అనిపించిందంటూ' సిబ్బంది వాపోయారు. అయితే ఈ విషయం తెలుసుకున్న ఎయిర్‌లైన్స్ అధికారులు ప్రయాణికుల దురుసు ప్రవర్తనపై ఒక రిపోర్టును అందజేయాలంటూ విమాన సిబ్బందిని కోరింది.(వైరల్: అమ్మాయిల వేషధారణలో అబ్బాయిలు) 'ఇంజన్లో సాంకేతిక లోపం తలెత్తడంతో పైలట్ విమానాన్ని నిలిపివేశాడు. అంతమాత్రానికే ప్రయాణికులు ఇలా దౌర్జన్యం చేయడం ఏం బాలేదు. దీనిపై సిబ్బంది రిపోర్టు అందజేయగానే విచారణ నిర్వహిస్తాము.దురుసుగా ప్రవర్తించిన ప్రయాణికులపై చర్యలు తీసుకుంటామని' అధికారి పేర్కొన్నారు. అయితే ఈ వీడియో కాస్తా సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అది వైరల్‌గా మారింది. విమానం నిలిపివేయడానికి కారణం ఏంటో తెలుసుకోకుండా ప్రయాణికులు ప్రవర్తించిన తీరుపై నెటిజన్లు తీవ్రంగా మండిపడుతున్నారు. -
కాక్‌పిట్ తలుపులు పగలగొడతా
న్యూఢిల్లీ: ఎయిర్ ఇండియా సిబ్బందిని ప్రయాణికులు దూషించడంతోపాటు వారిపై దాడి చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గురువారం ఢిల్లీ–ముంబై వెళ్లాల్సిన ఎయిర్ ఇండియా ఏఐ865 అనే విమానం పలు సాంకేతిక కారణాలతో ఆలస్యమైంది. దీంతో ఆగ్రహం చెందిన ఆ విమానంలోని ఓ ప్రయాణికుడు పైలట్లను బయటకు రావాలని లేకపోతే కాక్‌పిట్ తలుపులు పగులగొట్టి లోపలికొస్తానని బెదిరించాడని సమాచారం. అలాగే ఒక మహిళా ప్రయాణికురాలు సిబ్బందిలోని ఓ వ్యక్తిపై దాడి చేసి ప్రధాన ద్వారం తెరవాల్సిందిగా ఒత్తిడి చేసినట్లు ఎయిర్‌లైన్స్ వర్గాలు తెలిపాయి. ఘటనపై తగు చర్యలు తీసుకోవాలని ఎయిర్ ఇండియా యోచిస్తోంది. -
కాక్‌పిట్‌లో కాఫీ తెచ్చిన తంటా..
విమాన ప్రయాణంలో ఒక్కోసారి అనుకోని సంఘటనలు తీవ్ర ఆందోళనకు దారి తీస్తూ వుంటాయి. తాజాగా కాక్‌పిట్ కంట్రోల్ ప్యానెల్లో వేడి వేడి కాఫీ ఒలకడంతో అకస్మాత్తుగా పొగలు వ్యాపించాయి. దీంతో ప్రయాణికులు సిబ్బంది గందరగోళానికి గురయ్యారు. చివరకు పైలట్ అప్రమత్తతో విమానం సురక్షితంగా ల్యాండ్ అయింది. ఫిబ్రవరి 6న చోటుచేసుకున్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఎయిర్ యాక్సిడెంట్స్ ఇన్వేస్టిగేషన్ బ్రాంచ్ వివరాల ప్రకారం కాండోర్ ఎయిర్‌బస్ ఏ330-243 విమానం జర్మనీలోని ఫ్రాంక్ఫర్ట్ నుంచి మెక్సికోలోని కాన్కున్కు 326 మంది ప్రయాణికులతో అట్లాంటిక్ సముద్రం మీదుగా ప్రయాణిస్తోంది. ఆ సమయంలో పైలట్ మూతలేకుండా ఇచ్చినటువంటి కాఫీని కప్ హోల్డర్‌లో కాకుండా ట్రేలో ఉంచాడు. అయితే ప్యానెల్మీద ప్రమాదవశాత్తు కాఫీ ఒలికిపోయింది. దీంతో ప్యానెల్ నుంచి కాలిన వాసన రావడంతో పాటు పొగలు రావడం మొదలైంది. వెంటనే కెప్టెన్ అప్రమత్తమై విమానాన్ని దారి మళ్లించి, షానన్ విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండ్ చేశాడు. ఈ ఘటనలో విమానంలోని 11 మంది సిబ్బంది సహా 326 మంది ప్రయాణికులందరూ క్షేమంగా ఉన్నారు. ఈ ఉదంతం అనంతరం అన్ని మార్గాల్లో ప్రయాణించే విమానాల్లో మూతలతో కూడిన కాఫీలు అందేలా చర్యలు తీసుకున్నట్లు థామస్ కుక్ గ్రూప్ అనుబంధ సంస్థ అయిన ఎయిర్‌లైన్స్ ప్రతినిధి ఒకరు వెల్లడించారు. అలాగే పైలట్లకు అందించే ద్రవాలతో జాగ్రత్తగా ఉండాలని సూచించినట్టు పేర్కొన్నారు. తమ ఇంజనీర్ల బృందం విమానం పూర్తిగా తనిఖీ చేసి మరమ్మతుల తరువాత, మాంచెస్టర్ మీదుగా విమానం గమ్యానికి చేరుకుందని, ఈ వ్యవహారంలో ప్రయాణికుల అసౌకర్యానికి క్షమాపణలు తెలిపారు. -
రూ.72 లక్షల జరిమానా.. జీవితకాల నిషేధం
లండన్: కాక్‌పిట్‌లోకి దూసుకెళ్లడానికి ప్రయత్నించడమే కాక.. విమనా సిబ్బందిపై దాడి చేసినందుకు గాను ఓ యువతిపై జీవితకాలం విమానయానం చేయకూడదంటూ నిషేధం విధించారు. వివరాలు.. చ్లోయి హైనెస్(22) అనే యువతి గత నెల 22న తన బామ్మతో కలిసి యూకే నుంచి టర్కీకి ప్రయాణిస్తుంది. ఈ క్రమంలో విమానం గాల్లో ఉండగా.. ఎమర్జెన్సీ ఎగ్జిట్‌ను తెరవడానికి, కాక్‌పిట్‌లోకి వెళ్లడానికి ప్రయత్నించింది. అడ్డుకోబోయిన ఇద్దరు సిబ్బంది మీద దాడి చేసి వారిని గాయపర్చింది. ఆపడానికి ప్రయత్నించిన ప్రయాణికులపై కూడ దాడి చేసింది. ఈ విషయం గురించి సదరు విమానయాన సంస్థ సీఈవో మాట్లాడుతూ.. ‘నా జీవితంలో ఇలాంటి ప్రయాణికురాలిని ఇంతవరకూ చూడలేదు. ఆమె చూడ్డానికి చాలా చిన్నగా ఉంది. కానీ చాలా బలవంతురాలు. ఆమె తీరు చూస్తే.. మా మీద యాసిడ్ పొయడానికి కూడా సిద్ధంగా ఉన్నట్లు తోచింది. ఆమె సృష్టించిన బీభత్సం వల్ల విమానాన్ని వెనక్కి తీసుకురావాల్సి వచ్చింది. కానీ ఆమె చేసిన పనికి తగిన మూల్యం చెల్లించక తప్పదు. ఆమె ప్రవర్తన వల్ల ప్రయాణికులు ఇబ్బంది పడటమే కాక.. డబ్బు కూడా వృథా అయ్యింది. ఆ మొత్తన్ని ఆమె నుంచి తిరిగి రాబడతాం. అందుకనే ఆమె మీద రూ. 72 లక్షల జరిమానాతో పాటు.. జీవితాంతం విమానంలో ప్రయాణించకుండా నిషేధం విధించామ’ని తెలిపాడు. -
మద్యం తాగి కాక్‌పిట్‌లో ప్రయాణం
సాక్షి బెంగళూరు: విధుల్లో లేకపోయినా మద్యం తాగి వచ్చి కాక్‌పిట్‌లో ప్రయాణించిన ఓ పైలట్‌ను ఎయిర్ ఇండియా సంస్థ మూడు నెలల పాటు విధుల నుంచి తొలగించింది. ఈ నెల 13వ తేదీన ఢిల్లీ నుంచి బెంగళూరుకు వచ్చిన ఎయిర్ ఇండియా విమానంలో జితేంద్రసింగ్ అనే పైలట్ సాధారణ ప్రయాణికునిలా వచ్చాడు. అయితే ప్రయాణికుల రద్దీ వల్ల సీటు లేకపోవడంతో కో పైలట్ స్థానంలో అతడు కూర్చుని బెంగళూరుకు చేరుకున్నాడు. అతడు అప్పటికే మద్యం సేవించి ఉన్నాడు. బెంగళూరు చేరుకోగానే విమానాశ్రయ అధికారులు కాక్‌పిట్‌లో పరీక్షలు చేయగా జితేంద్రసింగ్ మద్యం మత్తులో ఉన్నట్లు తేలింది. మద్యం సేవించి కోపైలట్ సీటులో కూర్చోవడం నిబంధనల ఉల్లంఘనే అని నిర్ధారించి మూడు నెలల పాటు సస్పెండ్ చేశారు. మద్యం తాగి ప్రయాణించవచ్చు, కానీ కాక్‌పిట్‌లో కూర్చోకూడదనే నిబంధనలు ఉన్నట్లు ఎయిర్‌పోర్టు అధికారులు తెలిపారు. -
కాక్‌పిట్‌లోనే.. అలా దొరికిపోయాడు
బీజింగ్ : గాలిలో (విమాన) ప్రయాణమంటే...మన జీవితం గాల్లో దీపం లాంటిదే అని భయపడిపోతున్న విమాన ప్రయాణికుల వెన్నులో వణుకుపుట్టించే వీడియో ఒకటి తాజాగా వెలుగులోకి వచ్చింది. విమానం గాల్లో ఉండగానే పైలట్ నిద్రపోయాడు. అయితే అదృష్టవశాత్తూ ఎలాంటి ప్రమాదం జరగలేదు. దీంతో అధికారులు, ప్రయాణీకులు ఊపిరి పీల్చుకున్నారు. లేదంటే మానవ తప్పిదానికి భారీ మూల్యం చెల్లించాల్సి వచ్చేది. చైనాలో బుధవారంలో ఈ ఘటన చేటుకుంది. బోయింగ్ 747 విమానం 35వేల అడుగుల ఎత్తున ఎగురుతున్న సమయంలో కాక్‌పిట్‌లో పైలట్ ఉన్నట్టుండి నిద్రపోయాడు. పక్కనే కో పైలట్ మౌనంగా ఉండిపోయాడు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్లో వైరల్‌గా మారింది. ఈ సంఘటనపై చైనా విమానయాన అధికారులు తక్షణమే స్పందించారు. పైలట్లు ఇద్దరినీ తొలగిస్తున్నట్టు ప్రకటించారు. తైవాన్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన పైలట్ వెంగ్ జియాఘిగా ఇతణ్ని గుర్తించారు. అలసిపోవడం సహజమే అయినా..20 సంవత్సరాల అనుభవం వున్న సీనియర్ పైలట్‌గా బాధ్యతాయుతంగా ప్రవర్తించాలని ఎయిర్‌లైన్స్ అధికారులు వ్యాఖ్యానించారు. కనీసం క్రూ మెంబర్స్ కైనా సమాచారం అందించి వుండాల్సిందని పేర్కొన్నారు. కాగా వాతావరణం అనుకూలించకపోవడం, సాంకేతిక లోపాలకుతోడు సెల్ఫీ మోజులో లేదా సిగరెట్ ముట్టించిన కారణంగా సంభవించిన ఘోర విమాన ప్రమాదాలు భారీ విషాదాన్ని నింపుతున్న తెలిసిందే. ఒక్క సిగరెట్.. 51 మందిని బలి తీసుకుంది -
ఒక్క సిగరెట్.. 51 మందిని బలి తీసుకుంది
కఠ్మాండు : గతేడాది మార్చిలో నేపాల్ రాజధాని కఠ్మాండూ అంతర్జాతీయ విమానాశ్రయంలో జరిగిన ప్రమాదంలో 51 మంది చనిపోయిన సంగతి తెలిసిందే. అయితే ఏడాది తర్వాత ఈ ప్రమాదానికి గల కారణాలు వెలుగులోకి వచ్చాయి. విమానం నడుపుతున్న పైలెట్ కాక్‌పిట్‌లో సిగరెట్ తాగడం వల్ల ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు విచారణలో తేల్చారు. అయితే ప్రమాదం జరిగిన సమయంలో ఇందుకు గల కారణాలు తెలియరాలేదు. దీంతో అధికారులు దర్యాప్తు కోసం ప్రత్యేక ప్యానెల్‌ను ఏర్పాటు చేశారు. విచారణలో భాగంగా ప్యానెల్.. కాక్‌పిట్ వాయిస్ రికార్డర్‌ను పరిశీలించింది. విమానం నడుపుతున్న సమయంలో పైలట్ నిబంధనలకు విరుద్ధంగా కాక్‌పిట్‌లోనే పొగ తాగినట్లు అధికారులు గుర్తించారు. కాక్‌పిట్‌లోని సిబ్బంది నిర్లక్ష్యం, ల్యాండింగ్ సమయంలో పరిస్థితిపై అవగాహన కోల్పోవడం కారణంగా ఈ ప్రమాదం జరిగినట్లు నిర్ధారించారు. గతేడాది మార్చిలో యూఎస్–బంగ్లా ఎయిర్‌లైన్స్‌కు చెందిన బాంబార్డియర్ డాష్ 8 క్యూ 400 విమానం 67 మంది ప్రయాణికులు, నలుగురు సిబ్బందితో బంగ్లాదేశ్ రాజధాని ఢాకా నుంచి కఠ్మాండుకు బయల్దేరింది. నేపాల్ కాలమానం ప్రకారం మధ్యాహ్నం 2.20 గంటల సమయంలో కఠ్మాండు ఎయిర్‌పోర్టులో దిగుతుండగా ఈ ఘోరం జరిగింది. ఈ ప్రమాదంలో నలుగురు సిబ్బంది సహా 51 మంది చనిపోయారు. ప్రమాదం జరిగిన సమయంలో విమానంలో మొత్తం 67మంది ఉన్నారు. -
కాక్‌పిట్‌లో నిద్రపోయిన పైలెట్.. ఆ తర్వాత
కాన్బెర్రా : ప్రయాణిలకులు కునుకు తీస్తే ఏం కాదు.. మహా అయితే దిగాల్సిన చోట కాకుండా మరో చోట దిగుతారు. అదే డ్రైవర్ నిద్రపోతే.. ఇంకేమైనా ఉందా.. అందరి ప్రాణాలు గాల్లోకి. ఇలాంటి సంఘటనే ఒకటి ఆస్ట్రేలియాలో చోటు చేసుకుంది. అయితే ఇక్కడ నిద్ర పోయింది డ్రైవర్ కాదు పైలెట్. అవును విమానం నడపాల్సిన పైలెట్ కాస్తా వెళ్లి కాక్‌పిట్‌లో ఆదమరిచి నిద్ర పోయాడు. ఆనక తీరిగ్గా లేచి విమానాన్ని ల్యాండ్ చేశాడు. దాంతో ఆ విమానం గమ్యస్థానాన్ని దాటి అదనంగా మరో 50 కిలోమీటర్ల దూరం ప్రయాణించింది. అయితే అదృష్టవశాత్తు ఎలాంటి ప్రమాదానికి గురి కాకుండా భద్రంగా ల్యాండ్ అయ్యింది. ఈ నెల 8న ఆస్ట్రేలియాలో జరిగిన ఈ సంఘటన కాస్తా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పైపర్ పీఏ-31 ఎయిర్‌క్రాఫ్ట్ దేవన్‌పోర్ట్ నుంచి టాస్మానియాలోని కింగ్ ఐస్లాండ్ వెళ్లేందుకు గాల్లోకి ఎగిరింది. అయితే కొంత దూరం ప్రయాణించిన తర్వాత పైలట్ నెమ్మదిగా నిద్రలోకి జారుకున్నాడు. మెలకువ వచ్చిన తర్వాత లేచి విమానాన్ని సురక్షితంగా ల్యాండ్ చేశాడు. అయితే అప్పటికే ఆ విమానం గమ్యస్థానాన్ని దాటి మరో 50 కిలోమీటర్ల దూరం అదనంగా ప్రయాణించింది. అధికారులు ఈ ఘటనకు సంబంధించిన వివరాలను వెల్లడించలేదు. ఈ విషయం గురించి దర్యాప్తు చేస్తున్నట్లు ఆస్ట్రేలియా ట్రాన్స్పోర్ట్ సేఫ్టీ బ్యూరో(ఏటీఎస్బీ) తెలిపింది. పైలట్‌ను విచారించి, ఆపరేటింగ్ విధానాలను పరీక్షించిన తర్వాత ఘటనకు సంబంధించిన దర్యాప్తు నివేదికను విడుదల చేస్తామని ఏటీఎస్బీ పేర్కొంది. గతేడాది మెల్బోర్న్ నుంచి గాల్లోకి ఎగిరిన విమానం కింగ్ ఐస్లాండ్ వెళ్లే క్రమంలో క్రాష్ కావడంతో ఐదుగురు మృతిచెందిన సంగతి తెలిసిందే. -
ఆకాశంలో విమానం : కాక్‌పిట్‌లో టెన్షన్
న్యూఢిల్లీ : విమానం గగనతలంలో ఉన్నప్పుడు ఏ సంఘటన జరిగినా అది అత్యంత ప్రమాదమే. విమానంలో ఉన్న ప్రయాణికులందరి ప్రాణాలు ఆ గాల్లోనే కలిసిపోతాయి. తాజాగా ఓ ఎయిరిండియా విమానం ఆకాశంలో ఎగురుతూ ఉండగానే ఓ వ్యక్తి, విమానాన్ని నియంత్రించే అత్యంత కీలకమైన వ్యవస్థ కాక్‌పిట్‌లోకి ప్రవేశించేందుకు ప్రయత్నించి తెగ రచ్చ రచ్చ చేశాడు. దీంతో ఎయిరిండియా విమానంలో తీవ్ర ఆందోళన నెలకొంది. విమానంలో ఉన్న 250 మంది ప్రయాణికులు తీవ్ర టెన్షన్‌కు గురయ్యారు. మిలాన్ నుంచి ఎయిరిండియా విమానం ఏఐ 138 న్యూఢిల్లీకి బయలుదేరింది. గుర్ప్రీత్ సింగ్ అనే ప్రయాణికుడు ఒక్కసారిగా కాక్‌పిట్‌లోకి ప్రవేశించేందుకు ప్రయత్నించాడు. దీంతో గాల్లో ఉండగానే రూట్ మార్చేసిన విమానం తిరిగి మిలాన్ వెళ్లిపోయింది. మిలాన్‌లో ల్యాండ్ అయిన వెంటనే ఆ ప్రయాణికుడిని స్థానిక పోలీసులకు అప్పజెప్పింది. వెంటనే ఆ వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనుకున్న సమయానికే మిలాన్ నుంచి ఈ విమానం టేకాఫ్ అయినప్పటికీ, ఓ విచిత్ర ప్రయాణికులు కాక్ పిట్లోకి ప్రవేశించేందుకు ప్రయత్నించాడని ఎయిరిండియా పేర్కొంది. అప్పటికే విమానం గంటకు పైగా ప్రయాణించిందని తెలిపింది. ఈ గందరగోళంతో తిరిగి మిలాన్ వెళ్లాలని నిర్ణయించాం. ఇలా రెండు గంటల 37 నిమిషాల పాటు విమానం ఆలస్యమైంది. ఢిల్లీకి వెళ్లడానికి మళ్లీ సెక్యురిటీ క్లియరెన్స్ ఇచ్చిన తర్వాతనే ఎయిర్‌క్రాఫ్ట్ తిరిగి బయలుదేరిందని ఎయిరిండియా ప్రకటన చేసింది. -
కాక్‌పిట్‌లో గొడవ: ఆ పైలెట్లకు డీజీసీఏ షాక్!
సాక్షి, న్యూఢిల్లీ: విమానంలో కాక్‌పిట్‌లో గొడవపడి ప్రయాణికుల ప్రాణాలను నిర్లక్ష్యం చేసిన ఇద్దరు పైలెట్ల లైసెన్స్ లను డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) రద్దు చేసింది. ఈ మేరకు మంగళవారం ఈ నిర్ణయం వెలువడింది. నూతన సంవత్సరం రోజున లండన్- ముంబయి జెట్ ఎయిర్ వేస్ విమానం ప్రయాణిస్తుండగా.. ఏమైందో తెలియదు కానీ ఇద్దరు పైలెట్లు తమ బాధ్యతలను గాలికొదిలి కాక్‌పిట్‌లో గొడవకు దిగారు. ఈ ఘటనపై విచారణ చేపట్టిన డీజీసీఏ ఇద్దరు పైలెట్లను తాత్కాలికంగా విధుల నుంచి తప్పించడంతో పాటు వారి లైసెన్స్ ను ఐదేళ్లపాటు రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. 14 మంది సిబ్బంది సహా 324 మందితో బయలుదేరిన 9డబ్ల్యూ 119 జెట్ ఎయిర్ వేస్ విమానంలో కో పైలెట్, మహిళా కమాండర్ పై చేయి చేసుకున్నాడు. ఆపై మహిళా ఉద్యోగిని ఏడుస్తూ క్యాబిన్ నుంచి బయటకు వచ్చిన విషయం తెలిసిందే. కో పైలెట్ సైతం విధులు నిర్వహించకుండా ప్రయాణికులను ఇబ్బందులకు గురిచేశాడు. కాక్‌పిట్‌లో జరిగిన గొడవను సీరియస్‌గా తీసుకున్న ఉన్నతాధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. -
దీపికా పడుకోన్
ఉమన్ నమః శిక్షణలో ఉన్న భారతీయ వైమానిక దళం కెప్టెన్ పక్కన కాక్‌పిట్‌లో దీపికా పడుకోన్ అతిథిగా ఆశీనురాలై ఉంటే కనుక ఆ కొద్ది నిమిషాలూ విమానం ఎన్ని ఆహ్లాదకరమైన చక్కర్లు కొట్టగలదో, ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌లో చేరడం కోసం పరీక్ష రాస్తున్న ఇంజినీరింగ్ విద్యార్థుల హృదయాలు కూడా ప్రశ్నపత్రంలో ఒక్కసారిగా దీపిక కనిపించగానే కొన్ని క్షణాలపాటు అంతకుమించిన ఉల్లాసంతో రెపరెపమని అన్ని చక్కర్లూ కొట్టే ఉంటాయి! ‘2016లో ఏ చిత్రానికి దీపికా పడుకోన్ ఫిల్మ్‌ఫేర్ అవార్డు అందుకున్నారు?’ అన్నది ఆ క్వశ్చన్ పేపర్లోని ఒక ప్రశ్న. ప్రపంచంలోనే అత్యధికంగా పారితోషికం తీసుకుంటున్న తొలి పది మందిలో దీపికా పడుకోన్ ఒకరు. ఇప్పుడీ విద్యార్థులు సాధించబోయే ఆలిండియా ర్యాంకుకు కూడా ఆమె ఒక ‘మార్కు’ అవడం.. జీవన సాఫల్య పురస్కారానికి ఆమెను క్రమంగా దగ్గర చేసే ఒక ఘనతే! -
గాల్లో కార్తీ!
‘పోదాం... పెకైగిరిపోదాం...’ అంటూ ‘ఊపిరి’లో సందడి చేసిన కార్తీ ఇప్పుడు నిజంగా గాల్లో ఎగరడానికి శ్రద్ధగా ట్రైనింగ్ తీసుకుంటున్నారు. ఎందుకూ అనుకుంటున్నారా? మణిరత్నం దర్శకత్వంలో రూపొందనున్న తాజా చిత్రంలో కార్తీ హీరోగా నటించనున్న విషయం తెలిసిందే. ఇందులో కార్తీ పైలట్ పాత్ర పోషిస్తున్నారు. దీని కోసమే పైలట్‌గా శిక్షణ తీసుకోవడానికి రెండు వారాల క్రాష్ కోర్సులో చేరిపోయారు కార్తీ. ఈ ట్రైనింగ్ తర్వాత కార్తీ విమానం నడిపేస్తారనుకుంటే పొరపాటే. ఆ స్థాయిలో శిక్షణ తీసుకోవడం లేదు. జస్ట్ కొన్ని మెలకువలు నేర్చుంటుకుంటున్నారట. కాక్‌పిట్‌లో పైలట్ ఎలా కూర్చుంటాడు? అతని బాడీ లాంగ్వేజ్ ఎలా ఉంటుంది? వంటి పలు విషయాల మీద ట్రైనింగ్ తీసుకుంటున్నారు. రెండు వారాల్లో శిక్షణ పూర్తయ్యాక షూటింగ్ మొదలుపెడతారట. -
ఫ్లైట్‌లో జిహాద్ అంటూ కాక్ పీట్ వైపు దూసుకెళ్లి..
అలెగ్జాండ్రియా(వర్జీనియా): విమానం వెళుతుండగా జిహాద్ అంటూ అరుస్తూ కాక్‌పీట్‌లోకి వెళ్లేందుకు ప్రయత్నించిన వ్యక్తికి అమెరికా కోర్టు తొమ్మిది నెలల జైలు శిక్షను విధించింది. గత ఏడాది మార్చి 2015న 36 ఏళ్ల డేవిడ్ ప్యాట్రిక్ డియాజ్ అనే వ్యక్తి డల్లెస్ నుంచి డెన్వెర్కు బయలుదేరాడు. తొలుత అందరితోపాటు కుదురుగా కూర్చున్న అతడు ఫ్లైట్ బయలుదేరి గగనతలానికి వెళ్లిన కాసేపటికి జిహాద్ అంటూ బిగ్గరగా కేకలు పెడుతూ కాక్ పీట్లోకి ప్రవేశించేందుకు ప్రయత్నించాడు. దీంతో ఒక్కసారిగా ఉలిక్కిపడిన సిబ్బంది ఉన్నపలంగా అతడిని బంధించి తిరిగి విమానాన్ని వెనక్కితిప్పి వర్జీనియాలోని డల్లెస్ ఎయిర్ పోర్ట్ లో దింపేశారు. అనంతరం అతడిని అరెస్టు చేశారు. అయితే, అతడి తరుపు న్యాయవాది అలెగ్జాండ్రియా కోర్టులో వాదిస్తూ అతడు ఆ సమయంలో మద్యం సేవించిన కారణంగా మానసికంగా బలహీనుడయ్యాడని అందుకే అలా ప్రవర్తించాడని చెప్పారు. అయితే, ఎయిర్ లైన్స్ తరుపు న్యాయవాది మాత్రం అతడికి కనీసం 21 నెలలు జైలు శిక్ష విధించాలని కోరారు. కాగా, న్యాయమూర్తి మాత్రం తొమ్మిది నెలల శిక్ష విధించడంతోపాటు 22 వేల డాలర్ల ఫైన్ వేశారు. -
కాక్‌పిట్‌లో చాటింగ్..పైలెట్ సస్పెన్షన్
ఆన్ లైన్లోనే ఎక్కువ సమయం గడపాలన్న మోజు.. ఓ పైలెట్ సస్పెన్షన్ కు దారితీసింది. విధి నిర్వహణలో ఉన్న సమయంలో తాను చేస్తున్న పనిని అందరికి చూపించాలన్న అతగాడి ఆతురత కొంపముంచింది. సదరు పైలెట్ విమానం టేక్ ఆఫ్ అయ్యే సమయంలో కూడా కాక్ పిట్ నుంచి లైవ్ వీడియోలో చాటింగ్ చేశాడు. దీనికి సంబంధించి యూనిఫాం ధరించి, సన్‌గ్లాసెస్ పెట్టుకుని ఉన్న పైలెట్ ఫోటోలు, వీడియోలు చైనీస్ ట్విట్టర్(వీబో)లో చక్కర్లు కొట్టాయి. అయ్యాగారి ఘనకార్యానికి సోషల్ మీడియాలో ఓ వర్గం అతడిని పొగడ్తలతో ముంచెత్తితో మరో వర్గం మాత్రం విమాన ప్రయాణ సమయంలో ఇలాంటి పనులేంటని విమర్శించింది. ఆ ఫోటోలు ఆన్లైన్లో చక్కర్లు కొట్టడంతో అతనికి ఏకంగా 6వేలమంది కొత్తవారు ఫాలోవర్లుగా మారారు. అయితే ప్రయాణికుల రక్షణ గాలికొదిలేసి వెధవ వేషాలు వేసినందుకు పైలెట్ ను ఉద్యోగం నుంచి తీసేయాలని మరోవర్గం గట్టిగా డిమాండ్ చేసింది. తీవ్రస్థాయిలో విమర్శలు వెల్లువెత్తడంతో విమనాయాన సంస్థ ఎయిర్ చైనా దీనిపై వివరణ ఇచ్చుకుని అయ్యగారిపై సస్పెన్షన్ వేటు వేసింది.