attak
-
Madhya Pradesh: ఆర్మీ అధికారులపై దుండగుల దాడి.. ఒకరిపై అత్యాచారం
భోపాల్: మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో దారుణం చోటు చేసుకుంది. ఇద్దరు స్నేహితురాళ్లతో కలిసి మరో ఇద్దరు యువ ఆర్మీ అధికారులపై గుర్తు తెలియని దుండగులు తీవ్రంగా దాడిచేశారు. దోపిడీ చేయడానికి వచ్చిన దుండగులు.. వారిపై దాడి చేసి ఓ మహిళా అధికారిణిపై అత్యాచారం చేసినట్లు బద్గొండ పోలీస్ స్టేషన్ ఇన్ఛార్జ్ లోకేంద్ర సింగ్ హిరోర్ తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మోవ్ ఆర్మీ కాలేజీలో శిక్షణ తీసుకుంటున్న అధికారులు మంగళవారం జామ్‌లోని ఫైరింగ్ రేంజ్ సమీపంలో మహిళలతో కలిసి బయటకు వెళ్లారు. అకస్మాత్తుగా ఎనిమిది మంది దుండగులు తుపాకులు, కత్తులు కర్రలతో వారిని చుట్టుముట్టారు. ట్రైనీ ఆఫీసర్లు, మహిళల డబ్బు, వస్తువులను దోచుకునే ముందు వారిపై దాడి చేశారు. ఒక మహిళను, మరో ఆర్వీ అధికారిని బందీలుగా పట్టుకుని.. మిగతా ఇద్దరు రూ.10 లక్షల ఇవ్వాలని అలాఅయితే వారివద్ద ఉన్న అధికారులను వదిపెడతామని డిమాండ్ చేశారు. ట్రైనింగ్ సెంటర్ వెళ్లిన యువ అధికారులు మోవ్ ఆర్మీ కాలేజీ అధికారులు, పోలీసులకు సమాచారం అధించారు. దీంతో పోలీసులను అప్రమత్తమై.. సంఘటనా స్థలానికి చేరుకున్నారు. పోలీసులు రావటాన్ని గమనించిన దుండగులు అక్కడి నుంచి పారిపోయారు. గాయపడిన నలుగురినీ వైద్య పరీక్షల నిమిత్తం మోవ్ సివిల్ ఆసుపత్రికి తరలించారు. ఇద్దరు అధికారులు గాయపడినట్లు డాక్టర్లు తెలిపారు. అదేవిధంగా వైద్య పరీక్షల్లో ఒక మహిళపై అత్యాచారం జరిగినట్లు తెలిసిందని బద్గొండ పోలీస్ స్టేషన్ ఇన్ఛార్జ్ లోకేంద్ర సింగ్ హిరోర్ తెలిపారు. నిందితుల్లో ఇద్దరిని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. నిందితుల్లో ఒకరికి గతంలో నేర చరిత్ర ఉన్నట్లు పేర్కొన్నారు. నాలుగు పోలీసు స్టేషన్లకు చెందిన సిబ్బంది రంగంలోకి దిగి నేరస్తుల కోసం గాలింపు చేపట్టినట్లు పోలీసులు చెప్పారు.చదవండి: ప్రజ్వల్‌కు చీర చిక్కు -
సైకో భర్త.. రెండో భార్యను కొట్టి.. కుమారుడికి కరెంటు పెట్టి..
దర్శి(ప్రకాశం జిల్లా): స్థానిక పొదిలి రోడ్డులో నివాసముంటున్న రమణారెడ్డి తన రెండో భార్య కెజియా, కుమారుడు రేవంత్‌పై ఆదివారం రాత్రి హత్యాయత్నానికి పాల్పడ్డాడు. రెండో భార్య ఫిర్యాదు మేరకు నిందితుడిపై ఎస్సీఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసినట్లు ఎస్సై చంద్రశేఖర్ తెలిపారు. ఎస్సై కథనం ప్రకారం పొదిలి మండలం సూదనగుంట రామాపురానికి చెందిన రమణారెడ్డికి పదేళ్ల క్రితం తన అక్క కుమార్తెతో వివాహమైంది. వారికి ఒకరు సంతానం కలిగారు. అయితే దొనకొండ మండలం నారసింహనాయునిపల్లె గ్రామానికి చెందిన దారం కెజియాను ప్రేమ పేరుతో ఏడేళ్ల క్రితం వివాహం చేసుకున్న రమణారెడ్డి దర్శిలోని పొదిలి రోడ్డులో కాపురం పెట్టాడు. చదవండి: యువతి పరిచయం.. భార్యకు విడాకులు ఇచ్చేశానని నమ్మబలికి.. వీరికి ఆరేళ్ల కుమారుడు రేవంత్ ఉన్నాడు. రమణారెడ్డి దర్శిలో సినిమా హాలు లీజుకు తీసుకుని నిర్వహిస్తున్నాడు. భార్యపై అనుమానంతో మద్యం తాగి తరచూ గొడవపడుతుండేవాడు. ఐదు రోజులుగా ఇద్దరి మధ్య గొడవలు ఎక్కువయ్యాయి. ఆదివారం రాత్రి పూటుగా మద్యం తాగి భార్యతో గొడవపడటమే కాకుండా ఆమెను హత్య చేసేందుకు ప్రయతి్నంచాడు. కుమారుడు రేవంత్‌ను గొంతు నులిమి చంపేందుకు ప్రయత్నించడంతోపాటు బాలుడి శరీరానికి విద్యుత్ తీగలు చుట్టి హత్యాయత్నానికి పాల్పడ్డాడు. బాలుని కేకలతో ఇంటి యజమాని, చుట్టు పక్కల వారు అక్కడికి రావడంతో రమణారెడ్డి పరారయ్యాడు. కెజియా, రేవంత్‌ను చికిత్స నిమిత్తం దర్శి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు ఎస్సీఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. -
నోట్ల రద్దు ‘అసంఘటితం’పై శరాఘాతం
న్యూఢిల్లీ: నోట్ల రద్దు భారత అసంఘటిత రంగంపై దాడి అని, దీనిపై సమైక్యంగా పోరాడాల్సిన అవసరం ఉందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. పెద్ద నోట్ల రద్దు నిర్ణయం దేశంలోని పేద ప్రజలు, రైతాంగం, అసంఘటిత రంగకార్మికులపై, చిన్నాచితకా దుకాణదారులపై తీవ్రమైన దాడి అని ఆరోపించారు. సామాజిక మాధ్యమాల్లో రాహుల్ వెలువరిస్తోన్న వీడియో సిరీస్ ద్వితీయ భాగంలో ఆయన భారత ఆర్థిక వ్యవస్థపై మాట్లాడారు. ప్రధాని మోదీ దేశాన్ని నగదు రహిత ఆర్థిక వ్యవస్థగా మార్చాలని భావిస్తున్నారని, కానీ పేదలు, రైతులు, కార్మికులు చిన్న వ్యాపారులు, అసంఘటితరంగ కార్మికులంతా నగదుపైనే ఆధారపడి ఉన్నారని రాహుల్ వ్యాఖ్యానించారు. మోదీ చెప్పినట్టు నోట్ల రద్దు కారణంగా నల్లధనం బయటకు రాలేదనీ, పేదప్రజలు లబ్ధిపొందిందీ లేదని, దీనివల్ల సంపన్నులకే మేలు జరిగిందని రాహుల్ అన్నారు. -
కోవిడ్ మృతులు 1,665
బీజింగ్/న్యూఢిల్లీ: ప్రాణాంతక ‘కోవిడ్–19’ విజృంభణ కొనసాగుతోంది. చైనాలో ఈ వైరస్ కారణంగా మృతిచెందిన వారి సంఖ్య 1,665కి చేరింది. ఈ మరణాల్లో అత్యధికం తొలుత ఈ వైరస్‌ను గుర్తించిన వుహాన్ నగరం ఉన్న హుబే ప్రావిన్స్‌లోనే చోటు చేసుకున్నాయి. శనివారం చనిపోయిన 142 మందిలో 139 మంది ఆ రాష్ట్రంలోనే మరణించారు. అలాగే, మొత్తం నిర్ధారిత కేసుల సంఖ్య 68,500కు పెరగగా, వాటిలో 56,249 కేసులు హుబే ప్రావిన్స్‌లోనివే. వీటిలో శనివారం ఒక్కరోజే నిర్ధారించిన కేసుల సంఖ్య 1,843. అయితే, కొత్తగా వైరస్ సోకుతున్నవారి సంఖ్య క్రమంగా తగ్గుతోందని అధికారులు చెప్పారు. ఇప్పటివరకు దాదాపు 1700 మంది వైద్య సిబ్బందికి ఈ వైరస్ సోకగా ఆరుగురు చనిపోయారు. కరెన్సీ ద్వారా కూడా ఈ వైరస్ వ్యాప్తి చెందే అవకాశమున్న నేపథ్యంలో.. నోట్లు, నాణేలను కొన్ని రోజుల పాటు వాడకుండా పక్కనబెట్టి, వాటిపై అతినీలలోహిత కిరణాలను ప్రసరింపచేసి, ఆ తరువాత మళ్లీ సర్క్యులేషన్లోకి పంపిస్తున్నారు. పాన్ తీరంలో నిలిపేసిన ‘డైమండ్ ప్రిన్సెస్’ నౌకలో కోవిడ్–19 సోకిన వారి సంఖ్య ఆదివారానికి 355కి పెరిగింది. అందులోభారత్ సహా 50 దేశాలకు చెందిన 3700 మంది ఉన్నారు. ఆ నౌకలో నుంచి తమ వారిని తీసుకువెళ్లేందుకు అమెరికా, కెనడా సహా పలు దేశాలు ప్రయత్నాలు ప్రారంభించాయి. కోవిడ్–19పై పోరులో చైనాకు అన్ని రకాలుగా సహకరిస్తామని భారత్ మరోసారి చెప్పింది. భారత్ త్వరలో ఔషధాలను పంపించనుందని చైనాలో భారతీయ రాయబారి విక్రమ్ మిస్రీ తెలిపారు. -
బిజీ బిజీ
బాలీవుడ్ ‘ఎటాక్’లో జాయిన్ అయ్యారు రకుల్‌ప్రీత్ సింగ్. జాన్ అబ్రహాం హీరోగా లక్ష్యరాజ్ దర్శకత్వంలో హిందీలో ‘ఎటాక్’ అనే చిత్రం తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఇందులో జాక్వెలిన్ ఫెర్నాండెజ్, రకుల్‌ప్రీత్ సింగ్ కథానాయికలుగా నటిస్తున్నారు. 2008లో ఢిల్లీలో జరిగిన ఓ ఉగ్రవాద దాడి ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతోందని తెలిసింది. ఇందులో ఆర్మీ ఆఫీసర్‌గా నటిస్తున్నారు జాన్ అబ్రహాం. గత ఏడాది డిసెంబరులో ఈ సినిమా చిత్రీకరణ ప్రారంభమైన సంగతి తెలిసిందే. తాజాగా ఈ సినిమా షూటింగ్లో జాయిన్ అయ్యారు రకుల్‌ప్రీత్ సింగ్. ప్రస్తుతం జాన్ , రకుల్‌పై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ‘ఎటాక్’ చిత్రం ఈ ఏడాదే విడుదల కానుంది. మరోవైపు అజయ్ దేవగన్–సిద్దార్థ్ మల్హోత్రా, అర్జున్ కపూర్ హీరోలుగా నటిస్తున్న చిత్రాల్లో రకుల్ కథానాయికగా చాన్స్ కొట్టేశారు. ఈ మూడు సినిమాలతో రకుల్ ఈ ఏడాది బాలీవుడ్లో బిజీ బిజీ. -
కాక్‌పిట్ తలుపులు పగలగొడతా
న్యూఢిల్లీ: ఎయిర్ ఇండియా సిబ్బందిని ప్రయాణికులు దూషించడంతోపాటు వారిపై దాడి చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గురువారం ఢిల్లీ–ముంబై వెళ్లాల్సిన ఎయిర్ ఇండియా ఏఐ865 అనే విమానం పలు సాంకేతిక కారణాలతో ఆలస్యమైంది. దీంతో ఆగ్రహం చెందిన ఆ విమానంలోని ఓ ప్రయాణికుడు పైలట్లను బయటకు రావాలని లేకపోతే కాక్‌పిట్ తలుపులు పగులగొట్టి లోపలికొస్తానని బెదిరించాడని సమాచారం. అలాగే ఒక మహిళా ప్రయాణికురాలు సిబ్బందిలోని ఓ వ్యక్తిపై దాడి చేసి ప్రధాన ద్వారం తెరవాల్సిందిగా ఒత్తిడి చేసినట్లు ఎయిర్‌లైన్స్ వర్గాలు తెలిపాయి. ఘటనపై తగు చర్యలు తీసుకోవాలని ఎయిర్ ఇండియా యోచిస్తోంది. -
రకుల్ ఎటాక్
బాలీవుడ్‌పై హీరోయిన్ రకుల్‌ప్రీత్ సింగ్ ‘ఎటాక్’ చేసినట్లున్నారు. వరుస అవకాశాలను ఖాతాలో వేసుకుంటూ బాలీవుడ్లో కెరీర్ గ్రాఫ్‌ను పెంచుకుంటున్నారు. ఈ ఏడాది ఇప్పటికే దేదే ప్యార్ దే, మర్జావాన్ చిత్రాల్లో హిందీ తెరపై కనిపించారు. ఇటీవల అర్జున్ కపూర్ సరసన ఓ సినిమా అంగీకరించారు. ఇప్పుడు జాన్ అబ్రహాం హీరోగా హిందీలో తెరకెక్కనున్న ‘ఎటాక్’ సినిమాకి సైన్ చేశారు. లక్ష్యరాజ్ ఆనంద్ ఈ సినిమాతో దర్శకునిగా పరిచయం అవుతున్నారు. ఈ చిత్రంలో రకుల్ ఓ కథానాయికగా నటించనున్నారు. మరో నాయికగా జాక్వెలిన్ ఫెర్నాండెజ్ నటిస్తారు. ‘‘మంచి స్క్రిప్ట్ కుదిరింది. జాన్‌తో మరోసారి నటించబోతున్నందుకు సంతోషంగా ఉంది. రకుల్‌ది కూడా చాలా మంచి పాత్ర’’ అని జాక్వెలిన్ పేర్కొన్నారు. -
ఎవరినీ ఉపేక్షించం
న్యూఢిల్లీ: బీజేపీ నేతలెవరైనా సరే అహంకారపూరితంగా, అనుచితంగా ప్రవర్తిస్తే ఊరుకునేది లేదని ప్రధాని మోదీ హెచ్చరించారు. మధ్యప్రదేశ్‌లో బీజేపీ సీనియర్ నేత కైలాశ్ విజయ్‌వర్గీయ కొడుకు, ఎమ్మెల్యే ఆకాశ్ వర్గీయ ఇటీవల ఓ ప్రభుత్వ అధికారిపై క్రికెట్ బ్యాట్‌తో దాడి చేసిన ఘటన నేపథ్యంలో ప్రధాని ఈ హెచ్చరికలు చేశారు. మంగళవారం ఇక్కడ జరిగిన బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో మోదీ మాట్లాడారు. ‘అతడు ఎవరి కొడుకైనా సరే అటువంటి వారి అహంకారపూరిత, దుష్ప్రవర్తనను సహించేది లేదు. ఎవరికి వారు ఇష్టానుసారంగా ప్రవర్తిస్తామంటే ఊరుకోబోం. కఠిన చర్యలు తప్పవు’ అని హెచ్చరించారు. ఆకాశ్ జైలు నుంచి విడుదలైనపుడు హడావుడి చేసిన నేతలపై బీజేపీ గట్టి చర్యలు తీసుకోవాలన్నారు. ఈ సమయంలో ఆకాశ్ తండ్రి కైలాశ్ సమావేశంలోనే ఉండటం గమనార్హం. ట్రిపుల్ తలాక్ బిల్లును ప్రవేశపెట్టిన సమయంలో లోక్‌సభలో పార్టీ సభ్యుల హాజరు శాతం తక్కువగా ఉండటంపైనా ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ పార్లమెంట్ సమావేశాల్లో అందరూ తప్పనిసరిగా పాల్గొనాలని కోరారు. ప్రజలకు గుర్తుండేలా సేవా కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. బీజేపీ సిద్ధాంతకర్త శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ జయంతి సందర్భంగా ఈ నెల 6వ తేదీన పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని వారణాసి నుంచి ప్రధాని మోదీ ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా పార్టీ కార్యకర్తలు దేశవ్యాప్తంగా ప్రతి బూత్ పరిధిలో కనీసం ఐదు మొక్కలు నాటాలని కోరారు. ఈ కార్యక్రమాన్ని ప్రధాని మోదీ ‘పంచవటి’గా పేర్కొన్నారు. శ్రీ సీతారామలక్ష్మణులు వనవాస సమయంలో 14 ఏళ్లపాటు పర్ణశాలలో నివసించిన విషయం తెలిసిందే. ఎంపీలతో ప్రధాని వరుస సమావేశాలు బీజేపీ ఎంపీలతో మోదీ తన నివాసంలో ఈ వారం వరుస సమావేశాలు జరపనున్నారు. ఎంపీలను ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ, మహిళలు, యువత తదితర గ్రూపులుగా విభజించి వేర్వేరుగా మాట్లాడతారు. పార్లమెంట్‌తో వివిధ అంశాలపై ప్రధానితో నేరుగా మాట్లాడే అవకాశం కల్పించడమే ఈ భేటీల ఉద్దేశం. -
అధికారంలో ఉన్నాం.. ఏమైనా చేస్తాం!
నెల్లూరు(వేదాయపాళెం): రూరల్ మండలంలోని అంబాపురం అరుంధతీయవాడలో బుధవారం స్థానిక దళితుడైన ఇండ్ల ప్రసాద్, ఎమ్మార్పీఎస్ నాయకుడు బద్దేపూడి కృష్ణయ్యలపై అదే గ్రామానికి చెందిన అధికారపార్టీ నాయకుడు, విశ్రాంత వీఆర్ఓ పల్నాటి రాగపనాయుడు, అతని కుమారులు మస్తాన్‌నాయుడు, మల్లికార్జుననాయుడు, అతని అనుచరులు దాడికి పాల్పడ్డారు. బాధితుల కథనం మేరకు సర్వేనంబరు 105/2లోని 33 అంకణాల నివేశన స్థలాన్ని లఘుసాని వెంకటసుబ్బమ్మ వద్ద గత కొన్నేళ్ల క్రితం ఇండ్ల ప్రసాద్ కొనుగోలు చేశాడు. కొనుగోలు చేసిన స్థలంలో బుధవారం ఇంటి నిర్మాణ పనులు చేపడుతుండగా అధికార పార్టీ నాయకులు అక్కడకు చేరుకుని ఈ స్థలం తమదంటూ దౌర్జన్యానికి పాల్పడ్డారు. స్థలానికి సంబంధించిన అన్ని హక్కు పత్రాలు తన వద్ద ఉన్నాయని ప్రసాద్ తెలపగా అధికార పార్టీ నాయకుడు ఏమాత్రం పట్టించుకోలేదు. కులం పేరుతో దూషించి ప్రసాద్‌పై దాడి చేశారు. ప్రసాద్ బంధువైన ఎమ్మార్పీఎస్ నాయకుడు బద్దేపూడి కృష్ణకు విషయం తెలియడంతో అక్కడకు చేరుకుని ఇదెక్కడి అన్యాయమని టీడీపీ నాయకులను ప్రశ్నించాడు. అతడిపై కూడా దాడి చేశారు. అధికారం ఉంది ఏమైనా చేస్తాం అంటూ అధికార దర్పాన్ని ప్రదర్శించారు. బాధితులు పోలీసులను ఆశ్రయించారు. -
సభ్యత్వం రద్దుపై హైకోర్టులో విచారణ
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ కాంగ్రెస్ శాసనసభ్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సంపత్‌కుమార్ శాసనసభ్యత్వం రద్దుపై గురువారం హైకోర్టులో విచారణ జరిగింది. అసెంబ్లీలో ఈ నెల 12న గవర్నర్ ప్రసంగం తాలూకు మొత్తం ఒరిజినల్ వీడియో ఫుటేజీని 22న సీల్డ్ కవర్లో అందజేయాలని గతంలో అసెంబ్లీ కార్యదర్శిని ఆదేశించింది. దీనిపై గురువారం విచారణ జరుగగా, వీడియోలు ఇంకా సిద్ధం కాలేదని, మరికొంత సమయం కావాలని ప్రభుత్వ అడ్వొకేట్ జనరల్ హైకోర్టును కోరారు. ఈ నెల 27వ తేదీన ఈ కేసుకు సంబంధించిన సీడీలను సమర్పించి కౌంటర్ దాఖలు చేస్తామని అడ్వొకేట్ జనరల్ తెలిపారు. మరోవైపు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్న నల్లగొండ, అలంపూర్ నియోజకవర్గాలు ఖాళీ అయినట్లుగా పేర్కొంటూ రాష్ట్ర న్యాయ, శాసన వ్యవహారాల శాఖ జారీ చేసిన గెజిట్ నోటిఫికేషన్ విషయంగా ఆరు వారాల పాటు ఎటువంటి చర్యలూ తీసుకోవద్దని కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఇప్పటికే హైకోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే. -
విద్యార్థినిపై ప్రేమోన్మాది కత్తితో దాడి
బోనకల్: విద్యార్థినిపై ఓ ప్రేమో న్మాది కత్తితో దాడి చేసి హత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ ఘటన గురువారం ఖమ్మం జిల్లా బోనకల్ మండల కేంద్రంలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన కోలా వెంకటేశ్వర్లు కుమారుడు రామలింగయ్య.. అదే గ్రామానికి చెందిన మన్నెం అంజయ్య కూతురు యమునను ప్రేమిస్తున్నానంటూ నిత్యం వేధిస్తున్నాడు. ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న ఆమెను గతంలోనూ తరచూ ఇబ్బందులకు గురిచేసేవాడు. ఈ విషయమై ఆమె తల్లిదండ్రులు 2017, డిసెంబర్ 18న పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు అతడిపై ఫోక్సో కేసు నమోదు చేశారు. రిమాండ్‌కు వెళ్లిన అతను బెయిల్‌పై వచ్చి మళ్లీ వెంట పడటం ప్రారంభించాడు. దీంతో యమున తల్లిదండ్రులు యమునను కళాశాల మాన్పించి యాదగిరిరెడ్డిపల్లిలోని తమ బంధువుల ఇంటికి పంపించారు. ప్రస్తుతం ఇంటర్ పరీక్షలు దగ్గర పడటంతో ఆమె ఇంటికి వచ్చింది. విషయం తెలుసుకున్న రామలింగయ్య.. ఇంట్లో ఎవరూ లేని సమయంలో లోపలికి వెళ్లి గడియ పెట్టాడు. యమునను కత్తితో ఛాతి, కడుపులో పొడిచాడు. ఆమె గట్టిగా కేకలు వేయడంతో చుట్టుపక్కల వారు తలుపులు తెరిచి చూడగా.. వారిని చూసి పారిపోయాడు. బాధితురాలిని వెంటనే స్థానిక పీహెచ్‌సీకి తరలించి ప్రథమ చికిత్స చేయించారు. మెరుగైన చికిత్స కోసం ఖమ్మంలోని ఆస్పత్రికి తరలించారు. ఎస్ఐ ఇంద్రసేనారెడ్డి కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. -
లిబియాలో వరుస బాంబు పేలుళ్లు
బెంఘాజీ: ఆఫ్రికా దేశమైన లిబియా మంగళవారం వరుస కారు బాంబు పేలుళ్లతో దద్ధరిల్లింది. బెంఘాజీ నగరంలోని ఓ మసీదు నుంచి ప్రార్థనల అనంతరం ప్రజలు బయటికొస్తుండగా రెండు శక్తిమంతమైన కారు బాంబు పేలుళ్లు సంభవించడంతో 34 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ పేలుళ్లలో 87 మంది గాయపడ్డారు. మొదటి కారు బాంబు పేలిన తర్వాత సహాయక చర్యల కోసం అక్కడికి పెద్ద ఎత్తున చేరుకున్న ప్రజలే లక్ష్యంగా అరగంట వ్యవధిలో మరో కారు బాంబు పేలిందని అధికారులు తెలిపారు. లిబియా అంతర్యుద్ధంలో ప్రభుత్వానికి అండగా నిలిచిన సలాఫీ గ్రూపులకు కేంద్రంగా ఉండటంతోనే ఈ మసీదుపై దాడి జరిగిందన్నారు. ఈ దాడిని తామే చేసినట్లు ఇంతవరకూ ఏ ఉగ్రసంస్థా ప్రకటించుకోలేదన్నారు. నాటో బలగాలు 2011లో లిబియా పాలకుడు గడాఫీని హతమార్చినప్పటి నుంచి ఆ దేశం అంతర్యుద్ధంతో అట్టుడుకుతోంది. -
460 కిలోల ఆల్ఫ్రాజోలం పట్టివేత
సాక్షి, హైదరాబాద్: లైఫ్ సైన్సెస్ ల్యాబ్ ముసుగులో ఆల్ఫ్రాజోలం విక్రయిస్తున్న తండ్రీకొడుకులను ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు పట్టుకున్నారు. వారి నుంచి మొత్తం 460 కిలోల ఆల్ఫ్రాజోలంను స్వాధీనం చేసుకున్నారు. మార్కెట్లో దీని విలువ రూ 4.60 కోట్లు ఉంటుందని అంచనా. ఎక్సైజ్ ఇన్చార్జ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అజయ్‌రావు వివరాలను శుక్రవారం మీడియాకు వెల్లడించారు. సంగారెడ్డి జిల్లా పాశంమైలారం ఇండస్ట్రియల్ ప్రాంతంలోని ఒక గోదాంలో నిషేధిత ఆల్ఫ్రాజోలం ఉందనే పక్కా సమాచారం టాస్క్‌ఫోర్స్ అధికారులకు అందింది. గోదాంపై దాడి చేసి 10 కిలోల ఆల్ఫ్రాజోలంను స్వాధీనం చేసుకుని సిద్ధార్థ రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. అతను ఇచ్చిన సమాచారం మేరకు కూకట్పల్లి లో మరో గోదాంపై దాడులు చేశారు. అక్కడ ఎనిమిది డబ్బాల్లో నిల్వ చేసిన దాదాపు 450 కిలోల ఆల్ఫ్రాజోలం దొరికింది. పొరుగు రాష్ట్రాల నుంచి దీన్ని దిగుమతి చేసుకొని అక్రమంగా విక్రయిస్తున్నట్లు విచారణలో తేలింది. సీఆర్పీ లైఫ్ సెన్సెస్ పేరుతో అక్రమాలకు పాల్పడుతున్న సిద్ధార్థరెడ్డి, ఆతని తండ్రి సీపీరెడ్డి, మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ కల్యాణ్‌రావు, ట్రేడింగ్ బిజినెస్ ఆడిటర్ సెల్వకుమార్‌పై కేసులు నమోదు చేశారు. -
పోస్టు ప్రసాద్ పరిస్థితి విషమం
– హైదరాబాద్‌కు తరలింపు కర్నూలు: టీడీపీ వర్గీయుల దాడిలో తీవ్రంగా గాయపడిన వైఎస్ఆర్సీపీ నాయకుడు పోస్టు ప్రసాద్ ఆరోగ్య పరిస్థితి పూర్తిగా విషమించడంతో హైదరాబాద్‌కు తరలించారు. శుక్రవారం దాడి జరిగిన వెంటనే అతడిని కర్నూలు గౌరి గోపాల్ ఆసుపత్రిలో చేర్చారు. వైద్యుల సూచన మేరకు శనివారం ఉదయం హైదరాబాద్‌కు తీసుకెళ్లారు. ఈ నేపథ్యంలో డోన్‌లో ఉద్రిక్తత పరిస్థితులు ఏర్పడ్డాయి. పోస్టుప్రసాద్తో పాటు గాయపడిన వైఎస్ఆర్సీపీ నాయకులు నాయకులు ఓబులాపురం గొల్ల మదన్, గొల్ల సుధాకర్, గొల్ల రమణ, పాతపేటకు చెందిన లాల్బాషాలు ప్రస్తుతం కర్నూల్లోని అమృత ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వీరి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. కర్నూలు చికిత్స పొందుతున్న సమయంలో పోస్టు ప్రసాద్‌ను పీఏసీ చైర్మన్ బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి తదితరులు పరామర్శించారు. -
అక్రమార్కులపై విజిలెన్స్ కొరడా
ఈ ఏడాది రూ.319.28 కోట్ల ఆదాయం జిల్లా విజిలెన్స్ అధికారి రామప్రసాదరావు రాజమహేంద్రవరం క్రైం : విజిలె¯Œ్స అండ్ ఎ¯ŒSఫోర్స్మెంట్ శాఖ ఈ ఏడాది రూ.319.28 కోట్లు అక్రమార్కుల చేతుల్లోకి పోకుండా కాపాడగలిగారు. జిల్లా విజిలె¯Œ్స, ఎ¯ŒSఫోర్స్మెంట్ అధికారి టి.రామప్రసాదరావు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. జిల్లాలో ఈ ఏడాది అక్రమ లేఅవుట్లు, అక్రమ ఎరువులు, పురుగుమందులు, ఎలక్ట్రిసిటీ డ్యూటీ, విద్యాసంస్థల ప్రాపర్టీ టాక్స్ బకాయిలు, గుట్కా నిల్వలు తదితర వాటిపై దాడులు జరిపి, రూ.115.28 కోట్లను ప్రభుత్వానికి సమకూర్చారు. ఎఫ్‌సీఐ, ఏపీ సివిల్ సప్లయీస్ కార్పొరేష¯ŒS వారి బియ్యం, ధాన్యం కొనుగోళ్లపై అగ్రికల్చరల్ మార్కెట్ ఫీజు, రైస్ మిల్లులో వ్యాట్ ఎగవేత, రుచి సోయా పరిశ్రమ(కాకినాడ), అందాని, లోహియా ఆయిల్ పరిశ్రమలో వ్యాట్, కలప డిపోల్లో, జీడిపిక్కల పరిశ్రమల్లో, హోటళ్లు, ఇతర వ్యాపార సంస్థలు ఎగవేసిన పన్నులు రూ.130.72 కోట్లు గుర్తించి, ప్రభుత్వానికి నివేదిక పంపారు. గుజ్జనపూడిలో నిబంధనలకు విరుద్ధంగా లాటరైట్ మైనింగ్‌ను గుర్తించారు. అర్లధార, రావికంపాడు, ధవళేశ్వరం నుంచి లాటరైట్ స్టాక్ యార్డ్‌లను తనిఖీలు చేసి, అపరాధ రుసుముపై నివేదిక పంపారు. గ్రావెల్ క్వారీల అక్రమాలను గుర్తించి, ప్రభుత్వానికి రావలసిన రూ.73.79 కోట్లు వసూలు చేయడంలో నిర్లక్ష్యం వహించిన అధికారులపై చర్యలకు సిఫారసు చేశారు. ప్రజాపంపిణీలో అవకతవకలు జిల్లాలో రేష¯ŒS సరఫరాలో అవకతవకలపై తనిఖీలు చేసి, రూ.14,05,984 విలువైన పీడీఎస్ బియ్యం, రూ.22,83,55,258 విలువైన బియ్యం, ఇతర సరుకులు, రూ.39,86,653 విలువైన ఎల్పీజీ, ఆయిల్, కిరోసిన్, రూ.1,47,477 విలువైన పప్పులు, వంటనూనె, నిత్యావసరాలు.. మొత్తం రూ.23.52 కోట్ల విలువైన సరుకులు స్వాధీనం చేసుకున్నారు. మొత్తం 74 కేసులు నమోదు చేశారు. నాణ్యత లోపాలు ఇంజనీరింగ్ పనుల్లో అవకతవకలు, నాణ్యత లోపాలపై విచారణ జరిపి, బాధ్యులపై చర్యలు నివేదిక పంపించారు. పోలవరం ప్రాజెక్టు ప్ర«ధాన ఎడమ కాలువ ప్యాకేజీ–5, గోదావరి పుష్కరాలు, గోదావరి గట్టు పటిష్టత తదితర పనుల బిల్లుల చెల్లింపుల్లో అవకతవకలు, గోదావరి డెల్టాలోని ఉభయ గోదావరి జిల్లాల్లో రబీ సాగుకు ఎత్తిపోతల ద్వారా నీటి సరఫరా పనులు తదితర వాటిపై ప్రభుత్వానికి నివేదిక సమర్పించారు. -
నగల కోసం మహిళపై ఆటో డ్రైవర్ దాడి
ఉప్పలగుప్తం : ఒంటరిగా ప్రయాణిస్తున్న మహిళపై ఆటో డ్రైవర్ దాడిచేసి దోపిడీకి ప్రత్నించిన సంఘటన ఉప్పలగుప్తం మండలం భీమనపల్లిలో శనివారం రాత్రి జరిగింది. ఎస్సై డి.రమేష్‌బాబు తెలిపిన వివరాల ప్రకారం... అమలాపురం నుంచి ఎ¯ŒS.కొత్తపల్లికి వస్తున్న ఆటోలో ఎరవ్రంతెన వద్ద గొల్లవిల్లికి చెందిన మేడిద నాగలక్ష్మి ఎక్కింది. అనాతవరం మీదుగా వచ్చిన ఆటోలో ఆమె తప్ప ప్రయాణికులు లేకపోవడంతో డ్రైవరు ఆటోను భీమనపల్లి నుంచి చెయ్యేరు వైపు మళ్ళించాడు. దీంతో నాగలక్ష్మి ఇటు ఎక్కడికంటూ ప్రశ్నించగా, ఆటోలో బియ్యం బస్తా ఉంది ఎదర దింపాలని చెప్పాడు. నిర్జన ప్రదేశానికి ఆటో పోనిచ్చి.. బంగారు ఆభరణాలు తీసి ఇవ్వాలంటూ ఆమెపై దాడికి ప్రయత్నించాడు. దీంతో నాగలక్ష్మి కేకలు పెట్టడంతో నోరునోక్కి పక్కనున్న తోటలోకి లాక్కుంటూ వెళ్ళాడు. అదే సమయంలో అటుగా వెళుతున్న ముమ్మిడివరం జెడ్పీటీసీ సభ్యుడు శీలం సత్యనారాయణ ఆమె కేకలు విని తన మోటారు సైకిల్‌ను తోటలోకి పోనివ్వడంతో ఆ వెలుతురుకు మహిళను వదలి ఆటో డ్రైవర్ పరారయ్యాడు. ఆమెను రక్షించిన సత్యనారాయణ ఉప్పలగుప్తం జెడ్పీటీసీ సభ్యుడు దేశంశెట్టి వెంకట లక్ష్మినారాయణకు విషయాన్ని ఫో¯ŒSలో వివరించాడు. వెంటనే అక్కడకు చేరుకున్న ఆయన నాగలక్ష్మి నుంచి వివరాలు తెలుసుకుని ఆమె కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని, ఆటో డ్రైవర్ కోసం గాలిస్తున్నామని ఎస్సై రమేష్‌బాబు తెలిపారు. ఆదివారం ఉదయం సంఘటన జరిగిన ప్రదేశాన్ని ఎస్సై రమేష్‌బాబు పరిశీలించి, జెడ్పీటీసీ సభ్యులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రయాణికుల పట్ల అసభ్యంగా ప్రవర్తించే ఆటో డ్రైవర్లపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. -
ఎరువుల షాపులపై విజిలెన్స్ దాడులు
రూ.9 లక్షల పురుగు మందుల అమ్మకాలు నిలిపివేత రూ.3 లక్షల ఎరువుల స్వాధీనం గొల్లప్రోలు : మండలంలోని దుర్గాడ, వన్నెపూడి గ్రామాల్లోని ఎరువులు, పురుగు మందుల షాపులపై మంగళవారం విజిలెన్స్, ఎన్ఫోర్స్మెంట్ అధికారులు రెండు బృందాలుగా దాడులు చేశారు. సుమారు రూ.9.14 లక్షల విలువైన పురుగు మందుల అమ్మకాలను నిలిపివేశారు. రూ.3 లక్షల విలువైన ఎరువులను స్వాధీనం చేసుకున్నారు. వన్నెపూడిలోని విజిలెన్స్ సీఐ గౌస్‌బేగ్ ఆధ్వర్యంలో స్థానిక కేవీఆర్ ఏజెన్సీలోని నిల్వలు, స్టాకు రికార్డులను పరిశీలించారు. షాపు నిర్వహణకు సరైన పత్రాలు లేకపోవడం, అమ్మకాలు, కొనుగోళ్లకు సంబంధించి రికార్డులు సక్రమంగా నిర్వహించకపోవడంతో రూ.7.20 లక్షల విలువైన పురుగు మందుల అమ్మకాలు నిలుపుదల చేసినట్టు ఆయన తెలిపారు. స్టాకు రిజిస్టర్లు సక్రమంగా నిర్వహించకపోవడం తదితర కారణాలతో రూ.1.82 లక్షల విలువైన ఎరువులను స్వాధీనం చేసుకున్నారు. మైన్స్ ఏజీ కుమార్ తదితరులు పాల్గొన్నారు. దుర్గాడలో... దుర్గాడలో విజిలెన్స్ సీఐ ఎన్వీ భాస్కరరావు, ఏఓ జి.శ్రీనివాస్ తదితరులు షాపుల్లో తనిఖీలు చేశారు. వేగులమ్మ గుడి సమీపంలో అనుమతి లేకుండా షాపు నిర్వహిస్తున్న గుండ్ర తమ్మయ్య షాపును తనిఖీ చేశారు. ఆ షాపులో రూ.85 వేల విలువైన 144 బస్తాల ఎరువులు, రూ.53 వేల విలువైన పురుగు మందులు స్వాధీనం చేసుకున్నట్టు ఏఓ శ్రీనివాస్ తెలిపారు. సూర్యాఏజన్సీలో రూ.1.41 లక్షల విలువైన పురుగు మందులు అమ్మకాలను నిలుపుదల చేశామని, రూ.19 వేల విలువైన ఎరువులను సీజŒ æచేసినట్టు తెలిపారు. ఈ షాపులపై చట్ట ప్రకారం చర్యలకు ఆదేశించామన్నారు. తనిఖీల్లో సిబ్బంది కోటి, గణేష్ తదితరులు పాల్గొన్నారు. -
లారీ డ్రైవర్‌పై దుండగుల దాడి
రూ.30 వేల నగదు అపహరణ తుని రూరల్ : తుని మండలం తేటగుంట శివారం ఎర్రకోనేరు సమీపంలో లారీ డ్రైవర్‌పై దుండగులు దాడి చేసి, రూ.30 వేల నగదును దోచుకున్నారు. మంగళవారం అర్థరాత్రి జరిగిన ఈ సంఘటనపై కృష్ణా జిల్లా జగ్గయ్యపేటకు చెందిన లారీ డ్రైవర్ ఎస్.శివనాగబాబు ఫిర్యాదు మేరకు గురువారం కేసు నమోదు చేసినట్టు రూరల్ ఎస్సై ఎం.అశోక్ తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. జగ్గయ్యపేట నుంచి విజయనగరం జిల్లా తగరపువలసకు శివనాగబాబు లారీలో సిమెంట్ లోడును తీసుకువెళ్లాడు.lలారీ నుంచి సరుకు అన్లోడ్ చేశాక, కిరాయి రూ.20 వేలను తీసుకుని విశాఖపట్నం చేరుకున్నాడు. మళ్లీ విశాఖపట్నంలో కెమికల్ పౌడర్ లోడును లారీలో వేసుకుని, అడ్వా¯Œæ్స రూ.10 వేలు తీసుకుని మంగళవారం సాయంత్రం భద్రాచలానికి బయలుదేరాడు. రాత్రి 11 గంటల సమయంలో తుని మండలం ఎర్రకోనేరు సమీపంలో చేరుకున్నాడు. అక్కడ ఇద్దరు మహిళలు టార్చిలైట్లు వెలిగించి, లారీ ఆపారు. డ్రైవర్ శివనాగబాబు వారితో ఉండగా, ఆరుగురు దుండగులు అతడిపై దాడికి పాల్పడ్డారు. అతడి వద్ద ఉన్న రూ.30 వేల నగదు, వెండి ఉంగరం దోచుకుని దుండగులు పరారయ్యారు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
లారీ డ్రైవర్‌పై దుండగుల దాడి
రూ.30 వేల నగదు అపహరణ తుని రూరల్ : తుని మండలం తేటగుంట శివారం ఎర్రకోనేరు సమీపంలో లారీ డ్రైవర్‌పై దుండగులు దాడి చేసి, రూ.30 వేల నగదును దోచుకున్నారు. మంగళవారం అర్థరాత్రి జరిగిన ఈ సంఘటనపై కృష్ణా జిల్లా జగ్గయ్యపేటకు చెందిన లారీ డ్రైవర్ ఎస్.శివనాగబాబు ఫిర్యాదు మేరకు గురువారం కేసు నమోదు చేసినట్టు రూరల్ ఎస్సై ఎం.అశోక్ తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. జగ్గయ్యపేట నుంచి విజయనగరం జిల్లా తగరపువలసకు శివనాగబాబు లారీలో సిమెంట్ లోడును తీసుకువెళ్లాడు.lలారీ నుంచి సరుకు అన్లోడ్ చేశాక, కిరాయి రూ.20 వేలను తీసుకుని విశాఖపట్నం చేరుకున్నాడు. మళ్లీ విశాఖపట్నంలో కెమికల్ పౌడర్ లోడును లారీలో వేసుకుని, అడ్వా¯Œæ్స రూ.10 వేలు తీసుకుని మంగళవారం సాయంత్రం భద్రాచలానికి బయలుదేరాడు. రాత్రి 11 గంటల సమయంలో తుని మండలం ఎర్రకోనేరు సమీపంలో చేరుకున్నాడు. అక్కడ ఇద్దరు మహిళలు టార్చిలైట్లు వెలిగించి, లారీ ఆపారు. డ్రైవర్ శివనాగబాబు వారితో ఉండగా, ఆరుగురు దుండగులు అతడిపై దాడికి పాల్పడ్డారు. అతడి వద్ద ఉన్న రూ.30 వేల నగదు, వెండి ఉంగరం దోచుకుని దుండగులు పరారయ్యారు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
కత్తిపోట్లకు దారితీసిన భూ వివాదం
నెల్లిపాక : భూ వివాదం నేపథ్యంలో తండ్రీ కొడుకుల మధ్య తలెత్తిన ఘర్షణ కత్తితో దాడి చేసుకునేందుకు దారితీసింది. ఘర్షణకు అడ్డు వచ్చిన వ్యక్తిని, తన కొడుకుని కత్తితో పొడిచి తీవ్రంగా గాయపర్చిన ఈ ఘటన ఎటపాక మండలం చింతలపాడు వలస ఆదివాసీ గ్రామంలో చోటుచేసుకుంది. ఎస్సై నాగరాజు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. గ్రామానికి చెందిన సోడె ఉంగయ్య, సోడె దేవయ్య తండ్రీకొడుకులు. వీరి మధ్య సోమవారం రాత్రి వారి పోడుభూమి సాగు విషయంలో గొడవ జరిగింది. అది తీవ్రరూపం దాల్చి కత్తులతో దాడి చేసుకునే పరిస్థితి ఎదురైంది. అదే గ్రామానికి చెందిన మడకం భీమరాజు వారిని వారించేందుకు యత్నించాడు. అప్పటికే తీవ్ర ఆగ్రహంతో ఉన్న ఉంగయ్య తన చేతిలో ఉన్న కత్తితో దేవయ్యతో పాటు భీమరాజును కూడా పొడిచాడు. దేవయ్యకు గుండెలో, కడుపుపై, భీమరాజుకు కడుపులో తీవ్ర గాయం కావడంతో వారిని భద్రాచలంలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. శ్వాస అందకపోవడంతో భీమరాజుకు వైద్యులు శస్త్రచికిత్స చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు.. నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం భీమరాజు పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలిసింది. -
ఆదివాసీలపై దాడులు ఆపాలి
కలెక్టరేట్ ఎదుట సీపీఐ(ఎంఎల్) ధర్నా ముకరంపుర : ఆదివాసీలపై జరుగుతున్న దాడులను వెంటనే ఆపి వారి హక్కులు కాపాడాలని సీపీఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో మంగళవారం కలెక్టరేట్ ఎదుట ధర్నా చేపట్టారు. అంతకుముందు తెలంగాణ చౌక్‌నుంచి కలెక్టరేట్‌వరకు ర్యాలీ నిర్వహించారు. అభివృద్ధికి దూరంగా ఉన్న ఆదివాసీల పట్ల ప్రభుత్వం చిన్నచూపు చూస్తోందన్నారు. హరితహారం పేరిట ఏళ్ల తరబడి సాగుచేసుకుంటున్న భూములను ఫారెస్ట్ అధికారులు పోలీసుల అండతో లాక్కుంటున్నారని పేర్కొన్నారు. ఖమ్మం, వరంగల్, ఆదిలాబాద్ జిల్లాలో దాడులు సైతం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఖమ్మం జిల్లా ఇల్లందు ప్రాంతంలో పోలీసులు ఆదివాసీలను నిర్బంధిస్తున్నారని, అరెస్టులు చేస్తూ.. ఆస్తులు ధ్వంసం చేస్తూ.. పంటలను నాశనం చేస్తున్నారని పేర్కొన్నారు. రాష్ట్రంలోని 10 లక్షల ఎకరాల పోడుభూమి గుర్తించి ఆదివాసీలకు పట్టాలు ఇవ్వాలని కోరారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా కార్యదర్శి జేవీ.చలపతిరావు, నాయకులు రాజమ్మ, రాజు, నరేష్, శ్రీనివాస్, భీమేశ్వర్, రాములు తదితరులున్నారు.