- రూ.30 వేల నగదు అపహరణ
లారీ డ్రైవర్‌పై దుండగుల దాడి
Published Wed, Aug 31 2016 11:06 PM | Last Updated on Mon, Sep 4 2017 11:44 AM
తుని రూరల్ :
తుని మండలం తేటగుంట శివారం ఎర్రకోనేరు సమీపంలో లారీ డ్రైవర్‌పై దుండగులు దాడి చేసి, రూ.30 వేల నగదును దోచుకున్నారు. మంగళవారం అర్థరాత్రి జరిగిన ఈ సంఘటనపై కృష్ణా జిల్లా జగ్గయ్యపేటకు చెందిన లారీ డ్రైవర్ ఎస్.శివనాగబాబు ఫిర్యాదు మేరకు గురువారం కేసు నమోదు చేసినట్టు రూరల్ ఎస్సై ఎం.అశోక్ తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. జగ్గయ్యపేట నుంచి విజయనగరం జిల్లా తగరపువలసకు శివనాగబాబు లారీలో సిమెంట్ లోడును తీసుకువెళ్లాడు.lలారీ నుంచి సరుకు అన్‌లోడ్ చేశాక, కిరాయి రూ.20 వేలను తీసుకుని విశాఖపట్నం చేరుకున్నాడు. మళ్లీ విశాఖపట్నంలో కెమికల్ పౌడర్ లోడును లారీలో వేసుకుని, అడ్వా¯Œæ్స రూ.10 వేలు తీసుకుని మంగళవారం సాయంత్రం భద్రాచలానికి బయలుదేరాడు. రాత్రి 11 గంటల సమయంలో తుని మండలం ఎర్రకోనేరు సమీపంలో చేరుకున్నాడు. అక్కడ ఇద్దరు మహిళలు టార్చిలైట్లు వెలిగించి, లారీ ఆపారు. డ్రైవర్ శివనాగబాబు వారితో ఉండగా, ఆరుగురు దుండగులు అతడిపై దాడికి పాల్పడ్డారు. అతడి వద్ద ఉన్న రూ.30 వేల నగదు, వెండి ఉంగరం దోచుకుని దుండగులు పరారయ్యారు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
Advertisement
Advertisement