కాక్‌పిట్‌ తలుపులు పగలగొడతా | Passengers threaten to open cockpit door on AI flight | Sakshi
Sakshi News home page

కాక్‌పిట్‌ తలుపులు పగలగొడతా

Published Sun, Jan 5 2020 2:43 AM | Last Updated on Sun, Jan 5 2020 2:43 AM

Passengers threaten to open cockpit door on AI flight - Sakshi

న్యూఢిల్లీ: ఎయిర్‌ ఇండియా సిబ్బందిని ప్రయాణికులు దూషించడంతోపాటు వారిపై దాడి చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గురువారం ఢిల్లీ–ముంబై వెళ్లాల్సిన ఎయిర్‌ ఇండియా ఏఐ865 అనే విమానం పలు సాంకేతిక కారణాలతో ఆలస్యమైంది. దీంతో ఆగ్రహం చెందిన ఆ విమానంలోని ఓ ప్రయాణికుడు పైలట్‌లను బయటకు రావాలని లేకపోతే కాక్‌పిట్‌ తలుపులు పగులగొట్టి లోపలికొస్తానని బెదిరించాడని సమాచారం. అలాగే ఒక మహిళా ప్రయాణికురాలు సిబ్బందిలోని ఓ వ్యక్తిపై దాడి చేసి ప్రధాన ద్వారం తెరవాల్సిందిగా ఒత్తిడి చేసినట్లు ఎయిర్‌లైన్స్‌ వర్గాలు తెలిపాయి.  ఘటనపై తగు చర్యలు తీసుకోవాలని ఎయిర్‌ ఇండియా యోచిస్తోంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement